భామతీవ్యాఖ్యా
వేదాన్తకల్పతరుః
 

ఎవం - “కార్యాన్వయం వినా సిద్ధరూపే బ్రహ్మణి మానతా । పురుషార్థే స్వయం తావద్వేదాన్తానాం ప్రసాధితా” ॥ బ్రహ్మజిజ్ఞాసాం ప్రతిజ్ఞాయ “జన్మాద్యస్య యతః”(బ్ర.సూ.౧ । ౧ । ౨) ఇత్యాదినా “తత్తు సమన్వయాత్”(బ్ర.సూ.౧ । ౧ । ౩) ఇత్యన్తేన సూత్రసన్దర్భేణ సర్వజ్ఞే సర్వశక్తౌ జగదుత్పత్తిస్థితివినాశకారణే ప్రామాణ్యం వేదాన్తానాముపపాదితమ్ । తచ్చ బ్రహ్మణీతి పరమార్థతః । న త్వద్యాపి బ్రహ్మణ్యేవేతి వ్యుత్పాదితమ్ । తదత్ర సన్దిహ్యతే - తజ్జగదుపాదానకారణం కిం చేతనముతాచేతనమితి । అత్ర చ విప్రతిపత్తేః ప్రవాదినాం విశేషానుపలమ్భే సతి సంశయః । తత్ర చ ప్రధానమచేతనం జగదుపాదానకారణమనుమానసిద్ధమనువదన్త్యుపనిషద ఇతి సాఙ్ఖ్యాః । జీవాణువ్యతిరిక్తచేతనేశ్వరనిమిత్తాధిష్ఠితాశ్చతుర్విధాః పరమాణవో జగదుపాదానకారణమనుమితమనువదన్తీతి కాణాదాః । ఆదిగ్రహణేనాభావోపాదానత్వాది గ్రహీతవ్యమ్ । అనిర్వచనీయానాద్యవిద్యాశక్తిమచ్చేతనోపాదానం జగదాగమికమితి బ్రహ్మవిదః । ఎతాసాం చ విప్రతిపత్తీనామనుమానవాక్యానుమానవాక్యతదాభాసా బీజమ్ । తదేవం విప్రతిపత్తేః సంశయే కిం తావత్ప్రాప్తమ్ । తత్ర “జ్ఞానక్రియాశక్త్యభావాద్బ్రహ్మణోఽపరిణామినః । న సర్వశక్తివిజ్ఞానే ప్రధానే త్వస్తి సమ్భవః” ॥ జ్ఞానక్రియాశక్తీ ఖలు జ్ఞానక్రియాకార్యదర్శనోన్నేయసద్భావే । న చ జ్ఞానక్రియే చిదాత్మని స్తః, తస్యాపరిణామిత్వాదేకత్వాచ్చ । త్రిగుణే తు ప్రధానే పరిణామిని సమ్భవతః । యద్యపి చ సామ్యావస్థాయాం ప్రధానే సముదాచరద్వృత్తినీ క్రియాజ్ఞానే న స్తః, తథాప్యవ్యక్తేన శక్త్యాత్మనా రూపేణ సమ్భవత ఎవ । తథా చ ప్రధానమేవ సర్వజ్ఞం చ సర్వశక్తి చ । న తు బ్రహ్మ । స్వరూపచైతన్యం త్వస్యావృత్తితమనుపయోగి జీవాత్మనామివాస్మాకమ్ । న చ స్వరూపచైతన్యే కర్తృత్వమ్ , అకార్యత్వాత్తస్య । కార్యత్వే వా న సర్వదా సర్వజ్ఞతా । భోగాపవర్గలక్షణపురుషార్థద్వయప్రయుక్తానాదిప్రధానపురుషసంయోగనిమిత్తస్తు మహదహఙ్కారాదిక్రమేణాచేతనస్యాపి చేతనానధిష్ఠితస్య ప్రధానస్య పరిణామః సర్గః । దృష్టం చాచేతనం చేతనానధిష్ఠితం పురుషార్థే ప్రవర్తమానమ్ । యథా వత్సవివృద్ధ్యర్థమచేతనం క్షీరం ప్రవర్తతే । “తదైక్షత బహు స్యాం ప్రజాయేయ” (ఛా. ఉ. ౬ । ౨ । ౩) ఇత్యాద్యాశ్చ శ్రుతయోఽచేతనేఽపి చేతనవదుపచారాత్స్వకార్యోన్ముఖత్వమాదర్శయన్తి, యథా కూలం పిపతిషతీతి । “యత్ప్రాయే శ్రూయతే యచ్చ తత్తాదృగవగమ్యతే । భాక్తప్రాయే శ్రుతమిదమతో భాక్తం ప్రతీయతే” ॥ అపి చాహుర్వృద్ధాః - “యథాగ్ర్యప్రాయే లిఖితం దృష్ట్వా వదన్తి భవేదయమగ్ర్యః” ఇతి, తథేదమపి “తా ఆప ఐక్షన్త” (ఛా. ఉ. ౬ । ౨ । ౪) “తత్తేజ ఐక్షత” (ఛా. ఉ. ౬ । ౨ । ౩) ఇత్యాద్యుపచారప్రాయే క్షుతం “తదైక్షత”(ఛా. ఉ. ౬ । ౨ । ౩) ఇత్యౌపచారికమేవ విజ్ఞేయమ్ । “అనేన జీవేనాత్మనానుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి” (ఛా. ఉ. ౬ । ౩ । ౨) ఇతి చ ప్రధానస్య జీవాత్మత్వం జీవార్థకారితయాహ । యథా హి భద్రసేనో రాజార్థకారీ రాజ్ఞా భద్రసేనో మమాత్మేత్యుపచర్యతే, ఎవం “తత్త్వమసి”(ఛా. ఉ. ౬ । ౮ । ౭) ఇత్యాద్యాః శ్రుతయో భాక్తాః సమ్పత్త్యర్థా వా ద్రష్టవ్యాః । “స్వమపీతో భవతి” (ఛా. ఉ. ౬ । ౮ । ౧) ఇతి చ నిరుక్తం జీవస్య ప్రధానే స్వకీయేఽప్యయం సుషుప్తావస్థాయాం బ్రూతే । ప్రధానాంశతమఃసముద్రకే హి జీవోనిద్రాణస్తమసీవ మగ్నో భవతి । యథాహుః - “అభావప్రత్యయాలమ్బనా వృత్తిర్నిద్రా”(యో.సూ. ౧.౧౦) ఇతి । వృత్తీనామన్యాసాం ప్రమాణాదీనామభావస్తస్య ప్రత్యయకారణం తమస్తదాలమ్బనా నిద్రా జీవస్య వృత్తిరిత్యర్థః । తథా సర్వజ్ఞం ప్రస్తుత్య శ్వేతాశ్వతరమన్త్రోఽపి “సకారణం కరణాధిపాధిపః” ఇతి ప్రాధానాభిప్రాయః । ప్రధానస్యైవ సర్వజ్ఞత్వం ప్రతిపాదితమధస్తాత్ । తస్మాదచేతనం ప్రధానం జగదుపాదానమనువదన్తి శ్రుతయ ఇతి పూర్వః పక్షః । ఎవం కాణాదాదిమతేఽపి కథఞ్చిద్యోజనీయాః శ్రుతయః । అక్షరార్థస్తు -

ప్రధానకారణపక్షేఽపీతి ప్రధానస్యాపీతి ।

అపికారావేవకారార్థౌ ।

స్యాదేతత్ । సత్త్వసమ్పత్త్యా చేదస్య సర్వజ్ఞతాథ తమఃసమ్పత్త్యా - సర్వజ్ఞతైవాస్య కస్మాన్న భవతీత్యత ఆహ -

తేన చ సత్త్వధర్మేణ జ్ఞానేనేతి ।

సత్త్వం హి ప్రకాశశీలం నిరతిశయోత్కర్షం సర్వజ్ఞతాబీజమ్ । తథాహుః - “నిరతిశయం సర్వజ్ఞతాబీజం” ఇతి । యత్ఖలు సాతిశయం తత్క్వచిన్నిరతిశయం దృష్టం, యథా కువలామలకబిల్వేషు, సాతిశయం మహత్త్వం వ్యోమ్ని పరమమహతి నిరతిశయమ్ । ఎవం జ్ఞానమప్యేకద్విబహువిషయతయా సాతిశయమిత్యనేనాపి క్వచిన్నిరతిశయేన భవితవ్యమ్ । ఇదమేవ చాస్య నిరతిశయత్వం యద్విదితసమస్తవేదితవ్యత్వమ్ । తదిదం సర్వజ్ఞత్వం సత్త్వస్య నిరతిశయోత్కర్షత్వే సమ్భవతి । ఎతదుక్తం భవతి - యద్యపి రజస్తమసీ అపి స్తః తథాపి పురుషార్థప్రయుక్తగుణవైషమ్యాతిశయాత్సత్త్వస్య నిరతిశయోత్కర్షే సార్వజ్ఞ్యం కార్యముత్పద్యత ఇతి ప్రధానావస్థాయామపి తన్మాత్రం వివక్షిత్వావివక్షిత్వా చ తమఃకార్యం ప్రధానం సర్వజ్ఞముపచర్యత ఇతి ।

