సముచ్చయపక్షే ప్రశ్నప్రతివచనయోరసమ్భవాత్ నేదం గీతాశాస్త్రం తత్పరమిత్యుపసంహరతి -
తస్మాదితి ।
విశుద్ధబ్రహ్మాత్మజ్ఞానం స్వఫలసిద్ధౌ న సహకారిసాపేక్షమ్ , అజ్ఞాననివృత్తిఫలత్వాత్ , రజ్జ్వాదితత్త్వజ్ఞానవత్ । అథవా - బన్ధః సహాయానపేక్షేణ జ్ఞానేన నివర్త్యతే, అజ్ఞానాత్మకత్వాత్ , రజ్జుసర్పాదివదితి భావః ।
నను - ‘కుర్యాద్విద్వాంస్తథాఽసక్తశ్చికీర్షుర్లోకసఙ్గ్రహమ్’ (భ. భ. గీ. ౩-౨౫) ఇతి వక్ష్యమాణత్వాత్ కథం గీతాశాస్త్రే సముచ్చయో నాస్తి ? తత్రాహ -
యస్య త్వితి ।
చోదనాసూత్రానుసారేణ విధితోఽనుష్ఠేయస్య కర్మణో ధర్మత్వాత్ , వ్యాపారమాత్రస్య తథాత్వాభావాత్ తత్త్వవిదశ్చ వర్ణాశ్రమాభిమానశూన్యస్య అధికారప్రతిపత్త్యభావాత్ , యాగాదిప్రవృత్తీనామవిద్యాలేశతో జాయమానానాం కర్మాభాసత్వాత్ , ‘కుర్యాద్విద్వాన్’ (భ. భ. గీ. ౩-౨౫) ఇత్యాదివాక్యం న సముచ్చయప్రాపకమితి భావః । వాశబ్దశ్చార్థే । ద్వితీయస్తు వివిదిషావాక్యస్థసాధనాన్తరసఙ్గ్రహార్థః ।
సాంసారికం జ్ఞానం వ్యావర్తయతి -
పరమార్థేతి ।
తదేవాభినయతి -
ఎకమితి ।
ప్రవృత్తిరూపమితి రూపగ్రహణమాభాసత్వప్రదర్శనార్థమ్ । కర్మాభాససముచ్చయస్తు యాదృచ్ఛికత్వాత్ న మోక్షం ఫలయతీతి శేషః ।
కిఞ్చ, జ్ఞానినో యాగాదిప్రవృత్తిర్న జ్ఞానేన తత్ఫలేన సముచ్చీయతే, ఫలాభిసన్ధివికలప్రవృత్తిత్వాత్ అహఙ్కారవిధురప్రవృత్తిత్వాద్వా భగవత్ప్రవృత్తివదిత్యాహ -
యథేతి ।
హేతుద్వయస్యాసిద్ధిమాశఙ్క్య పరిహరతి -
తత్త్వవిదితి ।
కూటస్థం బ్రహ్మైవాహమితి మన్వానో విద్వాన్ ప్రవృత్తిం తత్ఫలం వా నైవ స్వగతత్వేన పశ్యతి, రూపాదివద్ దృశ్యస్య ద్రష్టృధర్మత్వాయోగాత్ । కిన్తు కార్యకరణసఙ్ఘాతగతత్వేనైవ ప్రవృత్త్యాది ప్రతిపద్యతే । తతస్తత్త్వవిదో వ్యాఖ్యానభిక్షాటనాదావహఙ్కారస్య తృప్త్యాదిఫలాభిసన్ధేశ్చ ఆభాసత్వాత్ నాసిద్ధం హేతుద్వయమిత్యర్థః ।
నను - జ్ఞానోదయాత్ ప్రాగవస్థాయామివోత్తరకాలేఽపి ప్రతినియతప్రవృత్త్యాదిదర్శనాత్ న తత్త్వదర్శినిష్ఠప్రవృత్త్యాదేరాభాసత్వమితి, తత్రాహ -
యథా చేతి ।
స్వర్గాదిరేవ కామ్యమానత్వాత్ కామః, తదర్థినః - స్వర్గాదికామస్య అగ్నిహోత్రాదేరపేక్షితస్వర్గాదిసాధనస్యానుష్ఠానార్థమగ్నిమాధాయ వ్యవస్థితస్య తస్మిన్నేవ కామ్యే కర్మణి ప్రవృత్తస్య అర్ధకృతే కేనాపి హేతునా కామే వినష్టే తదేవాగ్నిహోత్రాది నిర్వర్తయతో న తత్ కామ్యం భవతి, నిత్యకామ్యవిభాగస్య స్వాభావికత్వాభావాత్ , కామోపబన్ధానుపబన్ధకృతత్వాత్ । తథా విదుషోఽపి విధ్యధికారాభావాత్ యాగాదిప్రవృత్తీనాం కర్మాభాసతేత్యర్థః ।
విద్వత్ప్రవృత్తీనాం కర్మాభాసత్వమిత్యత్ర భగవదనుమతిముపన్యస్యతి -
తథా చేతి ।