మాణ్డూక్యోపనిషద్భాష్యమ్
ఆనన్దగిరిటీకా (మాణ్డూక్య)
 
జాగరితస్థానో బహిఃప్రజ్ఞః సప్తాఙ్గ ఎకోనవింశతిముఖః స్థూలభుగ్వైశ్వానరః ప్రథమః పాదః ॥ ౩ ॥
కథం చతుష్పాత్త్వమిత్యాహ — జాగరితస్థాన ఇతి । జాగరితం స్థానమస్యేతి జాగరితస్థానః, బహిఃప్రజ్ఞః స్వాత్మవ్యతిరిక్తే విషయే ప్రజ్ఞా యస్య, సః బహిఃప్రజ్ఞః ; బహిర్విషయేవ ప్రజ్ఞా యస్యావిద్యాకృతావభాసత ఇత్యర్థః । తథా సప్త అఙ్గాన్యస్య ; ‘తస్య హ వా ఎతస్యాత్మనో వైశ్వానరస్య మూర్ధైవ సుతేజాశ్చక్షుర్విశ్వరూపః ప్రాణః పృథగ్వర్త్మాత్మా సన్దేహో బహులో వస్తిరేవ రయిః పృథివ్యేవ పాదౌ’ (ఛా. ఉ. ౫ । ౧౮ । ౨) ఇత్యగ్నిహోత్రాహుతికల్పనాశేషత్వేనాగ్నిర్ముఖత్వేనాహవనీయ ఉక్త ఇత్యేవం సప్తాఙ్గాని యస్య, సః సప్తాఙ్గః । తథా ఎకోనవింశతిర్ముఖాన్యస్య ; బుద్ధీన్ద్రియాణి కర్మేన్ద్రియాణి చ దశ, వాయవశ్చ ప్రాణాదయః పఞ్చ, మనో బుద్ధిరహఙ్కారశ్చిత్తమితి, ముఖానీవ ముఖాని తాని ; ఉపలబ్ధిద్వారాణీత్యర్థః । స ఎవంవిశిష్టో వైశ్వానరః యథోక్తైర్ద్వారైః శబ్దాదీన్స్థూలాన్విషయాన్భుఙ్క్త ఇతి స్థూలభుక్ । విశ్వేషాం నరాణామనేకధా సుఖాదినయనాద్విశ్వానరః, యద్వా విశ్వశ్చాసౌ నరశ్చేతి విశ్వానరః, విశ్వానర ఎవ వైశ్వానరః, సర్వపిణ్డాత్మానన్యత్వాత్ ; స ప్రథమః పాదః । ఎతత్పూర్వకత్వాదుత్తరపాదాధిగమస్య ప్రాథమ్యమస్య । కథమ్ ‘అయమాత్మా బ్రహ్మ’ ఇతి ప్రత్యగాత్మనోఽస్య చతుష్పాత్త్వే ప్రకృతే ద్యులోకాదీనాం మూర్ధాద్యఙ్గత్వమితి ? నైష దోషః, సర్వస్య ప్రపఞ్చస్య సాధిదైవికస్య అనేనాత్మనా చతుష్పాత్త్వస్య వివక్షితత్వాత్ । ఎవం చ సతి సర్వప్రపఞ్చోపశమే అద్వైతసిద్ధిః । సర్వభూతస్థశ్చ ఆత్మా ఎకో దృష్టః స్యాత్ ; సర్వభూతాని చాత్మని । ‘యస్తు సర్వాణి భూతాని’ (ఈ. ఉ. ౬) ఇత్యాదిశ్రుత్యర్థశ్చైవముపసంహృతః స్యాత్ ; అన్యథా హి స్వదేహపరిచ్ఛిన్న ఎవ ప్రత్యగాత్మా సాఙ్‍ఖ్యాదిభిరివ దృష్టః స్యాత్ ; తథా చ సతి అద్వైతమితి శ్రుతికృతో విశేషో న స్యాత్ , సాఙ్‍ఖ్యాదిదర్శనేనావిశేషాత్ । ఇష్యతే చ సర్వోపనిషదాం సర్వాత్మైక్యప్రతిపాదకత్వమ్ ; తతో యుక్తమేవాస్య ఆధ్యాత్మికస్య పిణ్డాత్మనో ద్యులోకాద్యఙ్గత్వేన విరాడాత్మనాధిదైవికేనైకత్వమిత్యభిప్రేత్య సప్తాఙ్గత్వవచనమ్ । ‘మూర్ధా తే వ్యపతిష్యత్’ (ఛా. ఉ. ౫ । ౧౨ । ౨) ఇత్యాదిలిఙ్గదర్శనాచ్చ । విరాజైకత్వముపలక్షణార్థం హిరణ్యగర్భావ్యాకృతాత్మనోః । ఉక్తం చైతన్మధుబ్రాహ్మణే — ‘యశ్చాయమస్యాం పృథివ్యాం తేజోమయోఽమృతమయః పురుషో యశ్చాయమధ్యాత్మమ్’ (బృ. ఉ. ౨ । ౫ । ౧) ఇత్యాది । సుషుప్తావ్యాకృతయోస్త్వేకత్వం సిద్ధమేవ, నిర్విశేషత్వాత్ । ఎవం చ సత్యేతత్సిద్ధం భవిష్యతి — సర్వద్వైతోపశమే చాద్వైతమితి ॥

