ప్రతీకమాదాయ వ్యాచష్టే —
ఉషా ఇత్యాదినా ।
స్మారణార్థత్వమేవ నిపాతస్య స్ఫుటయతి —
ప్రసిద్ధమితి ।
శాస్త్రీయే లౌకికే చ వ్యవహారే ప్రసిద్ధో బ్రాహ్మో ముహూర్తస్తం కాలమితి యావత్ ।
ఉషసి శిరఃశబ్దప్రయోగే దినావయవేషు తస్య ప్రాధాన్యం హేతుమాహ —
ప్రాధాన్యాదితి ।
తథాపి కథం తత్ర తచ్ఛబ్దప్రయోగస్తత్రాఽఽహ —
శిరశ్చేతి ।
ఆశ్వమేధికాశ్వశిరస్యుషసో దృష్టిః కర్తవ్యేత్యాహ —
అశ్వస్యేతి ।
కాలాదిదృష్టిరశ్వాఙ్గేషు కిమితి క్షిప్యతేఽశ్వాఙ్గదృష్టిరేవ తేషు కిం న స్యాదిత్యాశఙ్క్యాఽఽహ —
కర్మాఙ్గస్యేతి ।
అఙ్గేష్వనఙ్గమతిక్షేపే హేత్వన్తరమాహ —
ప్రాజాపత్యత్వం చేతి ।
అశ్వస్య సేత్స్యతీతి శేషః, తత్ర హేతుః —
ప్రజాపతీతి ।
నను కాలాదిదృష్ట్యోఽశ్వావయవేష్వారోప్యన్తే న తస్య ప్రజాపతిత్వం క్రియతే తత్రాఽఽహ —
కాలేతి ।
కాలాద్యాత్మకో హి ప్రజాపతిః । తయా చ యథా ప్రతిమాయాం విష్ణుత్వకరణం తద్దృష్టిస్తథా కాలాదిదృష్టిరశ్వావయవేషు తస్య ప్రజాపతిత్వకరణమ్ । అశ్వమేధాధికారీ హి సత్యశ్వే కర్మణో వీర్యవత్తరత్వార్థం కాలాదిదృష్టీరశ్వావయవేషు కుర్యాత్ । తదనధికారీ త్వశ్వాభావే స్వాత్మానమశ్వం కల్పయిత్వా స్వశిరఃప్రభృతిషు కాలాదిదృష్టికరణేన ప్రజాపతిత్వం సంపాద్య ప్రజాపతిరస్మీతి జ్ఞానాత్తద్భావం ప్రతిపద్యేతేతి భావః ।
చక్షుషి సూర్యదృష్టౌ హేతుమాహ —
శిరస ఇతి ।
ఉషసోఽనన్తరత్వం సూర్యే దృష్టం చక్షుషి చ శిరసోఽనన్తరత్వం దృశ్యతే తస్మాత్తత్ర తద్దృష్టిర్యుక్తేత్యర్థః ।
తత్రైవ హేత్వన్తరమాహ —
సూర్యేతి ।
“ఆదిత్యశ్చక్షుర్భూత్వాఽక్షిణీ ప్రావిశత్” ఇతి శ్రుతేశ్చక్షుషి సూర్యోఽధిష్ఠాత్రీ దేవతా తేన సామీప్యాత్తత్ర తద్దృష్టిరిత్యర్థః । అశ్వప్రాణే వాయుదృష్టౌ చలనస్వాభావ్యం హేతుః ।
అశ్వస్య విదారితే ముఖే భవత్వగ్నిదృష్టిస్తథాఽపి పర్యాయోపాదానం వ్యర్థమిత్యాశఙ్క్య క్రవ్యాదాదివ్యావృత్త్యర్థం విశేషణమిత్యాహ —
వైశ్వానర ఇత్యగ్నేరితి ।
“అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశత్” ఇతి శ్రుతిమాశ్రిత్య ముఖే తద్దృష్టౌ హేతుమాహ —
ముఖస్యేతి ।
అధికమాసమనుసృత్య త్రయోదశమాసో వేత్యుక్తమ్ ।
శరీరే సంవత్సరదృష్టిరిత్యత్రాఽఽత్మత్వం హేతుమాహ —
కాలేతి ।
ఆత్మా హస్తాదీనామఙ్గానామితి శేషః ।
కాలావయవానాం సంవత్సరస్యాఽఽత్మత్వవదఙ్గానాం శరీరస్యాఽఽత్మత్వే ప్రమాణమాహ —
మధ్యం హీతి ।
పునరుక్తేరర్థవత్త్వమాహ —
అశ్వస్యేతి ।
పృష్టే ద్యులోకదృష్టౌ హేతుమాహ —
ఊర్ధ్వత్వేతి ।
ఉదరేఽన్తరిక్షదృష్టౌ నిమిత్తమాహ —
సుషిరత్వేతి ।
పాదా అస్యన్తే యస్మిన్నితి వ్యుత్పత్తిమాశ్రిత్య వివక్షితమాహ —
పాదేతి ।
అశ్వస్య హి ఖురే పాదాసనత్వసామాన్యాత్పృథివీదృష్టిరిత్యర్థః ।
పార్శ్వయోర్దిక్చతుష్టయదృష్టౌ హేతుమాహ —
పార్శ్వేనేతి ।
