అత్రేతి మోక్షప్రకరణోక్తిః । బన్ధప్రకరణం దృష్టాన్తయితుమపిశబ్దః । ఉక్తేఽర్థే తదేష ఇత్యాద్యక్షరాణి వ్యాచష్టే —
తత్తస్మిన్నేవేతి ।
యస్మిన్కాలే విద్యాపరిపాకావస్థాయామిత్యర్థః ।
సుషుప్తివ్యావృత్త్యర్థం సర్వవిశేషణమితి మత్వాఽఽహ —
సమస్తా ఇతి ।
కామశబ్దస్యార్థాన్తరవిషయత్వం వ్యావర్తయతి —
తృష్ణేతి ।
క్రియాపదం సోపసర్గం వ్యాకరోతి —
ఆత్మకామస్యేతి ।
తానేవ విశినష్టి —
యే ప్రసిద్ధా ఇతి ।
కామానామాత్మాశ్రయత్వం నిరాకరోతి —
హృదీతి ।
సమూలతః కామవియోగాదితి సంబన్ధః ।
కామవియోగాదమృతో భవతీతినిర్దేశసామర్థ్యసిద్ధమర్థమాహ —
అర్థాదితి ।
తేషాం మృత్యుత్వే కిం స్యాత్తదాహ —
అత ఇతి ।
అత్రేత్యాదినా వివక్షితమర్థమాహ —
అతో మోక్ష ఇతి ।
ఆదిపదముత్క్రాన్త్యాదిసంగ్రహార్థమ్ ।
ముక్తేస్తదపేక్షాభావే ఫలితమాహ —
తస్మాదితి ।
తర్హి మరణాసిద్ధిరిత్యాశఙ్క్యాఽఽహ —
యథేతి ।
ఉత్క్రాన్తిగత్యాగతిరాహిత్యం యథావస్థితత్వమ్ ।
ఎతచ్చ పఞ్చమే ప్రతిపాదితమిత్యాహ —
నామమాత్రమితి ।
తద్యథేత్యాదివాక్యనిరస్యాం శఙ్కామాహ —
కథం పునరితి ।
విదుషో విద్యయాఽఽత్మమాత్రత్వేన ప్రాణాదిషు బాధితేష్వపి దేహే చేదసౌ వర్తతే తతోఽస్య పూర్వవద్దేహిత్వాద్విద్యావైయర్థ్యమిత్యర్థః ।
దృష్టాన్తేన పరిహరతి —
అత్రేత్యాదినా ।
దేహే వర్తమానస్యాపి విదుషస్తత్రాభిమానరాహిత్యం తత్రేత్యుచ్యతే । యస్యాం త్వచి సర్పో నితరాం లీయతే సా నిర్లయనీ సర్పత్వగుచ్యతే ।
సర్పనిర్మోకదృష్టాన్తస్య దార్ష్టాన్తికమాహ —
ఎవమేవేతి ।
సర్పదృష్టాన్తస్య దార్ష్టాన్తికం దర్శయతి —
అథేతి ।
అజ్ఞానేన సహ దేహస్య నష్టత్వమశరీరత్వాదౌ హేతురథశబ్దార్థః ।
అథశబ్దావద్యోతితహేత్వవష్టమ్భేనాశరీరత్వం విశదయతి —
కామేతి ।
పూర్వమిత్యవిద్యావస్థోక్తిః । ఇదానీమితి విద్యావస్థోచ్యతే ।
వ్యుత్పత్త్యనుసారిణం రూఢం చ ముఖ్యం ప్రాణం వ్యావర్తయతి —
ప్రాణస్యేతి ।
శ్లోకే పర ఎవాఽఽత్మా యథా ప్రాణశబ్దస్తథాఽత్రాపీత్యర్థః ।
యథా చ శ్రుత్యన్తరే ప్రాణశబ్దః పర ఎవాఽఽత్మా తథాఽఽత్రాపీత్యాహ —
ప్రాణేతి ।
కిఞ్చ పరవిషయమిదం ప్రకరణమథాకామయమాన ఇతి ప్రాజ్ఞస్య ప్రకాన్తత్వాదథాయమిత్యాది వాక్యం చ తద్విషయమన్యథా బ్రహ్మాదిశబ్దానుపపత్తేః । తస్మాదుభయసామర్థ్యాదత్ర పర ఎవాఽఽత్మా ప్రాణశబ్దిత ఇత్యాహ —
ప్రకరణేతి ।
విశేష్యం దర్శయిత్వా విశేషణం దర్శయతి —
బ్రహ్మైవేతి।
బ్రహ్మశబ్దస్య కమలాసనాదివిషయత్వం వారయతి —
కిం పునరితి ।
తేజఃశబ్దస్య కార్యజ్యోతిర్విషయత్వమాశఙ్క్యాఽఽహ —
