తదభావో నాడీషు తచ్ఛ్రుతేరాత్మని చ ।
ఇహ హి నాడీపురీతత్పరమాత్మానో జీవస్య సుషుప్తావస్థాయాం స్థానత్వేన శ్రూయన్తే । తత్ర కిమేషాం స్థానానాం వికల్ప ఆహోస్విత్సముచ్చయః । కిమతో యద్యేవమ్ । ఎతదతో భవతి । యదా నాడ్యో వా పురీతద్వా సుషుప్తస్థానం తదా విపరీతగ్రహణనివృత్తావపి న జీవస్య పరమాత్మభావ ఇతి । అవిద్యానివృత్తావపి జీవస్య పరమాత్మభావాయ కారణాన్తరమపేక్షితవ్యం తచ్చ కర్మైవ న తు తత్త్వజ్ఞానం విపరీతజ్ఞాననివృత్తిమాత్రేణ తస్యోపయోగాత్ , విపరీతజ్ఞాననివృత్తేశ్చ వినాపి తత్త్వజ్ఞానం సుషుప్తావపి సమ్భవాత్ । తతశ్చ కర్మణైవాపవర్గో న జ్ఞానేన । యథాహుః “కర్మణైవ తు సంసిద్ధిమాస్థితా జనకాదయః”(భ.గీ. ౩-౨౦) ఇతి । అథ తు పరమాత్మైవ నాడీపురీతస్మృతిద్వారా సుషుప్తిస్థానం తతో విపరీతజ్ఞాననివృత్తేరస్తి మాత్రయా పరమాత్మభావ ఉపయోగః । తయా హి తావదేష జీవస్తదవస్థానో భవతి కేవలమ్ । తత్త్వజ్ఞానాభావేన సమూలకాషమవిద్యాయా అకాషాజ్జాగ్రత్స్వప్నలక్షణం జీవస్య వ్యుత్థానం భవతి । తస్మాత్ప్రయోజనవత్యేషా విచారణేతి । కిం తావత్ప్రాప్తం, నాడీపురీతత్పరమాత్మసు స్థానేషు సుషుప్తస్య జీవస్య నిలయం ప్రతి వికల్పః । యథా బహుషు ప్రాసాదేష్వేకో నరేన్ద్రః కదాచిత్క్వచిన్నిలీయతే కదాచిత్క్వచిదేవమేకో జీవః కదాచిన్నాడీషు కదాచిత్పురీతతి కదాచిద్బ్రహ్మణీతి । యథా నిరపేక్షా వ్రీహియవాః క్రతుసాధనీభూతపురోడాశప్రకృతితయా శ్రుతా ఎకార్థా వికల్ప్యన్తే, ఎవం సప్తమీశ్రుత్యా వాయతనశ్రుత్యా వైకనిలయనార్థాః పరస్పరానపేక్షా నాడ్యాదయోఽపి వికల్పమర్హన్తి । యత్రాపి నాడీభిః ప్రత్యవసృప్య పురీతతి శేత ఇతి నాడీపురీతతోః సముచ్చయశ్రవణమ్ “తథా తాసు తదా భవతి యదా సుప్తః స్వప్నం న కఞ్చన పశ్యతి । అథాస్మిన్ ప్రాణ ఎవైకధా భవతి” (కౌ . బ్రా. ౪ । ౨౦) ఇతి నాడీబ్రహ్మణోరాధారయోః సముచ్చయశ్రవణమ్ । ప్రాణశబ్దం చ బ్రహ్మ “అథాస్మిన్ ప్రాణే బ్రహ్మణి స జీవ ఎకధా భవతి” ఇతి వచనాత్ । తథాప్యాసు తదా నాడీషు సృప్తో భవతీతి చ పురీతతి శేత ఇతి చ నిరపేక్షయోర్నాడీపురీతతోరాధారత్వేన నిర్దేశాన్నిరపేక్షయోరేవాధారత్వమ్ । ఇయాంస్తు విశేషః । కదాచిన్నాడ్య ఎవాధారః కదాచిన్నాడీభిః సఞ్చరమాణస్య పురీతదేవ । ఎవం తాభిరేవ సఞ్చరమాణస్య కదాచిద్బ్రహ్మైవాధార ఇతి సిద్ధమాధారత్వే నాడీపురీతత్పరమాత్మనామనపేక్షత్వమ్ । తథా చ వికల్పో వ్రీహియవవద్బృహద్రథన్తరవద్వేతి ప్రాప్తమ్ । ఎవం ప్రాప్తేఽభిధీయతే జీవః సముచ్చయేనైవైతాని నాడ్యాదీని