బృహదారణ్యకోపనిషద్భాష్యమ్
చతుర్థోఽధ్యాయఃప్రథమం బ్రాహ్మణమ్
ఆనన్దగిరిటీకా (బృహదారణ్యక)
 
యదేవ తే కశ్చిదబ్రవీత్తచ్ఛృణవామేత్యబ్రవీన్మే సత్యకామో జాబాలో మనో వై బ్రహ్మేతి యథా మాతృమాన్పితృమానాచార్యవాన్బ్రూయాత్తథా తజ్జాబాలోఽబ్రవీన్మనో వై బ్రహ్మేత్యమనసో హి కిం స్యాదిత్యబ్రవీత్తు తే తస్యాయతనం ప్రతిష్ఠాం న మేఽబ్రవీదిత్యేకపాద్వా ఎతత్సమ్రాడితి స వై నో బ్రూహి యాజ్ఞవల్క్య మన ఎవాయతనమాకాశః ప్రతిష్ఠానన్ద ఇత్యేనదుపాసీత కానన్దతా యాజ్ఞవల్క్య మన ఎవ సమ్రాడితి హోవాచ మనసా వై సమ్రాట్స్త్రియమభిహార్యతే తస్యాం ప్రతిరూపః పుత్రో జాయతే స ఆనన్దో మనో వై సమ్రాట్పరమం బ్రహ్మ నైనం మనో జహాతి సర్వాణ్యేనం భూతాన్యభిక్షరన్తి దేవో భూత్వా దేవానప్యేతి య ఎవం విద్వానేతదుపాస్తే హస్త్యృషభం సహస్రం దదామీతి హోవాచ జనకో వైదేహః స హోవాచ యాజ్ఞవల్క్యః పితా మేఽమన్యత నాననుశిష్య హరేతేతి ॥ ౬ ॥
సత్యకామ ఇతి నామతః జబాలాయా అపత్యం జాబాలః । చన్ద్రమా మనసి దేవతా । ఆనన్ద ఇత్యుపనిషత్ ; యస్మాన్మన ఎవ ఆనన్దః, తస్మాత్ మనసా వై, సమ్రాట్ , స్త్రియమభికామయమానః అభిహార్యతే ప్రార్థయత ఇత్యర్థః ; తస్మాత్ యాం స్త్రియమభికామయమానోఽభిహార్యతే, తస్యాం ప్రతిరూపః అనురూపః పుత్రో జాయతే ; స ఆనన్దహేతుః పుత్రః ; స యేన మనసా నిర్వర్త్యతే, తన్మనః ఆనన్దః ॥

తథఽపి కథమానన్దత్వం మనసః సంభవతి తత్రాఽఽహ —

స యేనేతి  ॥౬॥