అాగమప్రాధాన్యేనాద్వైతం ప్రతిపాదయతా తత్ప్రత్యనీకస్య ద్వైతస్య మిథ్యాత్వమర్థాదుక్తమ్ । ఇదానీం తన్మిథాత్వముపపత్తిప్రాధాన్యేనాపి ప్రతిపత్తుం సుశకమితి దర్శయితుం ప్రకరణాన్తరమవతారయన్నాదౌ దృష్టాన్తసిద్ధ్యర్థం తస్మిన్ వృద్ధసంమతిమాహ –
వైతథ్యమితి ।
న కేవలమాగమోక్తివశాదేవ స్వప్నమిథ్యాత్వం, కిం తు యుక్తితోఽపీత్యాహ –
అన్తఃస్థానాదితి ।
పూర్వోత్తరప్రకరణయోః సమ్బన్ధసిద్ధ్యర్థం పూర్వప్రకరణే వృత్తం సంక్షిప్యానువదతి –
జ్ఞాత ఇతి ।
ఆదిశబ్దేన ‘యత్ర హి ద్వైతమివ భవతి’(బృ. ఉ. ౨ । ౪ । ౧౪) ఇత్యాదిశ్రుతిర్గృహ్యతే ।
తర్హి ద్వైతమిథ్యాత్వస్య ప్రాగేవ సిద్ధత్వాదుత్తరం ప్రకరణమనర్థకమిత్యాశఙ్క్యాఽఽహ –
ఆగమేతి ।
యద్ద్వైతమిథ్యాత్వం పూర్వముక్తం – తదాగమమాత్రమ్ ఆగమప్రాధాన్యేనాధిగతమ్ । న హ్యుక్తితః సిద్ధమ్ । తస్మిన్నాగమతోఽవగతే యుక్తిప్రాధాన్యేనాపి తన్మిథ్యాత్వమవగన్తవ్యమితి ప్రకరణాన్తరం ప్రారబ్ధమిత్యర్థః । ప్రమాణానుగ్రాహకత్వాత్తర్కస్యానుగ్రాహ్యప్రమాణస్య ప్రధానత్వాత్ తదధీనవిచారానన్తరం తర్కాధీనవిచారస్య సావకాశాద్ యుక్తం పౌర్వాపర్యం పూర్వోత్తరప్రకరణయోరిత్యుక్తమ్ ।
సంప్రతి శ్లోకాక్షరాణి యోజయతి –
వితథస్యేత్యాదినా ।
బాహ్యఘటాదయః; సుఖాదయస్త్వాధ్యాత్మికా భావాః ।
శరీరాన్తరవస్థానం స్వాప్నానాం భావానామిత్యత్రానుభవం ప్రమాణయతి –
తత్ర హీతి ।
తేషామన్తరుపలభ్యమానత్వేఽపి న వైతథ్యం వ్యభిచారాదిత్యాశఙ్కామనూద్య పరిహరతి –
నన్విత్యాదినా ।
హేత్వాన్తరశఙ్కాం వారయతి –
అన్తరితి ।
యద్యపి దేహాన్తః సఙ్కుచితే దేశే స్వాప్నా భావా భవన్తి తథాఽపి కథం తేషాం మృషాత్వమిత్యత ఆహ –
న హీతి ।
అన్తరిత్యుక్తం స్ఫుటయతి –
సంవృత ఇతి ।
తమేవ సఙ్కుచితం దేశం విశేషణాన్తరేణ స్ఫోరయతి –
దేహాన్తర్నాడీష్వితి ।
ఉక్తమర్థం కైముతికన్యాయేన స్ఫుటయతి –
న హీతి ।
యదా దేహేఽపి పర్వతాదయో న సంభావ్యన్తే తదా తదన్తర్వర్తినీషు నాడిష్వతిసూక్ష్మాసు తేషాం సమ్భావనా నాస్తీతి కిము వక్తవ్యమిత్యర్థః । స్వాప్నా భవాః సత్యా న భవన్తి, ఉచితదేశశూన్యత్వాత్, రజతభుజఙ్గాదివదితి భావః ॥౧॥