స్వాపాయోపైతి న వికల్పేన । అయమభిసన్ధిః నిత్యవదామ్నాతానాం నామ తద్గత్యన్తరాభావే కల్ప్యతే । యథాహుః “ఎవమేషోఽష్టదోషోఽపి యద్వ్రీహియవవాక్యయోః । వికల్ప ఆశ్రితస్తత్ర గతిరన్యా న విద్యతే” ఇతి । ప్రకృతక్రతుసాధనీభూతపురోడాశద్రవ్యప్రకృతితయా హి పరస్పరానపేక్షౌ వ్రీహియవౌ విహితౌ శక్నుతశ్చైతౌ ప్రత్యేకం పురోడాశమభినిర్వర్తయితుమ్ । తత్ర యది మిశ్రాభ్యాం పురోడాశోఽభినిర్వర్త్యేత పరస్పరానపేక్షవ్రీహియవవిధాతృణీ ఉభే అపి శాస్త్రే బాధ్యేయాతామ్ । న చైతౌ ప్రయోగవచనః సముచ్చేతుమర్హతి । స హి యథా విహితాన్యఙ్గాన్యభిసమీక్ష్య ప్రవర్తమానో నైతాన్యన్యథయితుం శక్నోతి । మిశ్రణే చాన్యథాత్వమేతేషామ్ । న చాఙ్గానురోధేన ప్రధానాభ్యాసో ‘గోసవే ఉభే కుర్యాత్’ ఇతివద్యుక్తః । అశ్రుతో హ్యత్ర ప్రధానాభ్యాసోఽఙ్గానురోధేన చ సోఽన్యాయ్యః । న చాఙ్గభూతైన్ద్రవాయవాదిగ్రహానురోధేన యథా ప్రధానస్య సోమయాగస్యావృత్తిరేవమత్రాపీతి యుక్తమ్ । ‘సోమేన యజేత’ ఇతి హి తత్రాపూర్వయాగవిధిః । తత్ర చ దశముష్టిపరిమితస్య సోమద్రవ్యస్య ‘సోమమభిషుణోతి’ , ‘సోమమభిప్లావయతి’ ఇతి చ వాక్యాన్తరానులోచనయా రసద్వారేణ యాగసాధనీభూతస్యేన్ద్రవాయ్వాద్యుద్దేశేన ప్రాదేశమాత్రేషూర్ధ్వపాత్రేషు గ్రహణాని పృథక్ప్రకల్పనాని సంస్కారా విధీయన్తే, నతు సోమయాగోద్దేశేనేన్ద్రవాయ్వాదయో దేవతాశ్చోద్యన్తే, యేన తాసాం యాగనిష్పత్తిలక్షణైకార్థత్వేన వికల్పః స్యాత్ । నచ ప్రాదేశమాత్రమేకైకమూర్ధ్వపాత్రం దశముష్టిపరిమితసోమరసగ్రహణాయ కల్పతే, యేన తుల్యార్థతయా గ్రహణాని వికల్పేరన్ । నచ యావన్మాత్రమేకమూర్ధ్వపాత్రం వ్యాప్నోతి తావన్మాత్రం గృహీత్వా పరిశిష్టం త్యజ్యేతేతి యుజ్యతే । దశముష్టిపరిమితోపాదానస్యాదృష్టార్థత్వప్రసఙ్గాత్ । ఎవం తద్దృష్టార్థం భవేద్యది తత్సర్వం యాగ ఉపయుజ్యేత । నచ దృష్టే సమ్భవత్యదృష్టకల్పనా న్యాయ్యా । తస్మాత్సకలస్య సోమరసస్య యాగశేషత్వేన సంస్కారార్హత్వాదేకైకేన చ గ్రహణేన సకలస్య సంస్కర్తుమశక్యత్వాత్తదవయవస్యైకేన సంస్కారేఽవయవాన్తరస్య గ్రహణాన్తరేణ సంస్కార ఇతి కార్యభేదాద్గ్రహణాని సముచ్చీయేరన్ । అత ఎవ సముచ్చయదర్శనం “దశైతానధ్వర్యుః ప్రాతఃసవనే గ్రహాన్ గృహ్ణాతి” ఇతి । సముచ్చయే చ సతి క్రమోఽప్యుపపద్యతే । “ఆశ్వినో దశమో గృహ్యతే తృతీయో హూయతే” । తథైవ “ఐన్ద్రవాయవాగ్రాన్గ్రహాన్గృహ్ణాతి” ఇతి । తేషాం చ సముచ్చయే సతి యావద్యదుద్దేశేన గృహీతం తావత్తస్యై దేవతాయై త్యక్తవ్యమిత్యర్థాద్యాగస్యావృత్త్యా