ఐతరేయోపనిషద్భాష్యమ్
ప్రథమః అధ్యాయఃప్రథమః ఖణ్డః
ఆనన్దగిరిటీకా (ఐతరేయ)
 
ఆత్మా వా ఇదమేక ఎవాగ్ర ఆసీత్ । నాన్యత్కిఞ్చన మిషత్ । స ఈక్షత లోకాన్ను సృజా ఇతి ॥ ౧ ॥
ఆత్మేతి । ఆత్మా ఆప్నోతేరత్తేరతతేర్వా పరః సర్వజ్ఞః సర్వశక్తిరశనాయాదిసర్వసంసారధర్మవర్జితో నిత్యత్యశుద్ధబుద్ధముక్తస్వభావోఽజోఽజరోఽమరోఽమృతోఽభయోఽద్వయో వై । ఇదం యదుక్తం నామరూపకర్మభేదభిన్నం జగత్ ఆత్మైవ ఎకః అగ్రే జగతః సృష్టేః ప్రాక్ ఆసీత్ । కిం నేదానీం స ఎవైకః ? న । కథం తర్హి ఆసీదిత్యుచ్యతే ? యద్యపీదానీం స ఎవైకః, తథాప్యస్తి విశేషః । ప్రాగుత్పత్తేః అవ్యాకృతనామరూపభేదమాత్మభూతమాత్మైకశబ్దప్రత్యయగోచరం జగత్ ఇదానీం వ్యాకృతనామరూపభేదత్వాదనేకశబ్దప్రత్యయగోచరమాత్మైకశబ్దప్రత్యయగోచరం చేతి విశేషః । యథా సలిలాత్పృథక్ ఫేననామరూపవ్యాకరణాత్ప్రాక్సలిలైకశబ్దప్రత్యయగోచరమేవ ఫేనమ్ , యదా సలిలాత్పృథఙ్ నామరూపభేదేన వ్యాకృతం భవతి, తదా సలిలం ఫేనం చేతి అనేకశబ్దప్రత్యయభాక్ సలిలమేవేతి చైకశబ్దప్రత్యయభాక్చ ఫేనం భవతి, తద్వత్ । న అన్యత్కిఞ్చన న కిఞ్చిదపి మిషత్ నిమిషద్వ్యాపారవదితరద్వా । యథా సాఙ్‍ఖ్యానామనాత్మపక్షపాతి స్వతన్త్రం ప్రధానమ్ , యథా చ కాణాదానామణవః, న తద్వదిహాన్యదాత్మనః కిఞ్చిదపి వస్తు విద్యతే । కిం తర్హి ? ఆత్మైవైక ఆసీదిత్యభిప్రాయః । సః సర్వజ్ఞస్వాభావ్యాత్ ఆత్మా ఎక ఎవ సన్ ఈక్షత । నను ప్రాగుత్పత్తేరకార్యకరణత్వాత్కథమీక్షితవాన్ ? నాయం దోషః, సర్వజ్ఞస్వాభావ్యాత్ । తథా చ మన్త్రవర్ణః — ‘అపాణిపాదో జవనో గ్రహీతా’ (శ్వే. ఉ. ౩ । ౨౯) ఇత్యాదిః । కేనాభిప్రాయేణేత్యాహ — లోకాన్ అమ్భఃప్రభృతీన్ప్రాణికర్మఫలోపభోగస్థానభూతాన్ ను సృజై సృజేఽహమ్ ఇతి ॥

తత్రాఽఽత్మశాబ్దార్థమాహ –

ఆత్మేతి ।

ఆత్మేతి పదేన సర్వజ్ఞాదిరూప ఆత్మోచ్యత ఇత్యన్వయః । అద్వయ ఇత్యనన్తరముచ్యత ఇతి శేషః ।

నన్వాత్మశబ్దేన కథముక్తలక్షణ ఆత్మోచ్యత ఇత్యాశఙ్క్యాఽఽత్మశబ్దస్య స్మృత్యుక్తవ్యుత్పత్తిబలాద్రూఢ్యా చేత్యాహ –

