తదన్తరప్రతిపత్తౌ రంహతి సమ్పరిష్వక్తః ప్రశ్ననిరూపణాభ్యామ్ । ద్వితీయతృతీయాధ్యాయయోర్హేతుమద్భావలక్షణం సమ్బన్ధం దర్శయన్ సుఖావబోధార్థమర్థసఙ్క్షేపమాహ –
ద్వితీయేఽధ్యాయ ఇతి ।
స్మృతిన్యాయశ్రుతివిరోధపరిహారేణ హి అనధ్యవసాయలక్షణమప్రామాణ్యం పరిహృతం తథా చ ప్రామాణ్యే నిశ్చలీకృతే తార్తీయో విచారో భవత్యన్యథా తు నిర్బీజతయా న సిద్ధ్యేదితి । అవాన్తరసఙ్గతిం దర్శయితుం తత్ర చ జీవవ్యతిరిక్తాని తత్త్వాని జీవోపకరణాని చేత్యుక్తమ్ ।
అధ్యాయార్థసఙ్క్షేపముక్త్వా పాదార్థసఙ్క్షేపమాహ –
తత్ర ప్రథమే తావత్పాద ఇతి ।
తస్య ప్రయోజనమాహ –
వైరాగ్య ఇతి ।
పూర్వాపరపరిశోధనాయ భూమికామారచయతి –
జీవో ముఖ్యప్రాణసచివ ఇతి ।
కరణోపాదానవద్భూతోపాదానస్యాశ్రుతత్వాదితి ।
అత్ర చ కరణోపాదానశ్రుత్యైవ భౌతికత్వాత్కరణానాం భూతోపాదానసిద్ధేరిన్ద్రియోపాదానాతిరిక్తభూతవివక్షయాధికరణారమ్భః । యది భూతాన్యాదాయాగమిష్యత్తదా తదపి కరణోపాదానవదేవశ్రోష్యత్ । నచ శ్రూయతే తస్మాన్న భూతపరిష్వక్తో రంహత్యపి తు కరణమాత్రపరిష్వక్తః । నహ్యాగమైకగమ్యేఽర్థే తదభావః ప్రమేయాభావం న పరిచ్ఛేత్తుమర్హతి ।
నచ దేహాన్తరారమ్భాన్యథానుపపత్త్యా భూతపరిష్వక్తస్య రంహణకల్పనేతి యుక్తమిత్యాహ –
సులభాశ్చ సర్వత్ర భూతమాత్రా ఇతి ।
ద్యుపర్జన్య ఇతి ।
ఇహ హి కాయారమ్భణామగ్నిహోత్రాపూర్వపరిణామలక్షణం శ్రద్ధాదిత్వేన పఞ్చధా ప్రవిభజ్య ద్యుప్రభృతిష్వగ్నిషు హోతవ్యత్వేనోపాసనముత్తరమార్గప్రతిపత్తిసాధనం వివక్షన్త్యాహ శ్రుతిః “అసౌ వావ లోకో గౌతమాగ్నిః”(ఛా. ఉ. ౫ । ౪ । ౧) ఇత్యాది । అత్ర సాయమ్ప్రాతరగ్నిహోత్రాహుతో, హుతే పయ ఆదిసాధనే శ్రద్ధాపూర్వమాహవనీయాగ్నిసమిద్ధూమార్చిరఙ్గారవిస్ఫులిఙ్గభావితే కర్త్రాదికారకభావితే చాన్తరిక్షం క్రమేణోత్క్రామ్య ద్యులోకం ప్రవిశన్త్యౌ సూక్ష్మభూతే ద్రవద్రవ్యపయఃప్రభృత్యప్సమ్బన్ధాదప్శబ్దవాచ్యే, శ్రద్ధాహేతుకత్వాచ్చ శ్రద్ధాశబ్దవాచ్యే । తయోరాహుత్యోరధికరణమగ్నిరన్యే చ సమిద్ధూమార్చిరఙ్గారవిస్ఫులిఙ్గా రూపకత్వేన నిర్దిశ్యన్తే । అసౌ వావ ద్యులోకో గౌతమాగ్నిః । యథాగ్నిహోత్రాధికరణమాహవనీయ ఎవం శ్రద్ధాశబ్దవాచ్యాగ్నిహోత్రాహుతిపరిణామావస్థారూపాః సూక్ష్మా యా ఆపః శ్రద్ధాభావితాస్తదధికరణం ద్యులోకః । అస్యాదిత్య ఎవ సమిత్ । తేన హీద్ధోఽసౌ ద్యులోకో దీప్యతేఽతః సమిన్ధనాత్సమిత్తస్యాదిత్యస్య రశ్మయో ధూమా ఇన్ధనాదివాదిత్యాద్రశ్మీనాం సముత్థానాత్ । అహరర్థిః । ప్రకాశసామాన్యాదాదిత్యకార్యత్వాచ్చ । చన్ద్రమా అఙ్గారః । అర్చిషః ప్రశమేఽభివ్యక్తేః । నక్షత్రాప్యస్య విస్ఫులిఙ్గాః చన్ద్రమసోఽఙ్గారస్యావయవా ఇవ విప్రకీర్ణతాసామాన్యాద్విస్ఫులిఙ్గః । తదేతస్మిన్నగ్నౌ దేవా యజమానప్రాణా అగ్న్యాదిరూపా అధిదేవమ్ । శ్రద్ధాం జుహ్వతి శ్రద్ధా చోక్తా । పర్జన్యో వావ గౌతమాగ్నిః పర్జన్యో నామ వృష్ట్యుపకరణాభిమానీ దేవతావిశేషః । తస్య వాయురేవ సమిత్ । వాయునా హి పర్జన్యోఽగ్నిః సమిధ్యతే, పురోవాతాదిప్రాబల్యే వృష్టిదర్శనాత్ । అభ్రం ధూమః । ధూమకార్యత్వాత్ధూమసాదృశ్యాచ్చ । విద్యుదర్చిః । ప్రకాశసామాన్యాత్ । అశనిరఙ్గారాః కాఠిన్యాద్విద్యుత్సమ్బన్ధాచ్చ । గర్జితం మోఘానాం విస్ఫులిఙ్గాః విప్రకీర్ణతాసామాన్యాత్ । తస్మిన్దేవా యజమానప్రాణా అగ్నిరూపాః సోమం రాజానం జుహ్వతి తస్య సోమస్యాహుతేర్వర్షం భవతి । ఎతదుక్తం భవతి శ్రద్ధాఖ్యా ఆపో ద్యులోకమాహుతిత్వేన ప్రవిశ్య చన్ద్రాకారేణ పరిణతాః సత్యో ద్వితీయే పర్యాయే పర్జన్యాగ్నౌ హుతా వృష్టిత్వేన పరిణమన్త ఇతి । “పృథివీ వావ గౌతమాగ్నిః”(ఛా. ఉ. ౫ । ౬ । ౧) తస్య పృథివ్యాఖ్యస్యాగ్నైః సంవత్సర ఎవ సమిత్ । సంవత్సరేణ కాలేన హి సమిద్ధా