బృహదారణ్యకోపనిషద్భాష్యమ్
షష్ఠోఽధ్యాయఃచతుర్థం బ్రాహ్మణమ్
ఆనన్దగిరిటీకా (బృహదారణ్యక)
 
ఎతదద్ధ స్మ వై తద్విద్వానుద్దాలక ఆరుణిరాహైతద్ధ స్మ వై తద్విద్వాన్నాకో మౌద్గల్య ఆహైతద్ధ స్మ వై తద్విద్వాన్కుమారహారిత ఆహ బహవో మర్యా బ్రాహ్మణాయనా నిరిన్ద్రియా విసుకృతోఽస్మాల్లోకాత్ప్రయన్తి య ఇదమవిద్వాంసోఽధోపహాసం చరన్తీతి బహు వా ఇదం సుప్తస్య వా జాగ్రతో వా రేతః స్కన్దతి ॥ ౪ ॥
ఎతద్ధ స్మ వై తత్ విద్వాన్ ఉద్దాలక ఆరుణిః ఆహ అధోపహాసాఖ్యం మైథునకర్మ వాజపేయసమ్పన్నం విద్వానిత్యర్థః । తథా నాకో మౌద్గల్యః కుమారహారితశ్చ । కిం త ఆహురిత్యుచ్యతే — బహవో మర్యా మరణధర్మిణో మనుష్యాః, బ్రాహ్మణా అయనం యేషాం తే బ్రాహ్మణాయనాః బ్రహ్మబన్ధవః జాతిమాత్రోపజీవిన ఇత్యేతత్ , నిరిన్ద్రియాః విశ్లిష్టేన్ద్రియాః, విసుకృతః విగతసుకృతకర్మాణః, అవిద్వాంసః మైథునకర్మాసక్తా ఇత్యర్థః ; తే కిమ్ ? అస్మాత్ లోకాత్ ప్రయన్తి పరలోకాత్ పరిభ్రష్టా ఇతి । మైథునకర్మణోఽత్యన్తపాపహేతుత్వం దర్శయతి — య ఇదమవిద్వాంసోఽధోపహాసం చరన్తీతి । శ్రీమన్థం కృత్వా పత్న్యా ఋతుకాలం బ్రహ్మచర్యేణ ప్రతీక్షతే ; యది ఇదం రేతః స్కన్దతి, బహు వా అల్పం వా, సుప్తస్య వా జాగ్రతో వా, రాగప్రాబల్యాత్ ॥౪॥

అవిదుషామతిగర్హితమిదం కర్మేత్యత్రాఽఽచార్యపరమ్పరాసమ్మతిమాహ —

ఎతద్ధేతి ।

పశుకర్మణో వాజపేయసంపన్నత్వమిదంశబ్దార్థః । అవిదుషామవాచ్యే కర్మణి ప్రవృత్తానాం దోషిత్వముపసంహర్తుమితిశబ్దః ।

విదుషో లాభమవిదుషశ్చ దోషం దర్శయిత్వా క్రియాకాలాత్ప్రాగేవ రేతఃస్ఖలనే ప్రాయశ్చిత్తం దర్శయతి —

శ్రీమన్థమితి ।

యః ప్రతీక్షతే తస్య రేతో యది స్కన్దతీతి యోజనా ॥౪॥