కార్యకారణవిభాగవిహీనం వస్త్వేవ నాస్తీతి మన్వానశ్చోదయతి -
తదసత్త్వ ఇతి ।
అనువృత్తవ్యావృత్తబుద్ధిద్వయదర్శనాదనువృత్తే చ వ్యావృత్తానాం కల్పితత్వాదకల్పితం సర్వభేదకల్పనాధిష్ఠానమకార్యకారణం వస్తు సిధ్యతీతి పరిహరతి -
న ; సర్వత్రేతి ।
సమ్ప్రతి సతో వస్తుత్వే ప్రమాణమనుమానముపన్యస్యతి -
యద్విషయేతి ।
యద్వ్యావృత్తేష్వనువృత్తం తత్ పరమార్థసత్ యథా - సర్పధారాదిష్వనుగతో రజ్జ్వాదేరిదమంశః । విమతం సత్యమవ్యభిచారిత్వాత్ సమ్ప్రతిపన్నవదిత్యర్థః ।
వ్యావృత్తస్య కల్పితత్వే ప్రమాణమాహ -
యద్విషయేత్యాదినా ।
యత్ వ్యావృత్తం తన్మిథ్యా, యథా - సర్పధారాది । విమతం మిథ్యా, వ్యభిచారిత్వాత్ సమ్ప్రతిపన్నవదిత్యర్థః । ఇత్యనుమానద్వయమనుసృత్య సతోఽకల్పితత్వమ్ , అసతశ్చ కల్పితత్వమ్ , స్థితమితి శేషః ।
నను - నేదమనుమానద్వయముపపద్యతే, సమస్తద్వైతవైతథ్యవాదినో విభాగాభావాత్ , అనుమానాదివ్యవహారానుపపత్తేః తత్రాహ -
సదసదితి ।
ఉక్తే విభాగే బుద్ధిద్వయాధీనే స్థితే సత్యనుమానాదివ్యవహారో నిర్వహతి ప్రాతిభసికవిభాగేన తద్యోగాత్ పరమార్థస్యైవ తద్ధేతుత్వే కేవలవ్యతిరేకాభావాదిత్యర్థః ।
కుతః ? సదసద్విభాగస్య బుద్ధిద్వయాధీనత్వం బుద్ధివిభాగస్యాపి తవాభావాత్ , తత్రాహ -
సర్వత్రేతి ।
వ్యవహారభూమిః సప్తమ్యర్థః । బుద్ధివిభాగస్యాపి కల్పితస్యైవ బోధ్యవిభాగప్రతిభాసహేతుతేతి భావః ।
బుద్ధిద్వయమనురుధ్య సదసద్విభాగే, సతః సామాన్యరూపతయా విశేషాకాఙ్క్షాయాం సామాన్యవిశేషే ద్వే వస్తునీ వస్తుభూతే స్యాతామ్ ఇతి చేత్ , నేత్యాహ -
సమానాధికరణే ఇతి ।
పదయోః సామానాధికరణ్యం బుద్ధ్యోరుపచర్యతే । సోఽయమితి సామానాధికరణ్యవద్ఘటః సన్నిత్యాది సామానాధికరణ్యమేకవస్తునిష్ఠం వస్తుభేదే ఘటపటయోరివ తదయోగాదిత్యర్థః ।
నీలముత్పలమితివద్ధర్మధర్మివిషయతయా సామానాధికరణ్యస్య సువచత్వాత్ న వస్త్వైక్యవిషయత్వమ్ ఇతి చేత్ , నేత్యాహ -
న నీలేతి ।
న హి సామాన్యవిశేషయోర్భేదేఽభేదే చ తద్భావః భేదాభేదౌ చ విరుద్ధౌ, అతో జాతివ్యక్త్యోః సామానాధికరణ్యం నీలోత్పలయోరివ న గౌణమ్ , కిన్తు వ్యావృత్తమనువృత్తే కల్పితమిత్యేకనిష్ఠమిత్యర్థః ।
సామాన్యవిశేషయోరుక్తన్యాయం గుణగుణ్యాదావతిదిశతి -
ఎవమితి ।
తుల్యౌ హి తత్రాపి వికల్పదోషావితి భావః ।
సామానాధికరణ్యానుపపత్త్యా ద్వే వస్తునీ సామాన్యవిశేషావితి పక్షం ప్రతిక్షిప్య, విశేషా ఎవ వస్తూనీతి పక్షం ప్రతిక్షిపతి -
తయోరితి ।
బుద్ధివ్యభిచారాద్బోధ్యవ్యభిచారేపి, కథం వ్యావృత్తానాం విశేషాణామవస్తుత్వమ్ ? ఇత్యాశఙ్క్యాహ -
తథా చేతి ।
వికారో హి స ఇత్యాదావితి శేషః ।
న చైకం వస్తు సామాన్యవిశేషాత్మకమేకస్య ద్వైరూప్యవిరోధాదిత్యభిప్రేత్య, సామాన్యమేకమేవ వస్తు తద్బుద్ధేరవ్యభిచారాత్ , బోధ్యస్యాపి సతస్తథాత్వాదిత్యాహ -
న త్వితి ।
వ్యభిచరతీతి పూర్వేణ సమ్బన్ధః ।
విశేషాణాం వ్యభిచారిత్వే సతశ్చావ్యభిచారిత్వే ఫలితముపసంహరతి -
తస్మాదితి ।
అసత్త్వం కల్పితత్వమ్ । తచ్ఛబ్దార్థమేవ స్ఫోరయతి -
వ్యభిచారాదితి ।
సద్బుద్ధివిషయస్య సతోఽకల్పితత్వే తచ్ఛబ్దోపాత్తమేవ హేతుమాహ -
అవ్యభిచారాదితి ।