ఆఖ్యాయికార్థే బహుధా స్థితే తదక్షరాణి వ్యాచష్టే —
అత్రేత్యాదినా ।
పూర్వపక్షవాదిత్వే హేతుమాహ —
అవిద్యావిషయేతి ।
గర్వితత్వే హేతుమాహ —
అసమ్యగితి ।
ఇయమేవ ను వాఙ్నిమిత్తమిత్యత్రాపి కస్మాదిత్యనుషజ్యతే । అతో బ్రహ్మ తే బ్రవాణీతి వాగేవ సహస్రదానే నిమిత్తమితి శేషః ।
శ్రుతిం వ్యాచష్టే —
జనక ఇతి ।
ప్రసిద్ధం జనకస్య దాతృత్వాది తదవద్యోతకో వైనిపాత ఇతి యావత్ ।
వాక్యార్థమాహ —
జనకో దిత్సురిత్యాదినా ।
సంభావితవానసీతి ప్రాగుక్తం వాఙ్మాత్రం సహస్రదానే నిమిత్తమితి శేషః । తస్మాన్ముగ్ధప్రసిద్ధ్యతిక్రమణాదితి యావత్ । తత్సర్వం దాతృత్వాదికమిత్యర్థః । ఇతిశబ్దోఽభిప్రాయసమాప్త్యర్థః ॥౧॥