ఆత్మనో నిరవయవస్య పాదద్వయమపి నోపపద్యతే, పాదచతుష్టయం తు దూరోత్సారితమితి శఙ్కతే –

కథమితి ।

పరమార్థతశ్చతుష్పాత్త్వాభావేఽపి కాల్పనికముపాయోపేయభూతం పాదచతుష్టయమవిరుద్ధమిత్యభిప్రేత్యాఽఽద్యం పాదం వ్యుత్పాదయతి –

ఆహేత్యాదినా ।

స్థానమస్యేత్యభిమానస్య విషయభూతమిత్యర్థః ।

ప్రజ్ఞాయాస్తావదాన్తరత్వప్రసిద్ధేరయుక్తమిదం విశేషణమిత్యాశఙ్క్య వ్యాచష్టే –

బహిరితి ।

చైతన్యలక్షణా ప్రజ్ఞా స్వరూపభూతా న బాహ్యే విషయే ప్రతిభాసతే తస్యా విషయానపేక్షత్వాత్, బాహ్యస్య చ విషయస్య వస్తుతోఽభావాదిత్యాశఙ్క్యాఽఽహ –

బహిర్విషయేవేతి ।

న స్వరూపప్రజ్ఞా వస్తుతో బాహ్యవిషయేష్యతే, బుద్ధివృత్తిరూపా త్వసావజ్ఞానకల్పితా తద్విషయా భవతి । న చ సాఽపి వస్తుతస్తద్విషయతామనుభవతి । వస్తుతః స్వయమభావాద్, బాహ్యస్య విషయస్య కాల్పనికత్వాత్ । అతస్తద్విషయత్వం ప్రాతిభాసికమిత్యర్థః ।

పూర్వేణ విశేషణేన విశేషణాన్తరం సముచ్చినోతి –

తథేతి ।

సప్తాఙ్గత్వం శ్రుత్యవష్టమ్భేన విశ్వస్య విశదయతి –

తస్యేత్యాదినా ।

ప్రకృతస్య సన్నిహితప్రసిద్ధస్యైవాఽఽత్మనస్త్రైలోక్యాత్మకస్య వక్ష్యమాణరీత్యా వైశ్వానరశబ్దితస్య సుతేజస్త్వగుణవిశిష్టో ద్యులోకో మూర్ధైవేతి ధులోకస్య శిరస్త్వముపదిశ్యతే । విశ్వరూపో నానావిధః శ్వేతపీతాదిగుణాత్మకః సూర్యశ్చక్షుర్వివక్ష్యతే । పృథఙ్ నానావిధం వర్త్మ సఞ్చరణమాత్మా స్వభావోఽస్యేతి వ్యుత్పత్త్యా వాయుస్తథోచ్యతే । స చ ప్రాణస్తస్యేతి సమ్బన్ధః । బహులో విస్తీర్ణగుణవానాకాశః సన్దేహో దేహస్య మధ్యమో భాగః । రయిరన్నం తద్ధేతురుదకం బస్తిరస్య మూత్రస్థానమ్ । పృథివ్యేవ ప్రతిష్ఠాత్వగుణా వైశ్వానరస్య పాదౌ । తద్యద్భక్తం ప్రథమమాగచ్ఛేత్తద్ధోమీయమియమిత్యగ్నిహోత్రకల్పనా శ్రుతా । తస్యాః శేషత్వేనాఽఽహవనీయోఽగ్నిరస్య ముఖ్యత్వేనోక్త ఇతి యోజనా ।