ఆప్నోతేరితి ।

వాశబ్దశ్చార్థ ఆదానం చ సముచ్చినోతి । తథా చ స్మృతిః “యచ్చాఽఽప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయానిహ । యచ్చాస్య సన్తతో భావస్తస్మాదాత్మేతి కీర్త్యతే “ ॥ ఇతి । అత్రాఽఽప్తిర్జ్ఞానం వ్యాప్తిశ్చోచ్యతే । సత్తాస్ఫురణాభ్యాం సర్వం వ్యాప్నోతీతి సర్వజ్ఞత్వం సర్వశక్తిత్వం చోచ్యతే । సత్తాప్రదనేనోపాదానత్వసూచనాత్సర్వశక్తిత్వమత్తీత్యనేన సంహర్తృత్వమతతీత్యనేన త్రివిధపరిచ్ఛేదరాహిత్యముచ్యత ఇతి । అశనాయాదివర్జితత్వాదితి విషయాదానేన రూఢ్యా చ ప్రత్యగభేదశ్చోచ్యత ఇత్యుక్తరూప ఆత్మపదేనోచ్యత ఇత్యర్థః ।

అభివ్యక్తనామరూపవ్యావర్తనేనాఽఽత్మమాత్రావధారణార్థో వైశబ్ద ఇత్యాహ –

వా ఇతి ।

యదుక్తమితి ।

పూర్వత్ర ప్రాణశబ్దితప్రజాపతిరూపత్వేన యదుక్తమిత్యర్థః । యదుతేతి పాఠః సాధుః । తత్రోతేతి పదేన ప్రత్యక్షాదిప్రసిద్ధముచ్యతే ।

నన్వగ్ర ఇతి విశేషణాదాసీదితి భూతత్వోక్తేశ్చ పూర్వమేవాఽఽత్మమాత్రమిదానీం త్వాత్మమాత్రం న భవతి కిన్తు తతః పృథక్సదితి ప్రతీయత ఇతి నాద్వితీయ ఆత్మేతి శఙ్కతే –

కిం నేదానీమితి ।

జడస్య మాయికస్య కదాచిదపి స్వతః సత్త్వాయోగాదాత్మనోఽద్వితీయత్వస్య న విరోధ ఇత్యాహ –

నేతి ।

తర్హ్యాత్మమాత్రత్వస్యేదానీమపి సత్త్వే భూతత్వోక్తేః కా గతిరితి పృచ్ఛతి –

కథం తర్హ్యాసీదితి ।

ఇదముపలక్షణమగ్ర ఇత్యపి కథమితి ద్రష్టవ్యమ్ । జగతః కాలత్రయేఽప్యాత్మవ్యతిరేకేణాభావో యద్యపి తథాఽపి తథా బోధనే బోధ్యస్య ప్రత్యక్షాదివిరోధశఙ్కయోక్తమాత్మతత్త్వం బుద్ధౌ నాఽఽరోహేత్ ।

అతః ప్రాగుత్పత్తేరాసీదిత్యుచ్యతే బోధ్యస్య చిత్తమనుసృత్య తదపి జగతో నామరూపాభివ్యక్త్యభావమపేక్ష్యైవ న త్విదానీమాత్మమాత్రత్వాభావాభిప్రాయేణేత్యుత్తరమాహ –

యద్యపీత్యాదినా ।

అవ్యాకృతో నామరూపభేదో యస్మిన్నాత్మని తథావిధాత్మభూతమిత్యర్థః ।

ఆత్మైకశబ్దప్రత్యయగోచరమితి ।

యద్యపి ప్రాగుత్పత్తేర్వాగ్బుద్ధ్యోరభావేన శబ్దప్రత్యయౌ తావపి న స్తస్తథాపీదానీం తదానీన్తనాత్మతత్త్వం సుప్తాదుత్థితః సుప్తికాలీనాత్మతత్త్వమివ ప్రమాణాన్తరేణ జ్ఞాత్వా తదానీమాత్మైక ఎవాఽఽసీదితి వదతి ప్రత్యేతి చేతి । తథోక్తేశ్చరస్య వాఽఽకత్మాశబ్దప్రత్యయౌ స్త ఇతి ద్రష్టవ్యమ్ ।

