బృహదారణ్యకోపనిషద్భాష్యమ్
ద్వితీయోఽధ్యాయఃద్వితీయం బ్రాహ్మణమ్
ఆనన్దగిరిటీకా (బృహదారణ్యక)
 
‘బ్రహ్మ జ్ఞపయిష్యామి’ (బృ. ఉ. ౨ । ౧ । ౧౫) ఇతి ప్రస్తుతమ్ ; తత్ర యతో జగజ్జాతమ్ , యన్మయమ్ , యస్మింశ్చ లీయతే, తదేకం బ్రహ్మ — ఇతి జ్ఞాపితమ్ । కిమాత్మకం పునః తజ్జగత్ జాయతే, లీయతే చ ? పఞ్చభూతాత్మకమ్ ; భూతాని చ నామరూపాత్మకాని ; నామరూపే సత్యమితి హ్యుక్తమ్ ; తస్య సత్యస్య పఞ్చభూతాత్మకస్య సత్యం బ్రహ్మ । కథం పునః భూతాని సత్యమితి మూర్తామూర్తబ్రాహ్మణమ్ । మూర్తామూర్తభూతాత్మకత్వాత్ కార్యకరణాత్మకాని భూతాని ప్రాణా అపి సత్యమ్ । తేషాం కార్యకరణాత్మకానాం భూతానాం సత్యత్వనిర్దిధారయిషయా బ్రాహ్మణద్వయమారభ్యతే సైవ ఉపనిషద్వ్యాఖ్యా । కార్యకరణసత్యత్వావధారణద్వారేణ హి సత్యస్య సత్యం బ్రహ్మ అవధార్యతే । అత్రోక్తమ్ ‘ప్రాణా వై సత్యం తేషామేష సత్యమ్’ (బృ. ఉ. ౨ । ౧ । ౨౦) ఇతి ; తత్ర కే ప్రాణాః, కియత్యో వా ప్రాణవిషయా ఉపనిషదః కా ఇతి చ — బ్రహ్మోపనిషత్ప్రసఙ్గేన కరణానాం ప్రాణానాం స్వరూపమవధారయతి — పథిగతకూపారామాద్యవధారణవత్ ॥

వృత్తవర్తిష్యమాణయోః సంగతిం వక్తుం వృత్తం కీర్తయతి —

బ్రహ్మేతి ।

బ్రహ్మ తే బ్రవాణీతి ప్రక్రమ్య వ్యేవ త్వా జ్ఞాపయిష్యామీతి ప్రతిజ్ఞాయ జగతో జన్మాదయో యతస్తదద్వితీయం బ్రహ్మేతి వ్యాఖ్యాతమిత్యర్థః ।

జన్మాదివిషయస్య జగతః స్వరూపం పృచ్ఛతి —

కిమాత్మకమితి ।

విప్రతిపత్తినిరాసార్థం తత్స్వరూపమాహ —

పఞ్చేతి ।

కథం తర్హి నామరూపకర్మాత్మకం జగదిత్యుక్తం తత్రాఽఽహ —

భూతానితి ।

తత్ర గమకమాహ —

నామరూపే ఇతి ।

భూతానాం సత్యత్వే కథం బ్రహ్మణః సత్యత్వవాచోయుక్తిరిత్యాశఙ్క్యాఽఽహ —

తస్యేతి ।

తత్సత్యమిత్యవధారణాద్బాధ్యేషు భూతేషు సత్యత్వాసిద్ధిరితి శఙ్కయిత్వా సమాధత్తే —

కథమిత్యాదినా ।

సచ్చ త్యచ్చ సత్యమితి వ్యుత్పత్త్యా భూతాని సత్యశబ్దవాచ్యాని వివక్ష్యన్తే చేత్కథం తర్హి కార్యకారణసంఘాతస్య ప్రాణానాం చ సత్యత్వముక్తం తత్రాఽఽహ —

మూర్తేతి ।

యథోక్తభూతస్వరూపత్వాత్కార్యకరణానాం తదాత్మకాని భూతాని సత్యానీత్యఙ్గీకారాత్కార్యకరణానాం సత్యత్వం ప్రాణా అపి తదాత్మకాః సత్యశబ్దవాచ్యా భవన్తీతి ప్రాణా వై సత్యమిత్యవిరుద్ధమిత్యర్థః ।

ఎవం పాతనికాం కృత్వోత్తరబ్రాహ్మణద్వయస్య విషయమాహ —

తేషామితి ।

ఉపనిషద్వ్యాఖ్యానాయ బ్రాహ్మణద్వయమిత్యుక్తివిరుద్ధమేతదిత్యాశఙ్క్యాఽఽహ —

సైవేతి ।

కార్యకరణాత్మకానాం భూతానాం స్వరూపనిర్ధారణైవోపనిషద్వ్యాఖ్యేత్యత్ర హేతుమాహ —

కార్యేతి ।

బ్రాహ్మణద్వయమేవమవతార్య శిశుబ్రాహ్మణస్యావాన్తరసంగతిమాహ —

అత్రేత్యాదినా ।

ఉపనిషదః కాః, కియత్యో వేత్యుపసంఖ్యాతవ్యమిత్యాకాఙ్క్షాయామితి శేషః ।

బ్రహ్మ చేదవధారయితుమిష్టం తర్హి తదేవావధార్యతాం కిమితి మధ్యే కరణస్వరూపమవధార్యతే తత్రాఽఽహ —

పథీతి ।