బృహదారణ్యకోపనిషద్భాష్యమ్
చతుర్థోఽధ్యాయఃతృతీయం బ్రాహ్మణమ్
ఆనన్దగిరిటీకా (బృహదారణ్యక)
 
స్త్రీపుంసయోరివ ఎకత్వాత్ న పశ్యతీత్యుక్తమ్ , స్వయఞ్జ్యోతిరితి చ ; స్వయఞ్జ్యోతిష్ట్వం నామ చైతన్యాత్మస్వభావతా ; యది హి అగ్న్యుష్ణత్వాదివత్ చైతన్యాత్మస్వభావ ఆత్మా, సః కథమ్ ఎకత్వేఽపి హి స్వభావం జహ్యాత్ , న జానీయాత్ ? అథ న జహాతి, కథమిహ సుషుప్తే న పశ్యతి ? విప్రతిషిద్ధమేతత్ — చైతన్యమాత్మస్వభావః, న జానాతి చేతి । న విప్రతిషిద్ధమ్ , ఉభయమప్యేతత్ ఉపపద్యత ఎవ ; కథమ్ —

యద్వై తన్న పశ్యతీత్యాదేః సంబన్ధం వక్తుం వృత్తం కీర్తయతి —

స్త్రీపుంసయోరితి ।

చకారాదుక్తం స్వయఞ్జ్యోతిష్ట్వమితి సంబధ్యతే ।

కిమిదం స్వయఞ్జ్యోతిష్ట్వమితి తదాహ —

స్వయఞ్జ్యోతిష్ట్వం నామేతి ।

ఎవం వృత్తమనూద్యోత్తరవాక్యవ్యావర్త్యాం శఙ్కామాహ —

యదీత్యాదినా ।

స్వభావత్యాగమేవాభినయతి —

న జానీయాదితి ।

తత్త్యాగాభావే సుషుప్తే విశేషవిజ్ఞానరాహిత్యమయుక్తమిత్యాహ —

అథేత్యాదినా ।

ఆత్మా చిద్రూపోఽపి సుషుప్తే విశేషం న జానాతి చేత్కిం దుష్యతీత్యాశఙ్క్యాఽఽహ —

విప్రతిషిద్ధమితి ।

పరిహరతి —

నేతి ।

ఉభయం చైతన్యస్వభావత్వం విశేషవిజ్ఞానరాహిత్యం చేత్యర్థః ।

ఉభయస్వీకారే శఙ్కితం విప్రషేధమాకాఙ్క్షాపూర్వకం శ్రుత్యా నిరాకరోతి —

కథమిత్యాదినా ।