భూమిర్వ్రీహ్యాదినిష్పత్తయే కల్పతే । ఆకాశో ధూమః పృథివ్యగ్నేరుత్థిత ఇవాకాశో దృశ్యతే । రాత్రిరర్చిః పృథివ్యాః శ్యామాయా అనురూపా శ్యామతయా రాత్రిరగ్నేరివానురూపమర్చిః । దిశోఙ్గారాః ప్రగే రాత్రిరూపార్చిఃశమనే ఉపశాన్తానాం ప్రసన్నానాం దిశాం దర్శనాత్ । అవాన్తరదిశో విస్ఫులిఙ్గాః క్షుద్రత్వసామ్యాత్ । తస్మిన్నగ్నౌ శ్రద్ధాసోమపరిణామక్రమేణాగతా అపో వృష్టిరూపేణ పరిణతా దేవా జుహ్వతి తస్యా ఆహుతేరన్నం వ్రీహియవాది భవతి । పురుషో వావ గౌతమాగ్నిస్తస్య వాగేవ సమిత్ । వాచా ఖల్వయం తాల్వాద్యష్టస్థానస్థితయా వర్ణపదవాక్యాభివ్యక్తిక్రమేణార్థజాతం ప్రకాశయన్ సమిధ్యతే । ప్రాణో ధూమః । ధూమవన్ముఖాన్నిర్గమాత్ । జిహ్వార్చిః లోహితత్వసామ్యాత్ । చక్షురఙ్గారాః ప్రభాశ్రయత్వాత్ । శ్రోత్రం విస్ఫులిఙ్గాః విప్రకీర్ణత్వాత్ । తా ఎవాపః శ్రద్ధాదిపరిణామక్రమేణాగతాః వ్రీహ్యాదిరూపైః పరిణతా సత్యః పురుషేఽగ్నౌ హుతాస్తాసాం పరిణామో రేతః సమ్భవతి । యోషా వావ గౌతమాగ్నిః తస్యా ఉపస్థ ఎవ సమిత్ । తేన హి సా పుత్రాద్యుత్పాదనాయ సమిధ్యతే యదుపమన్త్రయతే స ధూమః । స్త్రీసమ్భవాదుపమన్త్రణస్య లోమాని వా ధూమః యోనిరర్చిః లోహితత్వాత్ । యదన్తః కరోతి మైథునం తేఽఙ్గారాః । అభినన్దాః సుఖలవా విస్ఫులిఙ్గాః, క్షుద్రత్వాత్ । తస్మిన్నేతస్మిన్నగ్నౌ దేవా రేతో జుహ్వతి తస్యా ఆహుతేర్గర్భః సమ్భవతి । ఎవం శ్రద్ధాసోమవర్షాన్నరేతోహవనక్రమేణ యోషాగ్నిం ప్రాప్యాపో గర్భాఖ్యా భవన్తి । తత్రాప్సమవాయిత్వాదాపః పురుషవచసో భవన్తి పఞ్చమ్యామాహుతావితి । యతః పఞ్చమ్యామాహుతావాపః పురుషవచసో భవన్తి తస్మాదద్భిః పరివేష్టితో జీవో రహతీతి గమ్యతే । ఎతదుక్తం భవతి శ్రద్ధాశబ్దవాచ్యా ఆప ఇత్యగ్రే వక్ష్యతి తాసాం త్రివృత్కతతయా తేజోఽన్నావినాభావేనాబ్గ్రహణేన తేజోన్నయోరపి సఙ్గ్రహ ఇత్యేతదపి వక్ష్యతే । యద్యప్యేతావతాపి భూతవేష్టితస్య జీవస్య రంహణం నావగమ్యతే తేజోబన్నానాం పఞ్చమ్యామాహుతౌ పురుషవచస్త్వమాత్రశ్రవణాత్ , తథాపీష్టాదికారిణాం ధూమాదినా పితృయాణేన పథా చన్ద్రలోకప్రాప్తికథనపరయా “ఆకాశాచ్చన్ద్రమసమేష సోమో రాట్”(ఛా. ఉ. ౫ । ౧౦ । ౪) ఇతి శ్రుత్యా సహ “శ్రద్ధాం జుహ్వతి తస్యా ఆహుతేః సోమో రాజా సమ్భవతి”(ఛా. ఉ. ౫ । ౪ । ౨) ఇత్యస్యాః శ్రుతేః మానత్వాద్గమ్యతే భూతపరిష్వక్తో రంహతీతి । తథాహి యా ఎవాపో హుతా ద్వితీయస్యామాహుతౌ సోమభావం గతాస్తాభిరేష పరిష్వక్తో జీవ ఇష్టాదికారీ చన్ద్రభూయం గతశ్చన్ద్రలోకం ప్రాప్త ఇతి । నను స్వతన్త్రా ఆపః శ్రద్ధాదిక్రమేణ సోమభావమాప్నువన్తు తాభిరపరిష్వక్త ఎవ తు జీవః సేన్ద్రియమాత్రో గత్వా సోమభావమనుభవతు । కో దోషః । అయం దోషః । యతః శ్రుతిసామాన్యాతిక్రమ ఇతి । ఎవం హి శ్రుతిసామాన్యం కల్పేత యది యేన రూపేణ యేన చ క్రమేణాపాం సోమభావస్తేనైవ జీవస్యాపి సోమభావో భవేత్ । అన్యథా తు న శ్రుతిసామాన్యం స్యాత్ । తస్మాత్పరిష్వక్తాపరిష్వక్తరంహణవిశయే శ్రుతిసామాన్యానురోధేన పరిష్వక్తరంహణం నిశ్చీయతే । అతో దధిపయఃప్రభృతయో ద్రవభూయస్త్వాదాపో హుతాః సూక్ష్మీభూతా ఇష్టాదికారిణమాశ్రితా నేన్ధనేన విధినా దేహే హూయమానే హుతాః సత్య ఆహుతిమయ్య ఇష్టాదికారిణం పరివేష్ట్య స్వర్గం లోకం నయన్తీతి ।
చోదయతి –
నన్వన్యా శ్రుతిరితి ।
అయమర్థః ఎవం హి సూక్ష్మదేహపరిష్వక్తో రంహేత్యద్యస్య స్థూలం శరీరం రంహతో న భవేత్ । అస్తి త్వస్య వర్తమానస్థూలశరీరయోగ ఆదేహాన్తరప్రాప్తేస్తృణజలాయుకానిదర్శనేన, తస్మాన్నిదర్శనశ్రుతివిరోధాన్న సూక్ష్మదేహపరిష్వక్తో రంహతీతి ।
పరిహరతి –
తత్రాపీతి ।