భవితవ్యమ్ । యది పునః పృథక్కృతాన్యప్యేకీకృత్య కాఞ్చన దేవతాముద్దిశ్య త్యజేరన్ , పృథక్కరణాని చ దేవతోద్దేశాశ్చాదృష్టార్థా భవేయుః । నచ దృష్టే సమ్భవత్యదృష్టకల్పనా న్యాయ్యేత్యుక్తమ్ । తస్మాత్తత్ర సముచ్చయస్యావశ్యమ్భావిత్వాద్గుణానురోధేనాపి ప్రధానాభ్యాస ఆస్థీయతే । ఇహ త్వభ్యాసకల్పనాప్రమాణాభావాత్పురోడాశద్రవ్యస్య చానియమేన ప్రకృతిద్రవ్యే యస్మిన్కస్మింశ్చిత్ప్రాప్తే ఎకైకా పరస్పరానపేక్షా వ్రీహిశ్రుతిర్యవశ్రుతిశ్చ నియామికైకార్థతయా వికల్పమర్హతః । న తు నాడీపురీతత్పరమాత్మనామన్యోన్యానపేక్షణామేకనిలయనార్థసమ్భవో యేన వికల్పో భవేత్ । నహ్యేకవిభక్తినిర్దేశమాత్రేణైకార్థతా భవతి సముచ్చితానామప్యేకవిభక్తినిర్దేశదర్శనాత్ పర్యఙ్కే శేతే ప్రసాదే శేత ఇతి । తస్మాదేకవిభక్తినిర్దేశస్యానైకాన్తికత్వాదన్యతో వినిగమనా వక్తవ్యా ।
సా చోక్తా భాష్యకృతా –
యత్రాపి నిరపేక్షా ఇవ నాడీః సుప్తిస్థానత్వేన శ్రావయతీత్యాదినా ।
సాపేక్షశ్రుత్యనురోధేన నిరపేక్షశ్రుతిర్నేతవ్యేత్యర్థః । శేషమతిరోహితార్థమ్ ।
నను యది బ్రహ్మైవ నిలయనస్థానం తావన్మాత్రముచ్యతాం కృతం నాడ్యుపన్యాసేనేత్యత ఆహ –
అపిచాత్రేతి ।
అపిచేతి సముచ్చయే న వికల్పే । ఎతదుపపత్తిసహితా పూర్వోపపత్తిరర్థసాధినీతి । మార్గోపదేశోపయుక్తానాం నాడీనాం స్తుత్యర్థమత్ర నాడీసఙ్కీర్తనమిత్యర్థః । పిత్తేనాభివ్యాప్తకరణో న బాహ్యాన్విషయాన్వేదేతి తద్ద్వారా సుఖదుఃఖాభావేన తత్కారణపాప్మాస్పర్శేన నాడీస్తుతిః । యదా తు తేజో బ్రహ్మ తదా సుగమమ్ ।
అపిచ –
నాడ్యః పురీతద్వా జీవస్యోపాధ్యాధార ఎవ భవతీతి ।
అయమర్థః అభ్యుపేత్య జీవస్యాధేయత్వమిదముక్తమ్ । పరమార్థతస్తు న జీవస్యాధేయత్వమస్తి । తథాహి నాడ్యః పురీతద్వా జీవస్యోపాధీనాం కరణానామాశ్రయో జీవస్తు బ్రహ్మావ్యతిరేకాత్స్వమహిమప్రతిష్ఠః । న చాపి బ్రహ్మ జీవస్యాధారః, తాదాత్మ్యాత్ । వికల్ప్య తు వ్యతిరేకం బ్రహ్మణ ఆధారత్వముచ్యతే జీవం ప్రతి । తథాచ సుషుప్తావస్థాయాముపాధీనామసముదాచారాజ్జీవస్య బ్రహ్మాత్మత్వమేవ బ్రహ్మాధారత్వం న తు నాడీపురీతదాధారత్వమ్ । తదుపాధికరణమాత్రాధారతయా తు సుషుప్తదశారమ్భాయ జీవస్య నాడీపురీతదాధారత్వమిత్యతుల్యార్థతయా న వికల్ప ఇతి ।
అపిచ న కదాచిజ్జీవస్యేతి ।
