పదార్థముక్త్వా వాక్యార్థం కథయతి —
సర్వమితి ।
అస్మిన్నేవ వాక్యే పక్షాన్తరముత్థాపయతి —
కేచిత్త్వితి ।
న హ వా అస్యేత్యాద్యర్థవాదదర్శనాదిత్యర్థః ।
తద్దూషయతి —
తదసదితి ।
శాస్త్రాన్తరేణ ‘క్రిమయో భవన్త్యభక్ష్యభక్షిణ’ ఇత్యాదినేత్యర్థః ।
ప్రాణవిదతిరిక్తవిషయం శాస్త్రాన్తరం సర్వభక్షణం తు ప్రాణదర్శినో వివక్షితమతో వ్యవస్థితవిషయత్వాత్ప్రతిషేధేన సర్వభక్షణస్యోదితానుదితహోమవద్వికల్పః స్యాదితి శఙ్కతే —
తేనేతి ।
కిం తర్హి సర్వాన్నభక్షణం విహితం న వా ? న చేన్న తస్య నిషిద్ధస్యానుష్ఠానం ప్రాణవిది తత్ప్రాపకాభావాద్విహితం చేత్తత్కిం యదిదమిత్యాదినా న హేత్యాదినా వా విహితం నాఽఽద్య ఇత్యాహ —
నావిధాయకత్వాదితి ।
యదిదమిత్యాదినా హి సర్వం ప్రాణస్యాన్నమితి జ్ఞానమేవ విధీయతే న తు ప్రాణా[న్న]విదః సర్వాన్నభక్షణం తదవద్యోతిపదాభావాన్న వికల్పోపపత్తిరిత్యర్థః ।
ద్వితీయం దూషయతి —
న హ వా ఇతి ।
అస్యేతి విద్వత్పరామర్శాన్నిపాతయోరర్థవాదత్వావద్యోతినోర్దర్శనాదేకవాక్యత్వసంభవే వాక్యభేదస్యాన్యాయ్యత్వాచ్చేతి హేతుమాహ —
తేనేతి ।
అర్థవాదస్యాపి స్వార్థే ప్రామాణ్యం దేవతాధికరణన్యాయేన భవిష్యతీత్యాశఙ్క్య ‘న కలఞ్జం భక్షయేది’త్యాదివిహితస్య భక్షణాభావస్య తస్య బాధేన న హేత్యాదేర్న సామర్థ్యం దృష్టిపరత్వాదస్య మానాన్తరవిరోధే స్వార్థే మానత్వాయోగాదిత్యాహ —
న త్వితి ।
న హేత్యాదేరన్యపరత్వం ప్రపఞ్చయతి —
ప్రాణమాత్రస్యేతి ।
తత్ర దోషాభావజ్ఞాపనాత్తదేవ విధిత్సితమిత్యాశఙ్క్యాఽఽహ —
యత్త్వితి ।
అర్థవాదస్య మానాన్తరవిరోధే స్వార్థే మానత్వాయోగస్యోక్తత్వాదితి భావః ।
ప్రమాణాభావస్యాసిద్ధిమాశఙ్కతే —
విదుష ఇతి ।
సామర్థ్యాత్ప్రాణస్వరూపబలాదితి యావత్ । అదోషః సర్వాన్నభక్షణే తస్యేతి శేషః ।
అర్థాపత్తిం దూషయతి —
నేత్యాదినా ।
అనుపపత్తిమేవ వివృణోతి —
సత్యమితి ।
యేనేత్యస్మాత్ప్రాక్తథాఽపీతి వక్తవ్యమ్ । యద్యపీత్యుపక్రమాత్ ।
ప్రాణస్వరూపసామర్థ్యాదనుపపత్తిరపి శామ్యతీతి శఙ్కతే —
నన్వితి ।
కిం ఫలాత్మనా విదుషః సర్వాన్నభక్షణం సాధ్యతే కింవా సాధకత్వరూపేణేతి వికల్ప్యాఽఽద్యమఙ్గీకరోతి —
బాఢమితి ।
ప్రాణరూపేణ సర్వభక్షణం తచ్ఛబ్దార్థః ।