అపిభ్యామవధారణస్య వ్యవచ్ఛేద్యమాహ -

న కేవలస్యేతి ।

నహి కిఞ్చిదేకం కార్యం జనయేదపి తు బహూని । చిదాత్మా చైకః, ప్రధానం తు త్రిగుణమితి తత ఎవ కార్యముత్పత్తుమర్హతి, న చిదాత్మన ఇత్యర్థః ।

తవాపి చ యోగ్యతామాత్రేణైవ చిదాత్మనఃసర్Sవజ్ఞతాభ్యుపగమో న కార్యయోగాదిత్యాహ -

త్వయాపీతి ।

న కేవలస్యాకార్యకారణస్యేత్యేతత్సింహావలోకితేన ప్రపఞ్చయతి -

ప్రాగుత్పత్తేరితి ।

అపి చ ప్రధానస్యేతి ।

చస్త్వర్థః ।

ఎవం ప్రాప్త ఉచ్యతే -

ఈక్షతేర్నాశబ్దమ్ ।

నామరూపప్రపఞ్చలక్షణకార్యదర్శనాదేతత్కారణమాత్రవదితి సామాన్యకల్పనాయామస్తి ప్రమాణం, న తు తదచేతనం చేతనమితి వా విశేషకల్పనాయామస్త్యనుమానమిత్యుపరిష్టాత్ప్రవేదయిష్యతే । తస్మాన్నామరూపప్రపఞ్చకారణభేదప్రమాయామామ్నాయ ఎవ భగవానుపాసనీయః । తదేవమామ్నాయైకసమధిగమనీయే జగత్కారణే “పౌర్వాపర్యపరామర్శాద్యదామ్నాయోఽఞ్జసా వదేత్ । జగద్బీజం తదేవేష్టం చేతనే చ స ఆఞ్జసః” ॥ తేషు తేషు ఖల్వామ్నాయప్రదేశేషు “తదైక్షత”(ఛా. ఉ. ౬ । ౨ । ౩) ఇత్యేవంజాతీయకైర్వాక్యైరీక్షితుః కారణాజ్జగజ్జన్మాఖ్యాయత ఇతి । న చ ప్రధానపరమాణ్వాదేరచేతనస్యేక్షితృత్వమాఞ్జసమ్ । సత్త్వాంశేనేక్షితృ ప్రధానం, తస్య ప్రకాశకత్వాదితి చేన్న । తస్య జాడ్యేన తత్త్వానుపపత్తేః । కస్తర్హి రజస్తమోభ్యాం సత్త్వస్య విశేషః । స్వచ్ఛతా । స్వచ్ఛం హి సత్త్వమ్ । అస్వచ్ఛే చ రజస్తమసీ । స్వచ్ఛస్య చ చైతన్యబిమ్బోద్గ్రాహితయా ప్రకాశకత్వవ్యపదేశో నేతరయోః, అస్వచ్ఛతయా తద్గ్రాహిత్వాభావాత్ । పార్థివత్వే తుల్య ఇవ మణేర్బిమ్బోద్గ్రాహితా న లోష్టాదీనామ్ । బ్రహ్మణస్త్వీక్షితృత్వమాఞ్జసం, తస్యామ్నాయతో నిత్యజ్ఞానస్వభావత్వవినిశ్చయాత్ । నన్వత ఎవాస్య నేక్షితృత్వం, నిత్యస్య జ్ఞానస్వభావభూతస్యేక్షణస్యాక్రియాత్వేన బ్రహ్మణస్తత్ప్రతి నిమిత్తభావాభావాత్ । అక్రియానిమిత్తస్య చ కారకత్వనివృత్తౌ తద్వ్యాప్తస్య తద్విశేషస్య కర్తృత్వస్య నివృత్తేః । సత్యం, బ్రహ్మస్వభావశ్చైతన్యం నిత్యతయా న క్రియా, తస్య త్వనవచ్ఛిన్నస్య తత్తద్విషయోపధానభేదావచ్ఛేదేన కల్పితభేదస్యానిత్యత్వం కార్యత్వం చోపపద్యతే । తథా చైవంలక్షణ ఈక్షణే సర్వవిషయే బ్రహ్మణః స్వాతన్త్ర్యలక్షణం కర్తృత్వముపపన్నమ్ । యద్యపి చ కూటస్థనిత్యస్యాపరిణామిన ఔదాసీన్యమస్య వాస్తవం తథాప్యనాద్యనిర్వచనీయావిద్యావచ్ఛిన్నస్య వ్యాపారవత్త్వమవభాసత ఇతి కర్తృత్వోపపత్తిః । పరైరపి చ చిచ్ఛేక్తేః కూటస్థనిత్యాయా వృత్తీః ప్రతి కర్తృత్వమీదృశమేవాభ్యుపేయం, చైతన్యసామాన్యాధికరణ్యేన జ్ఞాతృత్వోపలబ్ధేః । నహి ప్రాధానికాన్యన్తర్బహిఃకరణాని త్రయోదశ సత్త్వగుణప్రధానాన్యపి స్వయమేవాచేతనాని, తద్వృత్తయశ్చ స్వం వా పరం వా వేదితుముత్సహన్తే । నో ఖల్వన్ధాః సహస్రమపి పాన్థాః పన్థానం విదన్తి । చక్షుష్మతా చైకేన చేద్వేద్యతే, స ఎవ తర్హి మార్గదర్శీ స్వతన్త్రః కర్తా నేతా తేషామ్ । ఎవం బుద్ధిసత్త్వస్య స్వయమచేతనస్య చితిబిమ్బసఙ్క్రాన్త్యా చేదాపన్నం చైతన్యస్య జ్ఞాతృత్వం, చితిరేవ జ్ఞాత్రీ స్వతన్త్రా, నాన్తర్బహిష్కరణాన్యన్ధసహస్రప్రతిమాన్యస్వతన్త్రాణి । న చాస్యాశ్చితేః కూటస్థనిత్యాయా అస్తి వ్యాపారయోగః । న చ తదయోగేఽప్యజ్ఞాతృత్వం, వ్యాపారవతామపి జడానామజ్ఞత్వాత్ । తస్మాదన్తఃకరణవర్తినం వ్యాపారమారోప్య చితిశక్తౌ కర్తృత్వాభిమానః । అన్తఃకరణే వా చైతన్యమారోప్య తస్య జ్ఞాతృత్వాభిమానః । సర్వథా భవన్మతేఽపి నేదం స్వాభావికం క్వచిదపి జ్ఞాతృత్వం, అపి తు సాంవ్యవహారికమేవేతి పరమార్థః । నిత్యస్యాత్మనో జ్ఞానం పరిణామ ఇతి చ భేదాభేదపక్షమపాకుర్వద్భిరపాస్తమ్ । కూటస్థస్య నిత్యస్యాత్మనోఽవ్యాపారవత ఎవ భిన్నం జ్ఞానం ధర్మ ఇతి చోపరిష్టాదపాకరిష్యతే । తస్మాద్వస్తుతోఽనవచ్ఛిన్నం చైతన్యం తత్త్వాన్యత్వాభ్యామనిర్వచనీయావ్యాకృతవ్యాచికీర్షితనామరూపవిషయావచ్ఛిన్నం సజ్జ్ఞానం కార్యం, తస్య కర్తా ఈశ్వరో జ్ఞాతా సర్వజ్ఞః సర్వశక్తిరితి సిద్ధమ్ । తథా చ శ్రుతిః - “తపసా చీయతే బ్రహ్మ తతోఽన్నమభిజాయతే । అన్నాత్ప్రాణో మనః సత్యం లోకాః కర్మసు చామృతమ్ ॥ యః సర్వజ్ఞః సర్వవిద్యస్య జ్ఞానమయం తపః । తస్మాదేతద్బ్రహ్మ నామ రూపమన్నం చ జాయతే ॥”(ము.ఉ. ౧.౧.౮) ఇతి । తపసా జ్ఞానేన అవ్యాకృతనామరూపవిషయేణ చీయతే తద్వ్యాచికీర్షవద్భవతి, యథా కువిన్దాదిరవ్యాకృతం పటాది బుద్ధావాలిఖ్య చికీర్షతి । ఎకధర్మవాన్ ద్వితీయధర్మోపజననేన ఉపచిత ఉచ్యతే । వ్యాచికీర్షాయాం చోపచయే సతి తతో నామరూపమన్నమదనీయం సాధారణం సంసారిణాం వ్యాచికీర్షితమభిజాయతే । తస్మాదవ్యాకృతాద్వ్యాచికీర్షితాదన్నాత్ప్రాణో హిరణ్యగర్భో బ్రహ్మణో జ్ఞానక్రియాశక్త్యధిష్ఠానం జగత్సూత్రాత్మా సాధారణో జాయతే, యథాఽవ్యాకృతాత్వ్యాచికీర్షితాత్పటాదవాన్తరకార్యం ద్వితన్తుకాది । తస్మాచ్చ ప్రాణాన్మన అఖ్యం సఙ్కల్పవికల్పాదివ్యాకరణాత్మకం జాయతే । తతో వ్యాకరణాత్మకాన్మనసః సత్యశబ్దవాచ్యాన్యాకాశాదీని జాయన్తే । తేభ్యశ్చ సత్యాఖ్యేభ్యోఽనుక్రమేణ లోకా భూరాదయః తేషు మనుష్యాదిప్రాణినో వర్ణాశ్రమక్రమేణ కర్మాణి ధర్మాధర్మరూపాణి జాయన్తే । కర్మసు చామృతం ఫలం స్వర్గనరకాది । తచ్చ స్వనిమిత్తయోర్ధర్మాధర్మయోః సతోర్న వినశ్యతీత్యమృతమ్ । యావద్ధర్మాధర్మభావీతి యావత్ । యః సర్వజ్ఞః సామాన్యతః, సర్వవిద్విశేషతః । యస్య భగవతో జ్ఞానమయం తపో ధర్మో నాయాసమయమ్ , తస్మాద్బ్రహ్మణః పూర్వస్మాదేతత్పరం కార్యం బ్రహ్మ । కిఞ్చ నామరూపమన్నం చ వ్రీహియవాది జాయత ఇతి । తస్మాత్ప్రధానస్య సామ్యావస్థాయామనీక్షితృత్వాత్ , క్షేత్రజ్ఞానాం చ సత్యపి చైతన్యే సర్గాదౌ విషయానీక్షణాత్ , ముఖ్యసమ్భవే చోపచారస్యాన్యాయ్యత్వాత్ , ముముక్షోశ్చాయథార్థోపదేశానుపపత్తేః, ముక్తివిరోధిత్వాత్ , తేజఃప్రభృతీనాం చ ముఖ్యాసమ్భవేనోపచారాశ్రయణస్య యుక్తిసిద్ధత్వాత్ , సంశయే చ తత్ప్రాయపాఠస్య నిశ్చాయకత్వాత్ , ఇహ తు ముఖ్యస్యౌత్సర్గికత్వేన నిశ్చయే సతి సంశయాభావాత్ , అన్యథా కిరాతశతసఙ్కీర్ణదేశనివాసినో బ్రాహ్మణాయనస్యాపి కిరాతత్వాపత్తేః, బ్రహ్మైవేక్షిత్రనాద్యనిర్వాచ్యావిద్యాసచివం జగదుపాదానం, శుక్తిరివ సమారోపితస్య రజతస్య, మరీచయ ఇవ జలస్య, ఎకశ్చన్ద్రమా ఇవ ద్వతీయస్య చద్రమసః । న త్వచేతనం ప్రధానపరమాణ్వాది । అశబ్దం హి తత్ । న చ ప్రధానం పరమాణవో వా తదతిరిక్తసర్వజ్ఞేశ్వరాధిష్ఠితా జగదుపాదానమితి సామ్ప్రతం కార్యత్వాత్ । కారణాత్కార్యాణాం భేదాభావాత్ కారణజ్ఞానేన సమస్తకార్యపరిజ్ఞానస్య మృదాదినిదర్శనేనాగమేన ప్రసాధితత్వాత్ , భేదే చ తదనుపపత్తేః । సాక్షాచ్చ “ఎకమేవాద్వితీయమ్” (ఛా. ఉ. ౬ । ౨ । ౧) “నేహ నానాస్తి కిఞ్చన” (బృ. ఉ. ౪ । ౪ । ౧౯) “మృత్యోః స మృత్యుమాప్నోతి” (క. ఉ. ౨ । ౪ । ౧౦) ఇత్యాదిభిర్బహుభిర్వచోభిర్బ్రహ్మాతిరిక్తస్య ప్రపఞ్చస్య ప్రతిషేధాచేతనోపాదానమేవ జగత్ , భుజఙ్గ ఇవారోపితో రజ్జూపాదాన ఇతి సిద్ధాన్తః ।