ఔత్సగికం బ్రహ్మస్వరూపత్వం జీవస్యాసతి జాగ్రత్స్వప్నదశారూపేఽపవాదే సుషుప్తావస్థాయాం నాన్యథయితుం శక్యమిత్యర్థః । అపిచ యేఽపి స్థానవికల్పమాస్థిషత తైరపి విశేషవిజ్ఞానోపశమలక్షణా సుషుప్త్యవస్థాఙ్గీకర్తవ్యా । న చేయమాత్మతాదాత్మ్యం వినా నాడ్యాదిషు పరమాత్మవ్యతిరిక్తేషు స్థానేషూపపద్యతే । తత్ర హి స్థితోఽయం జీవ ఆత్మవ్యతిరేకాభిమానీ సన్నవశ్యం విశేషజ్ఞానవాన్ భవేత్ । తథాహి శ్రుతిః “యత్ర వా అన్యదివ స్యాత్తత్రాన్యోఽన్యత్పశ్యేత్”(బృ. ఉ. ౪ । ౫ । ౧౫) ఇతి ।
ఆత్మస్థానత్వే త్వదోషః । “యత్ర త్వస్య సర్వమాత్మైవాభూత్తత్కేన కం పశ్యేద్విజానీయాత్”(బృ. ఉ. ౪ । ౫ । ౧౫) ఇతి శ్రుతేః । తస్మాదప్యాత్మస్థానత్వస్య ద్వారం నాడ్యాదీత్యాహ –
అపిచ స్థానవికల్పాభ్యుపగమేఽపీతి ।
అత్ర చోదయతి నను భేదవిషయస్యాపీతి । భిద్యత ఇతి భేదః । భిద్యమానస్యాపి విషయస్యేత్యర్థః ।
పరిహరతి –
బాఢమేవం స్యాదితి ।
న తావజ్జీవస్యాస్తి స్వతఃపరిచ్ఛేదస్తస్య బ్రహ్మాత్మత్వేన విభుత్వాత్ ఔపాధికే తు పరిచ్ఛేదే యత్రోపాధిరసంనిహితస్తన్మాత్రం న జానీయాన్న తు సర్వమ్ । నహ్యసంనిధానాత్సుమేరుమవిద్వాన్ దేవదత్తః సంనిహితమపి న వేద । తస్మాత్సర్వవిశేషవిజ్ఞానప్రత్యస్తమయీం సుషుప్తిం ప్రసాధయతా తదాస్య సర్వోపాధ్యుపసంహారో వక్తవ్యః । తథాచ సిద్ధమస్య తదా బ్రహ్మాత్మత్వమిత్యర్థః ।
గుణప్రధానభావేన సముచ్చయో న సమప్రధానతయాగ్నేయాదివదితి వదన్వికల్పమప్యపాకరోతి –
నచ వయమిహేతి ।
స్వాధ్యాయాధ్యయనవిధ్యాపాదితపురుషార్థత్వస్య వేదరాశేరేకేనాపి వర్ణేన నాపురుషార్థేన భవితుం యుక్తమ్ । నచ సుషుప్తావస్థాయాం జీవస్య స్వరూపేణ నాడ్యాదిస్థానత్వప్రతిపాదనే కిఞ్చిత్ప్రయోజనం బ్రహ్మభూయప్రతిపాదనే త్వస్తి । తస్మాన్న సమప్రధానభావేన సముచ్చయో నాపి వికల్ప ఇతి భావః । నీతార్థమన్యత్ ॥ ౭ ॥
అతః ప్రబోధోఽస్మాత్ ॥ ౮ ॥
తదభావో నాడీషు తచ్ఛ్రుతేరాత్మని చ ॥౭॥ జీవస్య స్వప్రభవత్వాయ స్వప్నమిథ్యాత్వమీరితమ్ । అథాస్య బ్రహ్మభావాయ సుషుప్తిః క్వేతి చిన్త్యతే ॥
ఆసు తదా నాడీషు ఇత్యాదిసప్తమీనిర్దేశాత్ తాభిః ప్రత్యవత్సృప్యేత్యాసిదముచ్చయనిర్దేశాచ్చ సంశయమాహ –
తత్ర కిమితి ।
ప్రయోజనమాహ –
ఎతదత ఇతి ।
వస్తుతో బ్రహ్మణ ఎవ సతో జీవస్య తద్వైపరీత్యం భ్రమః ।తద్యపి నివృత్తేఽపి సుషుప్తౌ విపర్యాసే నాడీషు పురీతతి వా తిష్ఠేద్ , న తు బ్రహ్మతాదాత్మ్యం భజేత జీవస్తదా బ్రహ్మభావే విపరీతజ్ఞాననివృత్తిరప్రయోజికా స్యాదిత్యర్థః ।
నను దణ్డాయమానభావరూపాజ్ఞాననివృత్తౌ బ్రహ్మభావః , సుషుప్తౌ తు నాడ్యాదిస్థస్య తదనివృత్తమితి న బ్రహ్మభావః తతో నాడ్యాదేః సుషుప్తిస్థానత్వాభావచిన్తా నిష్ప్రయోజనేత్యాశఙ్క్యాహ –