తత్ర ప్రతిషేధాభావే సదృష్టాన్తం ఫలితమాహ —
తస్మాదితి ।
తథా స్వారసికం ప్రాణస్య సర్వభక్షణం తత్ర చాప్రతిషేధాద్దోషరాహిత్యమితి శేషః ।
తద్రాహిత్యే కిం స్యాదితి చేత్తదాహ —
అత ఇతి ।
పఞ్చమ్యర్థమేవ స్ఫోరయతి —
అప్రాప్తత్వాదితి ।
ప్రాణవిదః సాధకత్వాకారేణ సాధ్యతే సర్వాన్నభక్షణమితి పక్షం ప్రత్యాహ —
యేన త్వితి ।
ఇహేతి ప్రాణవిదుచ్యతే । నిమిత్తాన్తరాదత్యన్తాప్రాప్తవిషయో విధిః ప్రతిప్రసవో యథా జ్వరితస్యాశనప్రతిషేధేఽప్యౌషధం పిబేదితి తథా శాస్త్రాధికారిణః సర్వాభక్ష్యభక్షణనిషేధేఽపి ప్రాణవిదో విశేషవిధిర్నోపలభ్యతే । తథా చ తస్య భక్షణం దుఃసాధ్యమిత్యర్థః ।
ప్రతిప్రసవాభావే లబ్ధం దర్శయతి —
తస్మాదితి ।
అర్థవాదస్య తర్హి కా గతిరిత్యాశఙ్క్యాఽఽహ —
అన్యవిషయత్వాదితి ।
తస్య స్తుతిమాత్రార్థత్వాన్న తద్వశాన్నిషేధాతిక్రమ ఇత్యర్థః ।
నను విశిష్టస్య ప్రాణస్య సర్వాన్నత్వదర్శనమత్ర విధీయతే తథా చ విదుషోఽపి తదాత్మనః సర్వాన్నభక్షణే న దోషో యథాదర్శనం ఫలాభ్యుపగమాదత ఆహ —
న చేతి ।
ఇతోఽపి సర్వం ప్రాణస్యాన్నమిత్యేతదవష్టమ్భేన ప్రాణవిదః సర్వభక్షణం న విధేయమిత్యాహ —
యథా చేతి ।
ప్రాణస్య యథోక్తస్య స్వీకారేఽపి కస్యచిత్కిఞ్చిదన్నం జీవనహేతురిత్యత్ర దృష్టాన్తమాహ —
యథేతి ।
తథా సర్వప్రాణిషు వ్యవస్థయాఽన్నసంబన్ధే దార్ష్టాన్తికమాహ —
తథేతి ।
ప్రాణవిదోఽపి కార్యకరణవతో నిషేధాతిక్రమాయోగే ఫలితమాహ —
తస్మాదితి ।
వాక్యాన్తరమాదాయ వ్యాకరోతి —
ఆప ఇతి ।
స్మార్తాదాచమనాదన్యదేవ శ్రౌతమాచమనమన్యతోఽప్రాప్తం విధేయం తదర్థమిదం వాక్యమితి కేచిత్తాన్ప్రత్యాహ —
అత్ర చేతి ।
వాసఃకార్యం పరిధానమ్ ।
తత్ర సాక్షాదపాం వినియోగాయోగే ప్రాప్తమర్థమాహ —
తస్మాదితి ।
యదిదం కిఞ్చేత్యాదావుక్తం దృష్టివిధేరర్థవాదమాదాయ వ్యాచష్టే —
నేత్యాదినా ।
పునర్నఞనుకర్షణమన్వయాయ ।
పదార్థముక్త్వా వాక్యార్థమాహ —
యద్యపీతి ।
అభక్ష్యభక్షణం తర్హి స్వీకృతమితి చేన్నేత్యాహ —
ఇత్యేతదితి ।
యథా ప్రాణవిదో నానన్నం భుక్తం భవతి తథేత్యేతత్ ।
అనుమతస్తర్హి ప్రాణవిదో దుష్ప్రతిగ్రహోఽపీత్యాశఙ్క్యాఽఽహ —
తత్రాపీతి ।
అసత్ప్రతిగ్రహే ప్రాప్తేఽపీత్యర్థః ।