ద్వే పార్శ్వే చతస్రశ్చ దిశస్తత్ర కథం తయోస్తదారోపణం ద్వాభ్యామేవ ద్వయోః సంబన్ధాదితి శఙ్కతే —
పార్శ్వయోరితి ।
యద్యపి ద్వే దిశౌ ద్వాభ్యాం పార్శ్వాభ్యాం సంబధ్యేతే తథాఽప్యశ్వస్య ప్రాఙ్ముఖత్వే ప్రత్యఙ్ముఖత్వే చ దక్షిణోత్తరయోస్తన్ముఖత్వే చ ప్రాక్ప్రతీచ్యోర్దిశోస్తాభ్యాం సంబన్ధసంభవాత్తత్ర తద్దృష్టిరవిరుద్ధేతి పరిహరతి —
నేత్యాదినా ।
తదుపపత్తౌ చాశ్వస్య చరిష్ణుత్వం హేతూకర్తవ్యమ్ । పార్శ్వాస్థిష్వవాన్తరదిశామారోపే పార్శ్వదిక్సంబన్ధో హేతుః ।
ఋతవః సంవత్సరస్యాఙ్గాని హస్తాదీని చ దేహస్యావయవాస్తస్మాదృతుదృష్టిరఙ్గేషు కర్తవ్యేత్యాహ —
ఋతవ ఇతి ।
అస్తి మాసాదీనాం సంవత్సరసన్ధిత్వమస్తి చ శరీరసన్ధిత్వం పర్వణామతస్తేషు మాసాదిదృష్టిరిత్యాహ —
సన్ధీతి ।
యుగసహస్రాభ్యాం ప్రాజాపత్యమేకమహోరాత్రమ్ । అయనాభ్యాం దైవమ్ । పక్షాభ్యాం పిత్ర్యమ్ । షష్టిఘటికాభిర్మానుషమితి భేదః ।
ప్రతిష్ఠాశబ్దస్య పాదవిషయత్వం వ్యుత్పాదయతి —
ప్రతితిష్ఠతీతి ।
పాదేష్వహోరాత్రదృష్టిసిద్ధ్యర్థం యుక్తిముపపాదయతి —
అహోరాత్రైరితి ।
అస్థిషు నక్షత్రదృష్టౌ హేతుమాహ —
శుక్లత్వేతి ।
నభఃశబ్దేనాన్తరిక్షం కిమితి న గృహ్యతే ముఖ్యే సత్యుపచారాయోగాదిత్యాశఙ్క్య పునరుక్తిం పరిహర్తుమిత్యాహ —
అన్తరిక్షస్యేతి ।
ఉదకం సిఞ్చన్తి మేధా మాంసాని రుధిరమతః సేకకర్తృత్వసామాన్యాన్మాంసేషు మేధదృష్టిరిత్యాహ —
ఉదకేతి ।
అశ్వజఠరవిపరివర్తిన్యర్ధజీర్ణే సికతాదృష్టౌ హేతుమాహ —
విశ్లిష్టేతి ।
కిమితి గుదశబ్దేన పాయురేవ న గృహ్యతే శిరాగ్రహణే హి ముఖ్యార్థాతిక్రమః స్యాత్తత్రాహ —
బహువచనాచ్చేతి ।
చకారోఽవధారణార్థః । యద్యపి బహూక్త్యా శిరాభ్యోఽర్థాన్తరమపి గుదశబ్దమర్హతి తథాఽపి స్యన్దనసాదృశ్యాత్తాస్వేవ సిన్ధుదృష్టిరితి తాసామిహ గ్రహణమితి భావః ।
కుతో మాంసఖణ్డయోర్ద్విత్వమేకత్ర బహువచనాద్బహుత్వప్రతీతేరిత్యాశఙ్క్య దారా ఇతివద్బహూక్తేర్గతిమాహ —
క్లోమాన ఇతి ।
తయోః పర్వతదృష్టౌ హేతుద్వయమాహ —
కాఠిన్యాదిత్యాదినా ।
క్షుద్రత్వసాధర్మ్యాదోషధిదృష్టిర్లోమసు మహత్త్వసామాన్యాద్వనస్పతిదృష్టిశ్చాశ్వకేశేషు కర్తవ్యేత్యాహ —
యథాసంభవమితి ।
పూర్వత్వసామాన్యాన్మధ్యాహ్నాత్ప్రాగవస్థాదిత్యదృష్టిరశ్వస్య నాభేరూర్ధ్వభాగే కర్తవ్యేత్యాహ —
ఉద్యన్నిత్యాదినా ।
అపరత్వసాదృశ్యాదశ్వస్య నాభేరపరార్ధే మధ్యాహ్నాదనన్తరభావ్యాదిత్యదృష్టిఃకార్యేత్యాహ —
నిమ్లోచన్నిత్యాదినా ।
విజృమ్భత ఇత్యాదౌ ప్రత్యయార్థో న వివక్షితః ।
విజృమ్భణం ముఖవిదారణం విద్యోతనం పునర్మేఘగతమతో విద్యోతనదృష్టిర్జృమ్భణే కర్తవ్యేత్యాహ —
ముఖేతి ।
స్తనయతీతి స్తనితముచ్యతే తద్దృష్టిర్గాత్రకమ్పే కర్తవ్యేత్యత్ర హేతుమాహ —
గర్జనేతి ।
మూత్రకరణ వర్షణదృష్టౌ కారణమాహ —
సేచనేతి ।
అశ్వస్య హేషితశబ్దే నాస్త్యారోపణమిత్యతో న సాదృశ్యం వక్తవ్యమిత్యాహ —
నాత్రేతి ॥౧॥