సదుపాదానత్వే హి సిద్ధే జగతస్తదుపాదానం చేతనమచేతనం వేతి సంశయ్య మీమాంస్యేత । అద్యాపి తు సదుపాదానత్వమసిద్ధమిత్యత ఆహ -

తత్రేదంశబ్దవాచ్యమిత్యాదిదర్శయతిఇత్యన్తేన ।

తథాపీక్షితా పారమార్థికప్రధానక్షేత్రజ్ఞాతిరిక్త ఈశ్వరో భవిష్యతి, యథాహుర్హైరణ్యగర్భా ఇత్యతః శ్రుతిః పఠితా “ఎకమేవాద్వితీయమ్” (ఛా. ఉ. ౬ । ౨ । ౧) ఇతి । “బహు స్యామ్”(ఛా. ఉ. ౬ । ౨ । ౩) ఇతి చాచేతనం కారణమాత్మన ఎవ బహుభావమాహ । తేనాపి కారణాచ్చేతనాదభిన్నం కార్యమభ్యుపగమ్యతే ।

యద్యప్యాకాశాద్యా భూతసృష్టిస్తథాపి తేజోఽబన్నానామేవ త్రివృత్కరణస్య వివక్షితత్వాత్తత్ర తేజసః ప్రాథమ్యాత్తేజః ప్రథమముక్తమ్ । ఎకమద్వితీయం జగదుపాదానమిత్యత్ర శ్రుత్యన్తరమపి పఠతి -

తథాన్యత్రేతి ।

బ్రహ్మ చతుష్పాదష్టాశఫం షోడశకలశమ్ । తద్యథా - ప్రాచీ ప్రతీచీ దక్షిణోదీచీతి చతస్రః కలా బ్రహ్మణః ప్రకాశవాన్నామ ప్రథమః పాదః । తదర్ధం శఫః । తథా పృథివ్యన్తరిక్షం ద్యౌః సముద్ర ఇత్యపరశ్చతస్రః కలా ద్వితీయః పాదోఽనన్తవాన్నామ । తథాగ్నిః సూర్యశ్చన్ద్రమా విద్యుదితి చతస్రః కలాః, స జ్యోతిష్మాన్నామ తృతీయః పాదః । ప్రాణశ్చక్షుః శ్రోత్రం వాగితి చతస్రః కాలాః, స చతుర్థమాయతనవాన్నామ బ్రహ్మణః పాదః । తదేవం షోడశకలం షోడశావయవం బ్రహ్మోపాస్యమితి సిద్ధమ్ ।

స్యాదేతత్ । ఈక్షతేరితి తిపా ధాతుస్వరూపముచ్యతే । న చావివక్షితార్థస్య ధాతుస్వరూపస్య చేతనోపాదానసాధనత్వసమ్భవ ఇత్యత ఆహ -

ఈక్షతేరితి

ధాత్వర్థనిర్దేశోఽభిమతః, విషయిణాం విషయలక్షణాత్ ।

ప్రసిద్ధా చేయం లక్షణేత్యాహ -

యజతేరితివదితి ।

‘యః సర్వజ్ఞః’ ఇతి సామాన్యతః; ‘సర్వవిత్’ ఇతి విశేషతః ।

సాఙ్ఖ్యీయం స్వమతసమాధానముపన్యస్య దూషయతి -

యత్తూక్తం సత్త్వధర్మేణేతి ।

పునః సాఙ్ఖ్యముత్థాపయతి -

ననూక్తమితి ।

పరిహరతి -

తదపీతి ।

సముదాచరద్వృత్తి తావన్న భవతి సత్త్వం, గుణవైషమ్యప్రసఙ్గేన సామ్యానుపపత్తేః । న చావ్యక్తేన రూపేణ జ్ఞానముపయుజ్యతే, రజస్తమసోస్తత్ప్రతిబన్ధస్యాపి సూక్ష్మేణ రూపేణ సద్భావాదిత్యర్థః ।

అపి చ చైతన్యప్రధానవృత్తివచనో జానాతిర్న చాచేతనే వృత్తిమాత్రే దృష్టచరప్రయోగ ఇత్యాహ -

అపి చ నాసాక్షికేతి ।

కథం తర్హి యోగినాం సత్త్వాంశోత్కర్షహేతుకం సర్వజ్ఞత్వమిత్యత ఆహ -

యోగినాం త్వితి ।

సత్త్వాంశోత్కర్షో హి యోగినాం చైతన్యచక్షుష్మతాముపకరోతి, నాన్ధస్య ప్రధానస్యేత్యర్థః ।

