ఉక్తా వసిష్ఠత్వాదిగుణా న వాగాదిగామినః కిన్తు ముఖ్యప్రాణగతా ఎవేతి దర్శయితుమాఖ్యాయికాం కరోతి —
తే హేత్యాదినా ।
ఈయసున్ప్రయోగస్య తాత్పర్యమాహ —
శరీరం హీతి ।
కిమితి శరీరస్య పాపీయస్త్వముచ్యతే తదాహ —
వైరాగ్యార్థమితి ।
శరీరే వైరాగ్యోత్పాదనద్వారా తస్మిన్నహంమమాభిమానపరిహారార్థమిత్యర్థః । వసిష్ఠో భవతీత్యుక్తవానితి సంబన్ధః ।
కిమితి సాక్షాదేవ ముఖ్యం ప్రాణం వసిష్ఠత్వాదిగుణం నోక్తవాన్ప్రజాపతిః స హి సర్వజ్ఞ ఇత్యాశఙ్క్యాహ —
జానన్నపీతి ॥౭॥