దహర ఉత్తరేభ్యః ।
'అథ యదిదమస్మిన్ బ్రహ్మపురే దహరమ్” సూక్ష్మం గుహాప్రాయం పుణ్డరీకసంనివేశం వేశ్మ “దహరోఽస్మిన్నన్తరాకాశస్తస్మిన్యదన్తస్తదన్వేష్టవ్యమ్”(ఛా. ఉ. ౮ । ౧ । ౧) ఆగమాచార్యోపదేశాభ్యాం శ్రవణం చ, తదవిరోధినా తర్కేణ మననం చ, తదన్వేషణమ్ । తత్పూర్వకేణ చాదరనైరన్తర్యదీర్ఘకాలాసేవితేన ధ్యానాభ్యాసపరిపాకేన సాక్షాత్కారో విజ్ఞానమ్ । విశిష్టం హి తజ్జ్ఞానం పూర్వేభ్యః । తదిచ్ఛా విజిజ్ఞాసనమ్ ।
అత్ర సంశయమాహ -
తత్రేతి ।
తత్ర ప్రథమం తావదేవం సంశయః - కిం దహరాకాశాదన్యదేవ కిఞ్చిదన్వేష్టవ్యం విజిజ్ఞాసితవ్యం చ ఉత దహరాకాశ ఇతి । యదాపి దహరాకాశోఽన్వేష్టవ్యస్తదాపి కిం భూతాకాశ ఆహో శారీర ఆత్మా కిం వా పరమాత్మేతి ।
సంశయహేతుం పృచ్ఛతి -
కుత ఇతి ।
తద్ధేతుమాహ -
ఆకాశబ్రహ్మపురశబ్దాభ్యామితి ।
తత్ర ప్రథమం తావద్భూతాకాశ ఎవ దహర ఇతి పూర్వపక్షయతి -
తత్రాకాశశబ్దస్య భూతాకాశే రూఢత్వాదితి ।
ఎష తు బహుతరోత్తరసన్దర్భవిరోధాత్తుచ్ఛః పూర్వపక్ష ఇత్యపరితోషేణ పక్షాన్తరమాలమ్బతే పూర్వపక్షీ -
అథవా జీవో దహర ఇతి ప్రాప్తమ్ ।
యుక్తమిత్యర్థః । తత్ర “ఆధేయత్వాద్విశేషాచ్చ పురం జీవస్య యుజ్యతే । దేహో న బ్రహ్మణో యుక్తో హేతుద్వయవియోగతః” ॥ అసాధారణ్యేన హి వ్యపదేశతా భవన్తి । తద్యథా క్షితిజలపవనబీజాదిసామగ్రీసమవధానజన్మాప్యఙ్కురః శాలిబీజేన వ్యపదిశ్యతే శాల్యఙ్కుర ఇతి । నతు క్షిత్యాదిభిః, తేషాం కార్యాన్తరేష్వపి సాధారణ్యాత్ । తదిహ శరీరం బ్రహ్మవికారోఽపి న బ్రహ్మణా వ్యపదేష్టవ్యమ్ , బ్రహ్మణః సర్వవికారకారణత్వేనాతిసాధారణ్యాత్ । జీవభేదధర్మాధర్మోపార్జితం తదిత్యసాధారణకారణత్వాజ్జీవేన వ్యపదిశ్యత ఇతి యుక్తమ్ । అపిచ బ్రహ్మపుర ఇతి సప్తమ్యధికరణే స్మర్యతే, తేనాధేయేనానేన సమ్బద్ధవ్యమ్ । నచ బ్రహ్మణః స్వే మహిమ్ని వ్యవస్థితస్యానాధేయస్యాధారసమ్బన్ధః కల్పతే । జీవస్త్వారాగ్రమాత్ర ఇత్యాధేయో భవతి । తస్మాద్బ్రహ్మశబ్దో రూఢిం పరిత్యజ్య దేహాదిబృంహణతయా జీవే యౌగికే వా భాక్తో వా వ్యాఖ్యేయః । చైతన్యం చ భక్తిః । ఉపాధానానుపధానే తు విశేషః । వాచ్యత్వం గమ్యత్వమ్ ।
స్యాదేతత్ । జీవస్య పురం భవతు శరీరం, పుణ్డరీకదహరగోచరతా త్వన్యస్య భవిష్యతి, వత్సరాజస్య పుర ఇవోజ్జయిన్యాం మైత్రస్య సద్మేత్యత ఆహ -
తత్ర పురస్వామిన ఇతి ।
అయమర్థః - వేశ్మ ఖల్వధికరణమనిర్దిష్టాధేయమాధేయవిశేషాపేక్షాయాం పురస్వామినః ప్రకృతత్వాత్తేనైవాధేయేన సమ్బద్ధం సదనపేక్షం నాధేయాన్తరేణ సమ్బన్ధం కల్పయతి ।
నను తథాపి శరీరమేవాస్య భోగాయతనమితి కో హృదయపుణ్డరీకస్య విశేషో యత్తదేవాస్య సద్మేత్యత ఆహ -
మనౌపాధికశ్చ జీవ ఇతి ।
నను మనోఽపి చలతయా సకలదేహవృత్తి పర్యాయేణేత్యత ఆహ -
మనశ్చ ప్రాయేణేతి ।
ఆకాశశబ్దశ్చారూపత్వాదినా సామాన్యేన జీవే భాక్తః ।
అస్తు వా భూతాకాశ ఎవాయమాకాశశబ్దో “దహరోఽస్మిన్నన్తరాకాశః”(ఛా. ఉ. ౮ । ౧ । ౧) ఇతి, తథాప్యదోష ఇత్యాహ -
న చాత్ర దహరస్యాకాశస్యాన్వేష్యత్వమితి ।
ఎవం ప్రాప్త ఉచ్యతే - భూతాకాశస్య తావన్న దహరత్వం, “యావాన్వాయమాకాశస్తావానేషోఽన్తర్హృదయ ఆకాశః” (ఛా. ఉ. ౮ । ౧ । ౩) ఇత్యుపమానవిరోధాత్ । తథాహి - “తేన తస్యోపమేయత్వం రామరావణయుద్ధవత్ । అగత్యా భేదమారోప్య గతౌ సత్యాం న యుజ్యతే” ॥ అస్తి తు దహరాకాశస్య బ్రహ్మత్వేన భూతాకాశాద్భేదేనోపమానస్య గతిః । న చానవచ్ఛిన్నపరిమాణమవచ్ఛిన్నం భవతి । తథా సత్యవచ్ఛేదానుపపత్తేః । న భూతాకాశమానత్వం బ్రహ్మణోఽత్ర విధీయతే, యేన “జ్యాయానాకాశాత్”(శ. బ్రా. ౧౦ । ౬ । ౩ । ౨) ఇతి శ్రుతివిరోధః స్యాత్ , అపి తు భూతాకాశోపమానేన పుణ్డరీకోపాధిప్రాప్తం దహరత్వం నివర్త్యతే ।
అపిచ సర్వ ఎవోత్తరే హేతవో దహరాకాశస్య భూతాకాశత్వం వ్యాసేధన్తీత్యాహ -
న చ కల్పితభేద ఇతి ।
నాపి దహరాకాశో జీవ ఇత్యాహ -
యద్యప్యాత్మశబ్ద ఇతి ।
'ఉపలబ్ధేరధిష్ఠానం బ్రహ్మణో దేహ ఇష్యతే । తేనాసాధారణత్వేన దేహో బ్రహ్మపురం భవేత్” ॥ దేహే హి బ్రహ్మోపలభ్యత ఇత్యసాధారణతయా దేహో బ్రహ్మపురమితి వ్యపదిశ్యతే, న తు బ్రహ్మవికారతయా । తథాచ బ్రహ్మశబ్దార్థో ముఖ్యో భవతి । అస్తు వా బ్రహ్మపురం జీవపురం, తథాపి యథా వత్సరాజస్య పురే ఉజ్జయిన్యాం మైత్రస్య సద్మ భవతి, ఎవం జీవస్య పురే హృత్పుణ్డరీకం బ్రహ్మసదనం భవిష్యతి, ఉత్తరేభ్యో బ్రహ్మలిఙ్గేభ్యో బ్రహ్మణోఽవధారణాత్ । బ్రహ్మణో హి బాధకే ప్రమాణే బలీయసి జీవస్య చ సాధకే ప్రమాణే సతి బ్రహ్మలిఙ్గాని కథఞ్చిదభేదవివక్షయా జీవే వ్యాఖ్యాయన్తే । న చేహ బ్రహ్మణో బాధకం ప్రమాణం, సాధకం వాస్తి జీవస్య । బ్రహ్మపురవ్యపదేశశ్చోపపాదితో బ్రహ్మోపలబ్ధిస్థానతయా । అర్భకౌకస్త్వం చోక్తమ్ । తస్మాత్సతి సమ్భవే బ్రహ్మణి, తల్లిఙ్గానాం నాబ్రహ్మణి వ్యాఖ్యానముచితమితి బ్రహ్మైవ దహరాకాశో న జీవభూతాకాశావితి । శ్రవణమననమనువిద్య బ్రహ్మానుభూయ చరణం చారస్తేషాం కామేషు చరణం భవతీత్యర్థః ।
స్యాదేతత్ । దహరాకాశస్యాన్వేష్యత్వే సిద్ధే తత్ర విచారో యుజ్యతే, నతు తదన్వేష్టవ్యమ్ , అపితు తదాధారమన్యదేవ కిఞ్చిదిత్యుక్తమిత్యనుభాషతే -
యదప్యేతదితి ।
అనుభాషితం దూషయతి -
అత్ర బ్రూమ ఇతి ।