ఉక్తం సప్తాఙ్గత్వముపసంహరతి –

ఇత్యేవమితి ।

విశేషణాన్తరం సముచ్చినోతి –

తథేతి ।

బుద్ధ్యర్థానీన్ద్రియాణి శ్రోత్రత్వక్చక్షుర్జిహ్వాఘ్రాణాని । కర్మార్థానీన్ద్రియాణి వాక్పాణిపాదపాయూపాస్థాని । తాన్యేతాని ద్వివిధానీన్దియాణి దశ భవన్తి । ప్రాణాదయ ఇత్యాదిశబ్దేనాపానవ్యానోదానసమానా గృహ్యన్తే । ఉపలబ్ధిద్వారాణీత్యుపలబ్ధిపదం కర్మోపలక్షణార్థమ్ । ద్వారత్వం కరణత్వమ్ । తత్ర బుద్ధీన్ద్రియాణాం మనసో బుద్ధేశ్చ ప్రసిద్ధముపలబ్ధౌ కరణత్వమ్ । కర్మేన్ద్రియాణాం తు వదనాదౌ కర్మణి కరణత్వమ్ । ప్రాణాదీనాం పునరుభయత్ర పారమ్పర్యేణ కరణత్వమ్ । తేషు సత్స్వేవ జ్ఞానకర్మణోరుత్పత్తేః, అసత్సు చానుత్పత్తేః । మనోబుద్ధ్యోశ్చ సర్వత్ర సాధారణం కరణత్వమ్ । అహఙ్కారస్యాపి ప్రాణాదివదేవ కరణత్వం మన్తవ్యమ్ । చిత్తస్య చైతన్యాభాసోదయే కరణత్వముక్తమితి వివేక్తవ్యమ్ । పూర్వోక్తైర్విశేషణైర్విశిష్టస్య వైశ్వానరస్య స్థూలభుగితి విశేషణాన్తరమ్ ।

తద్విభజతే –

స ఎవంవిశ్ష్ట ఇతి ।

శబ్దాదివిషయాణాం స్థూలత్వం దిగాదిదేవతానుగృహీతైః శ్రోత్రాదిభిర్గృహ్యమాణత్వమ్ ।

ఇదానీం వైశ్వానరశబ్దస్య ప్రకృతవిశ్వవిషయత్వం విశదయతి –

విశ్వేషామితి ।

కర్మణి షష్ఠీ । విశ్వే చ తే నరాశ్చేతి విశ్వానరాః । నిపాతాత్పూర్వపదస్య దీర్ఘతా । విశ్వాన్ నరాన్ భోక్తృత్వేన వ్యవస్థితాన్ ప్రత్యనేకధా ధర్మాధర్మకర్మానుసారేణ సుఖదుఃఖాదిప్రాపణాదయం కర్మఫలదాతా వైశ్వానరశబ్దితో భవతీత్యర్థః । అథ వా విశ్వశ్చాసౌ నరశ్చేతి విశ్వానరః స ఎవ వైశ్వానరః ।

స్వార్థే తద్ధితో రాక్షసవాయసవదిత్యాహ –

విశ్వేతి ।

కథం విశ్వశ్చాసౌ నరశ్చేతి విగృహ్యతే ? జాగ్రతాం నరాణామనేకత్వాత్తాదత్మ్యానుపపత్తేరిత్యాశఙ్క్యాహ –

సర్వేతి ।

సర్వపిణ్డాత్మా సమష్టిరూపో విరాడుచ్యతే । తేనాఽఽత్మనా విశ్వేషామనన్యత్వాద్యథోక్తసమాససిద్ధిరిత్యర్థః ।

