బృహదారణ్యకోపనిషద్భాష్యమ్
ప్రథమోఽధ్యాయఃప్రథమం బ్రాహ్మణమ్
ఆనన్దగిరిటీకా (బృహదారణ్యక)
 
అహర్వా అశ్వం పురస్తాన్మహిమాన్వజాయత తస్య పూర్వే సముద్రే యోనీ రాత్రిరేనం పశ్చాన్మహిమాన్వజాయత తస్యాపరే సముద్రే యోనిరేతౌ వా అశ్వం మహిమానావభితః సమ్బభూవతుః । హయో భూత్వా దేవానవహద్వాజీ గన్ధర్వానర్వాసురానశ్వో మనుష్యాన్సముద్ర ఎవాస్య బన్ధుః సముద్రో యోనిః ॥ ౨ ॥
అహర్వా ఇతి, సౌవర్ణరాజతౌ మహిమాఖ్యౌ గ్రహావశ్వస్యాగ్రతః పృష్ఠతశ్చ స్థాప్యేతే, తద్విషయమిదం దర్శనమ్ । అహః సౌవర్ణో గ్రహః, దీప్తిసామాన్యాద్వై । అహరశ్వం పురస్తాన్మహిమాన్వజాయతేతి కథమ్ ? అశ్వస్య ప్రజాపతిత్వాత్ ; ప్రజాపతిర్హ్యాదిత్యాదిలక్షణోఽహ్నా లక్ష్యతే ; అశ్వం లక్షయిత్వాజాయత సౌవర్ణో మహిమా గ్రహః, వృక్షమను విద్యోతతే విద్యుదితి యద్వత్ । తస్య గ్రహస్య పూర్వే పూర్వః సముద్రే సముద్రః యోనిః, విభక్తివ్యత్యయేన ; యోనిరిత్యాసాదనస్థానమ్ । తథా రాత్రీ రాజతో గ్రహః, వర్ణసామాన్యాజ్జఘన్యత్వసామాన్యాద్వా । ఎనమశ్వం పశ్చాత్పృష్ఠతో మహిమా అన్వజాయత ; తస్యాపరే సముద్రే యోనిః । మహిమా మహత్త్వాత్ । అశ్వస్య హి విభూతిరేషా, యత్సౌవర్ణో రాజతశ్చ గ్రహావుభయతః స్థాప్యేతే । తావేతౌ వై మహిమానౌ మహిమాఖ్యౌ గ్రహౌ, అశ్వమభితః సమ్బభూవతుః ఉక్తలక్షణావేవ సమ్భూతౌ । ఇత్థమసావశ్వో మహత్త్వయుక్త ఇతి పునర్వచనం స్తుత్యర్థమ్ । తథా చ హయో భూత్వేత్యాది స్తుత్యర్థమేవ । హయో హినోతేర్గతికర్మణః, విశిష్టగతిరిత్యర్థః ; జాతివిశేషో వా ; దేవానవహత్ దేవత్వమగమయత్ , ప్రజాపతిత్వాత్ ; దేవానాం వా వోఢాభవత్ ; నను నిన్దైవ వాహనత్వమ్ ; నైష దోషః ; వాహనత్వం స్వాభావికమశ్వస్య, స్వాభావికత్వాదుచ్ఛ్రాయప్రాప్తిర్దేవాదిసమ్బన్ధోఽశ్వస్య ఇతి స్తుతిరేవైషా । తథా వాజ్యాదయో జాతివిశేషాః ; వాజీ భూత్వా గన్ధర్వానవహదిత్యనుషఙ్గః ; తథార్వా భూత్వాసురాన్ ; అశ్వో భూత్వా మనుష్యాన్ । సముద్ర ఎవేతి పరమాత్మా, బన్ధుర్బన్ధనమ్ , బధ్యతేఽస్మిన్నితి ; సముద్రో యోనిః కారణముత్పత్తిం ప్రతి ; ఎవమసౌ శుద్ధయోనిః శుద్ధస్థితిరితి స్తూయతే ; ‘అప్సుయోనిర్వా అశ్వః’ (తై. సం. ౨ । ౩ । ౧౨) ఇతి శ్రుతేః ప్రసిద్ధ ఎవ వా సముద్రో యోనిః ॥

అశ్వావయవేషు కాలాదిదృష్టీర్విధాయాశ్వం ప్రజాపతిరూపం వివక్షిత్వా కణ్డికాన్తరం గృహీత్వా తాత్పర్యమాహ —

అహరిత్యాదినా ।

గ్రహౌ హవనీయద్రవ్యాధారౌ పాత్రవిశేషావగ్రతః పృష్ఠతశ్చేతి సంజ్ఞపనాత్ప్రాగూర్ధ్వం చేతి యావత్ ।

ప్రసిద్ధాతావదహని దీప్తిః సౌవర్ణే చ గ్రహే సాఽస్త్యతస్తస్మిన్నహర్దృష్టిరితి దర్శనం విభజతే —

అహరితి ।

అశ్వసంజ్ఞపనాత్పూర్వం యో మహిమాఖ్యో గ్రహః స్థాప్యతే స చేదహర్దృష్ట్యోపాస్యతే కథం సోఽశ్వమన్వజాయతేతి పశ్చాదశ్వస్య తజ్జన్మవాచోయుక్తిరితి శఙ్కతే —

