జ్ఞానస్యానన్తరఫలత్వాత్తత్ఫలే దేవాదీనాం న విఘ్నకర్తృతేత్యుక్తముపేత్య స్వయూథ్యః శఙ్కతే —
ఎవం తర్హీతి ।
జ్ఞానస్యాన్తరఫలత్వే న తదజ్ఞానం నివర్తయేదజ్ఞానమివ తత్త్వజ్ఞానమపి బ్రహ్మాస్మీతి జ్ఞానసన్తత్యభావాత్ । న చాఽఽద్యమేవ జ్ఞానమజ్ఞానధ్వంసి ప్రాగివోర్ధ్వమపి రాగాదేస్తత్కార్యస్య చ దృష్టత్వాత్ । అతో దేహపాతకాలీనం జ్ఞానమజ్ఞానం నివర్తయతీతి కుతో జీవన్ముక్తిరిత్యర్థః ।
అన్త్యజ్ఞానస్యాజ్ఞాననివర్తకత్వం తత్సన్తతేర్వా ప్రథమే తస్యాన్త్యత్వాదాత్మవిషయత్వాద్వా తద్ధ్వంసితేతి వికల్ప్యోభయత్ర దృష్టాన్తభావం మత్వా ద్వితీయే దోషాన్తరమాహ —
న ప్రథమేనేతి ।
తదేవానుమానేన స్ఫోరయతి —
యది హీతి ।
కల్పాన్తరం శఙ్కయతి —
ఎవం తర్హీతి ।
అవిచ్ఛిన్నా జ్ఞానసన్తతిరజ్ఞానం నివర్తయతీత్యేదద్దూషయతి —
నేత్యాదినా ।
జీవనాదిహేతుకః ప్రత్యయో బుభుక్షితోఽహం భోక్ష్యేఽహమిత్యాదిలక్షణః । తస్య బుభుక్షాద్యుపప్లుతస్య బ్రహ్మాస్మీత్యవిచ్ఛిన్నప్రత్యయసన్తతేశ్చ విరుద్ధతయా యౌగపద్యాయోగే హేతుమాహ —
విరోధాదితి ।
ప్రత్యయసన్తతిముపపాదయన్నాశఙ్కతే —
అథేతి ।
ఉక్తరీత్యా ప్రత్యయసన్తతిముపేత్య దూషయతి —
నేత్యాదినా ।
తమేవ దోషం విశదయతి —
ఇయతామితి ।
శాస్త్రార్థో జ్ఞానసన్తతిరజ్ఞానం నివర్తయతీత్యేవమాత్మకః ।
ఆత్మేత్యేవోపాసీతేతి శ్రుతేరాత్మజ్ఞానసన్తతిమాత్రసద్భావే తతో విద్యాద్వారాఽవిద్యాధ్వస్తిరితి శాస్త్రార్థనిశ్చయసిద్ధిరిత్యాహ —
సన్తతీతి ।
ఆత్మధీసన్తతేః సత్త్వేఽపి న సాఽఽత్మవిషయత్వాద్విద్యాద్వారాఽవిద్యాం నివర్తయతి । ఆద్య ద్విత్రిక్షణస్థాత్మధీసన్తతౌ వ్యభిచారాదితి పరిహరతి —
నాద్యన్తయోరితి ।
పూర్వస్మిన్ప్రత్యయే నావిద్యానివర్తకత్వమన్త్యే తు తథేత్యుక్తే తస్యాన్త్యత్వాత్తథాత్వం చేద్దృష్టాన్తాభావః । ఆత్మవిషయత్వాత్తథాత్వే ప్రథమప్రత్యయే వ్యభిచారః స్యాదిత్యుక్తౌ దోషౌ । ఆద్యా సన్తతిర్నావిద్యాధ్వంసినీ । అన్త్యా తు తథేత్యఙ్గీకారేఽపి విశేషాభావాదన్త్యత్వాత్తస్యా నివర్తకత్వే దృష్టాన్తాభావః ।
ఆత్మవిషయత్వాత్తద్భావే త్వనైకాన్తికత్వమిత్యేతావేవ దోషౌ స్యాతామిత్యుక్తం వివృణోతి —
ప్రథమేతి ।
అన్త్యప్రత్యయస్య తత్సన్తతేశ్చావిద్యానివర్తకత్వాఽసంభవే ప్రథమస్యాపి రాగాద్యనువృత్త్యా తదయోగాజ్జ్ఞానమజ్ఞానానివర్తకమేవేతి చోదయతి —
ఎవం తర్హీతి ।
శ్రుతివిరోధేన పరిహరతి —
న తస్మాదితి ।