అనేకశబ్దేతి ।

అవివేకినాం ఘటాదిశబ్దప్రత్యయగోచరం ఘటః సన్నిత్యాత్మశబ్దపర్యాయసచ్ఛబ్దగోచరం చేత్యర్థః । గోచరశబ్దస్య భావప్రధానత్వమఙ్గీకృత్య గోచరత్వం యస్యేతి బహువ్రీహిణా నపుంసకత్వం ద్రష్టవ్యమ్ ।

ఆత్మైకశబ్దేతి ।

వివేకినామిత్యర్థః ।

ఉక్తమర్థం దృష్టాన్తేన విశదయతి –

యథేతి ।

అత్రాఽఽత్మశబ్దవ్యుత్పత్తిబలాత్సర్వజ్ఞాదిశబ్దోపలక్షితః సత్యజ్ఞానానన్తరూపోఽఖణ్డైకరస ఆత్మోపక్షిప్తః । తస్యైవార్థస్య దృఢీకరణార్థమేకాదిపదాని । తత్రైక ఇత్యాత్మాన్తరాభావ ఉచ్యతే । ఎవేత్యనేన వృక్షాదావేకత్వేఽపి శాఖాదిభిర్నానాత్మత్వవదేకస్యాప్యాత్మనో నానాత్మత్వాభావ ఉచ్యత ఇతి ।

స్వ జాతీయభేదస్వగతభేదనిరాకరణార్థత్వేన పదద్వయమిత్యభిప్రేత్య విజాతీయభేదనిరాకరణార్థత్వేన నాన్యత్కిఞ్చనేతి పదం వ్యాచష్టే –

నాన్యదితి ।

నను జడప్రపఞ్చస్య కారణీభూతా జడా మాయా వర్తత ఇతి కథం విజాతీయభేదనిషేధ ఇత్యత ఆహ –

మిషదితి ।

మాయాయాః సత్త్వేఽపి తదానీం వ్యాపారాభావాద్వ్యాపారవతోఽన్యస్య నిషేధః సమ్భవతీత్యర్థః ।

నను నిర్వ్యాపారాయా అపి తస్యా అన్యస్యాః సత్త్వ ఆత్మశబ్దోక్తం తస్యాఖణ్డైకరసత్వం న సిధ్యేదిత్యత ఆహ –

ఇతరద్వేతి ।

నిర్వ్యాపారం వేత్యర్థః । నను మాయా తథావిధాఽస్తీతి పునః పూర్వోక్తదోషః స్యాదిత్యాశఙ్క్య మిషదిత్యనేన స్వతన్త్రం స్వతః సత్తాకముచ్యతే ।

తథావిధస్య చ నిషేధ ఇతి వ్యతిరేకదృష్టాన్తేనాఽఽహ –

యథేతి ।

అనాత్మపక్షపాతీతి ।

ఆత్మశక్తితయాఽఽత్మన్యేవాన్తర్భూతమాత్మపక్షపాతీత్యుచ్యతే । తద్భిన్నమిత్యర్థః ।

శక్తిత్వేఽపి ప్రాభాకరాణామివ తస్యాః స్వతః సత్త్వం స్యాన్నేత్యాహ –

స్వతన్త్రమితి ।

యథా సాఙ్ఖ్యానాం ప్రధానశక్తిభూతం స్వతఃసత్తాకమస్తి, కాణాదానాం చ తథావిధా అణవః సన్తి, తథావిధమాత్మవ్యతిరిక్తం మిషదిత్యనేనానూద్య నిషిధ్యతే । మాయా తు న తథాభూతేతి నోక్తదోష ఇత్యర్థః । దీపికాయాం తు ధాతూనామనేకార్థత్వేన మిషదితి ధాతోరాసీదిత్యర్థముక్త్వా నాన్యత్కిఞ్చనాఽఽసీదితి వాక్యార్థ ఉక్తః ।