విశ్వస్య తైజసాదుత్పత్తేస్తస్యైవ ప్రాథమ్యం యుక్తమ్, కార్యస్య తు పశ్చాద్భావిత్వముచితమిత్యాశఙ్క్యాహ –

ఎతదితి ।

ప్రవిలాపనాపేక్షయా ప్రాథమ్యం న సృష్ట్యపేక్షయేత్యర్థః ।

అధ్యాత్మాధిదైవయోర్భేదమాదాయ ప్రాగుక్తం సప్తాఙ్గత్వమాక్షిపతి –

కథమితి ।

బ్రహ్మణి ప్రకృతే తస్య పరోక్షత్వే శఙ్కితే తన్నిరాసార్థం బ్రహ్మాయమాత్మేతి ప్రత్యగాత్మానం ప్రకృత్య సోఽయమాత్మా చతుష్పాదితి చతుష్పాత్త్వే తస్య ప్రక్రాన్తే ద్యులోకాదీనాం మూర్ధాద్యఙ్గత్వసప్తాఙ్గత్వసిద్ధ్యర్థం యదుక్తం తదయుక్తం ప్రక్రమవిరోధాదిత్యర్థః ।

అధ్యాత్మాధిదైవయోర్భేదాభావాన్న ప్రక్రమవిరోధోఽస్తీతి పరిహరతి –

నైష దోష ఇతి ।

తత్ర హేతుమాహ –

సర్వస్యేతి ।

ఆధ్యాత్మికస్యాఽఽధిదైవికేన సహితస్య ప్రపఞ్చస్య సర్వస్యైవ స్థూలస్య పఞ్చీకృతపఞ్చమహాభూతతత్కార్యాత్మకస్యానేనాఽత్మనా విరాజా ప్రథమపాదత్వమ్ । తస్యైవ సూక్ష్మస్యాపఞ్చీకృతపఞ్చమహాభూతతత్కార్యాత్మనో హిరణ్యగర్భత్మనా ద్వితీయపాదత్వమ్ । తస్యైవ కార్యరూపతాం త్యక్త్వా కారణరూపతామాపన్నస్యావ్యాకృతాత్మనా తృతీయపాదత్వమ్ । తస్యైవ తు కార్యకారణరూపతాం విహాయ సర్వకల్పనాధిష్ఠానతయా స్థితస్య సత్యజ్ఞానానన్తానన్దాత్మనా చతుర్థపాదత్వమ్ । తదేవమధ్యాత్మాధిదైవయోరభేదమాదయోక్తేన ప్రకారేణ చతుష్పాత్త్వస్య వక్తుమిష్టత్వాత్ పూర్వపూర్వపాదస్యోత్తరోత్తరపాదాత్మనా ప్రవిలాపనాత్తురీయనిష్ఠాయాం పర్యవసానం సిద్ధ్యతీత్యర్థః ।

యదైయం తురీయే పర్యవసానం జిజ్ఞాసోర్ముముక్షోరిష్యతే తదా తత్త్వజ్ఞానప్రతిబన్ధకస్య ప్రాతిభాసికద్వైతస్యోపరమే సతి అద్వైతపరిపూర్ణబ్రహ్మాహమస్మీతి వాక్యార్థసాక్షాత్కారః సిధ్యతీతి ఫలితమాహ –

ఎవం చేతి ।

ఉక్తన్యాయేన తత్త్వసాక్షాత్కారే సంగృహీతే సర్వేషు భూతేషు బ్రహ్మాదిస్థావరాన్తేష్వాత్మైకోఽద్వితీయో దృష్టః స్యాత్ । ‘ఎకో దేవః సర్వభూతేషు’(శ్వే. ఉ. ౧ । ౧౦) ఇతి తత్ర తత్ర బ్రహ్మచైతన్యస్యైవ ప్రత్యక్త్వేనావస్థానాభ్యుపగమాత్ తాని తాని చ సర్వాణి ప్రాతిభాసికాని భూతాని తస్మిన్నేవాత్మని కల్పితాని దృష్టాని స్యుః । తథా చ పూర్ణత్వమాత్మనో భూతాన్తరాణాం చ తదతిరేకేణ సత్తాస్ఫురణవిరహితత్వం సిద్ధ్యతి ।