అహరశ్వమితి ।

నాయం పశ్చాదర్థోఽనుశబ్దః కిన్తు లక్షణార్థః ।

తథా చాశ్వస్య ప్రజాపతిరూపత్వాత్తం లక్షయిత్వా గ్రహస్య యథోక్తస్య ప్రవృత్తేరుపదేశాదశ్వమన్వజాయతేత్యవిరుద్ధమితి పరిహరతి —

అశ్వస్యేతి ।

తదేవ స్ఫుటయతి —

ప్రజాపతిరితి ।

కాలలోకదేవతాత్మా ప్రజాపతిరశ్వాత్మనా దృశ్యమానోఽత్రాహర్దృష్ట్యా దృష్టేన గ్రహేణ లక్ష్యతే । తథా చాశ్వమన్వజాయతేతి శ్రుతిరవిరుద్ధేత్యర్థః ।

అనుశబ్దో న పశ్చాద్వాచీత్యత్ర దృష్టాన్తమాహ —

వృక్షమితి ।

యదా వృక్షం లక్షయిత్వా తస్యాగ్రే విద్యుద్విద్యోతతే తదా వృక్షమను విద్యోతతే సేతి ప్రయుజ్యతే । తథాఽత్రాప్యనుశబ్దో న పశ్చాదర్థ ఇత్యర్థః ।

యత్ర చ స్థానే గ్రహః స్థాప్యతే తత్పూర్వసముద్రదృష్ట్యా ధ్యేయమిత్యాహ —

తస్యేతి ।

పూర్వత్రమత్ర సాదృశ్యమ్ ।

కథం సప్తమీ ప్రథమార్థే యోజ్యతే ఛన్దస్యర్థానుసారేణ వ్యత్యయసంభవాదిత్యాహ —

విభక్తీతి ।

యథా సౌవర్ణే గ్రహేఽర్దృష్టిరుపదిష్టా తథా రాజతే గ్రహే రాత్రిదృష్టిః కర్తవ్యేత్యాహ —

తథేతి ।

అస్తి హి చన్ద్రాతపవత్త్వాద్రాత్రేః శౌక్ల్యమస్తి చ రాజతస్య గ్రహస్య తద్యుక్తం తత్ర రాత్రిదర్శనమిత్యాహ —

వర్ణేతి ।

రజతం సువర్ణాజ్జఘన్యమహ్నశ్చ రాత్రిరతో వా సాదృశ్యాత్తత్ర రాత్రిదృష్టిరిత్యాహ —

జఘన్యేతి ।

ప్రజాపతిరూపం ప్రకృతమశ్వం లక్షయిత్వా తత్సంజ్ఞపనాత్పశ్చాదస్య ప్రవృత్తిం దర్శయతి —

ఎనమితి ।

తదాసాదనస్థానే పశ్చిమసముద్రదృష్టిర్విధేయేత్యహ —

తస్యేతి ।

కథమేతౌ గ్రహౌ మహిమాఖ్యావుక్తౌ మహత్త్వోపేర్తత్వాదిత్యాహ —

మహిమేతి ।

అథాశ్వవిషయం దర్శనమాదిశ్య గ్రహవిషయం తదాదిశతో వాక్యభేదః స్యాన్నేత్యాహ —

అశ్వస్యేతి ।

కిమత్ర నియామకమిత్యాశఙ్క్య పునరుక్తిరితి మత్వాఽఽహ —

తావిత్యాదినా ।

వైశబ్దార్థకథనమ్ —

ఎవేతి ।

వాక్యశేషోఽప్యత్రానుగుణీభవతీత్యాహ —

తథా చేతి ।

హయశబ్దనిష్పత్తిపురఃసరం తదర్థమాహ —

హయ ఇతి ।

వాజ్యాదిశబ్దానాం జాతివిశేషవాచిత్వాదత్రాపి తదేవ గ్రాహ్యమితి పక్షాన్తరమాహ —

జాతీతి ।

దేవాయనాం దేవత్వప్రాపకత్వం కథమస్త్యేత్యాశఙ్క్యాహ —

ప్రజాపతిత్వాదితి ।

అశ్వం స్తోతుమారభ్య కల్పాన్తరోక్త్యా తన్నిన్దావచనమనుచితమితి శఙ్కతే —

నన్వితి ।

ఉపక్రమవిరోధో నాస్తీతి పరిహరతి —

నేత్యాదినా ।

సముత్పద్య భూతాని ద్రవన్త్యస్మిన్నితి వ్యుత్పత్త్యా పరమగమ్భీరస్యేశ్వరస్య సముద్రశబ్దతామాహ —

పరమాత్మేతి ।

తత్ర యోనిత్వముత్పాదకత్వం బన్ధుత్వం స్థాపకత్వం సముద్రత్వం విలాపకత్వమితి భేదః ।

అథ పరమాత్మయోనిత్వాదివచనముపాస్యాశ్వస్య క్వోపయుజ్యతే తత్రాఽఽహ —

ఎవమితి ।

శ్రుత్యన్తరానురోధేన సముద్రో యోనిరిత్యత్ర సముద్రశబ్దస్య రూఢిమనుజానాతి —

అప్సుయోనిరితి ॥౨॥