యథా వాగగ్నిర్దేవతా తద్వదిత్యాహ —
పూర్వవదితి ।
ప్రాణ ఎవాఽఽయతనమిత్యత్ర ప్రాణశబ్దః కరణవిషయః । పతితాదికమిత్యాదిపదమకులీనగ్రహార్థమ్ । ఉగ్రో జాతివిశేషః । ఆదిశబ్దేన మ్లేచ్ఛగణో గృహ్యతే ॥౩॥