తతశ్చ – “సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాఽఽత్మని । సమ్పశ్యన్నాత్మయాజీ వై స్వారాజ్యమభిగచ్ఛతి॥”(మను. స్మృ. ౧౨ । ౯౧) ఇతి స్మృతిరనుగృహీతా భవతీత్యాహ –

సర్వభూతస్థశ్చేతి ।

న చేదం మానవం వచనమమానమితి శఙ్కనీయమ్ । ‘యద్వై కిఞ్చ మనురవదత్తద్భేషజమ్’ (తై. సం. ౨ । ౨ । ౧౦ । ౨) ఇతి శ్రుతేరిత్యభిప్రేత్య దర్శితస్మృతిమూలభూతాం శ్రుతిం సూచయతి –

యస్త్వితి ।

యో హి పాదత్రయం ప్రాగుక్తయా ప్రక్రియయా ప్రవిలాప్య తురీయే నిత్యే విజ్ఞప్తిమాత్రే సదానన్దైకతానే పరిపూర్ణే ప్రతిష్ఠాం ప్రతిపద్యతే స బ్రహ్మాహమస్మీత్యాత్మానం జానానః సర్వేషాం భూతానామధిష్ఠానాన్తరమనుపలభమాన ఆత్మన్యేవ ప్రాతీతికాని తాని ప్రత్యేతి । తేషు సర్వేష్వాత్మానం సత్తాస్ఫూర్తిప్రదమవగచ్ఛతి । తతశ్చ న కిఞ్చిదపి గోపాయితుమిచ్ఛతీతి శ్రుత్యర్థశ్చ యథోక్తరిత్యా తత్త్వసాక్షాత్కారే సఙ్గృహీతే సతి స్వీకృతః స్యాదిత్యర్థః ।

అధ్యాత్మాధిదైవయోరభేదాభ్యుపగమద్వారేణ ప్రాగుక్తపరిపాట్యా తత్త్వజ్ఞానానభ్యుపగమే దోషమాహ –

అన్యథేతి ।

సాఙ్ఖ్యాదిపక్షస్యాపి ప్రామాణికత్వాత్తథైవ ప్రతిదేహం పరిచ్ఛిన్నస్య ప్రత్యగాత్మనో దర్శనేన ప్రామాణికోఽర్థోఽభ్యుపగతో భవతి ।

వ్యవస్థానుపపత్త్యా చ ప్రతిశరీరమాత్మభేదః సిద్ధ్యతీత్యాశఙ్క్యాఽఽహ –

తథా చేతి ।

సాఙ్ఖ్యాదీనాం ద్వైతవిషయం దర్శనమిష్టమ్ । తేన త్వదీయదర్శనస్యాద్వైతవిషయస్య విశేషాభావాదద్వైతం తత్త్వమితి శ్రుతిసిద్ధో విశేషస్త్వత్పక్షే న సిధ్యేదతః శ్రుతివిరోధో భేదవాదే ప్రసజ్యేత । వ్యవస్థా త్వౌపాధికభేదమధికృత్య సుస్థా భవిష్యతీత్యర్థః । నను భేదవాదేఽపి నాద్వైతశ్రుతిర్విరుధ్యతే ।

ధ్యానార్థమన్నం బ్రహ్మేతివదద్వైతం తత్త్వమిత్యుపదేశసిద్ధేరిత్యాశఙ్క్యాఽఽహ –

ఇష్యతే చేతి ।

ఉపక్రమోపసంహారైకరూప్యాదినా సర్వాసాముపనిషదాం సర్వేషు దేహేష్వాత్మైక్యప్రతిపాదనపరత్వమిష్టమతో న ధ్యానార్థత్వమద్వైతశ్రుతేరేష్టుం శక్యమ్ । వస్తుపరత్వలిఙ్గవిరోధాదిత్యర్థః ।

