బృహదారణ్యకోపనిషద్భాష్యమ్
ప్రథమోఽధ్యాయఃపఞ్చమం బ్రాహ్మణమ్
ఆనన్దగిరిటీకా (బృహదారణ్యక)
 
‘త ఎతే సర్వ ఎవ సమాః సర్వేఽనన్తాః’ (బృ. ఉ. ౧ । ౫ । ౧౩) ఇత్యవిశేషేణ వాఙ్మనఃప్రాణానాముపాసనముక్తమ్ , న అన్యతమగతో విశేష ఉక్తః ; కిమేవమేవ ప్రతిపత్తవ్యమ్ , కిం వా విచార్యమాణే కశ్చిద్విశేషో వ్రతముపాసనం ప్రతి ప్రతిపత్తుం శక్యత ఇత్యుచ్యతే —

అథేత్యాదివాక్యస్య వక్తవ్యశేషాభావాదానర్థక్యమాశఙ్క్య వ్యవహితోపాసనానువాదేన తదఙ్గవ్రతవిధానార్థముత్తరం వాక్యమిత్యానర్థక్యం పరిహరతి —

త ఎత ఇత్యాదినా ।

వ్రతమిత్యవశ్యానుష్ఠేయం కర్మోచ్యతే । జిజ్ఞాసాయాః సత్త్వమతః శబ్దార్థః ।