స యథా సర్వాసామపామిత్యాదిసమనన్తరగ్రన్థముత్థాపయతి —
కిఞ్చాన్యదితి ।
తదేవ వ్యాకరోతి —
న కేవలమితి ।
ప్రలయకాలే చ ప్రజ్ఞానవ్యతిరేకేణాభావాజ్జగతో బ్రహ్మత్వమితి సంబన్ధః ।
ఉక్తమర్థం దృష్టాన్తేన స్పష్టయతే —
జలేతి ।
తథాఽపి ప్రజ్ఞానమేవైకమేవ స్యాన్న బ్రహ్మేత్యాశఙ్క్యాఽఽహ —
తస్మాదితి ।
సత్యజ్ఞానాదివాక్యాద్బ్రహ్మణస్తన్మాత్రత్వాదిత్యర్థః ।
యథోక్తం బ్రహ్మ చేత్ప్రతిపత్తవ్యం కిమితి తర్హి స యథేత్యాది వాక్యమిత్యాశఙ్క్య తచ్ఛేషత్వేన ప్రలయం దర్శయితుం దృష్టాన్తవచనమేతదిత్యాహ —
అత ఆహేతి ।
ప్రలీయతేఽస్మిన్నితి ప్రలయ ఎకశ్చాసౌ ప్రలయశ్చేత్యేకప్రలయః తడాగాదిగతానామపాం కుతః సముద్రే లయో న హి తాసాం తేన సంగతిరిత్యాశఙ్క్యాఽఽహ —
అవిభాగేతి ।
అత్ర హి సముద్రశబ్దేన జలసామాన్యముచ్యతే । తద్వ్యతిరేకేణ చ జలవిశేషాణామభావో వివక్షితస్తేషాం తత్సంస్థానమాత్రత్వాదతశ్చాఽఽసామస్మిన్నవిభాగస్య ప్రాప్తిరితి సముద్రేఽవిభాగప్రాప్తిరిత్యర్థః । పిచ్ఛిలాదీనామిత్యాదిశబ్దేనానుక్తస్పర్శంవిశేషాః సర్వే గృహ్యన్తే ।
విషయాణామిన్ద్రియకార్యత్వాభావాత్కుతః స్పర్శానాం త్వచి విలయః స్యాదిత్యాశఙ్క్యాఽఽహ —
త్వగితీతి ।
స్పర్శవిశేషాణాం స్పర్శసామాన్యేఽన్తర్భావం ప్రపఞ్చయతి —
తస్మిన్నితి ।
తథాఽపి సమస్తస్య జగతో బ్రహ్మవ్యతిరేకేణాభావాద్బ్రహ్మత్వమిత్యేతత్కథం ప్రతిజ్ఞాతమిత్యాశఙ్క్య పరమ్పరయా బ్రహ్మణి సర్వప్రవిలయం దర్శయితుం క్రమమనుక్రామతి —
తథేతి ।
మనసి సతి విషయవిషయిభావస్య దర్శనాదసతి చాదర్శనాన్మనఃస్పన్దితమాత్రం విషయజాతమితి తస్య తద్విషయమాత్రే ప్రవిష్టస్య తదతిరేకేణాసత్త్వమిత్యర్థః ।
సంకల్పవికల్పాత్మకమనఃస్పన్దితద్వైతస్య సంకల్పాత్మకే మనస్యన్తర్భావాత్తస్య చ సంకల్పస్యాధ్యవసాయపారతన్త్ర్యదర్శనాదధ్యవసాయాత్మికాయాం చ బుద్ధౌ తద్విషయస్య పూర్వవదనుప్రవేశాన్మనోవిషయసామాన్యస్య బుద్ధివిషయసామాన్యే ప్రవిష్టస్య తద్వ్యతిరేకేణాసత్త్వమిత్యాహ —
ఎవమితి ।
సర్వం జగదుక్తేన న్యాయేన బుద్ధిమాత్రం భూత్వా తద్యచ్ఛేచ్ఛాన్త ఆత్మనీతి శ్రుత్యా బ్రహ్మణి పర్యవస్యతీత్యాహ —
విజ్ఞానమాత్రమితి ।
నను జగదిదం విలీయమానం శక్తిశేషమేవ విలీయతే । తత్త్వజ్ఞానాదృతే తస్య నిఃశేషనాశానాశ్రయణాత్ । తథా చ కుతో బ్రహ్మైకరసస్య ప్రతిపత్తిరత ఆహ —
ఎవమితి ।
శక్తిశేషలయేఽపి తస్యా దుర్నిరూపత్వాద్వస్త్వేకరసస్య ధీరవిరుద్ధేతి భావః ।
ఎకాయనప్రక్రియాతాత్పర్యముపసంహరతి —
తస్మాదితి ।
ఘ్రాణవిషయసామాన్యమిత్యాదావేకాయనమితి సర్వత్ర సంబన్ధః ।
కథం పునరత్ర ప్రతిపర్యాయం బ్రహ్మణి పర్యవసానం తత్రాఽఽహ —
తథేతి ।
యథా సర్వేషు పర్యాయేషు బ్రహ్మణి పర్యవసానం తథోచ్యత ఇతి యావత్ । పూర్వవదితి త్వగ్విషయసామాన్యవదిత్యర్థః । సంకల్పే లయ ఇతి శేషః । విజ్ఞానమాత్ర ఇత్యత్రాపి తథైవ ।
ఎవం సర్వేషాం కర్మణామిత్యాదేరర్థమాహ —
తథా కర్మేన్ద్రియాణామితి ।
క్రియాసామాన్యానాం సూత్రాత్మసంస్థానభేదత్వమభ్యుపేత్యాఽఽహ —
తాని చేతి ।
క్రియాజ్ఞానశక్త్యోశ్చిదుపాధిభూతయోశ్చిదభేదాభేదమభిప్రేత్య ప్రాణశ్చేత్యాది భాష్యమ్ । తత్ర తయోరన్యోన్యాభేదే మానమాహ —
యో వా ఇతి ।
శ్రుతిముఖాత్కరణలయో న ప్రతిభాతి స్వయం చ వ్యాఖ్యాయతే తత్ర కో హేతురితి పృచ్ఛతి —
నన్వితి ।
శ్రుత్యా కరణలయస్యానుక్తత్వమఙ్గీకరోతి —
బాఢమితి ।
పృష్టమభిప్రాయం ప్రకటయతి —
కిన్త్వితి ।
కరణస్య విషయసాజాత్యం వివృణోతి —
విషయస్యైవేతి ।
కిమత్ర ప్రమాణమిత్యాశఙ్క్యానుమానమతి సూచయతి —
ప్రదీపవదితి ।
చక్షుషస్తేజసం రూపాదిషు మధ్యే రూపస్యైవ వ్యఞ్జకద్రవ్యత్వాత్సంప్రతిపన్నవదిత్యాదీన్యనుమానాని శాస్త్రప్రకాశికాయామధిగన్తవ్యాని ।
కరణానాం విషయసాజాత్యే ఫలితమాహ —
తస్మాదితి ।
పృథగ్విషయప్రలయాదితి శేషః । ఎకాయనప్రక్రియాసమాప్తావితిశబ్దః ॥౧౧॥