యద్యాకాశాధారమన్యదన్వేష్టవ్యం భవేత్తదేవోపరి వ్యుత్పాదనీయం, ఆకాశవ్యుత్పాదనం తు క్వోపయుజ్యత ఇత్యర్థః ।
చోదయతి -
నన్వేతదపీతి ।
ఆకాశకథనమపి తదన్తర్వర్తివస్తుసద్భావప్రదర్శనాయైవ ।
అథాకాశపరమేవ కస్మాన్న భవతీత్యత ఆహ -
తం చేద్బ్రూయురితి ।
ఆచార్యేణ హి “దహరోఽస్మిన్నన్తరాకాశస్తస్మిన్యదన్తస్తదన్వేష్టవ్యం తద్వావ విజిజ్ఞాసితవ్యమ్”(ఛా. ఉ. ౮ । ౧ । ౧) ఇత్యుపదిష్టేఽన్తేవాసినాక్షిప్తమ్ - “కిం తదత్ర విద్యతే యదన్వేష్టవ్యమ్”(ఛా. ఉ. ౮ । ౧ । ౨) । పుణ్డరీకమేవ తావత్సూక్ష్మతరం, తదవరుద్ధమాకాశం సూక్ష్మతమమ్ । తస్మిన్సూక్ష్మతమే కిమపరమస్తి । నాస్త్యేవేత్యర్థః । తత్కిమన్వేష్టవ్యమితి । తదస్మిన్నాక్షేపే పరిసమాప్తే సమాధానావసర ఆచార్యస్యాకాశోపమానోపక్రమం వచః - “ఉభే అస్మిన్ద్యావాపృథివీ సమాహితే”(ఛా. ఉ. ౮ । ౧ । ౩) ఇతి । తస్మాత్పుణ్డరీకావరుద్ధాకాశాశ్రయే ద్యావాపృథివ్యావేవాన్వేష్టవ్యే ఉపదిష్టే, నాకాశ ఇత్యర్థః ।
పరిహరతి -
నైతదేవమ్ ।
ఎవం హీతి ।
స్యాదేతత్ । ఎవమేవైతత్ ।
నో ఖల్వభ్యుపగమా ఎవ దోషత్వేన చోద్యన్త ఇత్యత ఆహ -
తత్ర వాక్యశేష ఇతి ।
వాక్యశేషో హి దహరాకాశాత్మవేదనస్య ఫలవత్త్వం బ్రూతే, యచ్చ ఫలవత్తత్కర్తవ్యతయా చోద్యతే, యచ్చ కర్తవ్యం తదిచ్ఛతీతి “తదన్వేష్టవ్యం తద్వావ విజిజ్ఞాసితవ్యమ్” (ఛా. ఉ. ౮ । ౧ । ౧) ఇతి తద్దహరాకాశవిషయమవతిష్ఠతే ।
స్యాదేతత్ । ద్యావాపృథివ్యావేవాత్మానౌ భవిష్యతః, తాభ్యామేవాత్మా లక్షయిష్యతే, ఆకాశశబ్దవత్ । తతశ్చాకాశాధారౌ తావేవ పరామృశ్యతే ఇత్యత ఆహ -
అస్మిన్కామాః సమాహితాః
ప్రతిష్ఠితాః ।
ఎష ఆత్మాపహతపాప్మేతి ।
అనేన
ప్రకృతం ద్యావాపృథివ్యాదిసమాధానాధారమాకాశమాకృష్య ।
ద్యావాపృథివ్యభిధానవ్యవహితమపీతి శేషః ।
నను సత్యకామజ్ఞానస్యైతత్ఫలం, తదనన్తరం నిర్దేశాత్ , న తు దహరాకాశవేదనస్యేత్యత ఆహ -
సముచ్చయార్థేన చశబ్దేనేతి ।
'అస్మిన్కామాః” ఇతి చ ‘ఎషః’ ఇతి చైకవచనాన్తం న ద్వే ద్యావాపృథివ్యౌ పరామ్రష్టుమర్హతీతి దహరాకాశ ఎవ పరామ్రష్టవ్య ఇతి సముదాయార్థః । తదనేన క్రమేణ ‘తస్మిన్యదన్తః’ ఇత్యత్ర తచ్ఛబ్దోఽనన్తరమప్యాకాశమతిలఙ్ఘ్య హృత్పుణ్డరీకం పరామృశతీత్యుక్తం భవతి । తస్మిన్ హృత్పుణ్డరీకే యదన్తరాకాశం తదన్వేష్టవ్యమిత్యర్థః ॥ ౧౪ ॥
గతిశబ్దాభ్యాం తథాహి దృష్టం లిఙ్గం చ ।
ఉత్తరేభ్య ఇత్యస్య ప్రపఞ్చః ఎతమేవ దహరాకాశం ప్రక్రమ్య బతాహో కష్టమిదం వర్తతే జన్తూనాం తత్త్వావబోధవికలానాం, యదేభిః స్వాధీనమపి బ్రహ్మ న ప్రాప్యతే । తద్యథా చిరన్తననిరూఢనిబిడమలపిహితానాం కలధౌతశకలానాం పథి పతితానాముపర్యుపరి సఞ్చరద్భిరపి పాన్థైర్ధనాయద్భిర్గ్రావఖణ్డనివహవిభ్రమేణైతాని నోపాదియన్త ఇత్యభిసన్ధిమతీ సాద్భుతమివ సఖేదమివ శ్రుతః ప్రవర్తతే - “ఇమాః సర్వాః ప్రజా అహరహర్గచ్ఛన్త్య ఎతం బ్రహ్మలోకం న విన్దన్తి”(ఛా. ఉ. ౮ । ౩ । ౨) ఇతి । స్వాపకాలే హి సర్వ ఎవాయం విద్వానవిద్వాంశ్చ జీవలోకో హృత్పుణ్డరీకాశ్రయం దహరాకాశాఖ్యం బ్రహ్మలోకం ప్రాప్తోఽప్యనాద్యవిద్యాతమః పటలపిహితదృష్టితయా బ్రహ్మభూయమాపన్నోఽహమస్మీతి న వేద । సోఽయం బ్రహ్మలోకశబ్దస్తద్గతిశ్చ ప్రత్యహం జీవలోకస్య దహరాకాశస్యైవ బ్రహ్మరూపలోకతామాహతుః ।
తదేతదాహ భాష్యకారః -
ఇతశ్చ పరమేశ్వర ఎవ దహరో యస్మాద్దహరవాక్యశేష ఇతి ।
తదనేన గతిశబ్దౌ వ్యాఖ్యాతౌ ।
'తథాహి దృష్టమ్” ఇతి సూత్రావయవం వ్యాచష్టే -
తథాహ్యహరహర్జీవానామితి ।
వేదే చ లోకే చ దృష్టమ్ । యద్యపి సుషుప్తస్య బ్రహ్మభావే లౌకికం న ప్రమాణాన్తరమస్తి, తథాపి వైదికీమేవ ప్రసిద్ధిం స్థాపయితుముచ్యతే, ఈదృశీ నామేయం వైదికీ ప్రసిద్ధిర్యల్లోకేఽపి గీయత ఇతి । యథా శ్రుత్యన్తరే యథా చ లోకే తథేహ బ్రహ్మలోకశబ్దోఽపీతి యోజనా ।
'లిఙ్గం చ” ఇతి సూత్రావయవవ్యాఖ్యానం చోద్యముఖేనావతారయతి -
నను కమలాసనలోకమపీతి ।
పరిహరతి -
గమయేద్యది బ్రహ్మణో లోక ఇతి ।
అత్ర తావన్నిషాదస్థపతిన్యాయేన షష్ఠీసమాసాత్కర్మధారయో బలీయానితి స్థితమేవ, తథాపీహ షష్ఠీసమాసనిరాకరణేన కర్మధారయసమాసస్థాపనాయ లిఙ్గమప్యధికమస్తీతి తదప్యుక్తం సూత్రకారేణ । తథాహి - లోకవేదప్రసిద్ధాహరహర్బ్రహ్మలోకప్రాప్త్యభిధానమేవ లిఙ్గం కమలాసనలోకప్రాప్తేర్విపక్షాదసమ్భవాద్వ్యావర్తమానం షష్ఠీసమాసాశఙ్కాం వ్యావర్తయద్దహరాకాశప్రాప్తావేవావతిష్ఠతే, నచ దహరాకాశో బ్రహ్మణో లోకః కిన్తు తద్బ్రహ్మేతి బ్రహ్మ చ తల్లోకశ్చేతి కర్మధారయః సిద్ధో భవతి । లోక్యత ఇతి లోకః । హృత్పుణ్డరీకస్థః ఖల్వయం లోక్యతే । యత్ఖలు పుణ్డరీకస్థమన్తఃకరణం తస్మిన్విశుద్ధే ప్రత్యాహృతేతరకరణానాం యోగినాం నిర్మల ఇవోదకే చన్ద్రమసో బిమ్బమతిస్వచ్ఛం చైతన్యం జ్యోతిఃస్వరూపం బ్రహ్మావలోక్యత ఇతి ॥ ౧౫ ॥
ధృతేశ్చ మహిమ్నోఽస్యాస్మిన్నుపలబ్ధేః ।
సౌత్రో ధృతిశబ్దో భావవచనః । ధృతేశ్చ పరమేశ్వర ఎవ దహరాకాశః । కుతః, అస్య ధారణలక్షణస్య మహిమ్నోఽస్మిన్నేవేశ్వర ఎవ శ్రుత్యన్తరేషూపలబ్ధేః । నిగదవ్యాఖ్యానమస్య భాష్యమ్ ॥ ౧౬ ॥
ప్రసిద్ధేశ్చ ।