న తావత్పరమాత్మనః సంసరణసమ్భవః, తస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావత్వాత్ । కిన్తు జీవానామ్ । పరమాత్మైవ చోపాధికల్పితావచ్ఛేదో జీవ ఇత్యాఖ్యాయతే, తస్య చ దేహేన్ద్రియాదేరుపాధేః ప్రాదేశికత్వాన్న తత్ర సన్ దేహాన్తరం గన్తుమర్హతి । తస్మాత్సూక్ష్మదేహపరిష్వక్తో రంహతికర్మోపస్థాపితః ప్రతిపత్తవ్యః ప్రాప్తవ్యో యో దేహస్తద్విషయాయా భావనాయా ఉత్పాదనాయా దీర్ఘీభావమాత్రం జలూకయోపమీయతే ।
సాఙ్ఖ్యానాం కల్పనామాహ –
వ్యాపినాం కరణానామితి ।
ఆహఙ్కారికత్వాత్కరణానామహఙ్కారస్య చ జగన్మణ్డలవ్యాపిత్వాత్కరణానామపి వ్యాపితేత్యర్థః ।
బౌద్ధానాం కల్పనామాహ –
కేవలస్యైవాత్మన ఇతి ।
ఆలయవిజ్ఞానసన్తాన ఆత్మా తస్య వృత్తిః షట్ప్రవృత్తివిజ్ఞానాని । పఞ్చేన్ద్రియాణి తు చక్షురాదీని అభినవాని జాయన్తే ।
కణభుక్క్ల్పనామాహ –
మన ఎవ చేతి ।
భోగస్థానం భోగాయతనం శరీరమభినవమితి యావత్ ।
దిగమ్బరకల్పనామాహ –
జీవ ఎవోత్ప్లుత్యేతి ।
ఆదిగ్రహణేన లోకాయతికానాం కల్పనాం సఙ్గృహ్ణాతి । తే హి శరీరాత్మవాదినో భస్మీభావమాత్మన ఆహుర్న కస్యచిద్గమనమితి ॥ ౧ ॥
చోదయతి –
ననూదాహృతాభ్యామితి ।
అత్ర సూత్రేణోత్తరమాహ –
త్ర్యాత్మకత్వాత్తు భూయస్త్వాత్ ।
తేజసః కార్యమశితపీతాహారపరిపాకః । అపాం కార్యం స్నేహస్వేదాది । పృథివ్యాః కార్యం గన్ధాది ।
యస్తు గన్ధస్వేదపాకప్రాణావకాశదానదర్శనాద్దేహస్య పాఞ్చభౌతికత్వం పశ్యంస్తేజోబన్నాత్మకత్వేన త్ర్యాత్మకత్వే న పరితుష్యతి, తం ప్రత్యాహ –
పునశ్చ త్ర్యాత్మక ఇతి ।
వాతపిత్తశ్లేష్మభిస్త్రిభిర్ధాతుభిః శరీరధారణాత్మకైస్త్రిధాతుత్వాత్ । అతో న స దేహో భూతాన్తరాణి ప్రత్యాఖ్యాయ కేవలాభిరద్భిరారబ్ధుం శక్యతే ।
అబ్గ్రహణనియమస్తర్హి కస్మాదిత్యత ఆహ –
తస్మాద్భూయస్త్వాపేక్ష ఇతి ।
పృథివీధాతువర్జమితరతేజ ఆద్యపేక్షయా కార్యస్య శరీరస్య లోహితాదిద్రవభూయస్త్వాత్తత్కరణయోశ్చోపాదాననిమిత్తయోర్ద్రవభూయస్త్వాదపాం పురుషవచస్త్వోక్తిర్న పునర్భూతాన్తరనిరాసార్థా ॥ ౨ ॥
ప్రాణగతేశ్చ ।
ప్రాణానాం జీవద్దేహే సాశ్రయత్వమవగతం గచ్ఛతి జీవద్దేహే తదనువిధాయినః ప్రాణా అపి గచ్ఛన్తీతి దృష్టమ్ । అతః షాట్కౌశికా దేహాదుత్క్రామన్తః కస్మింశ్చిదుత్క్రామత్యుత్క్రామన్తి । స చైషామనువిధేయః సూక్ష్మో దేహో భూతేన్ద్రియమయ ఇతి గమ్యతే । నహీన్ద్రియమాత్రాశ్రయత్వమేషాం దృష్టం యతస్తన్మాత్రాశ్రయాణాం గతిరుపపద్యేతేతి ॥ ౩ ॥
అగ్న్యాదిగతిశ్రుతేరితి చేన్న భాక్తత్వాత్ ।
శ్రావితేఽపి స్పష్టే జీవస్య ప్రాణైః సహ గమనేఽగ్న్యాదిగతిశఙ్కా శ్రుతివిరోధోత్థాపనార్థా । అత్ర హి లోమకేశయోరోషధివనస్పతిగమనం దృష్టవిరోధాద్భాక్తం తావదభ్యుపేయమ్ । ఎవం చ తన్మధ్యపతితత్వేన తేషామపి శ్రుతివిరోధాద్భాక్తత్వమేవోచితమితి । భక్తిశ్చోపకారనివృత్తిరుక్తా ॥ ౪ ॥
ప్రథమేఽశ్రవణాదితి చేన్న తా ఎవ హ్యుపపత్తేః ।
పఞ్చమ్యామాహుతావపాం పురుషవచస్త్వప్రకారే పృష్టే ప్రథమాయామాహుతౌ అనపాం శ్రద్ధాయా హోతవ్యతాభిధానసమ్భద్ధమనుపపన్నం చ । నహి యథా పశ్వాదిభ్యో హృదయాదయోఽవయవా అవదాయ నిష్కృష్య హూయన్తే, ఎవం శ్రద్ధా బుద్ధిప్రసాదలక్షణా నిష్క్రష్టుం వా హోతుం వా శక్యతే । న చాప్యేవమౌత్సర్గికీ కారణానురూపతా కార్యస్య యుజ్యతే । తస్మాద్భక్త్యాయమప్సు శ్రద్ధాశబ్దః ప్రయుక్త ఇతి । అత ఎవ శ్రుతిః “ఆపో హాస్మై”(ఐ .ఆ. ౨.౧.౭.) ఇతి ॥ ౫ ॥
అశ్రుతత్వాదితి చేన్నేష్టాదికారిణాం ప్రతీతేః ।
అస్యార్థః పూర్వమేవోక్తః । అగ్నిహోత్రే షట్సూత్క్రాన్తిగతిప్రతిష్ఠాతృప్తిపునరావృత్తిలోకప్రత్యుత్థాయిష్వగ్నిసమిద్ధూమార్చిరఙ్గారవిస్ఫులిఙ్గేషు ప్రశ్నాః షట్ , తేషాం యః సమాహారః షణ్ణాం సా షట్ప్రశ్నీ, తస్యా నిరూపణం ప్రతివచనమ్ ॥ ౬ ॥
సూత్రాన్తరమవతారయితుం శఙ్కతే –
కథం పునరితి ।
