నిపాతార్థమేవ స్ఫుటయతి —
వర్తమానేతి ।
ప్రజాపతిశబ్దో భవిష్యద్వృత్త్యా యజమానం గోచరయతీత్యాహ —
వృత్తేతి ।
ఇన్ద్రాదయో దేవా విరోచనాదయశ్చాసురా ఇత్యాశఙ్కాం వారయతి —
తస్యైవేతి ।
యజమానేషు ప్రాణేషు దేవత్వమసురత్వం చ విరుద్ధం న సిద్ధ్యతీతి శఙ్కతే —
కథమితి ।
తేషు తదుభయమౌపాధికం సాధయతి —
ఉచ్యత ఇతి ।
శాస్త్రానపేక్షయోర్జ్ఞానకర్మణోరుత్పాదకమాహ —
ప్రత్యక్షేతి ।
సన్నిధానాసంన్నిధానాభ్యాం ప్రమాణద్వయోక్తిః । స్వేష్వేవాసుషు రమణం నామాఽఽత్మమ్భరిత్వమ్ ।
తత ఇత్యాదివాక్యద్వయం వ్యాచష్టే —
యస్మాచ్చేతి ।
దేవానామల్పత్వం ప్రపఞ్చయతి —
స్వాభావికీ హీతి ।
మహత్తరత్వే హేతుర్దృష్టప్రయోజనత్వాదితి ।
అసురాణాం బహుత్వం ప్రపఞ్చయతి —
శాస్త్రజనితేతి ।
అసురాణాం బాహుల్యమితి శేషః ।
తదేవ సాధయతి —
అత్యన్తేతి ।
ఉభయేషాం దేవాసురాణాం మిథః సంఘర్షం దర్శయతి —
దేవాశ్చేతి ।
కథం బ్రహ్మాదీనాం స్థావరాన్తానాం భోగస్థానానాం స్పర్ధానిమిత్తత్వమిత్యాశఙ్క్య తేషాం శాస్త్రీయేతరజ్ఞానకర్మసాధ్యత్వాత్తయోశ్చ దేవాసురజయాధీనత్వాత్తస్య చ స్పర్ధాపూర్వకత్వాత్పరమ్పరయా లోకానాం తన్నిమిత్తత్వమిత్యభిప్రేత్య విశినష్టి —
స్వాభావికేతి ।
కా పునరేషాం స్పర్ధా నామేత్యాశఙ్క్యాఽఽహ —
దేవానాం చేతి ।
తామేవ సఫలాం వివృణోతి —
కదాచిదిత్యాదినా ।
అధికృతైరసురపరాజయే దేవజయే చ ప్రయతితవ్యమిత్యనుగ్రహబుద్ధ్యా జయఫలమాహ —
ఎవమితి ।
ఆకాఙ్క్షాపూర్వకమనన్తరవాక్యమాదాయ వ్యాకరోతి —
త ఎవమిత్యాదినా ।
యోఽయముద్గీథో నామ కర్మాఙ్గభూతః పదార్థస్తత్కర్తుః ప్రాణస్య స్వరూపాశ్రయణమేవ కథం సిద్ధ్యతీత్యాశఙ్క్యాఽఽహ —
ఉద్గీథేతి ।
కిం తత్కర్మ కిం వా జ్ఞానం తదాహ —
కర్మేతి ।
తదేతాన్యసతో మా సద్గమయేత్యాదీని యజూంషి జపేదితి విధిత్స్యమానమితి యోజనా ।