తదయం వాక్యార్థః –

ఇదం జగదగ్రే సజాతీయవిజాతీయస్వగతభేదరహితాత్మైవాఽఽసీదితి ।

అనేనాఽఽత్మనోఽద్వితీయత్వం జగతస్తథావిధాత్మమాత్రతయా మృషాత్వం చ సూచితమ్ । అనేనాగ్రే జగత ఆత్మమాత్రత్వోక్తేర్న కిఞ్చిత్ప్రయోజనమాత్మైక ఎవాఽఽసీన్నాన్యత్కిఞ్చనేత్యేతావతైవాఖణ్డత్వసిద్ధేరిత్యాశఙ్కా నిరస్తా । జగన్మృషాత్వసూచనస్యైవ ప్రయోజనత్వాత్ । న చైవమర్థభేదే వాక్యభేదః స్యాదితి వాచ్యమ్ । అఖణ్డత్వసమ్భావానార్థమేవ జగదనిర్వచనీయత్వస్యేదం ; జగదఖణ్డాత్మైవేతి విశిష్టవిశేషేణోక్తత్వాత్ । విశేషణానాం చార్థాత్సిద్ధేః “సోమేన యజేతే” త్యత్రేవేతి । అత్రార్థద్వయస్యాపి సూచితత్వాదేవాన్తేఽపి తస్య త్రయ అవస్థాస్త్రయః స్వప్నా ఇతి జాగ్రదాదేః స్వప్నత్వేన మృషాత్వముక్త్వా స ఎతమేవ పురుషం బ్రహ్మ తత్తమపశ్యదిత్యాత్మశబ్దోక్తం తత్తమత్వం త్రివిధపరిచ్ఛేదరాహిత్యలక్షణమఖణ్డత్వం వక్ష్యతి । న చేదమాత్మైవాఽఽసీదితి సామానాధికరణ్యేనాఽఽత్మనో జగద్వైశిష్ట్యమేవ ప్రతీయతే న తు జగతో మృషాత్వమితి వాచ్యమ్ । ఆత్మైక ఎవేతి పదైరుక్తేఽఖణ్డైకరసే తద్విపరీతజగత్ప్రతీతేరతస్మింస్తద్బుద్ధిరూపత్వేన మృషాత్వసిద్ధేర్జగద్వైశిష్ట్యస్య ఘటః సన్నిత్యాదిరూపేణ ప్రత్యక్షసిద్ధత్వేన ప్రయోజనాభావేన చ తత్ప్రతిపాదనస్యానుపపత్తేశ్చ మృషాత్వమేవ తదర్థః । మిషదిత్యనేన స్వాతన్త్ర్యనిషేధేన స్వతః సత్తానిషేధాదపి మృషాత్వసిద్ధేశ్చ । స్వతః సత్తావత్త్వే స్వవ్యాపారే స్వాతన్త్ర్యమేవ స్యాత్ । న చానేన ప్రకారేణేదానీమపి మృషాత్వస్యాఽఽత్మాఖణ్డత్వస్య చ వక్తుం శక్యత్వాదగ్ర ఇతి విశేషణం వ్యర్థమితి వాచ్యమ్ । ఇదానీమాత్మభిన్నతయా పృథక్సత్త్వేన చ ప్రతీయమానత్వేన తస్య సహసాఽఽత్మమాత్రత్వే బోధితే విరోధిప్రతీత్యా తస్య బుద్ధ్యనారోహః స్యాదితి గుడజిహ్వికాన్యాయేనాఽఽదౌ పృథఙ్నామరూపానభివ్యక్తిదశాయామాత్మమాత్రత్వం బోధ్యతే । తస్మిన్బోధితే పశ్చాత్తన్న్యాయేనేదానీమపి స్వయమేవాఽఽత్మమాత్రత్వం జ్ఞాస్యతీత్యభిప్రాయేణాగ్ర ఇతి విశేషణోపపత్తేః ।యద్వా వాజసనేయకే – “తద్ధేదం తర్హ్యవ్యాకృతమాసీత్” ఇతి సృష్టేః ప్రాక్కార్యస్యానభివ్యక్తనామరూపావస్థబీజభూతావ్యాకృతాత్మతోచ్యతే, ఇహ తు ఆత్మమాత్రతా ।