సోమం రాజానమాప్యాయస్వాపక్షీయస్వేత్యేవమేనాంస్తత్ర భక్షయన్తీతి ।
క్రియాసమభిహారేణాప్యాయనాపక్షయౌ యథా సోమస్య తథా భక్షయన్తి సోమమయాంల్లోకానిత్యర్థః ।
అత ఉత్తరం పఠతి –
భాక్తం వానాత్మవిత్త్వాత్తథాహి దర్శయతి ।
కర్మజనితఫలోపభోగకర్తా హ్యధికారీ న పునరుపభోగ్యస్తస్మాచ్చన్ద్రసాలోక్యముపగతానాం దేవాదిభక్ష్యత్వే ‘స్వర్గకామో యజేత’ ఇతి యాగభావనాయాః కర్త్రపేక్షితోపాయతారూపవిధిశ్రుతివిరోధాదన్నశబ్దో భోక్తౄణామేవ సతాం దేవోపజీవితామాత్రేణ భాక్తో గమయితవ్యో న తు చర్వణనిగరణాభ్యాం ముఖ్య ఇతి ।
అత్రైవార్థే శ్రుత్యన్తరం సఙ్గచ్ఛత ఇత్యాహ –
తథాహి దర్శయతి ।
శ్రుతిరనాత్మవిదామనాత్మవిత్త్వాదేవ పశువద్దేవోపభోగ్యతాం న తు చర్వణీయతయా । యథా హి బలీవర్దాదయో భుఞ్జానా అపి స్వఫలం స్వామినో హలాదివహనేనోపకుర్వాణా భోగ్యాః, ఎవం పరమతత్త్వమవిద్వాంస ఇష్టాదికారిణ ఇహ దధిపయఃపురోడాశాదినాముష్మింశ్చ లోకే పరిచారకతయా దేవానాముపభోగ్యా ఇతి శ్రుత్యర్థః । అథవా అనాత్మవిత్త్వాత్తథాహి దర్శయతి ఇత్యస్యాన్యా వ్యాఖ్యా । ఆత్మవిత్పఞ్చాగ్నివిద్యావిత్న ఆత్మవితనాత్మవిత్ । యో హి పఞ్చాగ్నివిద్యాం న వేద తం దేవా భక్షయన్తీతి నిన్ద్యతే పఞ్చాగ్నివిద్యాం స్తోతుం తస్యా ఎవ ప్రకృతత్వాత్ । తదనేనోపచారస్య ప్రయోజనముక్తమ్ ।
ఉపచారనిమిత్తమనుపపత్తిమాహ –
తథాహి దర్శయతి ।
శ్రుతిర్భోక్తృత్వమ్ ।
స సోమలోకే విభూతిమనుభూయేతి ।
శేషమతిరోహితార్థమ్ ॥ ౭ ॥
కల్పాదౌ నూనమాశా హరిరసృజదమూః కీర్తివిస్తారవిజ్ఞః ।
శ్రీమద్ వ్యాసాశ్రమస్య ప్రతివదనమధాత్కర్ణయుగ్మం విరిఞ్చిః ॥
శ్రోతుం వాచస్పతేర్వాక్ సరణిషు వితతం కల్పవృక్షం నిబన్ధమ్ ।
భేజే వజ్రీ సహస్రం చరితమభినవం ద్రష్టుమక్ష్యమ్బుజానామ్ ॥౧॥
ఇదమమలాత్మనః - మత్సరపిత్తనిదానాం విదుషామరుచిం చికిత్సతి ప్రబలామ్ ।
స్వగుణగణామృతవర్షైః కృతిరేషా కర్ణరన్ధగతా ॥౨॥
తదన్తరప్రతిపత్తౌ రంహతి సంపరిష్వక్తః ప్రశ్ననిరూపణాభ్యామ్ ॥౧॥
అవిరోధేన వేదాన్తవేద్యం బ్రహ్మ నిరూపితమ్ ।
తత్ప్రాప్తిసాధనం జ్ఞానం సోపాయమిహ చిన్త్యతే ॥
హేతుహేతుమద్భావం విశదయతి –
స్మృతిన్యాయేతి ।
స్మృతిన్యాయశ్రుతిభిః సహ శ్రుతీనాం విరోధపరిహారేణేతి యోజనా । అవాన్తరసంగతిః పాదసంగతిః । భాష్యే ప్రసఙ్గాగతమితి దేహాత్మవ్యతిరేకాదిరుక్తః । పూర్వాపరౌ పూర్వోత్తరపక్షౌ । భూమికేతి విషయః । భూతపరిష్వఙ్గే ప్రాణానాం నరకాదిగమనాద్వైరాగ్యమ్ , న చేద్ నిరాశ్రయప్రాణగత్యభావాన్నేతి చిన్తాప్రయోజనమ్ ।
కరణేషు ఉపాత్తేషు భూతానుపాదానం వ్యాహతమ్ ; కార్యస్వీకారే తత్ప్రకృతిస్వీకారస్యావశ్యంభావాదిత్యాశఙ్క్యాహ –
అత్రేతి ।
నను భూతోపాదానస్యాశ్రవణం తదభావగమకం న భవతి ; సత్యపి ప్రమేయే ప్రమాణానుదయసంభవాదత ఆహ –
న హ్యాగమైకేతి ।
నానాప్రమాణగమ్యే హి వస్తున్యేకప్రమాణానుత్పత్తావపి ప్రమాణాన్తరప్రవృత్తిశఙ్కయా వస్తుసద్భావశఙ్కా స్యాత్ , న త్విహేత్యర్థః ।
అనగ్నిషు ద్యులోకాదిష్వగ్నిత్వస్యానాహుతిత్వస్యోపచారే నిమిత్తమాహ –
ఇహ హీతి ।
యది శరీరోత్పత్త్యవస్థామాహుతిజాం పఞ్చాహుతిత్వేన ప్రవిభజ్య తదాధారేషు ద్యులోకాదిష్వగ్నిత్వసంపాదనం విధీయతే , కథం తర్హ్యాపః పురుషవచస ఇతి ప్రశ్నే ఆహుతావపూశబ్దః? కథం వా ప్రతివచనే శ్రద్ధాం జుహ్వతీతి శ్రద్ధాశబ్దః? అత ఆహ –
అత్ర సాయమిత్యాదినా ।
శ్రద్ధాపూర్వం హుతే ఇత్యన్వయః ।
వక్ష్యమాణరూపకసిద్ధార్థమాహ –
ఆహవనీయాగ్నీతి ।
పఞ్చాగ్నివిద్యాశ్రుతిముదాహృత్య వ్యాచష్టే –
అసౌ వావేత్యాదినా ।
ఆదిత్యకార్యత్వాచ్చేతి ।
సమిద్రూపాదిత్యకార్యత్వాదహరర్చిః ; ప్రసిద్ధస్యార్చిషః సమిత్కార్యత్వాదిత్యర్థః । అధిదైవం యజమానప్రాణా ఇత్యన్వయః ।
తన్నిర్దిశతి –
అగ్న్యాదిరూపా ఇతి ।