అవిద్యానివృత్తావపీతి ।
యావద్యావద్ధి ప్రతిబన్ధనివృత్తిస్తావత్తావద్ బ్రహ్మభావోప్యావిర్భవేత్ । తత్ర యది మిథ్యాజ్ఞాననివృత్తౌ న బ్రహ్మ భావః శ్రుత్యోచ్యేత , తర్హ్యజ్ఞాననివృత్తావపి న బ్రహ్మభావ ఇతి శ్రుతేరాశయః స్యాత్ । తతో బ్రహ్మభావాయ కారణాన్తరం స్యాద్ నాఞ్జానమిథ్యాజ్ఞాననివృత్తీ ఇత్యర్థః ।
తర్హి తదేవ కారణాన్తరం జ్ఞానమస్తు , నేత్యాహ –
తచ్చేతి ।
కర్మ హ్యభూతప్రాదుర్భావఫలం , జ్ఞానం త్వవిద్యానివృత్తిమాత్రఫలమిత్యర్థః । విపరీతజ్ఞాననివృత్తిరవిద్యానివృత్తేరప్యుపలక్షణమ్ , న తు విపరీతజ్ఞానమేవావిద్యేతి భ్రమితవ్యమ్ ; సమూలకాషమవిద్యాయా అకాషాదిత్యుపరితనగ్రన్థే మూలశబ్దేన భావరూపాఽవిద్యాయా అభిధానాత్ ।
తర్హ్యవిద్యానివృత్తిద్వారేణ బ్రహ్మభావం జ్ఞానమభివ్యనక్తు , నేత్యాహ –
విపరీతజ్ఞాననివృత్తేరితి ।
చశబ్దేనావిద్యానివృత్తేరప్యప్రయోజకత్వాదిత్యర్థః ।
మాత్రయేతి ।
స్తోకప్రతిబన్ధనివృత్తిరూపేణేత్యర్థః । తయా విపరీతజ్ఞాననివృత్త్యా తావత్తదవస్థానో బ్రహ్మభావావస్థానో భవతి జీవస్తావచ్ఛబ్దేన న సర్వాత్మనా తదవస్థానో మూలావిద్యాయాః స్థితత్వాదిత్యర్థః ।
లౌకికం వికల్పోదాహరణముక్త్వా వైదికమాహ –
యథా నిరపేక్షా ఇతి ।
నిరపేక్షా ఇతి సముచ్చయాసంభవార్థమ్ ।
ఆయతనశ్రుత్యా చేతి ।
సదాయతనా ఇత్యత్రత్యాయతనస్య సప్తమ్యర్థత్వాదిత్యర్థః ।
సిద్ధాన్తబీజమాశఙ్క్యాహ –
యత్రాపీతి ।
నన్వత్ర ప్రాణప్రాప్తిః ప్రతీయతే , కథం నాడీబ్రహ్మసముచ్చయః ? తత్రాహ –
ప్రాణశబ్దమితి ।
పదార్థముక్త్వా ప్రస్తుతవాక్యమేవ యోజయతి –
అథాస్మిన్ ప్రాణ ఇతి ।
ఇతివచనాద్యత్రాపి నాడీబ్రహ్మణోః సముచ్చయశ్రవణమితి యోజనా ।
తథాపీతి ।
తత్రాపీత్యర్థః । యత్రాపీత్యుపక్రమాత్ ।
నిరపేక్షసప్తమీశ్రుతిభ్యాం యది నాడీపురీతతోర్నిరపేక్షమాధారత్వం , కా తర్హి సముచ్చయశ్రవణస్య గతిః ? అత ఆహ –
ఇయాంస్త్వితి ।
నాడ్యస్తావత్ , స్వతన్త్రా ఎవాధారః , పురీతద్ బ్రహ్మప్రాప్తీ తు నాడీద్వారా భవతః పరస్పరం చానపేక్షే , తత్ర సముచ్చయశ్రవణాభావాత్ కదాచిచ్చ నాడీనాం పురీతద్బ్రహ్మసముచ్చయేఽపి కదాచిదనపేక్షస్థానత్వాద్వికల్పసిద్ధిరిత్యర్థః । బృహత్పృష్ఠం భవతి రథన్తరం పృష్ఠం భవతీతి పృష్ఠాఖ్యస్తోత్రసాధనత్వేన బృహద్రథన్తరయోర్విధానాద్వికల్పః । ఎవమేషోఽష్టదోష ఇతి(౧) వ్రీహ్యనుష్ఠానపక్షే యవశాస్త్రస్య ప్రాతీతప్రామాణ్యపరిత్యాగః (౨) అప్రతీతాప్రామాణ్యస్వీకారః , తథా ప్రయోగాన్తరే (౩) యవేషు ఉపాదీయమానేషు యవశాస్త్రస్య ప్రాక్ స్వీకృతాప్రామాణ్యత్యాగః (౪) పరిత్యక్తప్రామాణ్యోపాదానమితి యవశాస్త్రే చత్వారో దోషాః ; ఎవం యవానుష్ఠానపక్షేఽపి వ్రీహిశాస్త్రే చత్వార ఇత్యష్టదోషదుష్టో వికల్పః ।
