బృహదారణ్యకోపనిషద్భాష్యమ్
తృతీయోఽధ్యాయఃఅష్టమం బ్రాహ్మణమ్
ఆనన్దగిరిటీకా (బృహదారణ్యక)
 
సా హోవాచ యదూర్ధ్వం యాజ్ఞవల్క్య దివో యదవాక్పృథివ్యా యదన్తరా ద్యావాపృథివీ ఇమే యద్భూతం చ భవచ్చ భవిష్యచ్చేత్యాచక్షతే కస్మింస్తదోతం చ ప్రోతం చేతి ॥ ౬ ॥
వ్యాఖ్యాతమన్యత్ । సా హోవాచ యదూర్ధ్వం యాజ్ఞవల్క్యేత్యాదిప్రశ్నః ప్రతివచనం చ ఉక్తస్యైవార్థస్యావధారణార్థం పునరుచ్యతే ; న కిఞ్చిదపూర్వమర్థాన్తరముచ్యతే ॥

వక్ష్యమాణం వాక్యమన్యదిత్యుచ్యతే । తదేవ ప్రశ్నప్రతివచనరూపమనువదతి —

సా హేతి ।

పునరుక్తేరకిఞ్చిత్కరత్వం వ్యావర్తయతి —

ఉక్తస్యైవేతి ॥౬॥