హ్రాదునయో విస్ఫులిఙ్గా ఇతి శ్రుతి వ్యాచష్టే –
గర్జితమితి ।
అగ్నిరూపా ఇత్యగ్న్యాదిరూపా ఇతి ద్రష్టవ్యమ్ । స్వర్గే ఆరాబ్ధో దేహః సోమో రాజా ।
యద్యపి శ్రద్ధా సోమ ఇత్యాదిరాహుతిభేదః శ్రూయతే ; తథాపి జీవస్య భూతపరిష్వఙ్గసిద్ధ్యర్థమాప ఎవ తత్తదాకారపరిణతాస్తథా తథా నిర్దిశ్యన్త ఇత్యాహ –
శ్రద్ధాఖ్యా ఇతి ।
ప్రగే ఇతి ।
ప్రభాతే ఇత్యర్థః ।
స్వరూపాభావముపశమమాశఙ్క్యాహ –
ప్రసన్నానామితి ।
శ్రోత్రం శబ్దశ్రవణార్థం దిక్షు విప్రకీర్ణమివ । ఉపమన్త్రణం సంకేతః ।
శ్రుత్యన్తరవశేనాహ –
లోమాని వేతి ।
తాని చ గౌహ్యాని ధూమోఽర్చిర్జన్యత్వాదిత్యర్థః । సుఖలవవిస్ఫులిఙ్గహేతుత్వాద్ గ్రామ్యకర్మణోఽఙ్గారత్వమ్ । అప్సమవాయిత్వాద్గర్భస్యేతి శేషః ।
అశ్రుతత్వాదితి సూత్రార్థమిహ ప్రాప్తావసరం దర్శయతి –
యద్యపీత్యాదినా ।
కర్మిణాం చన్ద్రలోకారోహావరోహావాశ్రిత్య పఞ్చాగ్నిదర్శనముచ్యతే । తత్ర దక్షిణమార్గే ‘‘తద్య ఇమే గ్రామ ఇష్టాద్యుపాసతే ధూమమభిసంభవన్తి’’ ఇత్యుపక్రమ్య ‘‘ఎష సోమో రాజే’’తి చన్ద్రలోకప్రాప్తః పురుషో నిర్దిష్టః , పఞ్చాగ్నివిద్యాయామపి స్వర్గే లోకే సోమో రాజా భవతీతి స ఎవ నిర్దిశ్యతే ।
సోమరాజశ్రుతిసామ్యాత్స్వర్గాఖ్యస్థానసామ్యాచ్చేత్యాహ –
తథాపీష్టాదికారిణామితి ।
శ్రద్ధాం జుహ్వతీత్యత్రాపామిష్టాదికారిభిరన్వయముక్త్వా ఎష సోమోరాజేత్యత్ర కర్తౄణాం శ్రద్ధావాక్యావగతాభిరద్భిః పరిష్వఙ్గమాహ –
తథా హి యా ఎవేతి ।
అన్త్యాహుత్యపేక్షయా ద్వితీయా శ్రద్ధాహుతిః । అథ వా - పర్జన్యాగ్నౌ ద్వితీయే ద్వితీయస్యామాహుతౌ హోతవ్యాయాం సోమభావం గతా ఇత్యర్థః । అస్మిన్పక్షే ప్రత్యవరోహసామ్యం వాక్యద్వయే దర్శితమ్ । తథా హి – పఞ్చాగ్నివిద్యాయాం పర్జన్యాదిష్వగ్నిషు హుతస్య సోమరాజస్య వృష్ఠ్యన్నరేతోభావ ఆమ్నాయతే । తథా దక్షిణమార్గేఽపి ప్రత్యవరూఢానాం సోమరాజానాం తథాభావో వాయోర్వృష్టిం తే పృథివీ ప్రాప్యాన్నం భవన్తీత్యాదినా । అతశ్చ శ్రద్ధావాక్యే కర్మిణాం లాభ ఇత్యర్థః । చన్ద్రలోకం ప్రాప్తస్తతశ్చన్ద్రభూయం చన్ద్రభావమమృతమయశరీరాత్మతాం గత ఇత్యర్థః ।
వాక్యద్వయస్థసోమరాజశబ్దయోరర్థభేదం శఙ్కతే –
నను స్వతన్త్రా ఇతి ।
శ్రద్ధావాక్యే ఆప ఎవ సోమాఖ్యశరీరభావమాప్నువన్తు , ఎష సోమో రాజేత్యత్ర తు అద్భిరపరిష్వక్త ఇన్ద్రియమాత్రోపహితశ్చన్ద్రలోకం గత్వా సోమశరీరం భుఙ్క్తామిత్యర్థః ।
ఉత్తరమ్ –
అయం దోష ఇతి ।
యేన రూపేణేతి ।
అమృతమయశరీరాభిమానిత్వేనేత్యర్థః । క్రమ ఆహుతిపరిణామలక్షణ: ।
శబ్దమాత్రసామ్యమగమకం - బటోరప్యగ్నిశబ్దావిశేషాద్ జ్వలనాభేదప్రసఙ్గాదిత్యాశఙ్క్యాహ –
తస్మాదితి ।
అప్శబ్దాత్పురుషవచస ఇతి పురుషశబ్దాచ్చ కేవలభూతగమనస్య పురుషాధిష్ఠితభూతగమనస్య చ సంశయే సోమరాజశబ్దసామ్యం నిర్ణాయకం భవతి , మాణవకస్య తు జ్వలనాద్భేదనిశ్చయాన్నాభేదాపాత ఇత్యర్థః ।
ఎవం హి సూక్ష్మేతి ।
సూక్ష్మశరీరం భూతసూక్ష్మాణీతి ।
జలూకైవ జలాయుకా । నను - వ్యాపకస్యాత్మన ఇహ దేహాన్తరాభిమానపూర్వకమేతద్దేహత్యాగః సంభవతి , తత్ర కిమితి దృష్టాన్తశ్రుతేరార్జవభఙ్గః క్రియత ఇతి - చేత్ , తత్ర వక్తవ్యం - కిం పరమాత్మన ఉక్తవిధా దేహాన్తరప్రాప్తిరుత జీవస్య ।
నాద్య ఇత్యాహ –
న తావదితి ।
జీవోఽపి స్వతన్త్ర ఎవ వ్యాపకః సన్నస్మిన్దేహే వర్తమానో దేహాన్తరమభిమన్యతే , ఉతౌపాధికః సన్నుపాధివ్యాప్త్యా ।
న ప్రథమ ఇత్యాహ –
పరమాత్మైవ చేతి ।
న ద్వితీయ ఇత్యాహ –
తస్య చేతి ।
‘‘తద్యథా తృణజలాయుకా తృణస్యాన్తం గత్వాఽన్యమాక్రమమాక్రమ్యాత్మానముపసంహరత్యేవమేవాయం శరీర ఆత్మాఽన్యమాక్రమమాక్రమ్యాత్మానముపసంహరతీ’’తి శ్రుతౌ ప్రతిపత్తవ్యదేహవిషయభావనాదీర్ఘీభావ ఉపమీయత ఇతి భాష్యే ఉక్తమ్ ।