తత్ర శ్రుత్యోర్విరోధపరిహారాయోపసంహారే కర్తవ్య ఇహావ్యాకృతపదముపసమ్హ్రియతే । తత్ర చాఽఽత్మపదమితీదమగ్రేఽవ్యాకృతమాసీత్తచ్చ సదాఽఽత్మైవాఽఽసీదితి వాక్యం సిధ్యతి । తత్రావ్యాకృతశబ్దేన “తమఆసీత్తమసా గూఢమగ్రే” “మాయాం తు ప్రకృతిం విద్యాత్” ఇత్యాదిషు జగద్బీజావస్థాయాం తమ ఆదిశబ్దప్రయోగాత్తమోరూపా మాయోచ్యతే, తేన కార్యస్యాగ్రేఽనభివ్యక్తనామరూపాత్మకమాయాత్మకత్వం సిధ్యతి । తస్యాశ్చాఽఽత్మతాదాత్మ్యోక్త్యా సాఙ్ఖ్యమతవత్స్వతన్త్రత్వనిరాసేన తత్ర కల్పితత్వం సిధ్యతి । తయోః కార్యకారణభవాద్యభావేన ప్రకారాన్తరేణ తాదాత్మ్యానిర్వాహాత్తతశ్చాఽత్మనోఽఖడత్వం తద్భిన్నస్య మృషాత్వం చాఽఽత్మనః పరిణమమానావిద్యాధిష్ఠానత్వేన వివర్తోపాదానత్వం తస్యాశ్చ పరిణామిత్వం చ సూచితం భవిష్యతి । కార్యస్య చ మృషాత్వార్థమేవావ్యాకృతాత్మత్వముచ్యతే । తస్యావ్యాకృతస్యాఽఽత్మతాదాత్మ్యేన మాయాత్వేన చ మృషాత్వాదిదానీం తు నానభివ్యక్తనామరూపబీజాత్మత్వమిత్యగ్ర ఇతి విశేషణమప్యర్థవత్ । తదభిప్రేత్యైవ భాష్యే ప్రాగుత్పత్తేరనభివ్యక్తనామరూపభేదాత్మభూతమాత్మైకశబ్దప్రత్యయగోచరం జగదిదానీం తు వ్యాకృతనామరూపభేదవత్త్వాదనేకశబ్దప్రత్యయగోచరమాత్మైకశబ్దప్రత్యయగోచరం చేతి విశేష ఇతీదానీన్తనాభివ్యక్తనామరూపబీజాత్మత్వమేవాగ్రశబ్దస్య వ్యావర్త్యముక్తమ్ । న చ సాక్షాదిదానీమేవ మాయాత్మత్వేన మృషాత్వముచ్యతామితి వాచ్యమ్ । ఇదానీం ప్రత్యక్షాదివిరోధేన తథా బోధయితుమశక్యత్వాదిత్యుక్తత్వాన్నామరూపాభివ్యక్తేః సృష్టేః పూర్వమభావేనేదానీమేవ విద్యమానత్వేన కాదాచిత్కత్వాదపి రజ్జుసర్పాదివన్మృషాత్వమితి వక్తుమపి ప్రాగవ్యాకృతత్వోక్తిరర్థవతీతి న కిఞ్చిదవద్యమ్ । అథవా జగదధిష్ఠానం కిఞ్చిత్సద్రూపం సమ్భావయితుమిదమగ్ర ఆసీదిత్యుచ్యతే । అసమ్భావితే తస్మిన్నఖణ్డాత్వోక్తేర్నిర్విషయత్వప్రసఙ్గాత్ । అనేనాసతః శశవిషాణాదేరివ సద్రూపేణోత్పత్త్యసమ్భావాత్కార్యస్య ప్రాగవస్థాసదాత్మికా కాచిత్సమ్భావితా । తస్యాశ్చాచేతనత్వే కార్యాకారేణ స్వతోఽప్రవృత్తేరతిరిక్తచేతనాధిష్ఠానాఙ్గీకారే చ గౌరవాత్ । ఉపాదానాధిష్ఠానత్వయోరేకస్మిన్నేవాఽఽత్మని ఘటసంయోగాదావివ సమ్భవాచ్చ చేతనత్వమాత్మైవేత్యనేన సమ్భావ్యతే । ఎవం సమ్భావితే హ్యధిష్ఠానాభిన్నౌపాదానకారణ ఆత్మన్యఖణ్డైకరసత్వం తస్య వక్తుమేక ఎవ నాన్యత్కిఞ్చనేతి పదాని । అస్మిన్పక్షే చేదమగ్ర ఆత్మైవాఽఽసీదిత్యంశేన సమ్భావితం కార్యస్య ప్రాగ్రూపమనూద్య యదాత్మకమిదమాసీత్స ఎక ఎవ నాన్యత్కిఞ్చనేత్యఖణ్డైకరసత్వం విధీయత తి న కస్యచిదప్యానర్థక్యమ్ । అత ఎవ ఛాన్దోగ్యే “సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్” ఇత్యస్య సద్రూపకారణసమ్భావనార్థత్వాదేవ తత్సిద్ధ్యర్థం తద్ధైక ఆహురిత్యాదినాఽసత్కారణవాదో నిరస్తః । అన్యథాఽసిద్ధస్య సతోఽద్వితీయత్వమాత్రవివక్షాయాం