బృహదారణ్యకోపనిషద్భాష్యమ్
ప్రథమోఽధ్యాయఃతృతీయం బ్రాహ్మణమ్
ఆనన్దగిరిటీకా (బృహదారణ్యక)
 
సా వా ఎషా దేవతైతాసాం దేవతానాం పాప్మానం మృత్యుమపహత్యాథైనా మృత్యుమత్యవహత్ ॥ ౧౧ ॥
సా వా ఎషా దేవతా — తదేతత్ప్రాణాత్మజ్ఞానకర్మఫలం వాగాదీనామగ్న్యాద్యాత్మత్వముచ్యతే । అథైనా మృత్యుమత్యవహత్ — యస్మాదాధ్యాత్మికపరిచ్ఛేదకరః పాప్మా మృత్యుః ప్రాణాత్మవిజ్ఞానేనాపహతః, తస్మాత్స ప్రాణోఽపహన్తా పాప్మనో మృత్యోః ; తస్మాత్స ఎవ ప్రాణః, ఎనా వాగాదిదేవతాః, ప్రకృతం పాప్మానం మృత్యుమ్ , అతీత్య అవహత్ ప్రాపయత్ స్వం స్వమపరిచ్ఛిన్నమగ్న్యాదిదేవతాత్మరూపమ్ ॥

ద్వివిధముపాస్తిఫలం పాపహానిర్దేవతాభావశ్చ । తత్ర పాపహానిముపదిశతా ప్రాసంగికః, సాధారణో నిషేధో దర్శితః । సంప్రతి దేవతాభావం వక్తుముత్తరవాక్యమితి ప్రతీకోపాదానపూర్వకమాహ —

సా వా ఎషేతి ।

అథశబ్దావద్యోతితమర్థం కథయతి —

యస్మాదితి ।

పాప్మాపహన్తృత్వమనూద్యావశిష్టం భాగం వ్యాచష్టే —

తస్మాత్స ఎవేతి ॥౧౧॥