తత్ర భావిదేహస్యాననుభూతత్వాత్స్మృతిహేతుభావనానుపపత్తేరయుక్తిమాశఙ్క్య వ్యాచష్టే –
ఉత్పాదనాయా ఇతి ।
ప్రాకృతకర్మారభ్య భావిదేహోత్పత్తిం యావత్కర్తృవ్యాపారస్య వితతత్వాద్ దీర్ఘీభావః । ఎతదుక్తం భవతి – యథా జలూకా తృణాన్తరం ప్రాప్య తృణం ముఞ్చతి ఎవం సంసార్యపి దేహాన్తరప్రాప్త్యర్థ కర్మ కృత్వా దేహం త్యజతీతి । శబ్దాదిజ్ఞానాని సుఖాదిజ్ఞానాని చ షట్ ప్రవృత్తివిజ్ఞానాని । అహమిత్యాలయవిజ్ఞానసన్తానస్య వృత్తిః కార్యమ్ ॥౧॥
భాష్యోక్తాం దేహే భూతత్రయకార్యోపలబ్ధిం దర్శయతి –
తేజస ఇత్యాదినా ।
సామ్యావస్థాః శరీరం దధతీతి వాతాదయో ధాతవః ।
కథం త్రిధాతుకత్వే శరీరస్య పఞ్చభూతాత్మకత్వమత ఆహ –
అతో న స దేహ ఇతి ।
వాతాన్వయాద్ వాయ్వారబ్ధత్వం కఫపిత్తాన్వయాదప్తేజ ఆరబ్ధత్వమ్ అవకాశదానాన్వయాదాకాశారబ్ధత్వమిత్యర్థః । అత్ర నైయాయికాదయో వివదన్తే – యది దేహః పఞ్చభూతసమవాయికారణకః స్యాత్ , తర్హి ద్రవ్యం న స్యాత్ , పఞ్చభూతసమవాయికారణకబహుత్వవత్ । యది చ ప్రత్యక్షాప్రత్యక్షసమవాయికారణకః స్యాత్ , తర్హి ప్రత్యక్షో న స్యాత్ , తరుమరుత్సంయోగవత్ । తస్మాన్న దేహః పఞ్చభూతసమవాయికారణకః ద్రవ్యత్వాదాకాశవత్ । నాపి ప్రత్యక్షాప్రత్యక్షసమవాయికారణకః ప్రత్యక్షత్వాద్గన్ధవత్ । తోయాద్యారబ్ధత్వే చ శైత్యాద్యుపలమ్భప్రసఙ్గః , తోయత్వాదిజాతిసంకరప్రసఙ్గశ్చ - ఇతి । తన్న ; త్ర్యణుకాదేరపి ప్రత్యక్షత్వాదిహేతోరప్రత్యక్షసమవాయికారణత్వాభావానుమానాపాతాత్ । శీతస్పర్శాదిశ్చ శరీరే ఉద్భవాభిభవాభ్యాం క్రమేణోపలభ్యత ఎవ ।జాతిసంకరశ్చాదూషణమ్ । యత్తు - మన్యేత ద్రవ్యత్వాది పృథివీత్వాదిజాతిం యద్యపి పరిహరతి వ్యాపకత్వాత్ ; తథాపి పృథివీత్వాది ద్రవ్యత్వాదిజాతిం న ముఞ్చతి ; వ్యాప్యత్వాత్తాదృగ్జాత్యోశ్చైకత్ర సమావేశో నేతరయోః । పృథివీత్వాదిజాతిశ్చ పరస్పరపరిహారిణీ , కుమ్భే సలిలత్వాభావాత్ కుమ్భసలిలే చ పృథివీత్వాభావాత్ । పరస్పరపరిహారస్యాసమావేశానిశ్చాయకత్వే చ గోత్వాశ్వత్వయోరప్యసమావిష్టత్వనిశ్చయాభావప్రసఙ్గః , ఉచ్ఛిద్యేత చ తజ్జాతీయవిరోధకథా । తథా చాప్తవచనావసితతురగభావే తురగత్వాన్న స గౌరిత్యాద్యనుమానపూర్వకవ్యవహారవిలయప్రసఙ్గ - ఇతి । తదపి న । కాశ్చిత్పరస్పరం పరిహరన్త్య క్వచిదపి న సమావిశన్తి , కాశ్చిత్తు జాతయః క్వచిత్పరిహరన్తి క్వచిత్సమావిశన్తి చ । సమావేశశ్చ కియస్త్వేవ దేహాదిష్వతి నిశ్చిత్య గోత్వాదావప్యుక్తరీత్యోరేకామాప్తాదిభ్యః పరిచ్ఛిద్య ప్రవృత్త్యుపపత్తేః । అపి చాయమత్ర ప్రమాణార్థః । పృథివీత్వజలత్వే నైకత్ర సమావిశతః , పరస్పరపరిహారిత్వాద్ గోత్వాశ్వత్వవదితి । తత్ర పరస్పరేతి పృథివీత్వసలిలత్వవివక్షాయాం సాధనవికలో దృష్టాన్తః । న హి గోత్వాశ్వత్వే పృథివీత్వం పరిహరతః । గోత్వాశ్వత్వవివక్షాయామవిశేషేణ యత్కించిత్పరస్పరవివక్షాయాం చ హేతోరనైకాన్తికతా ; గుణత్వరూపత్వయోర్గోత్వాశ్వత్వే త్యజతోర్యత్కించిత్పరస్పరాత్మకస్తమ్భకుమ్బౌ పరిహరతోరప్యేకత్ర సమావేశాత్ । తస్మాత్ప్రసిద్ధిసామర్థ్యాద్బాధకస్యానిరూపణాత్ పఞ్చభూతమయః కాయః శ్రుతితోఽప్యనుమీయతామ్ । శ్రూయతే హి పృథివీమయ ఆపోమయో వాయుమయస్తేజోమయ ఆకాశమయ ఇతి । అత్ర చ దేహద్వారాఽఽత్మనః పఞ్చభూతమయత్వముచ్యతే ; చక్షుర్మయ ఇత్యాదివాక్యశేషాత్ । అనుమానమపి దేవదత్తశరీరమేతజ్జనకత్వే సత్యనుదకత్వాతేజస్త్వావాయుత్వానాకాశత్వాత్యన్తాభావవత్సమవాయికారణకం శరీరత్వాద్యజ్ఞదత్తశరీరవదితి । యద్యపి యజ్ఞదత్తశరీరమనుదకత్వాదిమత్ పృథివీమాత్రసమవాయికారణకం పరేషాం ; తథాపి దేవదత్తశరీరజనకత్వే సతి అనుదకాదిమజ్జన్యం న భవతి , తస్య దేవదత్తశరీరజనకత్వాభావేన తద్విశిష్టానుదకాదిమత్త్వరహితత్వాత్ । అతః సాధ్యప్రసిద్ధిః । ఎతజ్జనకత్వే సత్యనుదకత్వాదిమత్త్వరహితజన్యత్వమనుదకత్వాదిమత్త్వరహితజన్యత్వాద్వా స్యాదేతజ్జనకత్వరహితజన్యత్వాద్వా । ద్వితీయో వ్యాహత ఇతి ప్రథమః స్యాత్తథా చోదకత్వాదిమద్భూతసమవాయికారణత్వసిద్ధిరితి ॥౨॥