న చేయమాకాశశబ్దస్య బ్రహ్మణి లక్ష్యమాణవిభుత్వాదిగుణయోగాద్వృత్తిః సామ్ప్రతికీ, యథా రథాఙ్గనామా చక్రవాక ఇతి లక్షణా, కిన్త్వత్యన్తనిరూఢేతి సూత్రార్థః । యే త్వాకాశశబ్దో బ్రహ్మణ్యపి ముఖ్య ఎవ నభోవదిత్యాచక్షతే, తైః “అన్యాయశ్చానేకార్థత్వమ్” ఇతి చ “అనన్యలభ్యః శబ్దార్థః” ఇతి చ మీమాంసకానాం ముద్రాభేదః కృతః । లభ్యతే హ్యాకాశశబ్దాద్విభుత్వాదిగుణయోగేనాపి బ్రహ్మ । నచ బ్రహ్మణ్యేవ ముఖ్యో నభసి తు తేనైవ గుణయోగేన వర్త్స్యతీతి వాచ్యమ్ । లోకాధీనావధారణత్వేన శబ్దార్థసమ్బన్ధస్య వైదికపదార్థప్రత్యయస్య తత్పూర్వకత్వాత్ । నను “యావాన్వా అయమాకాశస్తావానేషోఽన్తర్హృదయ ఆకాశః”(ఛా. ఉ. ౮ । ౧ । ౩) ఇతి వ్యతిరేకనిర్దేశాన్న లక్షణా యుక్తా । నహి భవతి గఙ్గాయాః కూలమితి వివక్షితే గఙ్గాయా గఙ్గేతి ప్రయోగః తత్కిమిదానీం “పౌర్ణమాస్యాం పౌర్ణమాస్యా యజేత” “అమావాస్యాయామమావాస్యయా” ఇత్యసాధుర్వైదికః ప్రయోగః । నచ పౌర్ణమాస్యమావాస్యశబ్దావగ్నేయాదిషు ముఖ్యౌ । యచ్చోక్తం యత్ర శబ్దార్థప్రతీతిస్తత్ర లక్షణా, యత్ర పునరన్యార్థే నిశ్చితే శబ్దప్రయోగస్తత్ర వాచకత్వమేవేతి, తదయుక్తమ్ । ఉభయస్యాపి వ్యభిచారాత్ । “సోమేన యజేత” ఇతి శబ్దాదర్థః ప్రతీయతే । న చాత్ర కస్యచిల్లాక్షణికత్వమృతే వాక్యార్థాత్ । న చ “య ఎవం విద్వాన్ పౌర్ణమాసీం యజతే య ఎవం విద్వానమావాస్యామ్” ఇత్యత్ర పౌర్ణమాస్యమావాస్యాశబ్దౌ న లాక్షణికౌ । తస్మాద్యత్కిఞ్చిదేతదితి ॥ ౧౭ ॥
ఇతరపరామర్శాత్స ఇతి చేన్నాసమ్భవాత్ ।
సమ్యక్ ప్రసీదత్యస్మిన్ జీవో విషయేన్ద్రియసంయోగజనితం కాలుష్యం జహాతీతి సుషుప్తిః సమ్ప్రసాదో జీవస్యావస్థాభేదః న బ్రహ్మణః తథా శరీరాత్సముత్థానమపి శరీరాశ్రయస్య జీవస్య, నత్వనాశ్రయస్య బ్రహ్మణః । తస్మాద్యథా పూర్వోక్తైర్వాక్యశేషగతైర్లిఙ్గైర్బ్రహ్మావగమ్యతే దహరాకాశః, ఎవం వాక్యశేషగతాభ్యామేవ సమ్ప్రసాదసముత్థానాభ్యాం దహరాకాశో జీవః కస్మాన్నావగమ్యతే । తస్మాన్నాస్తి వినిగమనేతి శఙ్కార్థః । “నాసమ్భవాత్”(బ్ర. సూ. ౧ । ౩ । ౧౮) । సమ్ప్రసాదసముత్థనాభ్యాం హి జీవపరామర్శో న జీవపరః, కిన్తు తదీయతాత్త్వికరూపబ్రహ్మభావపరః । తథా చైష పరామర్శో బ్రహ్మణ ఎవేతి న సమ్ప్రసాదసముత్థానే జీవలిఙ్గమ్ , అపి తు బ్రహ్మణ ఎవ తాదర్థ్యాదిత్యగ్రే వక్ష్యతే । ఆకాశోపమానాదయస్తు బ్రహ్మావ్యభిచారిణశ్చ బ్రహ్మపరాశ్చేత్యస్తి వినిగమనేత్యర్థః ॥ ౧౮ ॥
ఉత్తరాచ్చేదావిర్భూతస్వరూపస్తు ।
దహరాకాశమేవ ప్రకృత్యోపాఖ్యాయతే - యమాత్మానమన్విష్య సర్వాంశ్చ లోకానాప్నోతి సర్వాంశ్చ కామాన్ , తమాత్మానం వివిదిషన్తౌ సురాసురరాజవిన్ద్రవిరోచనౌ సమిత్పాణీ ప్రజాపతిం వరివసితుమాజగ్మతుః । ఆగత్య చ ద్వాత్రింశతం వర్షాణి తత్పరిచరణపరౌ బ్రహ్మచర్యమూషతుః । అథైతౌ ప్రజాపతిరువాచ, కిఙ్కామావిహస్థౌ యువామితి । తావూచతుః, య ఆత్మాపహతపాప్మా తమావాం వివిదిషావ ఇతి । తతః ప్రజాపతిరువాచ, య ఎషోఽక్షిణి పురుషో దృశ్యతే ఎష ఆత్మాపహతపాప్మత్వాదిగుణః, యద్విజ్ఞానాత్సర్వలోకకామావాప్తిః । ఎతదమృతమభయమ్ । అథైతచ్ఛుత్వైతావప్రక్షీణకల్మషావరణతయా ఛాయాపురుషం జగృహతుః । ప్రజాపతిం చ పప్రచ్ఛతుః, అథ యోఽయం భగవోఽప్సు దృశ్యతే, యశ్చాదర్శే, యశ్చ స్వఙ్గాదౌ కతమ ఎతేష్వసౌ అథవైక ఎవ సర్వేష్వితి । తమేతయోః శ్రుత్వా ప్రశ్నం ప్రజాపతిర్బతాహో సుదూరముద్భ్రాన్తావేతౌ, అస్మాభిరక్షిస్థాన ఆత్మోపదిష్టః, ఎతౌ చ ఛాయాపురుషం ప్రతిపన్నౌ, తద్యది వయం భ్రాన్తౌ స్థ ఇతి బ్రూమస్తతః స్వాత్మని సమారోపితపాణ్డిత్యబహుమానౌ విమానితౌ సన్తౌ దౌర్మనస్యేన యథావదుపదేశం న గృహ్ణీయాతామ్ , ఇత్యనయోరాశయమనురుధ్య యథార్థం గ్రాహయిష్యామ ఇత్యభిసన్ధిమాన్ప్రత్యువాచ, ఉదశరావ ఆత్మానమవేక్షేథామస్మిన్యత్పశ్యథస్తద్బ్రూతమితి । తౌ చ దృష్ట్వా సన్తుష్టహృదయౌ నాబ్రూతామ్ । అథ ప్రజాపతిరేతౌ విపరీతగ్రాహిణౌ మా భూతామిత్యాశయవాన్పప్రచ్ఛ, కిమత్రాపశ్యతామితి । తౌ హోచతుః, యథైవావమతిచిరబ్రహ్మచర్యచరణసముపజాతాయతనఖలోమాదిమన్తావేవమావయోః ప్రతిరూపకం నఖలోమాదిమదుదశరావేఽపశ్యావేతి । పునరేతయోశ్ఛాయాత్మవిభ్రమమపనినీషుర్యథైవ హి ఛాయాపురుష ఉపజనాపాయధర్మాభేదేనావగమ్యమాన ఆత్మలక్షణవిరహాన్నాత్మైవేవమేవేదం శరీరం నాత్మా, కిన్తు తతో భిన్నమిత్యన్వయవ్యతిరేకాభ్యామేతౌ జానీయాతామిత్యాశయవాన్ ప్రజాపతిరువాచ, సాధ్వలఙ్కృతౌ సువసనౌ పరిష్కృతౌ భూత్వా పునరుదశరావే పశ్యతమాత్మానం, యచ్చాత్ర పశ్యథస్తద్బ్రూతమితి । తౌ చ సాధ్వలఙ్కృతౌ సువసనౌ ఛిన్ననఖలోమానౌ భూత్వా తథైవ చక్రతుః । పునశ్చ ప్రజాపతినాపృష్టౌ తామేవ ఛాయామాత్మానమూచతుః । తదుపశ్రుత్య ప్రజాపతిరహో బతాద్యాపి న ప్రశాన్త ఎనయోర్విభ్రమః, తద్యథాభిమతమేవాత్మతత్త్వం కథయామి తావత్ । కాలేన కల్మషే క్షీణేఽస్మద్వచనసన్దర్భపౌర్వాపర్యలోచనయాత్మతత్త్వం ప్రతిపత్స్యేతే స్వయమేవేతి మత్వోవాచ, ఎష ఆత్మైతదమృతమభయమేతద్బ్రహ్మేతి । తయోర్విరోచనో దేహానుపాతిత్వాచ్ఛాయాయా దేహ ఎవాత్మతత్త్వమితి మత్వా నిజసదనమాగత్య తథైవాసురానుపదిదేశ । దేవేన్ద్రస్త్వప్రాప్తనిజసదనోఽధ్వన్యేవ కిఞ్చిద్విరలకల్మషతయా ఛాయాత్మని శరీరగుణదోషానువిధాయిని తం తం దోషం పరిభావయన్నాహమత్ర ఛాయాత్మదర్శనే భోగ్యం పశ్యామీతి ప్రజాపతిసమీపం సమిత్పాణిః పునరేవేవాయమ్ । ఆగతశ్చ ప్రజాపతినాగమనకారణం పృష్టః పథి పరిభావితం జగాద । ప్రజాపతిస్తు సువ్యాఖ్యాతమప్యాత్మతత్త్వమక్షీణకల్మషావరణతయా నాగ్రహీః, తత్పునరపి తత్ప్రక్షయాయా చరాపరాణి ద్వాత్రింశతం వర్షాణి బ్రహ్మచర్యం, అథ ప్రక్షీణకల్మషాయ తే అహమేతమేవాత్మానం భూయోఽనువ్యాఖ్యాస్యామీత్యవోచత్ । స చ తథా చరితబ్రహ్మచర్యః సురేన్ద్రః ప్రజాపతిముపససాద । ఉపపన్నాయ చాస్మై ప్రజాపతిర్వ్యాచష్టే, య ఆత్మాపహతపాప్మాదిలక్షణోఽక్షణ దర్శితః సోఽయం య ఎష స్వప్నే మహీయమానో వనితాదిభిరనేకధా స్వప్నోపభోగాన్ భుఞ్జానో విరహతీతి । అస్మిన్నపి దేవేన్ద్రో భయం దదర్శ । యద్యప్యయం ఛాయాపురుషవన్న శరీరధర్మాననుపతతి, తథాపి శోకభయాదివివిధబాధానుభవాన్న తత్రాప్యస్తి స్వస్తిప్రాప్తిరిత్యుక్తవతి మఘవతి పునరపరాణి చర ద్వాత్రింశతం వర్షాణి స్వచ్ఛం బ్రహ్మచర్యమిదానీమప్యక్షీణకల్మషోఽసీత్యూచే ప్రజాపతిః । అథాస్మిన్నేవంకారముపసన్నే మఘవతి ప్రజాపతిరువాచ, య ఎష ఆత్మాపహతపాప్మాదిగుణో దర్శితోఽక్షిణి చ స్వప్నే చ స ఎష యో విషయేన్ద్రియసంయోగవిరహాత్ప్రసన్నః సుషుప్తావస్థాయామితి । అత్రాపి నేన్ద్రో నిర్వవార । యథా హి జాగ్రద్వా స్వప్నగతో వాయమహమస్మీతి ఇమాని భూతాని చేతి విజానాతి నైవం సుషుప్తః కిఞ్చిదపి వేదయతే, తదా ఖల్వయమచేతయమానోఽభావం ప్రాప్త ఇవ భవతి । తదిహ కా నిర్వృత్తిరితి । ఎవముక్తవతి మఘవతి బతాద్యాపి న తే కల్మషక్షయోఽభూత్ । తత్పునరపరాణి చర పఞ్చ వర్షాణి బ్రహ్మచర్యమిత్యవోచత్ప్రజాపతిః । తదేవమస్య మఘోనస్త్రిభిః పర్యాయైర్వ్యతీయుః షణ్ణవతివర్షాణి । చతుర్థే చ పర్యాయే పఞ్చ వర్షాణీత్యేకోత్తరం శతం వర్షాణి బ్రహ్మచర్యం చరతః సహస్రాక్షస్య సమ్పేదిరే । అథాస్మై బ్రహ్మచర్యసమ్పదున్మృదితకల్మషాయ మఘవతే య ఎషోఽక్షిణి యశ్చ స్వప్నే యశ్చ సుషుప్తే అనుస్యూత ఎష ఆత్మాపహతపాప్మాదిగుణకో దర్శితః, తమేవ “మఘవన్మర్త్యం వై శరీరమ్”(ఛా. ఉ. ౮ । ౧౨ । ౧) ఇత్యాదినా విస్పష్టం వ్యాచష్టే ప్రజాపతిః । అయమస్యాభిసన్ధిః - యావత్కిఞ్చిత్సుఖం దుఃఖమాగమాపాయి తత్సర్వం శరీరేన్ద్రియాన్తఃకరణసమ్బన్ధి, న త్వాత్మనః । స పునరేతానేవ శరీరాదీననాద్యవిద్యావాసనావశాదాత్మత్వేనాభిప్రతీతస్తద్గతేన సుఖదుఃఖేన తద్వన్తమాత్మానమభిమన్యమానోఽనుతప్యతే । యదా త్వయమపహతపాప్మత్వాదిలక్షణముదాసీనమాత్మానం దేహాదిభ్యో వివిక్తమనుభవతి, అథాస్య శరీరవతోఽప్యశరీరస్య న దేహాదిధర్మసుఖదుఃఖప్రసఙ్గోఽస్తీతి నానుతప్యతే, కేవలమయం నిజే చైతన్యానన్దఘనే రూపే వ్యవస్థితః సమస్తలోకకామాన్ ప్రాప్తో భవతి । ఎతస్యైవ హి పరమానన్దస్య మాత్రాః సర్వే కామాః । దుఃఖం త్వవిద్యానిర్మాణమితి న విద్వానాప్నోతి । “అశీలితోపనిషదాం వ్యామోహ ఇహ జాయతే । తేషామనుగ్రహాయేదముపాఖ్యానమవర్తయమ్” ॥ ఎవం వ్యవస్థిత ఉత్తరాద్వాక్యసన్దర్భాత్ప్రాజాపత్యాత్ అక్షిణి చ స్వప్నే సుషుప్తే చ చతుర్థే చ పర్యాయే “ఎష సమ్ప్రసాదోఽస్మాచ్ఛరీరాత్సముత్థాయ”(ఛా. ఉ. ౮ । ౩ । ౪) ఇతి జీవాత్మైవాపహతపాప్మాదిగుణః శ్రుత్యోచ్యతే । నో ఖలు పరస్యాక్షిస్థానం సమ్భవతి । నాపి స్వప్నాద్యవస్థాయోగః । నాపి శరీరాత్సముత్థానమ్ । తస్మాద్యస్యైతత్సర్వం సోఽపహతపాప్మాదిగుణః శ్రుత్యోక్తః । జీవస్య చైతత్సర్వమితి స ఎవాపహతపాప్మాదిగుణః శ్రుత్యోక్త ఇతి నాపహతపాప్మాదిభిః పరం బ్రహ్మ గమ్యతే । నను జీవస్యాపహతపాప్మత్వాదయో న సమ్భవన్తీత్యుక్తమ్ । వచనాద్భవిష్యతి । కిమివ వచనం న కుర్యాత్ । నాస్తి వచనస్యాతిభారః । నచ మానాన్తరవిరోధః । నహి జీవః పాప్మాదిస్వభావః, కిన్తు వాగ్బుద్ధిశరీరారమ్భసమ్భవోఽస్య పాప్మాదిః శరీరాద్యభావే న భవతి ధూమ ఇవ ధూమధ్వజాభావ ఇతి శఙ్కార్థః ।
నిరాకరోతి -
తం ప్రతి బ్రూయాత్ ఆవిర్భూతస్వరూపస్తు ।
అయమభిసన్ధిః - పౌర్వాపర్యాలోచనయా తావదుపనిషదాం శుద్ధబుద్ధముక్తమేకమప్రపఞ్చం బ్రహ్మ తదతిరిక్తం చ సర్వం తద్వివర్తో రజ్జోరివ భుజఙ్గ ఇత్యత్ర తాత్పర్యమవగమ్యతే । తథాచ జీవోఽప్యవిద్యాకల్పితదేహేన్ద్రియాద్యుపహితం రూపం బ్రహ్మణో న తు స్వాభావికః । ఎవం చ నాపహతపాప్మత్వాదయస్తస్మిన్నవిద్యోపాధౌ సమ్భవినః । ఆవిర్భూతబ్రహ్మరూపే తు నిరుపాధౌ సమ్భవన్తో బ్రహ్మణ ఎవ న జీవస్య । ఎవం చ బ్రహ్మైవాపహతపాప్మాదిగుణం శ్రుత్యుక్తమితి తదేవ దహరాకాశో న జీవ ఇతి ।
స్యాదేతత్ । స్వరూపావిర్భావే చేద్బ్రహ్మైవ న జీవః, తర్హి విప్రతిషిద్ధమిదమభిధీయతే జీవ ఆవిర్భూతస్వరూప ఇతి, అత ఆహ -
భూతపూర్వగత్యేతి ।
ఉదశరావబ్రాహ్మణేనేతి ।
యథైవ హి మఘోనః ప్రతిబిమ్బాన్యుదశరావ ఉపజనాపాయధర్మకాణ్యాత్మలక్షణవిరహాన్నాత్మా, ఎవం దేహేన్ద్రియాద్యప్యుపజనాపాయధర్మకం నాత్మేత్యుదశరావదృష్టాన్తేన శరీరాత్మతాయా వ్యుత్థానం బాధ ఇతి ।
చోదయతి -
కథం పునః స్వం చ రూపమితి ।
ద్రవ్యాన్తరసంసృష్టం హి తేనాభిభూతం తస్మాద్వివిచ్యమానం వ్యజ్యతే హేమతారకాది । కూటస్థనిత్యస్య పునరన్యేనాసంసృష్టస్య కుతో వివేచనాదభివ్యక్తిః । నచ సంసారావస్థాయాం జీవోఽనభివ్యక్తః । దృష్ట్యాదయో హ్యస్య స్వరూపం, తే చ సంసారావస్థాయాం భాసన్త ఇతి కథం జీవరూపం న భాసత ఇత్యర్థః ।
పరిహరతి -
ప్రాగ్వివేకజ్ఞానోత్పత్తేరితి ।