కిమిత్యయం స్తుత్యర్థవాదః ఫలవాద ఎవ కిం న స్యాదిత్యాశఙ్క్యాఽఽహ —
ఫలం త్వితి ।
ఇతిశబ్దః సర్వం ప్రాణస్యాన్నమితి దృష్టివిధేః సార్థవాదస్యోపసంహారార్థః ।
ఉక్తమేవార్థం చోద్యసమాధిభ్యాం సమర్థయతే —
నన్విత్యాదినా ।
యథాప్రాప్తం ప్రకృతవాక్యవశాత్ప్రతిపన్నం రూపమనతిక్రమ్యేతి యావత్ ।
వాక్యస్య విద్యాస్తుతిత్వే ఫలితమాహ —
అత ఇతి ।
యదుక్తమాపో వాస ఇతి తస్య శేషభూతముత్తరగ్రన్థముత్థాప్య వ్యాచష్టే —
యస్మాదితి ।
తత్రేత్యశనాత్ప్రాగూర్ధ్వకాలోక్తిః ।
ఉక్తేఽభిప్రాయే లోకప్రసిద్ధిమనుకూలయతి —
అస్తి చేతి ।
తత్రైవ వాక్యోపక్రమస్యాఽఽనుకూల్యం దర్శయతి —
ప్రాణస్యేతి ।
కిమర్థమిదం సోపక్రమం వాక్యమిత్యపేక్షాయామత్ర చేత్యాదావుక్తం స్మారయతి —
యదప ఇతి ।
దృష్టివిధానమసహమానః శఙ్కతే —
నన్వితి ।
అస్తు ప్రాయత్యార్థమాచమనం ప్రాణపరిధానార్థం చేత్యాశఙ్క్యాఽఽహ —
తత్రేతి ।
కుల్యాప్రణయనన్యాయేన ద్వికార్యత్వావిరోధమాశఙ్క్యాఽఽహ —
న చేతి ।
తత్ర ప్రత్యక్షత్వాత్కార్యభేదస్యావిరోధేఽపి ప్రకృతే ప్రమాణాభావాద్ద్వికార్యత్వానుపపత్తిరిత్యభిప్రేత్యోక్తముపపాదయతి —
యదీతి ।
నను స్మార్తాచమనస్య ప్రాయత్యార్థత్వం తథైవానగ్నతార్థత్వం ప్రకృతవాక్యాధిగతం తథా చ కథం ద్వికార్యత్వమప్రామాణికమిత్యాశఙ్క్య వాక్యస్య విషయాన్తరం దర్శయతి —
యస్మాదితి ।
ద్వికార్యత్వదోషముక్తం దూషయతి —
నేత్యాదినా ।
తచ్చాఽఽచమనం దర్శననిరపేక్షమిత్యాహ —
క్రియామాత్రమేవేతి ।
నన్వాచమనే ఫలభూతం ప్రాయత్యం దర్శనసాపేక్షమితి చేన్నేత్యాహ —
నత్వితి ।
క్రియాయా ఎవ తదాధానసామర్థ్యాదిత్యర్థః । తత్రేత్యాచమనే శుద్ధ్యర్థే క్రియాన్తరే సతీత్యర్థః ।
ప్రాణవిజ్ఞానప్రకరణే వాసోవిజ్ఞానం చోద్యతే చేద్వాక్యభేదః స్యాదిత్యాశఙ్క్యాఽఽహ —
ప్రాణస్యేతి ।
సర్వాన్నవిజ్ఞానవదితి చకారార్థః ।
ఆచమనీయాస్వప్సు వాసోవిజ్ఞానం క్రియతే చేత్కథమాచమనస్య ప్రాయత్యార్థత్వమిత్యాశఙ్క్యాఽఽహ —
న త్వితి ।
ద్వికార్యత్వదోషాభావే ఫలితం దర్శనవిధిముపసంహరతి —
తస్మాదితి ।
అప్రాప్తత్వాద్వాసోదృష్టేర్విధివ్యతిరేకేణ ప్రాప్త్యభావాద్దృష్టేశ్చాత్ర ప్రకృతత్వాత్కార్యాఖ్యానాదపూర్వమితి చ న్యాయాదిత్యర్థః ॥౧౪॥