యది తు కాపిలమతమపహాయ హైరణ్యగర్భమాస్థీయేత తత్రాప్యాహ -

అథ పునః సాక్షినిమిత్తమితి ।

తేషామపి హి ప్రకృష్టసత్త్వోపాదానం పురుషవిశేషస్యైవ క్లేశకర్మవిపాకాశయాపరామృష్టస్య సర్వజ్ఞత్వం, న తు ప్రధానస్యాచేతనస్య । తదపి చాద్వైతశ్రుతిభిరపాస్తమితి భావః ।

పూర్వపక్షబీజమనుభాషతే -

యత్పునరుక్తం బ్రహ్మణోఽపీతి ।

చైతన్యస్య శుద్ధస్య నిత్యత్వేఽప్యుపహితం సదనిత్యం కార్యం, ఆకాశమివ ఘటావచ్ఛిన్నమిత్యభిసన్ధాయ పరిహరతి -

ఇదం తావద్భవానితి ।

ప్రతతౌష్ణ్యప్రకాశే సవితరి

ఇత్యేతదపి విషయావచ్ఛిన్నప్రకాశః కార్యమిత్యేతదభిప్రాయమ్ ।

వైషమ్యం చోదయతి -

నను సవితురితి ।

కిం వాస్తవం కర్మాభావమభిప్రేత్య వైషమ్యమాహ భవాన్ ఉత తద్వివక్షాభావమ్ । తత్ర యది తద్వివక్షాభావం, తదా ప్రకాశయతీత్యనేన మా భూత్సామ్యం, ప్రకాశత ఇత్యనేన త్వస్తి । నహ్యత్ర కర్మ వివక్షితమ్ ।

అథ చ ప్రకాశస్వభావం ప్రత్యస్తి స్వాతన్త్ర్యం సవితురితి పరిహరతి -

న ।

అసత్యపి కర్మణీతి ।

అసత్యపీత్యవివక్షితేఽపీత్యర్థః ।

అథ వాస్తవం కర్మాభావమభిసన్ధాయ వైషమ్యముచ్యేత, తన్న, అసిద్ధత్వాత్కర్మాభావస్య, వివిక్షితత్వాచ్చాత్ర కర్మణ ఇతి పరిహరతి -

కర్మాపేక్షాయాం త్వితి ।

యాసాం సతి కర్మణ్యవివక్షితే శ్రుతీనాముపపత్తిస్తాసాం సతి కర్మణి వివక్షితే సుతరామిత్యర్థః ।

యత్ప్రసాదాదితి ।

యస్య భగవత ఈశ్వరస్య ప్రసాదాత్ తస్య నిత్యసిద్ధస్యేశ్వరస్య నిత్యం జ్ఞానం భవతీతి కిము వక్తవ్యమితి యోజనా । యథాహుర్యోగశాస్త్రకారాః - “తతః ప్రత్యక్చేతనాధిగమోఽప్యన్తరాయాభావశ్చ”(యో.సూ. ౧.౨౯) ఇతి । తద్భాష్యకారాశ్చ ‘భక్తివిశేషాదావర్జిత ఈశ్వరస్తమనుగృహ్ణాతి జ్ఞానవైరాగ్యాదినా’ ఇతి ।

సవితృప్రకాశవదితి ।

వస్తుతో నిత్యస్య కారణానపేక్షాం స్వరూపేణోక్త్వా వ్యతిరేకముఖేనాప్యాహ -

అపి చావిద్యాదిమత ఇత్యాది ।

ఆదిగ్రహణేన కామకర్మాదయః సఙ్గృహ్యన్తే ।

న జ్ఞానప్రతిబన్ధకారణరహితస్యేతి ।

సంసారిణాం వస్తుతో నిత్యజ్ఞానత్వేఽప్యవిద్యాదయః ప్రతిబన్ధకారణాని సన్తి, న తు ఈశ్వరస్యావిద్యారహితస్య జ్ఞానప్రతిబన్ధకారణసమ్భవ ఇతి భావః । న తస్య కార్యమావరణాద్యపగమో విద్యతే, అనావృత్తత్వాదితి భావః । జ్ఞానబలేన క్రియా । ప్రధానస్య త్వచేతనస్య జ్ఞానబలాభావాజ్జగతో న క్రియేత్యర్థః । అపాణిర్గృహీతా, అపాదో జవనో వేగవాన్ విహరణవాన్ । అతిరోహితార్థమన్యత్ ।

స్యాదేతేత్ । అనాత్మని వ్యోమ్ని ఘటాద్యుపాధికృతో భవత్వవచ్ఛేదకవిభ్రమః, న తు ఆత్మని స్వభావసిద్ధప్రకాశే స ఘటత ఇత్యత ఆహ -

దృశ్యతే చాత్మన ఎవ సత ఇతి ।

అభినివేశః

మిథ్యాభిమానః ।

మిథ్యాబుద్ధిమాత్రేణ పూర్వేణేతి ।

అనేనానాదితా దర్శితా । మాత్రగ్రహణేన విచారాసహత్వేన నిర్వచనీయతా నిరస్తా । పరిశిష్టం నిగదవ్యాఖ్యాతమ్ ॥ ౫ ॥ ॥ ౬ ॥

తన్నిష్ఠస్య మోక్షోపదేశాదితి ।

శఙ్కోత్తరత్వేన వా స్వాతన్త్ర్యేణ వా ప్రధాననిరాకరణార్థం సూత్రమ్ । శఙ్కా చ భాష్యే ఉక్తా ॥ ౭ ॥

స్యాదేతత్ । బ్రహ్మైవ జ్ఞీప్సితం, తచ్చ న ప్రథమం సూక్ష్మతయా శక్యం శ్వేతకేతుం గ్రాహయితుమితి తత్సమ్బద్ధం ప్రధానమేవ స్థూలతయాత్మత్వేన గ్రాహ్యతే శ్వేతకేతురరున్ధతీమివాతీవ సూక్ష్మాం దర్శయితుం తత్సంనిహితాం స్థూలతారకాం దర్శయతీయమసావరున్ధతీతి । అస్యాం శఙ్కాయాముత్తరమ్ -

హేయత్వావచనాచ్చ

ఇతి సూత్రమ్ । చకారోఽనుక్తసముచ్చయార్థః । తచ్చానుక్తం భాష్య ఉక్తమ్ ॥ ౮ ॥

అపి చ జగత్కారణం ప్రకృత్య స్వపితీత్యస్య నిరుక్తం కుర్వతీ శ్రుతిశ్చేతనమేవ జగత్కారణం బ్రూతే । యది స్వశబ్ద ఆత్మవచనస్తథాపి చేతనస్య పురుషస్యాచేతనప్రధానత్వానుపపత్తిః । అథాత్మీయవచనస్థథాప్యచేతనే పురుషార్థతయాత్మీయేఽపి చేతనస్య ప్రలయానుపపత్తిః । నహి మృదాత్మా ఘట ఆత్మీయేఽపి పాథసి ప్రలీయతేఽపి త్వాత్మభూతాయాం మృద్యేవ । నచ రజతమనాత్మభూతే హస్తిని ప్రలీయతే, కిన్త్వాత్మభూతాయాం శుక్తావేవేత్యాహ -

స్వాప్యయాత్ ॥ ౯ ॥

గతిసామాన్యాత్ ।

గతిరవగతిః ।

తార్కికసమయ ఇవేతి ।

యథా హి తార్కికాణాం సమయభేదేషు పరస్పరపరాహతార్థతా, నైవం వేదాన్తేషు పరస్పరపరాహృతిః, అపి తు తేషు సర్వత్ర జగత్కారణచైతన్యావగతిః సమానేతి ।

చక్షురాదీనామివ రూపాదిష్వితి ।

యథా హి సర్వేషాం చక్షూ రూపమేవ గ్రాహయతి, న పునా రసాదికం కస్యచిద్దర్శయతి కస్యచిద్రూపమ్ । ఎవం రసనాదిష్వపి గతిసామాన్యం దర్శనీయమ్ ॥ ౧౦ ॥

శ్రుతత్వాచ్చ ।

'తదైక్షత” ఇత్యత్ర ఈక్షణమాత్రం జగత్కారణస్య శ్రుతం న తు సర్వవిషయమ్ । జగత్కారణసమ్బన్ధితయా తు తదర్థాత్సర్వవిషయమవగతం, శ్వేతాశ్వతరాణాం తూపనిషది సర్వజ్ఞ ఈశ్వరో జగత్కారణమితి సాక్షాదుక్తమితి విశేషః ।