అయమర్థః - యద్యప్యస్య కూటస్థనిత్యస్యాన్యసంసర్గో న వస్తుతోఽస్తి, యద్యపి చ సంసారావస్థాయామస్య దృష్ట్యాదిరూపం చకాస్తి, తథాప్యనిర్వాచ్యానాద్యవిద్యావశాదవిద్యాకల్పితైరేవ దేహేన్ద్రియాదిభిరసంసృష్టమపి సంసృష్టమివ వివిక్తమప్యవివిక్తమివ దృష్ట్యాదిరూపమస్య ప్రథతే । తథాచ దేహేన్ద్రియాదిగతైస్తాపాదిభిస్తాపాదిమదివ భవతీతి । ఉపపాదితం చైతద్విస్తరేణాధ్యాసభాష్య ఇతి నేహోపపాద్యతే । యద్యపి స్ఫటికాదయో జపాకుసుమాదిసంనిహితాః, సంనిధానం చ సంయుక్తసంయోగాత్మకం, తథా చ సంయుక్తాః, తథాపి న సాక్షాజ్జపాదికుసుమసంయోగిన ఇత్యేతావతా దృష్టాన్తితా ఇతి । వేదనా హర్షభయశోకాదయః ।
దార్ష్టాన్తికే యోజయతి -
తథా దేహాదీతి ।
'సమ్ప్రసాదోఽస్మాచ్ఛరీరాత్సముత్థాయ పరం జ్యోతిరుపసమ్పద్య స్వేన రూపేణాభినిష్పద్యతే” ఇత్యేతద్విభజతే -
శ్రుతికృతం వివేకవిజ్ఞానమితి ।
తదనేన శ్రవణమననధ్యానాభ్యాసాద్వివేకవిజ్ఞానముక్త్వా తస్య వివేకవిజ్ఞానస్య ఫలం కేవలాత్మరూపసాక్షాత్కారః స్వరూపేణాభినిష్పత్తిః, స చ సాక్షాత్కారో వృత్తిరూపః ప్రపఞ్చమాత్రం ప్రవిలాపయన్ స్వయమపి ప్రపఞ్చరూపత్వాత్కతకఫలవత్ప్రవిలీయతే । తథాచ నిర్మృష్టనిఖిలప్రపఞ్చజాలమనుపసర్గమపరాధీనప్రకాశమాత్మజ్యోతిః సిద్ధం భవతి । తదిదముక్తమ్ - పరం జ్యోతిరుపసమ్పద్యేతి । అత్ర చోపసమ్పత్తావుత్తరకాలాయామపి క్త్వాప్రయోగో ముఖం వ్యాదాయ స్వపితీతీవన్మన్తవ్యః ।
యదా చ వివేకసాక్షాత్కారః శరీరాత్సముత్థానం, న తు శరీరాపాదానకం గమనమ్ , తదా తత్సశరీరస్యాపి సమ్భవతి ప్రారబ్ధకార్యకర్మక్షయస్య పురస్తాదిత్యాహ -
తథా వివేకావివేకమాత్రేణేతి ।
న కేవలం “స యో హ వై తత్పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి”(ము. ఉ. ౩ । ౨ । ౯) ఇత్యాదిశ్రుతిభ్యో జీవస్య పరమాత్మనోఽభేదః, ప్రాజాపత్యవాక్యసన్దర్భపర్యాలోచనయాప్యేవమేవ ప్రతిపత్తవ్యమిత్యాహ -
కుతశ్చైతదేవం ప్రతిపత్తవ్యమితి ।
స్యాదేతత్ । ప్రతిచ్ఛాయాత్మవజ్జీవం పరమాత్మనో వస్తుతో భిన్నమప్యమృతాభయాత్మత్వేన గ్రాహయిత్వా పశ్చాత్పరమాత్మానమృతాభయాదిమన్తం ప్రజాపతిర్గ్రాహ్యతి, న త్వయం జీవస్య పరమాత్మభావమాచష్టే ఛాయాత్మన ఇవేత్యత ఆహ -
నాపి ప్రతిచ్ఛాయాత్మాయమక్షిలక్షిత ఇతి ।
అక్షిలక్షితోఽప్యాత్మైవోపదిశ్యతే న ఛాయాత్మా । తస్మాదసిద్ధో దృష్టాన్త ఇత్యర్థః ।
కిఞ్చ ద్వితీయాదిష్వపి పర్యాయేషు “ఎతం త్వేవ తే భూయోఽనువ్యాఖ్యాస్యామి” (ఛా. ఉ. ౮ । ౯ । ౩) ఇత్యుపక్రమాత్ప్రథమపర్యాయనిర్దిష్టో న ఛాయాపురుషః, అపి తు తతోఽన్యో దృష్టాత్మేతి దర్శయతి, అన్యథా ప్రజాపతేః ప్రతారకత్వప్రసఙ్గాదిత్యత ఆహ -
తథా ద్వితీయేఽపీతి ।
అథ ఛాయాపురుష ఎవ జీవః కస్మాన్న భవతి । తథాచ ఛాయాపురుష ఎవైతమితి పరామృశ్యత ఇత్యత ఆహ -
కిఞ్చాహమద్య స్వప్నే హస్తినమితి ।
కిఞ్చేతి సముచ్చయాభిధానం పూర్వోపపత్తిసాహిత్యం బ్రూతే, తచ్చ శఙ్కానిరాకరణద్వారేణ । ఛాయాపురుషోఽస్థాయీ, స్థాయీ చాయమాత్మా చకాస్తి, ప్రత్యభిజ్ఞానాదిత్యర్థః ।
న హి ఖల్వయమేవమితి ।
అయం సుషుప్తః । సమ్ప్రతి సుషుప్తావస్థాయామ్ । అహమాత్మానమహఙ్కారాస్పదమాత్మానమ్ । న జానాతి ।
కేన ప్రకారేణ న జానాతీత్యత ఆహ -
అయమహమస్మీమాని భూతాని చేతి ।
యథా జాగృతౌ స్వప్నే చేతి । “న హి విజ్ఞాతుర్విజ్ఞాతేర్విపరిలోపో విద్యతేఽవినాశిత్వాత్”(బృ. ఉ. ౪ । ౩ । ౩౦) ఇత్యనేనావినాశిత్వం సిద్ధవద్ధేతుకుర్వతా సుప్తోత్థితస్యాత్మప్రత్యభిజ్ఞానముక్తమ్ , య ఎవాహం జాగరిత్వా సుప్తః స ఎవైతర్హి జాగర్మీతి ।
ఆచార్యదేశీయమతమాహ -
కేచిత్త్వితి ।
యది హ్యేతమిత్యనేనానన్తరోక్తం చక్షురధిష్ఠానం పురుషం పరామృశ్య తస్యాత్మత్వముచ్యేత తతో న భవేచ్ఛాయాపురుషః । న త్వేతదస్తి । వాక్యోపక్రమసూచితస్య పరమాత్మనః పరామర్శాత్ । న ఖలు జీవాత్మనోఽపహతపాప్మత్వాదిగుణసమ్భవ ఇత్యర్థః ।
తదేతద్దూషయతి -
తేషామేతమితి ।
సుబోధమ్ ।
మతాన్తరమాహ -
అపరే తు వాదిన ఇతి ।
యది న జీవః కర్తా భోక్తా చ వస్తుతో భవేత్ , తతస్తదాశ్రయాః కర్మవిధయ ఉపరుధ్యేరన్ । సూత్రకారవచనం చ “నాసమ్భవాత్”(బ్ర. సూ. ౧ । ౩ । ౧౮) ఇతి కుప్యేత । తత్ఖలు బ్రహ్మణో గుణానాం జీవేఽసమ్భవమాహ । న చాభేదే బ్రహ్మణో జీవానాం బ్రహ్మగుణానామసమ్భవో జీవేష్వితి తేషామభిప్రాయః । తేషాం వాదినాం శారీరకేణైవోత్తరం దత్తమ్ । తథాహి - పౌర్వాపర్యపర్యాలోచనయా వేదాన్తానామేకమద్వయమాత్మతత్త్వం, జీవాస్త్వవిద్యోపధానకల్పితా ఇత్యత్ర తాత్పర్యమవగమ్యతే । నచ వస్తుసతో బ్రహ్మణో గుణాః సమారోపితేషు జీవేషు సమ్భవన్తి । నో ఖలు వస్తుసత్యా రజ్జ్వా ధర్మాః సేవ్యత్వాదయః సమారోపితే భుజఙ్గే సమ్భవినః । నచ సమారోపితో భుజఙ్గో రజ్జ్వా భిన్నః । తస్మాన్న సూత్రవ్యాకోపః । అవిద్యాకల్పితం చ కర్తృత్వభోక్తృత్వం యథాలోకసిద్ధముపాశ్రిత్య కర్మవిధయః ప్రవృత్తాః, శ్యేనాదివిధయ ఇవ నిషిద్ధేఽపి “న హింస్యాత్సర్వా భూతాని” ఇతి సాధ్యాంశేఽభిచారేఽతిక్రాన్తనిషేధం పురుషమాశ్రిత్యావిద్యావత్పురుషాశ్రయత్వాచ్ఛాస్త్రస్యేత్యుక్తమ్ ।
తదిదమాహ -
తేషాం సర్వేషామితి ॥ ౧౯ ॥
నను బ్రహ్మచేదత్ర వక్తవ్యం కృతం జీవపరామర్శేనేత్యుక్తమిత్యత ఆహ -