నను యది వ్రీహియవౌ ద్వౌ విహితౌ , తర్హ్యాగ్నేయాదివత్సముచ్చయ , కిం న స్యాదిత్యాశఙ్కాం నిరాకుర్వన్ ‘గతిరన్యా న విద్యతే’ ఇత్యేతత్ప్రపఞ్చయతి –
ప్రకృతక్రతుసాధనీభూతేత్యాదినా ।
మా భూద్వాక్యద్వయసామర్థ్యాత్ సముచ్చయ: , అఙ్గసహితప్రధానానుష్ఠాపకప్రయోగవచనో వ్రీహియవౌ సముచ్చాయయతు , తత్రాహ –
న చైతావితి ।
నను మా మిశ్యేతాం వ్రీహియవావుభయవిధ్యర్థవత్త్వాయైకస్మిన్నేవ ప్రయోగే వ్రీహిభిరేకవారం యవైరప్యపరవారమిజ్యతామితి గత్యన్తరమాశఙ్క్యాహ –
న చాఙ్గానురోధేనేతి ।
ప్రకృతౌ బృహద్రథన్తరే పృష్ఠస్తోత్రసాధనత్వేన విహితే వికల్ప్యేతే , వికృతౌ గోసవాఖ్యైకాహేఽతిదేశేన ప్రాప్నుతః । తత్రాపి వికల్పప్రాప్తౌ గోసవే ఉభే బృహద్రథన్తరే కుర్యాదిత్యఙ్గభూతద్బృహద్రథన్తరసాహిత్యవచనాత్ పృష్ఠస్తోత్రమావర్తతే , బృహతైకవారం రథన్తరేణైకవారమితి । ఎవమిహాఙ్గభూతవ్రీహియవానురోధేన ప్రధానాగ్నేయయాగస్యాభ్యాసో న యుక్తః ।
కారణమాహ –
అశ్రుత ఇతి ।
తత్ర హ్యుభే కుర్యాదిత్యఙ్గసాహిత్యశ్రవణాత్తస్య చ ప్రధానస్తోత్రావృత్తివ్యతిరేకేణాసంభవాత్తాత్పర్యవృత్త్యా ప్రధానాభ్యాసః శ్రుతః , నైవమత్ర వ్రీహియవాభ్యాం యజేతేతి శ్రవణమస్తి , యేనావృత్తిః స్యాదిత్యర్థః ।
ఎవం సత్యఙ్గవిధిమాత్రాత్ప్రాధానావృత్తిః ప్రకల్ప్యా , సా చాయుక్తేత్యాహ –
అఙ్గానురోధేన చేతి ।
న హి స్థాలాని సంపన్నానీతి భుక్తవతాపి పునర్భోక్తవ్యమేవమిహాపీత్యర్థః ।
నను సాహిత్యాశ్రవణేఽప్యఙ్గానురోధేన ప్రధానాభ్యాసో దృశ్యతే , యథా సోమేన యజేతేతి శ్రుతస్య సోమయాగస్యైన్ద్రవాయవం గృహ్ణాతి మైత్రావరుణం గృహ్ణాత్యాశ్వినం గృహ్ణాతీత్యాదిగ్రహణరూపాఙ్గానురోధేనావృత్తిరిత్యాశఙ్క్యాహ –
న చాఙ్గభూతేతి ।
నను కథమత్ర ప్రధానస్యాఙ్గానురోధేనాఽవృత్తిః ? యావతైన్ద్రవాయవాదివాక్యేభ్య ఎవ ద్రవ్యదేవతాసంబన్ధాభిధానాత్తద్ద్వారాఽను మితయాగా విధీయన్తే , సోమేన యజేతేతి తు తేషాం యాగానాం సముదాయానువాద ఇత్యాశఙ్క్యాహ –
సోమేన యజేతేతి హీతి ।
