అగ్నావుక్తం న్యాయం వాయౌ యోజయతి —
తథేతి ।
‘వాయుః ప్రాణో భూత్వా నాసికే ప్రావిశత్’ ఇతి శ్రుత్యన్తరమాశ్రిత్యాఽఽహ —
అధ్యాత్మమితి ।
పృథివ్యాదీనాం తదన్తర్వర్తినాం చ పురుషాణామేకవాక్యోపాత్తానామేకరూపం మధుత్వమితి శఙ్కాం పరిహరన్నవాన్తరవిభాగమాహ —
భూతానామితి ।
పృథివ్యాదీనాం కార్యత్వం తేజోమయాదీనాం కరణత్వమిత్యత్ర సప్తాన్నాధికారసంమతిమాహ —
తథా చోక్తమితి ॥౪॥