అన్యార్థశ్చ పరామర్శః ।
జీవస్యోపాధికల్పితస్య బ్రహ్మభావ ఉపదేష్టవ్యః, న చాసౌ జీవమపరామృశ్య శక్య ఉపదేష్టుమితి తిసృష్వవస్థాసు జీవః పరామృష్టః । తద్భావప్రవిలయనం తస్య పారమార్థికం బ్రహ్మభావం దర్శయితుమిత్యర్థః ॥ ౨౦ ॥
అల్పశ్రుతేరితి చేత్తదుక్తమ్ ।
నిగదవ్యాఖ్యాతేన భాష్యేణ వ్యాఖ్యాతమ్ ॥ ౨౧ ॥
దహర ఉత్తరేభ్యః॥౧౪॥ ప్రాగుదాహృతపరపురుషశబ్దస్య దహరవాక్యశేషగతోత్తమపురుషశబ్దవత్ అబ్రహ్మవిషయత్వశఙ్కాయామ్, అస్యాపి బ్రహ్మవిషయత్వోపపాదనాత్సంగతిః ॥
పూర్వేభ్య ఇతి ।
శ్రవణమననధ్యానేభ్య ఇత్యర్థః।
ఆధేయత్వాదితి ।
బ్రహ్మపురశబ్దోక్తం దేహలక్షణం పురం జీవస్య యుజ్యతే। తస్య పరిచ్ఛిన్నత్వేనాధేయత్వాత్, స్వకర్మోపార్జితశరీరేణ సంబన్ధవిశేషాచ్చ బ్రహ్మణః పురమితి షష్ఠీసమాససంభవాత్। బ్రహ్మణస్తు న యుక్తం పురమ్; ఉక్తహేతుద్వయాభావాదిత్యర్థః।
విశేషాదిత్యేతద్వ్యాఖ్యాతి –
అసాధారణేనేత్యాదినా ।
జీవభేదో జీవవిశేషః।
ఆధేయత్వహేతుం వ్యాచష్టే –
అపి చేత్యాదినా ।
తేనాధికరణేన సహానేన బ్రహ్మశబ్దార్థేనాధేయేన సంబద్ధవ్యమ్; సమాసాభిహితసంబన్ధసామాన్యస్య ఆధారాధేయభావ ఎవ విశ్రమాదిత్యర్థః। భక్తిర్గుణస్తేన హి శబ్దో ముఖ్యార్థాద్భజ్యతే ।
యది చేతనత్వం సమం జీవబ్రహ్మణోస్తర్హి కో విశేషస్తత్రాహ –
ఉపధానేతి ।
భక్త్యా చ తస్య బ్రహ్మశబ్దవాచ్యత్వమితి భాష్యే వాచ్యత్వం తాత్పర్యగమ్యత్వం; భాక్తత్వే సత్యభిధేయత్వవిరోధాదిత్యర్థః। అన్యస్య బ్రహ్మణ ఇత్యర్థః।
అనిర్దిష్టాధేయమితి ।
వేశ్మాధేయతయా నిర్దిష్టస్యాప్యాకాశస్య సందిగ్ధత్వాదనిశ్చయ ఇత్యర్థః।
ఉపమానోక్తేః అన్యథాసిద్ధిమాశఙ్క్యాహ –
తేనేతి ।
హ్యస్తనాద్యతనత్వాదినాయుద్ధే భేదారోపః క్రియతే – గగనం గగనాకారం సాగరః సాగరోపమః। రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ॥ ఇత్యత్ర।
అస్తు వోపాధ్యపేక్షయాఽఽకాశే భేదారోపః, తథాపి న బాహ్యాకాశతుల్యత్వం హార్దాకాశస్యేత్యాహ –
న చేతి ।
యది ఊనత్వాద్ధార్ధనభసో న బాహ్యేనోపమేయతా, హన్తాధికత్వాద్ బ్రహ్మణోఽపి న స్యాదత ఆహ –
న భూతాకాశేతి ।
ఆధేయత్వాదిత్యేతత్ప్రత్యాహ –
ఉపలబ్ధేరితి ।
విశేషాచ్చేత్యేతన్నిరాకరోతి –
తేనేతి ।
ముఖ్యాధేయత్వత్యాగే హేతుమాహ –
తథా చేతి ।
నన్వనిర్ణీతాధేయం వేశ్మ సన్నిహితపురస్వామినా సంబధ్యత ఇత్యుక్తత్వాత్కథం జీవపురే బ్రహ్మసదనలాభోఽత ఆహ –
ఉత్తరేభ్య ఇతి ।
సన్నిధిర్లిఙ్గైర్బాధ్యత ఇత్యర్థః।
నను లిఙ్గాని బ్రహ్మాభేదపరాణి, నేత్యాహ –
బ్రహ్మణో హీతి ।
ఇహ బ్రహ్మణి బాధకం జీవే చ సాధకం ప్రమాణం నాస్తి; బ్రహ్మబాధకత్వేన జీవసాధకత్వేన చేష్టస్య సన్నిధేః లిఙ్గైర్బాధాదిత్యర్థః।
అపి చాసిద్ధో జీవసన్నిధిః, పురస్య బ్రహ్మసంబన్ధోపపాదనాద్ బ్రహ్మశబ్దేన జీవాఽనభిధానాదిత్యాహ –
బ్రహ్మపురవ్యపదేశశ్చేతి ।
‘అథ య ఇహాత్మానమ్’ ఇతి భాష్యస్థశ్రుతావనుశబ్దార్థమాహ –
శ్రవణేతి ।
విదేరర్థమాహ –
అనుభూయేతి ।
సాక్షాత్కృత్యేత్యర్థః।
కామ్యన్త ఇతి
కామాః విషయాః। చారః ఉపలబ్ధిః।
ఆద్యసంశయస్థపూర్వపక్షమనూద్య సిద్ధాన్తయతి –
స్యాదేతదిత్యాదినా ।
భాష్యే ద్యావాపృథివ్యాద్యన్వేప్యత్వాపత్తిరిష్టాపాదనమితి శఙ్కతే –
స్యాదేతదితి ।
తర్హి ‘‘అథ య ఇహాత్మానమ్’’ ఇత్యాత్మశబ్దః కథమత ఆహ –
తాభ్యామితి ।
తథా చ భూతాకాశస్య దహరత్వసిద్ధిరిత్యర్థః।
అస్మిన్కామా ఇత్యస్మిన్-శబ్దేన ద్యావాపృథివ్యాధార ఆకాశ ఎవ పరామృశ్యతే సమానాధారత్వప్రత్యభిజ్ఞానాద్, న ద్యావాపృథివ్యౌ, తథా చైష ఇతి, ఆత్మేతి తదుపరితనశబ్దాభ్యామప్యాకాశ ఎవ నిర్దిష్ట ఇత్యాహ –
అనేన హీతి ।
ఆకృష్యేతి భాష్యే వ్యవధానం సూచితమ్।
వ్యవహితస్య హ్యాకర్షణం తత్కథయతి –
ద్యావాపృథివ్యాదీతి ।
‘‘ఉభే అస్మిన్ ద్యావాపృథివీ అన్తరేవ సమాహితే’’ ఇతి పూర్వవాక్యే ఆకాశనిర్దేశానన్తరం ద్యావాపృథివ్యాదినిర్దేశాద్ వ్యవధానమ్।
ఎతాంశ్చ సత్యాన్ కామాన్ ఇత్యాత్మశబ్దానన్తరం కామనిర్దేశాత్, సర్వేషు లోకేషు కామచారో భవతీతి ఫలశ్రవణం గుణవిజ్ఞానస్యైవేతి శఙ్కతే –
నన్వితి ।
చకారాద్గుణగుణినోర్జ్ఞేయత్వే సముచ్చయావగమాత్ సముచ్చితోపాస్తిఫలం కామచార ఇతి పరిహారార్థః।
పూర్వత్ర అవ్యవహితద్యావాపృథివ్యావుపేక్ష్య అస్మిన్-శబ్దేన ప్రత్యభిజ్ఞానాదాకాశమేవ పరామృశ్యత ఇత్యుక్తం, తత్రైవ హేత్వన్తరమాహ –
అస్మిన్కామా ఇతి చేతి ।
లక్షితాత్మన ఐక్యేఽపి పూర్వం శబ్దతోఽనుపాత్తే నైకవచనపరామృశ్యతా - ఇత్యర్థః।
యది దహరాకాశస్య విజ్ఞేయత్వం, కథం తర్హి తదాధేయస్య విజ్ఞేయత్వోపదేశోఽత ఆహ –
తదనేనేతి ।
ఎతమేవ దహరాకాశం ప్రక్రమ్య శ్రుతిః ప్రవవృత ఇత్యన్వయః। ధనాయద్భిః ధనేచ్ఛావద్భిః।
యద్యపి సుషుప్తౌ బ్రహ్మప్రాప్తిర్న లోకసిద్ధా; తథాపి వేదసంస్కృతజనప్రసిద్ధ్యా వేదస్య తత్ర తాత్పర్యం గమ్యత ఇత్యాహ -
తథాపీతి ।
కర్మధారయస్య షష్ఠీసమాసాత్ బలీయస్త్వాత్ లిఙ్గోపన్యాసవైయర్థ్యమాశఙ్క్య, అభ్యుచ్చయార్థత్వేన పరిహరతి –
అత్ర తావదిత్యాదినా ।