కార్యాన్వయమితి ; తచ్చేతి ; జ్ఞానక్రియాశక్త్యభావాద్బ్రహ్మణోఽపరిణామినః ; జ్ఞానక్రియాశక్త్యభావాద్బ్రహ్మణోఽపరిణామినఃఅపరిణామిన ఇతి ; తస్యాపరిణామిత్వాదేకత్వాచ్చఎకత్వాచ్చేతి ; స్వరూపేతి ; న చ స్వరూపేతి ; కార్యత్వే చేతి ; భోగేతి ; తదైక్షతేత్యాదినా ; యథాగ్నేత్యాది ; ప్రధానాంశేతి ; సర్వజ్ఞం ప్రస్తుత్యేతి ; అపికారావితి ; యత్ఖల్వితి ; ఇదమేవేతి ; నామరూపేతి ; పౌర్వాపర్యేతి ; నన్వితి ; యద్యపి చేతి ; పరైరపీతి ; చైతన్యసామానాధికరణ్యేనేతి ; న హీతి ; నిత్యస్యేతి ; కూటస్థేతి ; తథా చేతి ; వ్యాచికీర్షాయాం  చేతి ; సాధారణమితి ; యథేతి ; తస్మాచ్చేతి ; మనఆఖ్యమితి ; ఆకాశాదీనీతి ; తేష్వితి ; పూర్వస్మాదితి ; ఎతదితి ; ముముక్షోశ్చేతి ; సంశయే చేతి ; ఇహత్వితి ; నచేతి ; సదితి ; తథాపీక్షితేతి ; పారమార్థికేతి ; తేనాపీతి ; యద్యపీతి ; ఎకమితి ; బ్రహ్మ చతుష్పాదితి ; ప్రసిద్ధేతి ; తదపి చేతి ; ఎతదపీతి ; తదా ప్రకాశయతీత్యనేనేతి ; ప్రకాశతే ఇత్యనేనేతి ; నహ్యత్రేతి ; అథేతి ; వివక్షితత్వాచ్చేతి ; యస్యేతి ; వస్తుతో నిత్యస్యేతి ; కారణానపేక్షామితి ; స్వరూపేణేతి ; ఆవరణాదీతి ; ప్రధానస్య త్వితి ; పూర్వేణేతి ; మాత్రేతి ౫ ౬ ; గౌణశ్చేదితి ; శఙ్కోత్తరత్వేనేత్యాదినా॥ ; అర్థవాదప్రకల్పితేనేతి ; కథం న్వితి ; యథా సోమ్యేతి ;

పరమా పరమానన్దబోధసల్లక్షణాఞ్చితమ్ । యమాశ్లిష్యతి సర్వజ్ఞం తం వన్దే పురుషోత్తమమ్॥

కార్యాన్వయమితి ।

శ్లోకపూరణార్థ ఎవంకారః । స్వయం పురుషార్థే ఇతి సంబన్ధః ।

యది సర్వజ్ఞే వేదాన్తప్రామాణ్యం సిద్ధం, కిమధికరణాన్తరేణ? అత ఆహ —

తచ్చేతి ।

సర్వజ్ఞే జగత్కారణే సమన్వయప్రదర్శనేన చేతనం తదిత్యుపక్షిప్తమ్ । తదాక్షిప్య సమర్థ్యత ఇతి సఙ్గతిః । ప్రయోజనం తు ‘తత్త్వమసీతి’ తచ్ఛబ్దవాచ్యప్రధానైక్యసంపత్తిః పూర్వపక్షే । సిద్ధాన్తే తు చేతనస్య బ్రహ్మైక్యమితి । జీవాణువ్యతిరిక్తేతి  కారణస్య జీవవ్యతిరేకేణ జీవా ఎవ స్వకర్మద్వారా కర్తార ఇతి మతం నిరస్తమ్ । అణువ్యతిరేకేణాణుసఙ్ఘాతవాదః । చేతనగ్రహణేన ప్రధానవాదః । పరమాణవ ఇతి సిద్ధాన్తాద్భేద ఇతి॥ ఆదిగ్రహణేనేతి । సాంఖ్యాదయ ఇతి  భాష్యే ఇతి । అనుమానవాక్యేతి । సిద్ధాన్తే అనుమానాని వాక్యాని చ బీజమ్, అన్యత్ర తు తదాభాసా ఇతి ।

జ్ఞానక్రియాశక్త్యభావాద్బ్రహ్మణోఽపరిణామినః ।

సర్వజననశక్తిసర్వవిషయజ్ఞానే బ్రహ్మణో న స్తః కుతః? తస్య జ్ఞానక్రియాశక్త్యభావాత్, జ్ఞానక్రియయోః శక్తీ జ్ఞానక్రియాశక్తీ తయోరభావాదిత్యర్థః ।

యస్య హి కించిన్మాత్రజననశక్తిః కించిన్మాత్రజ్ఞానశక్తిర్వా న సంభవతి, కుతస్తస్య సర్వవిషయజననశక్తిః సర్వవిషయజ్ఞానం చ భవేతామ్? శక్తిద్వయాభావే హేతుమాహ —

జ్ఞానక్రియాశక్త్యభావాద్బ్రహ్మణోఽపరిణామినఃఅపరిణామిన ఇతి ।

కార్యోన్నేయే హి శక్తీ, కార్యే చ జ్ఞానక్రియే నాస్య స్తోఽపరిణామిత్వాదిత్యర్థః । ప్రధానే తు పరిణామిత్వాదస్తి సంభవ ఇత్యర్థః ।

నన్వపరిణామిన్యపి జ్ఞానగుణః ప్రయత్నగుణశ్చ కిం న స్యాతామత ఆహ —

తస్యాపరిణామిత్వాదేకత్వాచ్చఎకత్వాచ్చేతి ।

ఎకరూపత్వాన్నిర్గుణత్వాదిత్యర్థః । అథవాఽపరిణామిత్వం సాధయతి నిరవయవత్వాదితి  యావత్ ।

నను చేతనత్వాదపరిణామ్యపి సర్వజ్ఞమత ఆహ —

స్వరూపేతి ।

అవృత్తికం సర్వవిషయపరిణామరహితమ్ ।

నన్వావృతజ్ఞానా జీవాః, బ్రహ్మ తు అనావృతం కిం న సర్వజ్ఞమత ఆహ —

న చ స్వరూపేతి ।

జ్ఞానకర్తృత్వం హి జ్ఞాతృత్వమిత్యర్థః ।

అఙ్గీకృత్యాపి స్వరూపస్య కార్యతామాహ —

కార్యత్వే చేతి ।

స్యాదేతత్ — కథమచేతనం చేతనానధిష్ఠితం ప్రవర్తేతాత ఆహ —

భోగేతి ।

పురుషార్థేన ప్రయుక్త ఆక్షిప్తశ్చాసావనాదిః ప్రధానపురుషసంయోగః ప్రధానస్య పురుషం ప్రతి పారార్థ్యలక్షణః సంబన్ధస్తన్నిమిత్తః సర్గ ఇతి॥

గౌణశ్చేత్ (బ్ర.అ.౧.పా.౧.సూ.౬) ఇత్యాదిసూత్రనిరస్యాః శఙ్కాః సౌకర్యార్థమేకత్రలిఖతి —

తదైక్షతేత్యాదినా ।

వృద్ధాః శబరస్వామినః ।

యజ్ఞపురుషస్య ‘‘శిరో హ వా ఆగ్నేయో హృదయముపాంశుయాజ’’ ఇతి ప్రధానాగ్నేయప్రాయవచనాత్ ప్రధానకర్మోపాంశుయాజ ఇత్యుక్త్వా లోకేఽప్యుదాహరతి —

యథాగ్నేత్యాది ।

అగ్నయః శ్రేష్ఠః ।

కథం నిత్యస్య జీవస్య ప్రధానే లయోఽత ఆహ —

ప్రధానాంశేతి ।

ప్రధానస్యాంశస్తమోగుణస్తస్యోద్రేకే జీవో నిద్రాం కుర్వంస్తత్ర మగ్న ఇవ భవత్యతశ్చ వివేకాభావాల్లయోపచారః । ప్రమాణవిపర్యయవికల్పనిద్రాస్మృతయః (పాతం.యో.అ.౧.పా.౧.సూ.౬) ఇతి సూత్రోక్తా నిద్రాతోఽన్యా వృత్తయోఽభావం ప్రత్యయన్తే ప్రతిగచ్ఛన్త్యస్మిన్నిత్యభావప్రత్యయస్తదాలమ్బనా జీవస్య యా వృత్తిః సా నిద్రేతి పాతఞ్జలసూత్రార్థః ।

సర్వజ్ఞం ప్రస్తుత్యేతి ।

‘జ్ఞః కాలకాలో గుణీ సర్వవిద్య ‘ ఇతి ప్రధానకారణపక్షేఽపి యోజయితుం శక్యత ఇతి ।

సర్వశక్తిత్వం తావత్ప్రధానస్యాప్యుపపద్యతే ఇతి చ భాష్యేఽపికారదర్శనాదనవధారణేనాత్ర పూర్వపక్ష ఇతి కేచిద్వ్యాచక్షతే, తద్వ్యావర్తయతి —