తస్యాప్రస్తుతత్వప్రసఙ్గాత్ । అస్మిన్నపి వ్యాఖ్యానే కారణస్యాద్వితీయత్వాదేవ చ తదన్యస్య మృషాత్వమపి సిధ్యతి । కార్యస్య మృషాత్వే తన్నిరూపితం కారణత్వమపి తథేతి తథావిధాత్మజ్ఞానాన్ముక్తిరపి వక్ష్యమాణా సిధ్యతీతి న కిఞ్చిదవద్యమ్ । దీపికాయాం త్విదమాత్మైవాఽసీదితి సామానాధికరణ్యం బాధాయాం యశ్చోరః స స్థాణురితివదిదానీం జగద్విశిష్టాత్మప్రతిభాసేన తత్ర బాధానుపపత్త్యా స్థితికాలం పరిత్యజ్యాగ్రశబ్దేన సృష్టేః ప్రాచీన కాల ఉపాదీయతే । సృష్టప్రపఞ్చబాధయా సిద్ధస్యాఖణ్డైకరసత్వస్య స్పష్టీకరణార్థమేకాదిశబ్దా ఇతి న కస్యాప్యానర్థక్యమిత్యుక్తమ్ । తత్రాగ్రశబ్దస్య న ప్రయోజనమారోప్య ప్రతీతిదశాయామేవ యశ్చోరః స స్థాణురిత్యాదౌ బాధదర్శనేనేహాపి జగత్ప్రతీతిదశాయామేవ తద్బాధనస్య న్యాయ్యత్వాత్సృష్టేః ప్రాగప్రతీతస్య బాధానుపపత్తేశ్చ । కిఞ్చ కాలత్రయనిషేధో హి బాధః ప్రాక్కాల ఎవ నిషేధే బాధ ఎవ న స్యాత్ । న హి పాకరక్తే ఘటే పూర్వం న రక్తో ఘట ఇతి ప్రత్యయం బాధం మన్యన్తే । అత ఎవ భాష్యే ప్రాగుత్పత్తేరవ్యాకృతనామరూపభేదాత్మభూతం జగదాసీదితి జగతః కారణాత్మనా సత్తైవోక్తా న తు బాధ ఇతి । న చ సృష్టేః ప్రాక్కాలాభావేనాగ్ర ఇతి కథం కాలసమ్బన్ధయోగ ఇతి వాచ్యమ్ । ప్రాక్కాలే ఘటశరావాదికం మృదేవాఽఽసీదిత్యాదివాక్యేషు కాలసమ్బన్ధేనైవ బోధనస్య వ్యుత్పన్నత్వేనేహాపి తథైవ బోధయితుం కాలసమ్బన్ధారోపోపపత్తేః । యథా దేవదత్తస్య శిర ఇత్యాదావవయవావయవిభేదేన బోధనస్య దృష్టత్వేన రాహోః శిర ఇత్యాదావపి తత్కల్పనమ్ । యథా వా పూర్వకాలేఽపి కాల ఆసీదిత్యాదౌ కాలాన్తరసమ్బన్ధారోపణం తద్వత్ । దీపికాయాం తు పరరీత్యా పరో బోధనీయ ఇతి న్యాయేన పరమతే కాలస్య నిత్యత్వేన ప్రాగపి సత్త్వాత్తద్రీత్యా కాలసమ్బన్ధ ఉక్త ఇత్యుక్తమ్ । న చాఽఽత్మా వా ఆసీదితి సత్తావైశిష్ట్యమేవ ప్రతీయత కర్తుః క్రియాశ్రయత్వాదితి వాచ్యమ్ । సవితా ప్రకాశత ఇత్యాదౌ కర్తృవాచిప్రత్యయస్య సాధుత్వమాత్రార్థత్వేన సవితుః ప్రకాశరూపత్వప్రత్యయవదాత్మన ఎవ సద్రూపత్వప్రతీతేః । అతిరిక్తసత్తాజాత్యభావాచ్చ । అన్యథా సత్తాఽఽసీదిత్యాదావగతేరితి సర్వం సుస్థమ్ । ఎవం సూత్రితమాత్మనోఽఖణ్డైకరసత్వం సాధయితుముపక్షిప్తం ప్రపఞ్చస్య మృషాత్వం తదధ్యారోపాపవాదాభ్యాం దృఢీకర్తుమధ్యాయశేషః । తత్రాప్యధ్యారోపార్థం స జాతో భూతానీత్యతః ప్రాక్తనస్తదాదిరపవాదార్థః । తత్రాపి వాచాఽఽరమ్భణన్యాయేనాఽఽత్మాతిరిక్తస్య వికారత్వేన మృషాత్వం వక్తుం సృష్టివాక్యమ్ ।