షష్ఠే స్థితమ్ – స్థపతిః నిషాదః, శబ్దసామర్థ్యాత్ (జై.సూ.అ.౬.పా.౧.సూ.౫౧) రౌద్రీమిష్టిం విధాయ ఆమ్నాయతే - ఎతయా నిషాదస్థపతిం యాజయేదితి। తత్ర నిషాదస్థపతిః త్రైవర్ణికానామన్యతమః, ఉతాన్యః ఇతి సందేహే, అగ్నివిద్యావత్త్వేన సమర్థత్వాత్ అనిషాదేఽపి నిషాదానాం స్థపతిః స్వామీతి శబ్దప్రవృత్తిసంభవాదన్యతమ ఇతి ప్రాప్తేఽభిధీయతే। నిషాద ఎవ స్థపతిః స్యాత్, కర్మధారయశ్చ సమాసః, నిషాదశబ్దస్య శ్రౌతార్థలాభేన శబ్దసామర్థ్యాత్। షష్ఠీసమాసే తు సంబన్ధో లక్ష్యేత షష్ఠ్యశ్రవణాత్ సమాసస్థషష్ఠీలోపోఽపి శబ్దాభావత్వన్నైవ షష్ఠ్యర్థబోధీ ద్వితీయాయాశ్చ ప్రత్యేకం నిషాదస్థపతిశబ్దాభ్యాం సంబన్ధసంభవే సతి నాశ్రుతషష్ఠీ కల్ప్యా। తస్మాన్నిషాద ఎవ స్థపతిరితి। తదప్యాధిక్యముక్తం సూత్రకారేణ చకారం ప్రయుఞ్జానేనేత్యర్థః।
సూత్రార్థమాహ –
తథా హీత్యాదినా ।
విపక్షాద్వ్యావృత్తౌ హేతుమాహ –
అసంభవాదితి॥౧౫॥
సేతుర్విధృతిరితి శ్రుతౌ ధృతిశబ్ద ఆత్మశబ్దసామానాధికరణ్యాత్ యద్యపి కర్తృవాచీ క్తిజన్తస్తథాఽపి సూత్రగతధృతిశబ్దో మహిమశబ్దసామానాధికరణ్యాత్ క్తిన్నన్తత్వేన భావవచన ఇత్యాహ –
సౌత్ర ఇతి॥౧౬॥
ప్రసిద్ధిశబ్దస్య రూఢివాచిత్వభ్రమమపనయతి –
న చేతి ।
రథాఙ్గమితి నామ చక్రవాకే లక్షణయా సంప్రత్యేవ ప్రయుజ్యతే। రథాఙ్గశబ్దపర్యాయస్య చక్రప్రాతిపదికస్య చక్రవాకశబ్దావయవత్వేన నివేశాత్।
ఆకాశశబ్దస్య తు బ్రహ్మణ్యనాదికాలే బహుకృత్వః ప్రయోగాన్నిరూఢలక్షణేత్యర్థః॥ పఞ్చపాద్యాం తు రూఢిరుక్తా, తాం దూషయతి –
యేత్వితి ।
నభసి బ్రహ్మణి చ రూఢ్యభ్యుపగమేఽనేకార్థత్వం, నాభసగుణయోగాద్ బ్రహ్మణి వృత్తిసంభవే చ శక్తికల్పనాయాం గౌరవమిత్యర్థః। అత్ర కేచిత్ - ఆసమన్తాత్ కాశత ఇతి ఆకాశశబ్దస్య అవయవవృత్తిసంభవే సేతుశబ్దస్యేవ తద్బహిర్భూతగుణవృత్తిరయుక్తా - ఇత్యాహుః। తన్న; అపహృత్య యోగం రూఢ్యర్థే ప్రత్యాయితే రూఢిం పురస్కృత్య క్లృప్తాదేవ గుణయోగాదన్యత్ర వృత్తిలాభేఽనపేక్ష్య రూఢిమవయవవ్యుత్పత్తిక్లేశస్యాయుక్తత్వాత్। సేతుశబ్దోఽపి సేతుగుణాద్విధరణాదేః బ్రహ్మణి వర్తతే। భాష్యకృద్భిస్తు సేతుశబ్దవ్యుత్పత్తిరభ్యుచ్చయార్థమాశ్రితా।
అస్తు తర్హ్యనేకార్థత్వపరిహారాయ బ్రహ్మణ్యేవ ముఖ్యత్వమత ఆహ –
న చేతి ।
తేనైవ విభుత్వాదిగుణయోగేన। వర్త్స్యతి వృతో భవిష్యత్యాకాశశబ్ద ఇతి న వాచ్యమ్। తత్ర హేతుః – వైదికపదార్థప్రత్యయస్య లోకపూర్వకత్వాద్వేదే రూఢ్యప్రతీతేరితి।
ఎతత్సిద్ధ్యర్థమాహ –
లోకాధీనేతి స్యాన్తేన ।
రూఢివాదీ తు ప్రసిద్ధగుణవృత్తివైషమ్యం శఙ్కతే –
నన్వితి ।
వ్యతిరేకేణ నిర్దేశాదితి ।
అన్తర్హృదయఆకాశ ఇతి బ్రహ్మణ్యాకాశశబ్దప్రయోగాదేవాకాశగుణయోగస్య లక్ష్యస్య సిద్ధౌ లభ్యాయామపి తద్వ్యతిరేకేణ యావాన్వా అయమాకాశః తావాన్ ఇత్యాకాశసాదృశ్యస్య నిర్దేశాత్ లక్షణా న యుక్తేత్యర్థః।
యత్ర లక్షణయా శబ్దః ప్రయుజ్యతే తత్ర లక్ష్యాంశస్య పృథక్ న నిర్దేశ ఇత్యత్ర దృష్టాన్తమాహ -
న హి భవతీతి ।
గఙ్గాపదేన గఙ్గాయాః కూలమిత్యర్థే వివక్షితే గఙ్గాపదమేవ ప్రయుజ్యతే, న తు గఙ్గాయా ఇతి లక్ష్యసంబన్ధం పృథగుక్త్వా గఙ్గేతి ప్రయుజ్యత ఇత్యర్థః।
పరిహరతి –
తత్కిమితి ।
ఆగ్నేయాదౌ పౌర్ణమాస్యమావాస్యాశబ్దప్రయోగాదేవ లక్ష్యస్య కాలసంబన్ధస్య సిద్ధావపి తద్వ్యతిరేకేణ పౌర్ణమాస్యామమావాస్యాయామితి చ కాలసంబన్ధనిర్దేశాత్ ఉక్తన్యాయోఽనేకాన్త ఇత్యర్థః।
దృష్టాన్తాఽసిద్ధిమాశఙ్క్యాహ –
న చేతి ।
ముఖ్యత్వే హ్యమావాస్యాయామపరాహ్ణే పిణ్డపితృయజ్ఞేన చరన్తీత్యత్రాపి అమావాస్యాశబ్దస్య కర్మణి రూఢిః స్యాత్, తథా చ పితృయజ్ఞః స్వకాలత్వాదనఙ్గం స్యాత్ (జై.సూ.అ.౪.పా.సూ.౧౯) ఇత్యధికరణబాధ ఇతి।
అపరం రూఢికారణమాశఙ్కతే –
యచ్చేతి ।
అన్యత్ర ముఖ్యత్వేన నిశ్చితస్య శబ్దస్యాన్యత్రార్థే ప్రయోగేఽర్థశ్చేదన్యతోఽధిగతస్తర్హి ముఖ్యత్వం, న చేదముఖ్యత్త్వం; గఙ్గాయాం ఘోష ఇత్యత్ర హి గఙ్గాపదాదేవ గఙ్గాసంబన్ధితీరమనుపపత్త్యా శ్రోతా జానాతి తతస్తత్ర లక్షణా, ఆకాశశబ్దస్తు యదేష ఆకాశ ఆనన్దో న స్యాదిత్యత్ర సత్యం జ్ఞానమనన్తమితి వాక్యనిశ్చితే బ్రహ్మణి ప్రయుక్త ఇతి వాచకః। తథా చ దహరవాక్యేఽపి బ్రహ్మవాచక ఇత్యర్థః।
శబ్దాదనధిగతార్థప్రతీతౌ లక్షణేత్యేతద్వ్యభిచారయతి –
సోమేనేతి ।
సోమశబ్దో హి లతాచన్ద్రమసోర్ముఖ్యః, ఎతద్వాక్యార్థాన్వయిత్వేన సోమపదాదన్యతోఽనధిగతాయాం లతాయామత్ర వాక్యే ప్రయుక్త ఇత్యర్థః।
అన్యతో నిశ్చితే శబ్దస్య ముఖ్యత్వమిత్యేతదనేకాన్తయతి –
న చేతి ।
అత్ర హి సముదాయానువాదివాక్యద్వయే పౌర్ణమాస్యామావాస్యాశబ్దౌ లాక్షణికౌ న భవతః, యాగషట్కశ్చ ప్రకృతాదాగ్నేయాదివాక్యాద్ జ్ఞాత ఇతి జ్ఞాతార్థవిషయత్వం ముఖ్యత్వేఽనేకాన్తమిత్యర్థః॥౧౭॥౧౮॥ వరివసితుం శుశ్రూషితుమ్। అపనినీషుః అపనేతుమిచ్ఛన్ప్రజాపతిరువాచేత్యన్వయః। యథా ప్రాక్ప్రతిబిమ్బాత్మత్వేన దృష్టనఖలోమ్నాం ఛేదనాదూర్ధ్వమభావాదనాత్మత్వమ్, ఎవం సర్వస్య ప్రతిబిమ్బస్య వివక్షితమ్। సాధు అలంకారాద్యుపన్యాసేన।
ఎష ఆత్మేతి ।
దేహాద్యాగమాపాయసాక్షీత్యర్థః।
దేహానుపాతిత్వాచ్ఛాయాయా ఇతి ।
యథా ఖలు నీలానీలపటయోరాదర్శే దృశ్యమానయోః యన్నీలం తన్మహార్హమిత్యుక్తే న చ్ఛాయాయా మహార్హత్వమేవం ఛాయాకారదేహస్యైవాత్మత్వమితి విరోచనో మేనే। ఇన్ద్రస్తు అల్పపాపత్వాత్ శ్రద్దధానతయా న ప్రతిబిమ్బమేవాత్మేతి ప్రతిపేదే। ఎవంకారమ్ ఎవం కృత్వా। న నిర్వవార - నివృత్తిం సుఖం నానుబభూవ। అక్షిణి అక్ష్యుపలక్షితే జాగ్రతి। అభిప్రతీతః అభిప్రతీతివాన్।