నను నిరాశ్రయా ఎవ ప్రాణా గచ్ఛన్తు వాయువదిత్యాశఙ్క్యాహ –
జీవద్దేహే ఇతి ।
భవతు సాశ్రయత్వం , గతిస్త్వాశ్రయస్యైవ న ప్రాణానామితి , నేత్యాహ –
తదనువిధాయినః ఇతి ।
న చేత్ప్రాణా గచ్ఛన్తి స్థిత్యాధారదేశాన్న వియుజ్యేరన్ । తథా చ దేశాన్తరగతే దేహే ప్రాణోపలబ్ధిర్న స్యాదిత్యర్థః ।
సాశ్రయప్రాణోత్క్రాన్తావాశ్రయదర్శనప్రసఙ్గమాశఙ్క్యాహ –
సూక్ష్మ ఇతి ।
నను కార్యవశాద్యః కశ్చిదాశ్రయః కల్ప్యతాం , కథం భూతసిద్ధిరత ఆహ –
భూతేన్ద్రియమయ ఇతి ।
ఇన్ద్రియగ్రహణం మృతదేహతుల్యత్వవ్యావృత్త్యర్థమ్ । జాగరితే భూతమయదేహాశ్రయత్వదర్శనాదిత్యర్థః । తర్హీన్ద్రియాణి సన్త్వాశ్రయో , నేత్యాహ – న హీతి ॥౩॥ తేషామపి పరోపాధిగమనత్వేన ప్రాణగత్యనుపపాదకత్వాదిత్యర్థః ।
నైవ ప్రాణా గచ్ఛన్తీతి భాష్యం దృష్ట్వా ప్రాణానాం గమనాభావేఽగ్న్యాదిగతిశ్రుతిర్హేతురుక్త ఇతి కశ్చిన్మన్యేత , తచ్చాయుక్తమ్ ; శ్రుతౌ సత్యామవధారణానుపపత్తేః , అత ఆహ –
శావితేఽపీతి ।
అత్ర శ్రుతిద్వయవిరోధాదనధ్యవసాయ ఆశఙ్క్యతే । భాష్యం చ ప్రాణా గచ్ఛన్త్యేవేతి యత్తన్నేతి వ్యాఖ్యేయమిత్యర్థః ।
పరిహారభాగం వ్యాచష్టే –
అత్ర హీత్యాదినా ।
తేషామపీతి ।
వాగాదిగమనానామపీత్యర్థః ।
నను సందిగ్ధం వస్తు ప్రాయదర్శనాన్నిర్ణీయతే గౌణముఖ్యగ్రహణవిషయే చ ముఖ్యే సంప్రత్యయస్తత్ర కథం వాగాదీనామగ్న్యాదిగతిశ్రుతిః ప్రాయదర్శనమాత్రాన్ముఖ్యార్థాత్ప్రచ్యావ్యతే , అత ఆహ –
శ్రుతివిరోధాదితి ।
జీవేన సహోత్క్రాన్త్యాదిశ్రుతివిరోధాత్సందిహ్యమానార్థా వాగాదిగతిశ్రుతిరతః ప్రాయదర్శనావకాశ ఇత్యర్థః । భక్తిర్గుణయోగః । ఉపకారనివృత్తిరుక్తా । భాష్యే ఇతి శేషః । ।౪॥
తా ఎవ హ్యుపపత్తేరితి సూత్రస్య (బ్ర.అ.౩.పా.౧.సూ.౫౪) పరిహారభాగం వ్యాచష్టే –
పఞ్చమ్యామాహుతావిత్యాదినా ।
పఞ్చమ్యామాహుతావపాం పురుషశబ్దవాచ్యత్వం యథా భవతి , తథా కిం వేత్థేతి ప్రశ్నే పురుషశబ్దవాచ్యత్వప్రకారమాత్రమగ్నివిస్ఫులిఙ్గాదిదృష్టివిశిష్టమజ్ఞాతం పృచ్ఛయతే , వాక్యస్య విశేషణసంక్రాన్తత్వాత్ । ఆపస్త్వగ్నిహోత్రాదిఫలప్రాప్తిపునరావృత్తిపర్యాలోచనయా శాస్త్రాన్తరాద్ జ్ఞాతా ఎవ । తత్ర ప్రథమాద్యాహుతిష్వప్యాహుతివిశేషమజిజ్ఞాసిత్వా పఞ్చమ్యామ్ ఆహుతివిషయః ప్రశ్న ఎవమభిప్రాయః యైవ పఞ్చమ్యాహుతిః సైవ ప్రథమాదిస్థానేఽపి భవతీతి । సతి చైవం ప్రశ్నహృదయే ప్రథమాహుతౌ అబ్యతిరిక్తాహుత్యభిధానమసంబద్ధం స్యాదిత్యర్థః । అప్శబ్దస్య నిత్యబహువచనాన్తత్వాదనపాం శ్రద్ధాయా ఇతి నిర్దేశః ।
అవ్యతిరిక్తాయాః శ్రద్ధాయాః ప్రథమాహుతిత్వే పరంపరయా తజ్జాతస్య దేహస్యాబ్వహులత్వం న స్యాదిత్యాహ –
న చాప్యేవమితి ।
బ్రహ్మకార్యస్య తద్వేలక్షణ్యాభ్యుపగమాదౌత్సర్గికీత్యుక్తమ్ ।
శ్రద్ధాయామప్త్వోపచారాపేక్షితం సబన్ధమాహ –
అత ఎవేతి ।
ఆపో హాస్మై శ్రద్ధాం సంనమన్త ఇతి శ్రుతౌ కార్యకారణభావోఽవగమ్యతే ఇత్యర్థః ॥౫॥ ఆహుత్యపూర్వరూపా ఆపో జీవం పరివేష్ట్య పరలోకం నయన్తీత్యత్ర సంవాదకత్వేన తే వా ఎతే ఇత్యాదివాజసనేయిబ్రాహ్మణం భాష్యకారేరుద్ధాహృతమ్ । తదిత్థమ్ - అగ్నిహోత్రాహుతీ ప్రక్రమ్య జనకేన యాజ్ఞవల్క్యం ప్రతి ‘‘న త్వేవైనయోస్త్వముత్క్రాన్తిం న గతిం న ప్రతిష్ఠాం న తృప్తిం న పునరావృత్తిం న లోకప్రత్యుత్థాయినం వేత్థే’’త్యజ్ఞానే ఉద్భావితే తేన చానుమోదితే జనకః షట్ ప్రశ్నాన్నిర్ణినాయ । తే వా ఎతే ఆహుతీ హుతే ఉత్క్రామతస్తే అన్తరిక్షమావిశతస్తే అన్తరిక్షమేవాహవనీయం