పాదద్వయమేవం వ్యాఖ్యాయ తృతీయం పాదం వ్యాఖ్యాస్యన్ వ్యాఖ్యాయమానశ్రుతౌ న కఞ్చనేత్యాదివిశేషణస్య తాత్పర్యమాహ –
దర్శనేతి ।
దర్శనస్య స్థూలవిషయస్య వృత్తిరత్రాస్తీతి జాగరితం దర్శనవృత్తిరిత్యుచ్యతే, స్థూలవిషయదర్శనాదన్యద్దర్శనమదర్శనం వాసనామాత్రం తస్య వృత్తిరత్రాస్తీత్యదర్శనవృత్తిః స్వప్నస్తయోః సుషుప్తవదేవ స్వాపస్య తత్త్వాగ్రహణస్య తుల్యత్వాత్ ‘యత్ర సుప్త’ ఇత్యుక్తే తయోరపి ప్రసక్తౌ తద్వ్యవచ్ఛేదేన సుషుప్తస్యైవ గ్రహణార్థం ‘యత్ర సుప్త’(బృ. ఉ. ౪ । ౩ । ౧౯) ఇత్యాదివాక్యే ‘న కఞ్చనే’ త్యాదివిశేషణమ్ । తద్ధి స్థానద్వయం వ్యవచ్ఛిద్య సుషుప్తమేవ గ్రాహయతీత్యర్థః ।
న కఞ్చన స్వప్నం పశ్యతీత్యనేనైవ విశేషణేన స్థానద్వయవ్యవచ్ఛేదసమ్భవాద్ విశేషణాన్తరమకిఞ్చిత్కరమిత్యాశఙ్క్యాఽఽహ –
అథ వేతి ।
తత్త్వాప్రతిబోధః స్వాపస్తస్య స్థానత్రయేఽపి తుల్యత్వాజ్జాగ్రత్స్వప్నాభ్యాం విభజ్య సుషుప్తం జ్ఞాపయితుం విశేషణమిత్యర్థః ।
ఎకస్యైవ విశేషణస్య వ్యవచ్ఛేదకత్వసమ్భవాదలం విశేషణాభ్యామిత్యస్య కః సమాధిరిత్యాశఙ్క్య విశేషణయోర్వికల్పేన వ్యవచ్ఛేదకత్వాన్నాఽనర్థక్యమితి మత్వాఽఽహ –
న హీతి ।
యత్రేత్యస్యాపేక్షితార్థం కథయతి –
తదేతదితి ।
అన్యథాగ్రహణశూన్యత్వం కామసంస్పర్శవిరహితత్వం చ విశేషణాభ్యాం వివక్షితమ్ ।
కథమస్య సద్వితీయస్యైకీభూతత్వవిశేషణమిత్యాశఙ్క్యాహ –
స్థానద్వయేతి ।
జాగరితం స్వప్నశ్చేతి స్థానద్వయమ్ । తేన ప్రవిభక్తం యద్ ద్వైతం స్థూలం సూక్ష్మం చ తత్సర్వం మనఃస్పన్దితమాత్రమితి వక్ష్యతే । తచ్చ యథా స్వకీయరూపమాత్మనో విభక్తం తథైవ తస్యాత్యాగేనావ్యాకృతాఖ్యం కారణమాపన్నం స్వకీయసర్వవిస్తారసహితం కారణాత్మకం భవతి । యథాఽహర్నైశేన తమసా గ్రస్తం తమస్త్వేనైవ వ్యవహ్రియతే తథేదమపి కార్యజాతం కారణభావమాపన్నం కారణమిత్యేవ వ్యవహ్రియతే । తస్యాం చావస్థాయాం తదుపాధిరాత్మైకీభూతవిశేషణభాగ్ భవతీత్యర్థః ।
తథాఽపి కారణోపహితస్య ప్రజ్ఞానఘనవిశేషణమయుక్తం నిరుపాధికస్యైవ తథా విశేషణసమ్భవాదిత్యాశఙ్క్యాహ –
అత ఎవేతి ।
సర్వస్య కార్యప్రపఞ్చస్య సమనస్కస్య సుషుప్తే కారణాత్మనా స్థితత్వాదేవేత్యర్థః ।
సుషుప్తావస్థాయాముక్తప్రజ్ఞానానామేకమూర్తిత్వం న వాస్తవం, పునర్యథాపూర్వవిభాగయోగ్యత్వాదితి మత్వోక్తమ్ –
ఇవేతి ।
సుషుప్త్యవస్థాయాః కారణాత్మకత్వాజ్జాగ్రత్స్వప్నప్రజ్ఞానానాం తత్రైకీభావాత్ ప్రజ్ఞానఘనశబ్దవాచ్యతేత్యుక్తమనువదతి –
సేయమితి ।
ఉక్తమేవార్థం దృష్టాన్తేన బుద్ధావావిర్భావయతి –
