బృహదారణ్యకోపనిషద్భాష్యమ్
ప్రథమోఽధ్యాయఃచతుర్థం బ్రాహ్మణమ్
ఆనన్దగిరిటీకా (బృహదారణ్యక)
 
స వై నైవ రేమే తస్మాదేకాకీ న రమతే స ద్వితీయమైచ్ఛత్ । స హైతావానాస యథా స్త్రీపుమాంసౌ సమ్పరిష్వక్తౌ స ఇమమేవాత్మానం ద్వేధాపాతయత్తతః పతిశ్చ పత్నీ చాభవతాం తస్మాదిదమర్ధబృగలమివ స్వ ఇతి హ స్మాహ యాజ్ఞవల్క్యస్తస్మాదయమాకాశః స్త్రియా పూర్యత ఎవ తాం సమభవత్తతో మనుష్యా అజాయన్త ॥ ౩ ॥
ఇతశ్చ సంసారవిషయ ఎవ ప్రజాపతిత్వమ్ , యతః సః ప్రజాపతిః వై నైవ రేమే రతిం నాన్వభవత్ — అరత్యావిష్టోఽభూదిత్యర్థః — అస్మదాదివదేవ యతః ; ఇదానీమపి తస్మాదేకాకిత్వాదిధర్మవత్త్వాత్ ఎకాకీ న రమతే రతిం నానుభవతి । రతిర్నామేష్టార్థసంయోగజా క్రీడా । తత్ప్రసఙ్గిన ఇష్టవియోగాన్మనస్యాకులీభావోఽరతిరిత్యుచ్యతే । సః తస్యా అరతేరపనోదాయ ద్వితీయమరత్యపఘాతసమర్థం స్త్రీవస్తు ఐచ్ఛత్ గృద్ధిమకరోత్ । తస్య చైవం స్త్రీవిషయం గృధ్యతః స్త్రియా పరిష్వక్తస్యేవాత్మనో భావో బభూవ । సః తేన సత్యేప్సుత్వాత్ ఎతావాన్ ఎతత్పరిమాణ ఆస బభూవ హ । కిమ్పరిమాణ ఇత్యాహ — యథా లోకే స్త్రీపుమాంసావరత్యపనోదాయ సమ్పరిష్వక్తౌ యత్పరిమాణౌ స్యాతామ్ , తథా తత్పరిమాణః, బభూవేత్యర్థః । స తథా తత్పరిమాణమేవేమమాత్మానం ద్వేధా ద్విప్రకారమ్ అపాతయత్ పాతితవాన్ । ఇమమేవేత్యవధారణం మూలకారణాద్విరాజో విశేషణార్థమ్ । న క్షీరస్య సర్వోపమర్దేన దధిభావాపత్తివద్విరాట్ సర్వోపమర్దేనైతావానాస ; కిం తర్హి ? ఆత్మనా వ్యవస్థితస్యైవ విరాజః సత్యసఙ్కల్పత్వాదాత్మవ్యతిరిక్తం స్త్రీపుంసపరిష్వక్తపరిమాణం శరీరాన్తరం బభూవ । స ఎవ చ విరాట్ తథాభూతః — ‘స హైతావానాస’ ఇతి సామానాధికరణ్యాత్ । తతః తస్మాత్పాతనాత్ పతిశ్చ పత్నీ చాభవతామ్ ఇతి దమ్పత్యోర్నిర్వచనం లౌకికయోః ; అత ఎవ తస్మాత్ — యస్మాదాత్మన ఎవార్ధః పృథగ్భూతః — యేయం స్త్రీ — తస్మాత్ — ఇదం శరీరమాత్మనోఽర్ధబృగలమ్ — అర్ధం చ తత్ బృగలం విదలం చ తదర్ధబృగలమ్ , అర్ధవిదలమివేత్యర్థః । ప్రాక్‌స్త్ర్యుద్వహనాత్కస్యార్ధబృగలమిత్యుచ్యతే — స్వ ఆత్మన ఇతి । ఎవమాహ స్మ ఉక్తవాన్కిల, యాజ్ఞవల్క్యః — యజ్ఞస్య వల్కో వక్తా యజ్ఞవల్కస్తస్యాపత్యం యాజ్ఞవల్క్యో దైవరాతిరిత్యర్థః ; బ్రహ్మణో వా అపత్యమ్ । యస్మాదయం పురుషార్ధ ఆకాశః స్త్ర్యర్ధశూన్యః, పునరుద్వహనాత్తస్మాత్పూర్యతే స్త్ర్యర్ధేన, పునః సమ్పుటీకరణేనేవ విదలార్ధః । తాం స ప్రజాపతిర్మన్వాఖ్యః శతరూపాఖ్యామాత్మనో దుహితరం పత్నీత్వేన కల్పితాం సమభవత్ మైథునముపగతవాన్ । తతః తస్మాత్తదుపగమనాత్ మనుష్యా అజాయన్త ఉత్పన్నాః ॥

