బృహదారణ్యకోపనిషద్భాష్యమ్
షష్ఠోఽధ్యాయఃద్వితీయం బ్రాహ్మణమ్
ఆనన్దగిరిటీకా (బృహదారణ్యక)
 
శ్వేతకేతుర్హ వా ఆరుణేయః పఞ్చాలానాం పరిషదమాజగామ స ఆజగామ జైవలిం ప్రవాహణం పరిచారయమాణం తముదీక్ష్యాభ్యువాద కుమారా౩ ఇతి స భో౩ ఇతి ప్రతిశుశ్రావానుశిష్టోఽన్వసి పిత్రేత్యోమితి హోవాచ ॥ ౧ ॥
శ్వేతకేతుః నామతః, అరుణస్యాపత్యమ్ ఆరుణిః, తస్యాపత్యమ్ ఆరుణేయః ; హ - శబ్దః ఐతిహ్యార్థః ; వై నిశ్చయార్థః ; పిత్రా అనుశిష్టః సన్ ఆత్మనో యశఃప్రథనాయ పఞ్చాలానాం పరిషదమాజగామ ; పఞ్చాలాః ప్రసిద్ధాః ; తేషాం పరిషదమాగత్య, జిత్వా, రాజ్ఞోఽపి పరిషదం జేష్యామీతి గర్వేణ స ఆజగామ ; జీవలస్యాపత్యం జైవలిం పఞ్చాలరాజం ప్రవాహణనామానం స్వభృత్యైః పరిచారయమాణమ్ ఆత్మనః పరిచరణం కారయన్తమిత్యేతత్ ; స రాజా పూర్వమేవ తస్య విద్యాభిమానగర్వం శ్రుత్వా, వినేతవ్యోఽయమితి మత్వా, తముదీక్ష్య ఉత్ప్రేక్ష్య ఆగతమాత్రమేవ అభ్యువాద అభ్యుక్తవాన్ , కుమారా౩ ఇతి సమ్బోధ్య ; భర్త్సనార్థా ప్లుతిః । ఎవముక్తః సః ప్రతిశుశ్రావ — భో౩ ఇతి । భో౩ ఇతి అప్రతిరూపమపి క్షత్త్రియం ప్రతి ఉక్తవాన్ క్రుద్ధః సన్ । అనుశిష్టః అనుశాసితోఽసి భవసి కిం పిత్రా — ఇత్యువాచ రాజా । ప్రత్యాహ ఇతరః — ఓమితి, బాఢమనుశిష్టోఽస్మి, పృచ్ఛ యది సంశయస్తే ॥

యదా కదాచిదతిక్రాన్తే కాలే వృత్తార్థద్యోతిత్వం నిపాతస్య దర్శయతి —

హశబ్ద ఇతి ।

యశఃప్రథనం విద్వత్సు స్వకీయవిద్యాసామర్థ్యఖ్యాపనం ప్రసిద్ధవిద్వజ్జనవిశిష్టత్వేనేతి శేషః । క్వచిజ్జయస్య ప్రాప్తత్వం గర్వే హేతుః ।

కిమితి రాజా శ్వేతకేతుమాగతమాత్రం తదీయాభిప్రాయమప్రతిపద్య తిరస్కుర్వన్నివ సంబోధితవానిత్యాశఙ్క్యాఽఽహ —

స రాజేతి ।

సంబోధ్య భర్త్సనం కృతవానితి శేషః ।

తదవద్యోతి పదమిహ నాస్తీత్యాశఙ్క్యాఽఽహ —

భర్త్సనార్థేతి ।

భో ౩ ఇతి ప్రతివచనమాచార్యం ప్రత్యుచితం న క్షత్త్రియం ప్రతి తస్య హీనత్వాదిత్యాహ —

భో ౩ ఇతీతి ।

అప్రతిరూపవచనే క్రోధం హేతూకరోతి —

క్రుద్ధః సన్నితి ।

పితుః సకాశాత్తవ లబ్ధానుశాసనత్వే లిఙ్గం నాస్తీత్యాశఙ్క్యాఽఽహ —

పృచ్ఛేతి ॥౧॥