అపికారావితి ।

ఇహ హి ‘గౌణశ్చే’దితీక్షణే గౌణత్వశఙ్కా ముఖ్యేక్షణవతో బ్రహ్మణః కారణత్వాసంభవనిశ్చయవత ఎవ । తథాచ నానవధారణమ్ । తత్పరతయైవ వేదాన్తవాక్యాని యోజయతీతి చ భాష్యం విపర్యయేణ పూర్వపక్షం ద్యోతయతి । యదా యోగైశ్వర్యాత్ సత్త్వం నిరతిశయోత్కర్షం భవతి, తదా తత్సర్వజ్ఞత్వే బీజం భవతీతి సూత్రార్థః ।

నిరతిశయతాం సత్త్వస్య తత్కార్యజ్ఞానస్య నిరతిశయత్వసాధనేనోపపాదయతి —

యత్ఖల్వితి ।

కువలం బదరమ్ । జ్ఞానత్వం, నిరతిశయకించిదాశ్రితం, సాతిశయవృత్తిజాతిత్వాత్, పరిమాణత్వవదితి సముదాయార్థః ।

నిరతిశయత్వే కథం సర్వవిషయతా? న హి నభః పరిమాణం సర్వవిషయమత ఆహ —

ఇదమేవేతి ।

జ్ఞేయభూమ్నా హి జ్ఞానభూమా, తతో నిరతిశయత్వం , సర్వవిషయత్వమానయతీత్యర్థః । అపిభ్యామ్ ఎవకారార్థత్వేన వ్యాఖ్యాతాభ్యామ్ । సింహావలోకితేనేతి పునరుక్తిపరిహారః । చకారో విశేషవాచీ తుశబ్దసమానార్థః॥

నన్వనుమానసిద్ధానువాదిషు వేదాన్తేషు కథమీక్షతిశ్రవణాద్ బ్రహ్మనిర్ణయస్తత్రాహ —

నామరూపేతి ।

ప్రవేదయిష్యతే తర్కపాదే (బ్ర.అ.౨.పా.౨) ।

పౌర్వాపర్యేతి ।

పౌర్వాపర్యముపక్రమోపసంహారౌ । పరామర్శో మధ్యే నిర్దేశః । ఎభిర్యదామ్నాయో ముఖ్యవృత్త్యా వదేత్తదేవ జగద్బీజం, స చామ్నాయశ్చేతనే ముఖ్యో న ప్రధాన ఇతి ।

భవతు బ్రహ్మణి ప్రకృతిర్ముఖ్యా, ప్రత్యయః కథం ముఖ్య ఇతి శఙ్కతే —

నన్వితి ।

అత ఎవ నిత్యజ్ఞానత్వాదేవ ।

యదవాద్యపరిణామిత్వాన్న జ్ఞానం బ్రహ్మణ ఇతి , తత్రాహ —

యద్యపి చేతి ।

ఉపాధ్యపేక్షం జ్ఞాతృత్వం గౌణమిత్యాశఙ్క్య పారమార్థికేక్షితృత్వాసంభవాదిదమేవ ముఖ్యమిత్యాహ —

పరైరపీతి ।

చైతన్యసామానాధికరణ్యేనేతి ।

యత్రాత్మని స్వరూపభూతం చైతన్యం తత్రైవ జ్ఞాతృత్వోపలబ్ధేస్తస్య చ పరిణామానభ్యుపగమాత్పరైరిత్యర్థః ।

నను కిం చితిశక్తేర్జ్ఞాతృత్వేన, ప్రధానవికారా ఎవ జ్ఞాస్యన్తి? నేత్యాహ —

న హీతి ।

భవతు కాపిలే మతేఽలీకం జ్ఞాతృత్వం, భాట్టే తు తాత్త్వికం తదనభ్యుపగచ్ఛతస్తవ గౌణం స్యాదత ఆహ —

నిత్యస్యేతి ।

అస్తు తర్హి న్యాయమతే వాస్తవమత ఆహ —

కూటస్థేతి ।

అవ్యాపారవత ఇతి చ్ఛేదః । ధర్మో గుణః । ఉపరిష్టాత్ ‘జ్ఞోఽత ఎవ’(బ్ర.అ.౨.పా.౩.సూ.౧౮) ఇత్యాదౌ ।

ఔపాధికమీక్షణకర్తృత్వమిత్యత్ర శ్రుతీ దర్శయతి —

తథా చేతి ।

జ్ఞానం సాధనేనోపలక్షితం తద్విషయనామరూపవ్యాచికీర్షావద్భవతి । అయం ధర్మద్వయయోగ ఉపచయః ।

తతోఽన్నమభిజాయత ఇత్యేతద్వ్యాచష్టే —

వ్యాచికీర్షాయాం  చేతి ।

ఉత్పన్నవ్యాచికీర్షయా నామరూపప్రపఞ్చస్య వ్యాప్తిరభిజాయత ఇత్యుక్త్వాఽన్నశబ్దేన నామరూపముచ్యతే, తత్ర నిమిత్తం ప్రసిద్ధాన్నగుణయోగమాహ —

సాధారణమితి ।

అన్నాదితి క్రమార్థా పఞ్చమీ । వ్యాచికీర్షితత్వానన్తరమిత్యర్థః । హిరణ్యగర్భసృష్టిః సూక్ష్మభూతసృష్ఠ్యనన్తరమితి ద్రష్టవ్యమ్ । మణీనామివ సూత్రం జగతో సూత్రం విధారకః సూత్రాత్మా ।

సముదాయే సిసృక్షితే ప్రథమమేకదేశోత్పత్తౌ నిదర్శనమాహ —

యథేతి ।

మన ఇత్యాదావపి పూర్వపూర్వసర్గానన్తరమితి ద్రష్టవ్యమిత్యాహ —

తస్మాచ్చేతి ।

మనఆఖ్యమితి ।

వ్యష్టి మన ఇత్యర్థః । సఙ్కల్పాదివృత్తివ్యక్తీకరణాత్మకం తత్కారణమితి యావత్ ।

సత్యమిత్యస్యార్థమాహ —

ఆకాశాదీనీతి ।

స్థూలానీత్యర్థః । తేషు హి పృథివ్యాదిభూతత్రయమ్ అపరోక్షత్వాత్సత్ వాయ్వాకాశౌ పరోక్షత్వాత్సత్యమితి తత్త్వశబ్దప్రయోగః ।

కర్మసృష్టిం సిద్ధవత్కృత్య శ్రుత్యా కర్మసు చేత్యుక్తం, తామాహ —

తేష్వితి ।

సప్తమీ నిమిత్తార్థా । జ్ఞానమయమ్ ఇత్యౌపాధికమీక్షణముక్తమ్ ।

అన్నాత్ప్రాణ ఇత్యత్ర పఞ్చమ్యాః క్రమార్థత్వస్వీకారాదిహాపి తత్ప్రసఙ్గమాశఙ్క్యాహ —

పూర్వస్మాదితి ।

నియతపూర్వకాలవర్తిత్వం కారణత్వం తచ్ఛబ్దార్థ ఇత్యర్థః ।

నియతపూర్వసతః సర్వజ్ఞాజ్జాయమానస్య హిరణ్యగర్భబ్రహ్మణః పరకాలవర్తిత్వేన కార్యత్వమేతచ్ఛబ్దార్థ ఇత్యాహ —

ఎతదితి ।

నామ దేవదత్త ఇత్యాది । రూపం శుక్లాది ।

ముముక్షోశ్చేతి ।

‘తన్నిష్ఠస్య’ (బ్ర.అ.౧.పా.౧.సూ.౭) ఇతి సూత్రార్థానుకర్షః । అయథాభూతప్రధానాత్మత్వోపదేశశ్చ ముక్తివిరోధీ ।

యదవాది “యత్ప్రాయే శ్రూయత’’ ఇతి, తత్రాహ —

సంశయే చేతి ।

ద్వితీయే స్థితమ్ – ‘విశయే ప్రాయదర్శనాత్’ (జై.అ.౧.పా.౩.సూ.౧౬) । ‘‘వత్సమాలభేత వత్సనికాన్తా హి పశవ’’ ఇత్యత్ర కిమాలభతిర్యజిమత్కర్మాభిధానః, ఉత స్పర్శమాత్రవచన ఇతి సశయే ‘వాయవ్యం శ్వేతమాలభేతే’త్యాదావాలభతిః ప్రాణిద్రవ్యసంయుక్తో యజిమత్కర్మాభిధానో దృష్ట ఇతీహాపి తథాత్వే ప్రాప్తే — రాద్ధాన్తః, వాయవ్యాదౌ ద్రవ్యదేవతాసంబన్ధాద్యాగప్రతీతేర్యజిమత్సంజ్ఞపనాభిధాయ్యాలభతిః, ఇహ తు న, ద్రవ్యదేవతాసంబన్ధాభావాత్, కింతు గోదోహనాదిసంస్కారకర్మసన్నిధౌ శ్రవణాత్ స్పర్శమాత్రసంస్కారకర్మవచన ఇతి॥