విజ్ఞానేతి ।
తత్ర ప్రమాణమాహ —
యేనేతి ।
ప్రజ్ఞా ప్రకృష్టా జ్ఞప్తిః స్వరూపచైతన్యం నేత్రమివ నేత్రం ప్రకాశకమస్యేతి తథోక్తమ్ ।
సోఽహమిత్యాదేస్తాత్పర్యం వక్తుం వృత్తం కీర్తయతి —
యః కామప్రశ్న ఇతి ।
నిర్ణయప్రకారం సంక్షిపతి —
సంసారేతి ।
సోఽహమిత్యాదివాక్యాన్తరముత్థాపయతి —
ఇదానీమితి ।
ఆకాఙ్క్షాపూర్వకం వాక్యమాదాయ విభజతే —
కథమితి ।
సహస్రదానమాక్షిపతి —
అత్రేతి ।
సర్వస్వదానప్రాప్తావపి సహస్రదానే హేతుమేకదేశీయం దర్శయతి —
అత్రేత్యాదినా ।
కదా తర్హి గురవే సర్వస్వం రాజా నివేదయిష్యతి తత్రాఽఽహ —
శ్రుత్వేతి ।
నను పునః శుశ్రూషురపి రాజా కిమితి సంప్రత్యేవ గురవే న ప్రయచ్ఛతి ప్రభూతా హి దక్షిణా గురుం ప్రీణయన్తీ స్వీయాం శుశ్రూషా ఫలయతి తత్రాఽఽహ —
యది చేతి ।
అనాప్తోక్తౌ హృదయేఽన్యన్నిధాయ వాచాఽన్యనిష్పాదనాత్మకం వ్యాజోత్తరం యుక్తం శ్రుతౌ త్వపౌరుషేయ్యామపాస్తాశేషదోషశఙ్కాయాం న వ్యాజోక్తిర్యుక్తా తదీయస్వారసికప్రామాణ్యభఙ్గప్రసంగాదితి దూషయతి —
సర్వమపీతి ।
ఎకదేశీయపరిహారసంభవే హేత్వన్తరమాహ —
అర్థేతి ।
తదుపపత్తిమేవోపపాదయతి —
విమోక్షేతి ।
తస్యాపి పూర్వమసకృదుక్తేస్తదీయశుశ్రూషాధీనం సహస్రదానమనుచితమిత్యాశఙ్క్య శమాదేర్జ్ఞానసాధనత్వేన ప్రాగనుక్తేస్తేన సహ భూయోఽపి సంన్యాసస్య వక్తవ్యత్వయోగాత్తదపేక్షయా యుక్తం సహస్రదానమిత్యాహ —
అగతికా హీతి ।
నను సంన్యాసాది విద్యాస్తుత్యర్థముచ్యతే మహాభాగా హీయం యత్తదర్థీ దుష్కరమపి కరోత్యతో నార్థశేషసిద్ధిస్తత్రాఽఽహ —
న చేతి ।
న తావత్సంన్యాసో విద్యాస్తుతిర్విదిత్వా వ్యుత్థాయేతి సమానకర్తృత్వనిర్దేశాదితి పఞ్చమే స్థితం నాపి శమాదిర్విద్యాస్తుతిస్తత్రాపి విధేర్వక్ష్యమాణత్వాదిత్యర్థః ।
అర్థశేషశుశ్రూషయా సహస్రదానమిత్యత్ర జనకస్యాకౌశలం చోదయతి —
నన్వితి ।
రాజ్ఞః శఙ్కితమకౌశలం దూషయతి —
నైష ఇతి ।
తత్ర హేతుమాహ —
ఆత్మజ్ఞానవదితి ।
యథాఽఽత్మజ్ఞానం మోక్షే ప్రయోజకం న తథా సంన్యాసో న చాస్మిన్పక్షే తస్యాకర్తవ్యత్వం ప్రతిపత్తికర్మవదనుష్ఠానసంభవాదితి రాజా యతో మన్యతే తతః సంన్యాసస్య న జ్ఞానతుల్యత్వమతో నాత ఊర్ధ్వం విమోక్షాయైవ బ్రూహీతి పృచ్ఛతీత్యర్థః ।
సంన్యాసస్య ప్రతిపత్తికర్మవత్కర్తవ్యత్వే ప్రమాణమాహ —
సంన్యాసేనేతి ।
నను వివిదిషాసంన్యాసమఙ్గీకుర్వతా న తస్య ప్రతిపత్తికర్మవదనుష్ఠేయత్వమిష్యతే తత్రాఽఽహ —
సాధనత్వేతి।
’త్యజతైవ హి తజ్జ్ఞేయం త్యక్తుః ప్రత్యక్పరం పదమ్’ ఇత్యుక్తత్వాదిత్యర్థః ॥ ౭ ॥