యథేత్యాదినా ।
ఎవకారస్య నాయోగవ్యవచ్ఛిత్తిరర్థః ।
కిం తు అన్యయోగవ్యవచ్ఛిత్తిరిత్యాహ –
ఎవశబ్దాదితి ।
ప్రజ్ఞస్యాఽఽనన్దవికారత్వాభావే కథమానన్దమయత్వవిశేషణమిత్యాశఙ్క్య స్వరూపసుఖాభివ్యక్తిప్రతిబన్ధకదుఃఖాభావాత్ ప్రాచుర్యార్థత్వం మయటో గృహీత్వా విశేషణోపపత్తిం దర్శయతి –
మనస ఇతి ।
మయటః స్వరూపార్థత్వాదానన్దమయత్వమానన్దత్వమేవ కిం న స్యాదిత్యాశఙ్క్యాఽఽహ –
నేత్యాదినా ।
న హి సుషుప్తే నిరుపాధికానన్దత్వం ప్రాజ్ఞస్యాభ్యుపగన్తుం శక్యం తస్య కారణోపహితత్వాత్ । అన్యథా ముక్తత్వాత్పునరుత్థానాయోగాత్ । తస్మాదానన్దప్రాచుర్యమేవాస్య స్వీకర్తుం యుక్తమిత్యర్థః ।
ఆనన్దభుగితి విశేషణం సదృష్టాన్తం వ్యాచష్టే –
యథేతి ।
తథా సుషుప్తోఽపీతి శేషః ।
దార్ష్టాన్తికం వివృణోతి –
అత్యన్తేతి ।
ఇయం స్థితిరితి సుషుప్తిరుక్తా । అనేనేతి ప్రాజ్ఞోక్తిః ।
సౌషుప్తస్య పురుషస్య తస్యామవస్థాయాం స్వరూపభూతానతిశయానన్దాభివ్యక్తిరస్తీత్యత్ర ప్రమాణమాహ –
ఎషోఽస్యేతి ।
ప్రాజ్ఞస్యైవ చేతోముఖ ఇతి విశేషణాన్తరం తద్వ్యాచష్టే –
స్వప్నాదీతి ।
స్వప్నో జాగరితం చేతి ప్రతిబోధశబ్దితం చేతస్తత్ప్రతి ద్వారభూతత్వం ద్వారభావేన స్థితత్వమ్ । న హి స్వప్నస్య జాగరితస్య వా సుషుప్తద్వారమన్తరేణ సమ్భవోఽస్తి । తయోస్తత్కార్యత్వాత్ । అతః సుషుప్తాభిమానీ ప్రాజ్ఞః స్థానద్వయకారణత్వాచ్చేతోముఖవ్యపదేశభాగిత్యర్థః । అథవా ప్రాజ్ఞస్య సుషుప్తాభిమానినః స్వప్నం జాగరితం వా ప్రతి క్రమాక్రమాభ్యాం యదాగమనం తత్ప్రతి చైతన్యమేవ ద్వారమ్ ।
న హి తద్ వ్యతిరేకేణ కాఽపి చేష్టా సిధ్యతీత్యభిప్రేత్య పక్షాన్తమాహ –
బోధేత్యాదినా ।
భూతే భవిష్యతి చ విషయే జ్ఞాతృత్వం తథా సర్వస్మిన్నపి వర్తమానే విషయే జ్ఞాతృత్వమస్యైవేతి ప్రకర్షేణ జానాతీతి ప్రజ్ఞః । ప్రజ్ఞ ఎవ ప్రాజ్ఞః ।
తదేవ ప్రాజ్ఞపదం వ్యుత్పాదయతి –
భూతేతి ।
సుషుప్తే సమస్తవిశేషవిజ్ఞానోపరమాత్ కుతో జ్ఞాతృత్వమిత్యాశఙ్క్యాహ –
సుషుప్తోఽపీతి ।
యద్యపి సుషుప్తస్తస్యామవస్థాయాం సమస్తవిశేషవిజ్ఞానవిరహితో భవతి తథాపి భూతా నిష్పన్నా యా జాగరితే స్వప్నే చ సర్వవిషయజ్ఞాతృత్వలక్షణా గతిస్తయా ప్రకర్షేణ సర్వమ్ ఆసమన్తాజ్జానాతీతి ప్రాజ్ఞశబ్దవాచ్యో భవతీత్యర్థః ।
తర్హి ప్రాజ్ఞశబ్దస్య ముఖ్యార్థత్వం న సిధ్యతీత్యాశఙ్క్యాఽఽహ –
అథవేతి ।
అసాధారణమితివిశేషణద్యోతితమర్థం స్ఫుటయతి –
ఇతరయోరితి ।
ఆధ్యాత్మికస్య తృతీయపాదస్య వ్యాఖ్యాముపసంహరతి –
సోఽయమితి ॥ ౫॥