ఇదమత్రాకూతమ్ - న సముదాయానువాదత్వమ్ సోమవాక్యస్య ; ప్రత్యభిజ్ఞానాభావాత్ , ఐన్ద్రవాయవాదిశబ్దా హి రసమభిదధతి ; సోమమభిషుణోతి సోమం ప్లావయతీత్యాదివాక్యై రసస్య ప్రస్తుతత్వాత్ । సోమశబ్దశ్చ లతాపరః , తతశ్చ లతావిశిష్టయాగవిధిరయం కథమనువాదకః స్యాత్ ? ప్రత్యక్షే చ యాగవిధావానుమానికవిధికల్పనాఽనుపపన్న । తస్మాత్సోమేన యజేతేత్యేవాపూర్వవిధిః , ఇతరాణి త్విన్ద్రవాయ్వాదివిశిష్టగ్రహణాఖ్యసంస్కారవిధాయకానీతి ద్వితీయే నిరూపితమితి ।
భవత్వపూర్వవిధిస్తథాపి కథమావృత్తిసిద్ధిః ? సోమవాక్యవిహితసోమయాగే ఇన్ద్రవాయ్వాదిదేవతా వికల్పేన విధీయన్తాం , నేత్యాహ –
తత్ర చేత్యాదినా ।
ఎవం హ్యత్ర వికల్పః స్యాద్ , యదీమాని దేవతావిధానాని ద్రవ్యం వా సర్వం సకృత్ త్యుక్తం శక్యమ్ । న తావద్ ద్రవ్యస్య సకృత్ త్యాగసంభవో దశముష్టీర్మిమీతే ఇతి విధేః సోమస్య విపులత్వాత్ । న చ దశాపి ముష్టయో లతారూపేణ వ్యజ్యన్తే ; అభిషుణోత్యభిప్లావయతి గాలయతీత్యర్థ ఇత్యాదినా రసభావేన యాగోపయోగావగమాత్ , తస్య చ నియతపరిమాణోదకకలశజలైః సేకాత్ ।
న చ సర్వోఽపి రసః సకృత్ త్యజ్యేత , నానాదేవతోద్దేశేన గృహ్యమాణత్వాదిత్యాహ –
ఇన్ద్రవాయ్వాదీతి ।
నను ప్రతీన్ద్రవాయ్వాదికం గ్రహణాని వికల్ప్యన్తాం , తత్రాహ –
ప్రాదేశమాత్రేష్వితి ।
ప్రాదేశమాత్రేణ హి పాత్రేణ ఎకైకేనేద్రవాయ్వాదిభ్యో రసో గృహ్యతే , న చైకస్మిన్పాత్రే కృత్స్నో రసః సంమాతీత్యర్థః ।
గ్రహణానీత్యస్య వ్యాఖ్యానం –
పృథక్వల్పనానీతి ।
ఎవం ద్రవ్యస్య సకృత్త్యాగాసమ్భవమభిధాయ దేవతావిధ్యసంభవమాహ –
న తు సోమయాగోద్దేశేనేతి ।
ఎషు హి వాక్యేషు గృహ్ణాతీతి గ్రహణాన్వయో దేవతానామవగమ్యతే , అతః కథం యాగే దేవతావిధిరిత్యర్థః । గ్రహణమాత్రే త్వపర్యవసానాదర్థాద్దేవతానా యాగాన్వయః ।
దశముష్ఠ్యాదిగ్రన్థం స్వయమేవ వ్యాచష్టే –
న చ ప్రాదేశమాత్రమిత్యాదినా ।
ప్రాదేశమాత్రే ఊర్ధ్వత్వప్రతీతిః తర్హ్యేవ ఘటతే , యది విస్తారః ప్రాదేశాదూనస్తిర్యక్ ప్రసారే హ్యూర్ధ్వత్వం న స్యాత్ , తతోఽల్పత్వవిశేషణద్వయేనోక్తం –
తుల్యార్థతయేతి ।
ఎకసోమసంస్కారప్రయోజనతయేత్యర్థః ।
లిఙ్గదర్శనాన్యాహ –
అత ఎవేతి ।
వికల్పే హ్యేక ఎవ ప్రయోగః స్యాదిత్యర్థః ।
సముచ్చయే సత్యుపపద్యమానం క్రమం దర్శయతి –
ఆశ్విన ఇతి ।
దశానా గ్రహాణాం మధ్యే ఆశ్వినో గ్రహణకాలే దశమత్వేన గృహ్యతే , హోమకాలే తృతీయత్వేన హూయత ఇత్యేతద్ వికల్పే సతి న యుజ్యతే ; ఎకత్వేన దశమత్వాద్యయోగాత్ । తథా వికల్పే సతి గ్రహణకాలే గ్రహణామైన్ద్రవాయవాగ్రత్వమైన్ద్రవాయవప్రాథమ్యవత్త్వం న స్యాదేకత్వే ప్రథమచరమభావాయోగాదిత్యర్థః ।
నన్వేవమపి గ్రహణాన్యావర్తన్తాం కథం యాగావృస్తిస్తత్ర శ్రుత్యాద్యభావాద్ , యతోఽఙ్గానురోధేన ప్రధానావృత్తిః స్యాదిత్యాశఙ్క్య సామర్థ్యమాహ –
