బృహదారణ్యకోపనిషద్భాష్యమ్
ద్వితీయోఽధ్యాయఃప్రథమం బ్రాహ్మణమ్
ఆనన్దగిరిటీకా (బృహదారణ్యక)
 
స హోవాచాజాతశత్రుః ప్రతిలోమం చైతద్యద్బ్రాహ్మణః క్షత్రియముపేయాద్బ్రహ్మ మే వక్ష్యతీతి వ్యేవ త్వా జ్ఞపయిష్యామీతి తం పాణావాదాయోత్తస్థౌ తౌ హ పురుషం సుప్తమాజగ్మతుస్తమేతైర్నామభిరామన్త్రయాఞ్చక్రే బృహన్పాణ్డరవాసః సోమ రాజన్నితి స నోత్తస్థౌ తం పాణినాపేషం బోధయాఞ్చకార స హోత్తస్థౌ ॥ ౧౫ ॥
స హోవాచ అజాతశత్రుః — ప్రతిలోమం విపరీతం చైతత్ ; కిం తత్ ? యద్బ్రాహ్మణః ఉత్తమవర్ణః ఆచార్యత్వేఽధికృతః సన్ క్షత్రియమనాచార్యస్వభావమ్ ఉపేయాత్ ఉపగచ్ఛేత్ శిష్యవృత్త్యా — బ్రహ్మ మే వక్ష్యతీతి ; ఎతదాచారవిధిశాస్త్రేషు నిషిద్ధమ్ ; తస్మాత్ తిష్ఠ త్వమ్ ఆచార్య ఎవ సన్ ; విజ్ఞపయిష్యామ్యేవ త్వామహమ్ — యస్మిన్విదితే బ్రహ్మ విదితం భవతి, యత్తన్ముఖ్యం బ్రహ్మ వేద్యమ్ । తం గార్గ్యం సలజ్జమాలక్ష్య విస్రమ్భజననాయ పాణౌ హస్తే ఆదాయ గృహీత్వా ఉత్తస్థౌ ఉత్థితవాన్ । తౌ హ గార్గ్యాజాతశత్రూ పురుషం సుప్తం రాజగృహప్రదేశే క్వచిత్ ఆజగ్మతుః ఆగతౌ । తం చ పురుషం సుప్తం ప్రాప్య ఎతైర్నామభిః — బృహన్ పాణ్డరవాసః సోమ రాజన్నిత్యేతైః — ఆమన్త్రయాఞ్చక్రే । ఎవమామన్త్ర్యమాణోఽపి స సుప్తః నోత్తస్థౌ । తమ్ అప్రతిబుద్ధ్యమానం పాణినా ఆపేషమ్ ఆపిష్య ఆపిష్య బోధయాఞ్చకార ప్రతిబోధితవాన్ । తేన స హోత్తస్థౌ । తస్మాద్యో గార్గ్యేణాభిప్రేతః, నాసావస్మిఞ్ఛరీరే కర్తా భోక్తా బ్రహ్మేతి ॥

“అబ్రాహ్మణాదధ్యయనమాపత్కాలే విధీయతే । అనువ్రజ్యా చ శుశ్రూషా యావదధ్యయనం గురోః ॥ నాబ్రాహ్మణే గురౌ శిష్యో వాసమాత్యన్తికం వసేత్ ॥” ఇత్యాదీన్యాచారవిధిశాస్త్రాణి । ఆదిత్యాదిబ్రహ్మభ్యో విశేషమాహ —

యస్మిన్నితి ।

ప్రాణస్య వ్యాప్రియమాణస్యైవ సంబోధనార్థం ప్రయుక్తానామాశ్రవణాదాపేషణాచ్చోత్థానాత్తస్యాభోక్తృత్వం సిధ్యతీతి ఫలితమాహ —

తస్మాదితి ।