కుర్వాతే వాయుం సమిధం మరీచీరేవ శుక్రామాహుతిం తే అన్తరిక్షం తర్పయతస్తే దివమావిశతస్తే దివమేవాహవనీయం కుర్వాతే ఆదిత్యం సమిధం చన్ద్రమసమేవ శుక్రామాహుతిం తే దివం తర్పయతస్తే తతా ఆవర్తేతే’’ ఇత్యుపక్రమ్య ‘‘పృథివీం పురుషం యోషితం చాహవనీయత్వేనోపన్యస్య సంవత్సరాదీంశ్చ సమిదాదిత్వేన పరికల్ప్య యోషిదగ్నేర్యః పుత్రో జాయతే స లోకం ప్రత్యిత్థాయీ’’ ఇతి । తత్రైష షట్ ప్రశ్నీనిర్ణయః పఞ్చాగ్నివిద్యాయామద్భిః పరివేష్టితస్య జీవస్య న గమయితుమర్హతిః విద్యాభేదాత్ । షట్ప్రశ్న్యాం హ్యాహవనీయసమిదాహుతయ ఎవ శ్రూయన్తే , న తు ధూమార్చిరఙ్గారాః । అన్తరిక్షాగ్నిశ్చాధికః పర్జన్యశ్చ న శ్రుత ఇతి । తత్ర సత్యపి విద్యాన్యత్వే ఆహుతిగత్యా గతిసామ్యాద్ దృష్టాన్తత్వమిత్యస్త్యేవ పరిహారః ।
ఆచార్యస్తు ప్రౌఢ్యా విద్యైక్యముపేత్యాప్యాహ –
షట్ప్రశ్నీతి ।
అగ్నిహోత్రే షట్సు ఉత్క్రాన్త్యాదిషు యే ప్రశ్నాస్తేఽగ్నిసమిద్ధూమార్చిరఙ్గారవిస్ఫులిఙ్గేషు సమస్తేషు విషయేషు ఘటన్తే ; విస్ఫులిఙ్గాదీనాం తత్రాప్యుపసంహర్తవ్యత్వాత్ , బహుసామ్యే సత్యల్పవైషమ్యస్యాకించిత్కరత్వాత్పర్జన్యాగ్నేశ్చాగ్నిహోత్రే స్వర్గాత్ పృథివీప్రాప్త్యభిధానేనార్థసిద్ధేః । అన్తరిక్షాగ్నేశ్చ పఞ్చాగ్నివిద్యాయాం పృథివ్యాః స్వర్గప్రాప్త్యభిధానాత్ సామర్థ్యసిద్ధేరిత్యర్థః । యః సమాహారః షణ్ణాముత్క్రాన్త్యాదీనామిత్యర్థః । ఎవం చ షడగ్న్యుపాసనమిదమ్ । పఞ్చాగ్నీన్వేదేతి త్వవాన్తరసంఖ్యాభిప్రాయమ్ ; సామ్యలిఙ్గాత్ షష్ఠాగ్న్యుపసంహారసిద్ధౌ ప్రచయశిష్టప్రాప్తసంఖ్యానువాదిపఞ్చశబ్దస్య దుర్బలస్య తద్వ్యావర్తకత్వానుపపత్తేః । ఎవం విస్ఫులిఙ్గాదిషు షట్ప్రశ్నానుపలమ్భాదుత్క్రాన్త్యాదివిషయాణా చ విస్ఫులిఙ్గాదివిషయత్వాభావాత్ శ్రుత్యనిభిజ్ఞో వాచస్పతిరిత్యుపహాసోఽనవసరః ॥౬॥
భాష్యస్థశ్రుతిం వ్యాచష్టే –
క్రియేతి ।
సోమస్య యథేతి శేషః । లోణ్మధ్యమైకవచనం సర్వవిభత్త్యర్థేషు క్రియాసమభిహారాఖ్యపౌనఃపున్యే స్మర్యతే । తేనాప్యాయస్వేతి ఆప్యాయ్యేత్యర్థః । అపక్షీయస్వేతి అపక్షపయ్యేత్యర్థః । యథా సోమం యజ్ఞే భక్షయన్త్యేవం కర్మిణః పురుషాన్ దేవా ఇత్యర్థః ।
ఎతాస్తత్ర భక్షయన్తీతి శ్రుతౌ ఎతాన్ శబ్దేన కర్మిణామభిధానం గృహీత్వా భాక్తత్వం భక్షణస్య సూత్రభాష్యకారాభ్యాం వర్ణితం , స్వయం తు సిద్ధాన్తానుసారేణావిరుద్ధమర్థమాహ –
సోమమయాల్లోకానితి ।
యుక్తతరశ్చాయమర్థః ; ఎష సోమో రాజేతి కర్మాభిప్రాప్యస్య ప్రాధాన్యేన ప్రకృతత్వాత్ , విభూతిమనుభూయేతి భోక్తృత్వనిర్దేశః సాక్షాదన్నత్వేఽనుపపత్తిః ॥౭॥ పఞ్చమ్యాం త ఆహుతావాపో యథా పురుషశబ్దవాచ్యా భవన్తి తం ప్రకారం కిం వేత్థేతి శ్వేతకేతుం ప్రతి ప్రవాహణస్య రాజ్ఞః ప్రశ్నః । తమాత్మానమ్ । యత్ర కాలే అస్య పురుషస్య వాగాదయోఽగ్న్యాదిదేవాన్ గచ్ఛన్తి క్వాయం తదా పురుషో భవతీతి ఆర్తభాగస్య యాజ్ఞవల్క్యం ప్రతి ప్రశ్నః । అస్మై అధికారిణే । శ్రద్ధాం సన్నమన్తే ఆనయన్తి । అథోత్తరమార్గకథానన్తరమ్ । గ్రామే గృహాశ్రమే స్థిత్వా । ఇష్టం యాగాదిపూర్తవాప్యాదికరణం దత్తం దానమ్ । ఇత్యేతాన్యుపాసతేఽనుతిష్ఠన్తి యే తే ధూమం ధూమాభిమానినీం దేవతామ్ అభిసంభవన్తి ప్రాప్నువన్తి ఆకాశదేవతాతో వాయుమాప్నువన్తి । అసౌ అముకనామా స్వర్గాయ లోకాయ స్వాశ్రయం హా గచ్ఛతు ఎతదేవాదిత్యస్య రోహితాద్యమృతం దృష్ట్వైవ వస్వాదయో దేవాస్తృప్యన్తీతి మధువిద్యాయాం శ్రుతమ్ । అథ పిత్రానన్దకథనానన్తరం జితః ప్రాప్తః శ్రాద్ధాదికర్మభిః పితృలోకో యైస్తేషాం పితౄణాం యే ఆనన్దాః స కర్మదేవానామేక ఆనన్దః । పిత్రానన్దశతగుణ ఆనన్దః కర్మదేవానాం భవతీత్యర్థః । యే కర్మణేతి కర్మదేవానాం వ్యాఖ్యానమ్ ॥