తైత్తిరీయోపనిషద్భాష్యమ్
వనమాలావ్యాఖ్యా
 
అతీతవిద్యాప్రాప్త్యుపసర్గప్రశమనార్థా శాన్తిః పఠితా । ఇదానీం తు వక్ష్యమాణబ్రహ్మవిద్యాప్రాప్త్యుపసర్గోపశమనార్థా శాన్తిః పఠ్యతే -

నను ‘శం నో మిత్రః’ ఇత్యాదిశాన్తేరాదావేవ పఠితత్వాదిదానీం పునః కిమర్థం పఠ్యతే ? తత్రాహ —

శం నో మిత్ర ఇత్యాద్యతీతేతి ।

సంహితోపనిషద్యతీతానాం విద్యానాం ప్రాప్తౌ యే ఉపసర్గాః విఘ్నాస్తేషాముపశమనాయ ‘శం నో మిత్రః’ ఇత్యాద్యా శాన్తిరాదౌ పఠితేత్యర్థః ।

పునః పాఠ ఉత్తరార్థ ఇత్యాహ —

ఇదానీమితి ।

యద్యపి పునఃపాఠస్యాపి పూర్వశేషత్వమేవ ప్రతీయతే ‘ఆవీన్మామ్’ ఇత్యాదిలిఙ్గాత్ , తథాప్యతీతవిద్యోపసర్గప్రశమనరూపస్య ప్రార్థనాప్రయోజనస్య సిద్ధత్వాదుపక్రమే ‘శం నో భవత్వర్యమా’ ఇతి ప్రార్థనాలిఙ్గాచ్చ పునఃపాఠస్యోత్తరవిద్యాశేషత్వముక్తమితి మన్తవ్యమ్ ; తథా చ ‘తన్మామావీత్’ ఇత్యాదౌ తత్ వాయ్వాఖ్యమపరం బ్రహ్మ మామ్ అపరవిద్యార్థినమ్ ఆవీత్ అరక్షత్ ఇదానీం పరవిద్యార్థినం మామవత్విత్యాదిప్రకారేణ పరబ్రహ్మవిద్యాశేషత్వానుగుణముపపాదనం కర్తవ్యమితి భావః ।