తత్ర స్త్రష్టురాత్మనః సమ్భావితం చేతనత్వం దృఢీకర్తుమీక్షణమాహ –

స సర్వజ్ఞేతి ।

నన్వేకస్యాఖణ్డస్య కథమీక్షణం సాధనాభావాదిత్యాశఙ్క్య న తస్య సాధనాపేక్షేత్యభిప్రేత్యైకః సన్నపి సర్వజ్ఞస్వాభావ్యాదీక్షతేత్యుక్తమ్ । అత్రాఽఽడాగమాభావశ్ఛాన్దసః ।

ఇమమేవాభిప్రాయం శఙ్కాపరిహారాభ్యాం స్పష్టీకరోతి –

నన్వితి ।

తత్ర కరణానీన్ద్రియాణి కార్యం శరీరమితి వివేకః ।

తద్రహితస్యాపి సార్వజ్ఞ్యే శ్రుతిమాహ –

తథా చేతి ।

అపాదో జవనోఽపాణిర్గ్రహీతేత్యన్వయః । పశ్యత్యచక్షుః స శృణోత్యకర్ణః । స వేత్తి వేద్యం న చ తస్యాస్తి వేత్తా తమాహురగ్ర్యం పురుషం మహాన్తమితి మన్త్రశేషః । న తస్య కార్యం కరణం చ విద్యతే న తత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే । పరాఽస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియా చేత్యాదిరాదిశబ్దార్థః । నను స్వాభావికనిత్యచైతన్యేన కథం కాదాచిత్కేక్షణమితి । అత్ర కేచిత్సర్గాదౌ ప్రాణికర్మభిరేకా సృజ్యాకారాఽవిద్యావృత్తిరుత్పద్యతే । తస్యామాత్మచైతన్యం ప్రతిబిమ్బతే తదేవేక్షణం తచ్చాఽఽదికార్యత్వాత్స్వపరనిర్వాహకమితి న తత్రాపీక్షణాన్తరాపేక్షా సర్వైరపి ప్రథమకార్యేఽనవస్థాపరిహారాయైవమేవ వక్తవ్యమిత్యాహుః । అపరే తు ప్రాణికర్మవశాత్సృష్టికాలేఽభివ్యక్త్యున్ముఖీభూతానభివ్యక్తనామరూపావచ్ఛిన్నం సత్స్వరూపచైతన్యమేవౌన్ముఖ్యస్య కాదాచిత్కత్వాత్కాదాచిత్కమీక్షణమిత్యాహుః । అన్యే త్వీక్షణవాక్యస్య కారణస్యాచైతన్యవ్యావృత్తిపరత్వాదీక్షణే తాత్పర్యాభావాచ్చ న తత్ర భూయానాగ్రహః కర్తవ్యః ఇత్యాహుః ।

ను శబ్దో వితర్కార్థ ఇతి మనసి నిధాయాఽఽహ –

న్వితి ।

లోడర్థస్య విధ్యాదేఃస్వాత్మన్యసమ్భవాల్లోటో లడర్థత్వమాహ –

సృజ ఇతి ।

అహమితీత్యస్యేక్షతేతి పూర్వేణాన్వయః ॥౧॥