ప్రజాపతేర్భయావిష్టాత్వేన సంసారాన్తర్భూతత్వముక్తమిదానీం తత్రైవ హేత్వన్తరమాహ —

ఇతశ్చేతి ।

అరత్యావిష్టత్వే ప్రజాపతేరేకాకిత్వం హేతూకరోతి —

యత ఇతి ।

కార్యస్థారతిః కారణస్థారతేర్లిఙ్గమిత్యనుమానం సూచయతి —

ఇదానీమపీతి ।

ఆదిపదేన భయావిష్టత్వాదిగ్రహః అరతిం ప్రతియోగినిరుక్తిద్వారా నిర్వక్తి —

రతిర్నామేతి ।

కథం తర్హి యథోక్తారతినిరసనమిత్యాశఙ్క్య స ద్వితీయమైచ్ఛదిత్యేతద్వ్యాచష్టే —

స తస్యా ఇతి ।

స హేత్యస్య వాక్యస్య పాతనికాఙ్కరోతి —

తస్యేతి ।

తేన భావేనేతి యావత్ ।

కథమభిమానమాత్రేణ యథోక్తపరిమాణత్వం తత్రాఽఽహ —

సత్యేతి ।

నిపాతోఽవధారణే । తస్యైవ పునరనువాదోఽన్వయార్థః ।

పరిమాణమేవ ప్రశ్నపూర్వకం వివృణోతి —

కిమిత్యాదినా ।

సంప్రతి స్త్రీపుంసయోరుత్పత్తిమాహ —

స తథేతి ।

నను ద్వేధాభావో విరాజో వా సంసక్తస్త్రీపుమ్పిణ్డస్య వా ? నాఽఽద్యః । సశబ్దేన విరాడ్గ్రహయోగాత్తస్య కర్మత్వాద్ద్వితీయే త్వాత్మశబ్దానుపపత్తిస్తత్రాఽఽహ —

ఇమమితి ।

తథా చ సశబ్దేన కర్తృతయా విరాడ్గ్రహణమవిరుద్ధమిత్యర్థః ।

తదేవ స్ఫుటయతి —

నేత్యాదినా ।

కస్య తర్హి ద్విధాకరణమిత్యాశఙ్క్యాఽఽహ —

కిం తర్హీతి ।

తచ్చ ద్విధాకరణకర్మేతి శేషః ।

కథం తర్హి తత్రాఽఽత్మశబ్దః సంభవతీత్యాశఙ్క్యాఽఽహ —

స ఎవ చేతి ।

తథాభూతః సంసక్తజాయాపుమ్పరిమాణోఽభూదితి యావత్ ।

న కేవలం మనుః శతరూపేత్యనయోరేవ దమ్పత్యోరిదం నిర్వచనం కిన్తు లోకప్రసిద్ధయోః సర్వయోరేవ తయోరేతద్ద్రష్టవ్యం సర్వత్రాస్య సంభవాదిత్యాహ —

లౌకికయోరితి ।

ఉక్తే నిర్వచనే లోకానుభవమనుకూలయతి —

తస్మాదితి ।

ప్రాగితి సహధర్మచారిణీసంబన్ధాత్పూర్వమిత్యర్థః ।

ఆకాఙ్క్షాద్వారా షష్ఠీమాదాయానుభవమవలమ్బ్య వ్యాచష్టే —

కస్యేత్యాదినా ।

బృగలశబ్దో వికారార్థః ।

అనుభవసిద్ధేఽర్థే ప్రామాణికసమ్మతిమాహ —

ఎవమితి ।

ద్వేధాపాతనే సత్యేకో భాగః పురుషోఽపరస్తు స్త్రీత్యత్రైవ హేత్వన్తరమాహ —

యస్మాదితి ।

ఉద్వహనాత్ప్రాగవస్థాయామాకాశః పురుషార్ధః స్త్ర్యర్ధశూన్యో యస్మాదసంపూర్ణో వర్తతే తస్మాదుద్వహనేన ప్రాప్తస్త్ర్యర్ధేన పునరితరో భాగః పూర్యతే యథా విదలార్ధోఽసంపూర్ణః సంపుటీకరణేన పునః సంపూర్ణః క్రియతే తద్వదితి యోజనా । పూర్వమపి స్వాభావికయోగ్యతావశేన సంసర్గోఽభూదనాదిత్వాత్సంసారస్యేతి సూచయితుం పునరిత్యుక్తమ్ ।

పురుషార్ధస్యేతరార్ధస్య చ మిథః సంబన్ధాన్మనుష్యాదిసృష్టిరిత్యాహ —

తామిత్యాదినా ॥౩॥

స్మార్తం ప్రతిషేధమితి । ‘న సగోత్రాం సమానప్రవరాం భార్యాం విన్దేతే’త్యాదికమితి యావత్ ।