ప్రకృతే వైషమ్యామాహ —

ఇహత్వితి ।

బ్రాహ్మణ అయనమాశ్రయో యస్య స్వయం త్వాభాస ఇతి । ఆరోపే సాదృశ్యనియమభఙ్గాయ మరీచ్యుదాహరణమ్ । చేతనభేదారోపే చన్ద్రభేదః ।

పాతఞ్జలాదిమతేఽప్యాహ —

నచేతి ।

తన్మతే కార్యాణామధిష్ఠాతురుపాదానాచ్చ భేదాత్ శ్రుతౌ చ తదభావాదిత్యర్థః ।

చేతనం కారణమితి ప్రతిపాద్యే తత్సత్త్వోక్తిరనర్థికేత్యాశఙ్క్యాహ —

సదితి ।

అధికరణానుక్రమణే ఉక్తోఽర్థో భాష్యారూఢః క్రియతే —

తథాపీక్షితేతి ।

సిద్ధాన్తేఽప్యనిర్వాచ్యా త్రిగుణాస్తి మాయా, తత ఉక్తం —

పారమార్థికేతి ।

తేనాపీతి ।

చేతనకారణేనాత్మన ఎవ బహుభవనకథనేనేత్యర్థః ।

ఆకాశోపక్రమసృష్టిశ్రుత్యా తేజః ప్రాథమ్యశ్రుతేర్వియదధికరణ (బ్ర.అ.౨.పా.౩.సూ.౧) సిద్ధాన్తో నాస్తీతి కృత్వాచిన్తయైవ విరోధమాహ —

యద్యపీతి ।

ఛన్దోగ్యే హి – ‘‘తాసాం త్రివృతం త్రివృతమేకైకామకరోది’’తి తిసృణాం దేవతానాం తేజోబన్నానామేవ త్రివృత్కరణమనన్తరం వక్ష్యతి, న గగనపవనయోః, తత్ర చ తేజః ప్రథమమితి స్వరూపోత్పత్తావపి తదుపచార ఇతి॥ సంప్రదాయాధ్వనా పఞ్చోకరణం యద్యపి స్థితమ్ । తథాపి యుక్తియుక్తత్వాద్వాచస్పతిమతం శుభమ్॥ పృథివ్యబనలాత్మత్వం గగనే పవనే చ చేత్ । రూపవత్త్వమహత్వాభ్యాం చాక్షుషత్వం ప్రసజ్యతే॥ అర్ధభూయస్త్వతః క్షిత్యాద్యవిభావనకల్పనే । వ్యవహారపథా ప్రాప్తా ముధా పఞ్చీకృతిర్భవేత్॥ అనపేక్ష్య ఫలం వేదసిద్ధేత్యేషేష్యతే యది । త్రివృత్కృతిః శ్రుతా పఞ్చీకృతిర్న క్వచన శ్రుతా॥ తస్మాత్సుష్ఠూచ్యతే తేజోఽబన్నానామేవ త్రివృత్కరణస్య వివక్షితత్వాదితి । పఞ్చీకరణమేవమ్ — పఞ్చభూతాని ప్రథమం ప్రత్యేకం ద్విధా విభజ్యన్తే తత ఎకైకమర్ధం చతుర్ధా క్రియతే । తే చ చత్వారో భాగా ఇతరభూతేషు చతుర్షు నిక్షిప్యన్తే । తత్రాకాశస్య స్వార్ధేన భూతాన్తరాగతపాదచతుష్కేణ చ పఞ్చీకరణమ్ । ఎవం భూతాన్తరేషు యోజనా । త్రివృత్కరణే తు త్రీణి భూతాని ద్విధా విదార్య ప్రతిభూతమేకైకమర్ధం ద్విధా ప్రస్ఫోష్ఠ్యేతరభూతద్వయే యోజనమితి ।

అభ్యుచ్చయాయ శ్రుత్యాన్తరోదాహరణమిత్యాహ —

ఎకమితి ।

బ్రహ్మ చతుష్పాదితి ।

క్వచిచ్చ షోడశకలం పురుషం ప్రస్తుత్యేత్యస్య భాష్యస్య వ్యాఖ్యానమ్ । పశోః పాదేషు హి పురతః ఖురౌ పృష్ఠతశ్చ ద్వౌ పార్ష్ణిస్థానీయావవయవౌ దృశ్యేతే । తద్వత్పరమాత్మన్యపి చతుష్పాత్త్వేన షోడశకలత్వేన చ పశురూపకల్పనయోపాసనమ్॥ ఇదముదాహరణమత్ర న సంగచ్ఛతే; ప్రశ్నోపనిషది హి – ‘‘ఇహైవాన్తః శరీరే సోమ్య స పురుషో యస్మిన్నేతాః షోడశ కలాః ప్రభవన్తీతి’’ ప్రస్తుత్య ‘‘స ఈక్షాంచకే కస్మిన్న్వహముత్కాన్తే ఉత్కాన్తో భవిష్యామి కస్మిన్వా ప్రతిష్ఠితే ప్రతిష్ఠాస్యామితి స ప్రాణమసృజత్ప్రాణాచ్ఛ్రద్ధాం స్వం వాయుర్జ్యోతిరాపః పృథివీమిన్ద్రియం మనోఽన్నమన్నాద్ధీర్యం తపో మన్త్రాః కర్మ లోకా లోకేషు నామ చేతి’’ పఠ్యతే ।

ఛాన్దోగ్యే తు —

దిగాద్యవయవః షోడశకల ఉపాస్యో, న చ తత్ర స ఈక్షాంచకే ఇతి శ్రవణమస్తి । తస్మాద్ న్యాయనిష్ఠం శాస్త్రమితి ద్యోతయితుమనుదాహరణమప్యుదాహృతమ్ । అథవా — ఎవం కథం చిత్సమర్థనీయమ్ । పరబ్రహ్మప్రమిత్యర్థాం సృష్టిమాశ్రిత్య శాసతి । ఉపాసనాని వేదాన్తాస్తత ఎతదుదాహృతమ్॥ యా హి కలాః ప్రశ్నే పరమాత్మప్రమితిప్రయోజనాస్తత ఉత్పాన్నా ఇత్యుక్తాస్తభిర్విశిష్టః ఛాన్దోగ్యే స ఎవోపాస్య ఉక్తః । తత్ర యద్యపి శ్రద్ధాదయశ్ఛాన్దోగ్యే న పఠితాః నాపి దిగాదయః ప్రశ్నే, న చ గుణॊపసంహారః, సగుణనిర్గుణత్వేన విద్యాభేదాదుపసంహారే చాధికసంఖ్యాపత్తౌ షోడశకలత్వభఙ్గాత్; తథాపి పృథివీన్ద్రియమనః ప్రాణాదయః కియన్తః సమా ఉభయత్రాపి, దిగాదయస్తు లోకేష్వన్తర్భవన్తి, న చ యావత్సృష్టావుక్తం తావత్సర్వముపాస్తావుపసంహ్రియతే; యేన సంఖ్యాతిరిచ్యతే, ఉపయోగి తు । తస్మాత్ప్రశ్నచ్ఛాన్దోగ్యయోరేకత్వాత్ షోడశకలస్య శక్యతే వక్తుం దిగాద్యవయవం షోడశకలం ప్రస్తుత్య స ఈక్షాంచక్రే ఇతి శ్రూయత ఇతి । ఎవంచ నిర్గుణప్రకరణే కలాశబ్దప్రయోగోఽన్యత్రోపాస్యత్వాభిప్రాయః సన్ సోపయోగ ఇతి । కలాః షోడశ భూతాని ప్రాణోఽక్షం నామ కర్మ చ । శ్రద్ధా లోకాస్తపో మనో వీర్యం శరీరకమ్॥

ప్రసిద్ధేతి ।

లక్షణాయా ఎవ నిరుఢత్వార్థం ప్రయోగానుగమో న వాచకత్వాయేత్యర్థః । సప్తమే స్థితమ్ — ఇతికర్తవ్యతావిధేర్యజతేః పూర్వవత్త్వమ్ (జై.అ.౭.పా.౪.సూ.౧) సౌర్యాదిష్వనామ్నానాదనితికర్తవ్యతాకత్వే ప్రాప్తే — ఉచ్యతే; తథా లోకే శాకాదిషు సిద్ధేషు వదత్యోదనం పచేతి, తథేహ సిద్ధవత్కృత్య సామాన్యేనేతికర్తవ్యతాం కరణం విహితమ్ । తస్యాశ్చ వికృతిష్వవిధేః సౌర్యాదీనాం వికృతియాగానాం దర్శాదిప్రకృతివిహితపూర్వేతికర్తవ్యతావత్త్వమితి । । సముదాచరణం వ్యక్తిః । తేషామపి హైరణ్యగర్భాణాం మతే క్లేశైరవిద్యాఽస్మితారాగద్వేషాభినివేశధర్మాధర్మకర్మణాం విపాకేన తత్ఫలేన ఆశయేన ఫలభోగవాసనయా అస్పృష్టస్య పురుషస్యైవ ప్రకృష్టసత్త్వోపాదానం సర్వజ్ఞత్వం, నాచేతనస్యేత్యర్థః ।

