బృహదారణ్యకోపనిషద్భాష్యమ్
పఞ్చమోఽధ్యాయఃత్రయోదశం బ్రాహ్మణమ్
ఆనన్దగిరిటీకా (బృహదారణ్యక)
 
యజుః ప్రాణో వై యజుః ప్రాణే హీమాని సర్వాణి భూతాని యుజ్యన్తే యుజ్యన్తే హాస్మై సర్వాణి భూతాని శ్రైష్ఠ్యాయ యజుషః సాయుజ్యం సలోకతాం జయతి య ఎవం వేద ॥ ౨ ॥
యజురితి చోపాసీత ప్రాణమ్ ; ప్రాణో వై యజుః ; కథం యజుః ప్రాణః ? ప్రాణే హి యస్మాత్ సర్వాణి భూతాని యుజ్యన్తే ; న హి అసతి ప్రాణే కేనచిత్ కస్యచిత్ యోగసామర్థ్యమ్ ; అతో యునక్తీతి ప్రాణో యజుః । ఎవంవిదః ఫలమాహ — యుజ్యన్తే ఉద్యచ్ఛన్తే ఇత్యర్థః, హ అస్మై ఎవంవిదే, సర్వాణి భూతాని, శ్రైష్ఠ్యం శ్రేష్ఠభావః తస్మై శ్రైష్ఠ్యాయ శ్రేష్ఠభావాయ, అయం నః శ్రేష్ఠో భవేదితి ; యజుషః ప్రాణస్య సాయుజ్యమిత్యాది సర్వం సమానమ్ ॥

యజుఃశబ్దస్యాన్యత్ర రూఢత్వాదయుక్తం ప్రాణవిషయత్వమితి శఙ్కిత్వా పరిహరతి —

కథమిత్యాదినా ।

అసత్యపి ప్రాణే యోగః సంభవతీత్యాశఙ్క్యాఽఽహ —

న హీతి ।

ప్రకరణానుగృహీతప్రాణశబ్దశ్రుత్యా యజుఃశబ్దస్య రూఢిం త్యక్త్వా యోగోఽఙ్గీక్రియత ఇత్యాహ —

అత ఇతి ॥౨॥