చతుర్థపర్యాయం ప్రతీకత ఆదత్తే -
ఎష సంప్రసాద ఇతి ।
వాగ్బుద్ధిశరీరాణాం కార్యభూతో య ఆరమ్భః క్రియా తతః సంభవో యస్య పాప్మాదేరపూర్వస్య స తథా। జీవవాదీ ప్రష్టవ్యః - కిమీశ్వరమేవ మన్యతే, ఉత తస్య జీవప్రత్వగాత్మత్వమ్ అథవాఽభ్యుపేత్యేశ్వరస్య జీవప్రత్యక్త్వమ్ అత్ర వాక్యే ఈశ్వరప్రతిపాదనం న మన్యత ఇతి।
నాద్య ఇత్యాహ –
పౌర్వాపర్యేతి ।
న ద్వితీయ ఇత్యాహ –
తదతిరిక్తం చేతి ।
రజ్జ్వాం భుజఙ్గవజ్జగత్పరమాత్మని వికల్పితం జీవోఽపి ద్వితీయచన్ద్రవద్భేదేనాధ్యస్త ఇత్యాహ –
తథా చేతి ।
తృతీయం ప్రత్యాహ –
ఎవం చ బ్రహ్మైవేతి ।
శ్రుత్యా ప్రజాపతివాక్యే ఉక్తమిత్యర్థః।
భాష్యేఽన్యాసంసర్గిణ ఆత్మనోఽభివ్యక్తిసమ్భవే అన్యసంసర్గిస్ఫటికదృష్టాన్తవర్ణనమయుక్తమిత్యాశఙ్క్యాహ –
యద్యపి స్ఫటికాదయ ఇతి ।
జపాకుసుమాదినా సంయుక్తం భూతలం తేన నికట ఎవ సంయోగో యేషాం స్ఫటికాదీనాం తే సంయుక్తసంయోగాః। తద్రూపత్వమ్ తదాత్మత్వమ్। తథా చ వ్యవధానేన సంయుక్తా ఇత్యర్థః।
ప్రాగ్వివేకవిజ్ఞానోత్పత్తేరితి భాష్యే వేదనాశబ్దార్థమాహ –
వేదనా ఇతి ।
అనావృతస్వరూపస్ఫురణముపసమ్పత్తిశబ్దార్థమాహ –
తథా చేతి ।
నను స్వరూపాభినిష్పత్తిర్వృత్తిః, తయాఽపసారితే ఆవరణే పశ్చాజ్జ్యోతిరుపసంపత్తిః, తత్కథం వ్యుత్క్రమేణ నిర్దేశోఽత ఆహ –
అత్ర చేతి ।
యదా చ వివేకసాక్షాత్కార ఇతి ।
పూర్వం పరోక్షజ్ఞానం శరీరాత్సముత్థానముక్తమ్। ఇదానీం తస్య ఫలపర్యన్తత్వాత్తత్ఫలం సాక్షాత్కారోఽపి శరీరాత్ సముత్థానత్వేనానూదోత ఇతి న విరోధః।
నాపి ప్రతిచ్ఛాయాత్మాఽయమ్ ఇతి భాష్యం ప్రతిబిమ్బస్య అక్షిపురుషత్వేన నిర్దేశవారకమప్రాసఙ్గికమివ ప్రతిభాతి, తత్పూర్వపక్షితజీవదృష్టాన్తనిరాకరణపరత్వేన ప్రకృతే సఙ్గమయతి –
స్యాదేతదితి ।
అక్షిపర్యాయే ఛాయాత్మా నిర్దిష్టః, స్వప్నసుషుప్తిపర్యాయయోర్జీవోఽతః ఛాయాత్మదృష్టాన్తేన జీవశఙ్కా।
అహేత్యత్ర బిన్దుమధ్యాహృత్య వ్యాచష్టే –
అహమాత్మానమితి ।
అహమితిశబ్దగోచరమిత్యర్థః। యథాశ్రుతపాఠేఽహేత్యవధారణార్థో నిపాతః। నైవ జానాతీత్యర్థః। సుప్తే చైతన్యస్య స్ఫురణాత్సర్వథాఽఽత్మభాననిషేధో న యుక్తోఽత ఔపాధికస్ఫూర్తినిషేధాయ నిపాతస్యావధారణార్థత్వం జానతైవ బిన్దురధ్యాహృతః।
అవినాశిత్వాదితి హేతోః సాధ్యావిశేషమాశఙ్క్యాహ –
అనేనేతి ।
అసిద్ధస్యాపి హేతోః సిద్ధినిర్దేశేన సిద్ధిహేతుభూతం ప్రమాణం సూచితమిత్యర్థః।
తదేవ ప్రమాణం దర్శయతి –
య ఎవాహమితి ।
ఆచార్యదేశీయాః ఆచార్యకల్పాః। న తు సమ్యగాచార్యాస్తన్మతమిత్యర్థః।
ఎకదేశిప్రత్యవస్థానం జీవో దహర ఇతి పూర్వపక్షేఽన్తర్భావయతి -
యదీతి ।
ఉక్తం హి పూర్వపక్షిణా ఛాయావద్వా ఆరోపేణ స్వత ఎవ వా దేహాదివియోగమపేక్ష్య అమృతాభయత్వాది జీవస్యైవేతి ఎతం త్వేవ త ఇత్యాక్షిస్థపురుషానుకర్షణమఙ్గీకృత్య, ఇదానీం తు పరామర్శస్యాన్యవిషయత్వేన స ఎవైకదేశీ భూత్వా ప్రత్యవతిష్ఠత ఇత్యర్థః। నన్వేవం పరమాత్మా చేదిహ నిర్దిష్టః స ఎవేహ దహరః కిం న స్యాత్। అస్తు జీవోఽపి కిం న భవేత్? అత ఎవ అవినిగమేన పూర్వపక్ష ఇత్యతీతాన్తరసూత్రోపక్రమే వర్ణితం తదిహాపి సూత్రేఽనుసంధేయమ్। నన్వేతం వ్యాఖ్యాస్యామీతి పరమాత్మానం ప్రతిజ్ఞాయ కథం స్వప్నసుషుప్తిపర్యాయయోర్జీవో వ్యాఖ్యాయతే। ఉచ్యతే – సూక్ష్మే చతుర్థపర్యాయే వక్ష్యమాణే పరాత్మని। ధీనివేశాయ జీవస్యాప్యుపాస్తిరిహ వర్ణ్యతే॥ అత ఎవ వ్యాఖ్యాస్యామీతి భవిష్యతాఽవగమః।
నను పరమాత్మపరామర్శే జీవః పరామృష్ట ఎవ తదభేదాదత ఆహ –
న ఖల్వితి ।
దృష్టే సంభవతి అదృష్టకల్పనానుపపత్తేః జీవానువాదేన బ్రహ్మతా బోధ్యతే నోపాస్తివిధిః। ఇన్ద్రబ్రహ్మచర్యావసానానన్తర్యార్థా భవిష్యోక్తిరితి పరిహారాశయః। అస్య చౌపాధికో జీవః, అవచ్ఛిన్నే చ నాపహతపాప్మత్వాదిసంభవ ఇతి మతమ్।
పారమార్థికజీవబ్రహ్మవిభాగమతమాహ –
మతాన్తరమితి ।
శారీరకార్థమాహ –
తథాహీతి ।
సూత్రకోపం పరిహరతి –
న చ వస్తుసత ఇతి ।
ఔపాధికభేదేన గుణసంకర ఇత్యర్థః।
కర్మవిధ్యుపరోధం వారయతి –
అవిద్యాకల్పితమితి ।
అవిద్యాకల్పితం కర్తృత్వాద్యాశ్రిత్య కర్మవిధయః ప్రవృత్తా ఇత్యత్ర హేతుమాహ –
అవిద్యావదితి ।
ఇత్యుక్తమధ్యాసభాష్యే॥౧౯॥ అవినిగమపరిహారార్థం జీవపరామర్శస్యాన్యథాసిద్ధిప్రతిపాదకం సూత్రమవతార్య వ్యాచష్టే –
నన్విత్యాదినా॥౨౦॥౨౧॥
స స వా అయమితి ।
స వై ఈశ్వరస్తత్త్వతోఽయం జీవ ఎవ ఔపాధికస్తు భేద ఇత్యాహ –
పురుష ఇతి ।
పురుషశబ్దార్థమాహ –
పురిశయ ఇతి ।
పూః ఉపాధిః। కిమేకస్యామేవ పురి శేతే, న; అపి తు సర్వాసు పూర్షు। తమాచార్యం శిష్యాశ్చేద్ బ్రూయుః।
తద్యత్రేతి ।
తత్తత్ర అవస్థాద్వయప్రాపకకర్మోపరమే సతి యత్ర యస్మిన్కాలే। ఎతదితి క్రియావిశేషణమ్। ఎతత్స్వప్నమ్। సుప్తః స్వాపస్య ద్విప్రకారత్వాత్।
స్వప్నవ్యావృత్త్యర్థమాహ –
సమస్త ఇతి ।
ఉపసంహృతసర్వకరణ ఇత్యర్థః। అత ఎవ విషయాసంపర్కాత్ సంప్రసన్నః। స్వప్నే మహీయమానః పూజ్యమానః చరతి పశ్యతి భోగాన్॥ ఇతి పఞ్చమం దహరాధికరణమ్॥