నచైతదపిభేదమతం శ్రద్ధేయమిత్యాహ —

తదపి చేతి ।

ఇదం తావదిత్యాదిదోషోఽస్తీత్యన్తం భాష్యం బ్రహ్మణి ప్రకృత్యర్థస్యేక్షణస్యాఞ్జస్యప్రదర్శనపరమ్ ।

జ్ఞాననిత్యత్వ ఇత్యాదినా ప్రత్యయార్థానుపపత్తిమాశఙ్క్య పరిహ్రియతే, తదభిప్రాయమాహ —

ఎతదపీతి ।

అనుపహితనిత్యచైతన్యే కర్తృత్వాభావాదిత్యర్థః । సవితృప్రకాశ్యస్య రూపాదేర్భావాదసత్యపీతి భాష్యాయోగమాశఙ్క్య వికల్పముఖేనావతారయతి కిమితి । సవితరి కర్మాస్తి, ఇహ తు నేతి వస్తుత ఎవ కర్మాభావ ఉదాహరణాద్వైషమ్యమభిమతమ్, ఉత దృష్టాన్తే కర్మ విద్యతే వివక్షితం చ, దార్ష్టాన్తికే తు యద్యపి విద్యతే, తథాప్యవివక్షితం; తవ మతేఽధ్యస్తత్వాదృశ్యస్యేతి మతమ్ । తత్ర ద్వితీయే వికల్పే కిం సవితా ప్రకాశయతీత్యస్మాదైక్షతేత్యస్య దార్ష్టాన్తికస్య వైషమ్యముత ప్రకాశత ఇత్యస్మాత్ ।

ఆద్యమభ్యుపగమేన పరిహరతి —

తదా ప్రకాశయతీత్యనేనేతి ।

న ద్వితీయ ఇత్యాహ —

ప్రకాశతే ఇత్యనేనేతి ।

నహ్యత్రేతి ।

అకర్మకత్వాత్ప్రకాశతేరిత్యర్థః । ఎవంచ సత్యైక్షతేత్యేతదపీక్షణం కరోతీత్యేవంపరం, నత్వాలోచయతీత్యేవమర్థమితి । ప్రకాశత ఇతి కర్తృత్వవ్యపదేశదర్శనాదిత్యయమేవ భాష్యపాఠః సాధుర్న ణిజన్తః ।

ఆద్యవికల్పయోర్మధ్యే ప్రథమం ప్రత్యాహ —

అథేతి ।

ఐక్షతేత్యత్ర కర్మావివక్షాముపేత్య ప్రకాశత ఇతివత్కర్తృత్వనిర్దేశ ఉపపాదితః, ఇదానీమవివక్షాప్యసిద్ధేత్యాహ —

వివక్షితత్వాచ్చేతి ।

న ఖల్వస్మాకం క్వచిద్వాస్తవం దృశ్యమస్త్యతోఽప్యస్తతయైవ కర్మత్వస్య వివక్షేత్యర్థః ।

యా తు ప్రధానస్య సర్వజ్ఞత్వే సాక్షిణీ సత్త్వోత్కర్షే యోగిసార్వజ్ఞప్రసిద్ధిరుక్తా, సా సమా బ్రహ్మణ్యపి; చేతనేశ్వరప్రసాదాయత్తయోగిసర్వజ్ఞత్వస్య పాతఞ్జలతన్త్రే ప్రసిద్ధత్వాద్, ఇత్యేవమర్థ యత్ప్రసాదాదిత్యాదిభాష్యం, తద్వ్యాచష్టే —

యస్యేతి ।

తత ఈశ్వరప్రణిధానాత్ప్రత్యగాత్మాధిగమోఽన్తరాయస్య రాగాదేరప్యభావ ఇతి సూత్రార్థః ।

వస్తుతో నిత్యస్యేతి ।

ఔపాధికత్వేనానిత్యత్వస్యోక్తత్వాదితి ।

కారణానపేక్షామితి ।

కర్మమాత్రముపాధిమీక్షణమపేక్షతే, న శరీరాదీతిభావః ।

స్వరూపేణేతి ।

అన్వయేనేత్యర్థః ।

జ్ఞానాభివ్యక్తయే కర్తవ్యం నాస్తీత్యాహ —

ఆవరణాదీతి ।

జ్ఞానమేవ బలం సామర్థ్యముపాధ్యవచ్ఛిన్నఫలోత్పత్తౌ, తేన బలేన ఫలభూతానుభవస్య కరణం క్రియా, సా చ న ప్రధానస్యేత్యాహ —

ప్రధానస్య త్వితి ।

అభినివేశస్యైవ మిథ్యాబుద్ధిత్వాత్కథం తస్యైవ తం ప్రతి హేతుత్వమత ఆహ —

పూర్వేణేతి ।

నను లయలక్షణాఽవిద్యోపాదానమస్తి కథం మాత్రశబ్దోఽత ఆహ —

మాత్రేతి ।౫ ।౬ ।

గౌణశ్చేదితి ।

(బ్ర.అ.౧.పా.౧సూ.౬) సూత్రసంబన్ధిభాష్యమనుక్రమణికాయాం వ్యాఖ్యాతమిత్యుపరితనభాష్యం వ్యాచష్టే —

శఙ్కోత్తరత్వేనేత్యాదినా॥

యః సదాఖ్యః । ఎషోఽణిమాఽణోర్భావః । భావభవిత్రోరభేదాదణుః॥ ఎతస్యాత్మనో భావ ఐతదాత్మ్యమ్ । అయమపి ప్రయోగో భవితృపరః । ఎతదాత్మకం జగత్॥ సత్యేన తప్తపరశుం గృహ్వతో మోక్షవత్సత్యబ్రహ్మజ్ఞస్య మోక్ష ఉక్తః ‘తప్తం పరశుం గృహ్ణాతీ’త్యత్ర॥ ఉక్థం ప్రాణః ।

అర్థవాదప్రకల్పితేనేతి ।

‘ఎతాని వావ తాని జ్యోతీంషి య ఎతస్య స్తోమా’’ ఇతి ప్రకాశకత్వాజ్ జ్యోతిష్ట్వేన రూపితత్రివృదాదిస్తుతిసముదాయవత్త్వాత్క్రతౌ జ్యోతిః శబ్దః॥౭॥ హే శ్వేతకేతో పుత్ర తమప్యాదేశమ్ ఆదిశ్యతే ఇతి శాస్త్రాచార్యోపదేశగమ్యం వస్త్వప్రాక్షీః పృష్టవానసిత్వమాచార్యమ్ । యేన శ్రుతేన శాస్త్రతోఽశ్రుతమప్యన్యచ్ఛ్రుతం భవతి, అమతమన్యన్మతం తర్కతో ఎన మతేన , అవిజ్ఞాతమనిదిధ్యాసితం విజ్ఞాతం భవతి యేన విజ్ఞాతేనేతి ।

అన్యజ్ఞానాదన్యన్న జ్ఞేయమితి పుత్రప్రశ్నః —

కథం న్వితి ।

నాన్యత్వం కార్యస్య కారణాదిత్యాహ —

యథా సోమ్యేతి ।

యో వికారః స వాచారమ్భణం వాగాలమ్బనమ్, ఉచ్యతే పరమ్ । నామధేయం నామమాత్రం, నార్థ ఇతి॥౮॥ మనఃశబ్దవాచ్యో భవతీతి । లక్ష్యో భవతి । ‘‘ఎవమేవ ఖలు సోమ్య తన్మన‘‘ ఇతి స్వప్నోపన్యాసవాక్యే అర్థవాదస్యాపి స్వపితినామనిర్వచనస్య యథార్థత్వాయ హృదయాదినిరుక్త్యుదాహరణమ్ । తస్య హృదయశబ్దస్య ।    ఎతన్నిరుక్తం నిర్వచనమ్ । ‘‘అశనాయాపిపాసే సోమ్య విజానీహి’’ ఇత్యుపక్రమ్యాషితస్యాన్నస్య ద్రవీకరణేన నయనాజ్జరణాదాపోఽశనాయా । ఎకవచనం ఛాన్దసమ్ । ద్రావకోదకాపనయతాచ్ఛోషణాదుదన్యం తేజః । ఆకారశ్ఛాన్దసః॥౧॥ ప్రాణాః చక్షురాదయః । యథాయతనం యథాగోలకమ్ । ప్రాణేభ్యోఽనన్తరమాదిత్యాద్యా అనుగ్రాహకా దేవాః । లోక్యన్త ఇతి లోకాః విషయాః॥౧౦॥ కరణాధిపానాం జీవనామధిపః॥౧౧॥