అధ్యాత్మాధిదైవయోరేకత్వముపేత్యాద్వైతపర్యవసానే సిద్ధే సత్యాధ్యాత్మికస్య వ్యష్ట్యాత్మనో విశ్వస్య త్రైలోక్యాత్మకేనాఽఽధిదైవికేన విరాజా సహైకత్వం గృహీత్వా యత్తస్య సప్తాఙ్గత్వముక్తం తదవిరుద్ధమిత్యుపసంహరతి –

అత ఇతి ।

అధ్యాత్మాధిదైవయోరైక్యే హేత్వన్తరమాహ –

మూర్ధేతి ।

దివాదిత్యాదికం వైశ్వానరావయవం వైశ్వానరబుద్ధ్యా ధ్యాయతో జిజ్ఞాసయా పునరఖణ్డపక్షముపగతస్య ‘మూర్ధా తే వ్యపతిష్యద్యన్మాం నాఽఽగమిష్యః’ (ఛా. ఉ. ౫ । ౧౨ । ౨) ఇత్యన్ధోఽభవిష్యో యన్మామిత్యాదివ్యస్తోపాసననిన్దా సమస్తోపాసనవిధిత్సయా దృశ్యతే । న చ ద్యులోకాదికం విపరీతబుద్ధ్యా గృహీతవతః స్వకీయమూర్ధాదిపరిపతనముచితం యద్యధ్యాత్మాధిదైవయోరేకత్వం న భవేత్ తస్మాత్తయోరేకత్వమత్ర వివక్షితం భవతీత్యర్థః । నను విరాజో విశ్వేనైకత్వమేవ మూలగ్రన్థే దృశ్యతే ।

తత్కథమవిశేషేణాధ్యాత్మాధిదైవయోరేకత్వం వివక్షిత్వాఽద్వైతపర్యవసానం భాష్యకృతోచ్యతే, తత్రాఽఽహ –

విరాజేతి ।

యన్ముఖతో విరాజో విశ్వేనైకత్వం దర్శితం తత్తు హిరణ్యగర్భస్య తైజసేనాన్తర్యామిణశ్చావ్యాకృతోపహితస్య ప్రాజ్ఞేన సహైకత్వస్యోపలక్షణార్థమతో మూలగ్రన్థేఽప్యవిశేషేణాధ్యాత్మాధిదైవయోరేకత్వం వివక్షితమిత్యద్వైతపర్వయసానసిద్ధిరిత్యర్థః ।

అధ్యాత్మాధిదైవయోర్యదేకత్వమిహోచ్యతే తన్మధుబ్రాహ్మణేఽపి దర్శితమిత్యాహ –

ఉక్తం చేతి ।

అధిదైవమధ్యాత్మం చైకరూపం నిర్దేశం ప్రతిపర్యాయమయమేవ స ఇత్యభేదవచనాదేకత్వమత్ర వివక్షితమిత్యర్థః । నను విశ్వవిరాజోః స్థూలాభిమానిత్వాత్తైజసహిరణ్యగర్భయోశ్చ సూక్ష్మాభిమానిత్వాదేకత్వం యుక్తమ్ ।

ప్రాజ్ఞావ్యాకృతయోస్తు కేన సాధార్మ్యేణైకత్వం, తత్రాఽఽహ –

సుషుప్తేతి ।

ప్రాజ్ఞో హి సర్వం విశేషముపసంహృత్య నిర్విశేషః సుషుప్తే వర్తతే, ప్రలయదశాయామవ్యాకృతం చ నిఃశేషవిశేషం స్వాత్మన్యుపసంహృత్య నిర్విశేషరూపం తిష్ఠతి, తేనోక్తం సాధర్మ్యం పురోధాయ తయోరైక్యమవిరుద్ధమిత్యర్థః ।

అధ్యాత్మాధిదైవయోరేకత్వే ప్రాగుక్తన్యాయేన ప్రసిద్ధే సత్యుపసంహారప్రక్రియయా సిద్ధమద్వైతమితి ఫలితమాహ –

ఎవం చేతి ।

తచ్చాద్వైతం ప్రతిబన్ధధ్వంసమాత్రేణ న స్ఫురతి, కిం తు వాక్యాదేవాఽఽచార్యోపదిష్టాదితి వక్తుం చశబ్దః ॥౩॥