తేషాం చేతి ।
కాంచన దేవతామితి ।
ఇన్ద్ర వాయ్వాదినాం మధ్యే ఎకామిత్యర్థః ।
ఇహ త్వితి ।
వ్రీహియవవాక్యే ఇత్యర్థః । వ్రీహియవసముచ్చయే హి యాగాభ్యాసకల్పనా స్యాత్ , తత్ర చ ప్రమాణాభావాదిత్యర్థః ।
న కేవలం వ్రీహియవసముచ్చయే ప్రమాణాభావః , ప్రమాణవిరోధోఽపీత్యాహ –
పురోడాశస్య చేతి ।
పురోడాశచోదనయైవౌషధిద్రవ్యే యస్మిన్కస్మింశ్చిత్ప్రాప్తే వ్రీహయోఽపి పక్షే ప్రాప్తాస్తత్రాప్రాప్తాంశపూరణార్థా వ్రీహిశ్రుతిర్వీహిభిరేవేతి నియమయేత్తత్ర యవసముచ్చయే వ్రీహిశ్రుతిబాధః స్యాద్ , ఎవం యవశ్రుతేరపి నియమార్థత్వాద్ వ్రీహిసముచ్చయే తద్బాధ ఇత్యర్థః ।
ఎకార్థతయేతి ।
ఎకపురోడాశార్థతయేత్యర్థః ।
ఎవం గత్యన్తరాభావాద్వ్రీహియవయోర్వికల్పముక్త్వా ప్రకృతే గత్యన్తరసద్భావాద్వికల్పాభావమాహ –
న తు నాడీత్యాదినా ।
భాష్యే సముచ్చయశ్రుత్యనురోధాదసముచ్చయశ్రుతిర్నేయేతి ప్రతిజ్ఞామాత్రమివ భాతి , తతోఽభిప్రాయం స్ఫోరయతి –
సాపేక్షశ్రుత్యనురోధేనేతి ।
నిరపేక్షతా హ్యపేక్షాభావ ఉత్సర్గః , తస్య సాపేక్షతాఽపవాదికేత్యర్థః ।
న వికల్ప ఇతి ।
వికల్పఫలకోఽభ్యుచ్చయ ఇత్యర్థః ।
ఎవం తావత్తుల్యబలశ్రుత్యభావాన్న నాడ్యాదీనాం వికల్ప ఇత్యుక్తమ్ , ఇదానీమతుల్యార్థత్వాచ్చ న వికల్ప ఇత్యాహ –
అభ్యుపేత్యేత్యాదినా ।
జీవోపాధిరన్తఃకరణాదిర్నాడీపురీతతోరాశ్రితః , జీవస్తు న క్వాపీతి కథమాధారత్వేన తుల్యార్థతేత్యథః ।
నను సర్వదా జీవస్య బ్రహ్మాభేదే సుషుప్తౌ కిమిత్యాధారత్వోపచారస్తత్రాహ –
ఉపాధీనామసముదాచారాదితి ।
అవ్యక్తేరిత్యర్థః ।
నను తాదాత్మ్యాదుపాధ్యుపశాన్తేశ్చ యథా సుషుప్తౌ జీవస్య బ్రహ్మాశ్రయత్వోపచార ఎవం జీవోపాధ్యాధారత్వాత్సుషుప్తౌ నాడ్యాదేర్జీవాశ్రయత్వోపచారోఽస్తు , తత ఔపచారికాశ్రయత్వేన తుల్యార్థత్వమత ఆహ –
సుషుప్తదశారమ్భాయేతి ।
సుషుప్తిప్రాక్కాలే ఉపాధిద్వారేణ జీవస్య నాడ్యాశ్రయత్వముపచరితుం శక్యమ్ , తేన సుషుప్తౌ ఉపాధీనాం లీనత్వాదిత్యర్థః ।
న సమప్రధానతయేతి ।
సమప్రధానత్వే హి నాడీపురితద్ద్బ్రహ్మసు త్రిష్వపి జీవస్థానం స్యాత్ , తదా చ్చ న బ్రహ్మభావ ఇతి సమప్రాధాన్యం నిరస్తమ్ , తన్నిరాసశ్చ వికల్పనిరాసోపలక్షణార్థమిత్యర్థః । నీతార్థం గతార్థమ్ ।
తద్యత్రైతదితి ।
నాడీష్వాదిత్యరశ్మీనాం ప్రవేశః పూర్వవాక్య ఉక్తస్తత్తత్రైవం సతి యత్ర యస్మిన్ కాలే ఎతత్ స్వప్నం సుప్తః కుర్వన్ ఓదనపాకం పచతీతివత్ స్వాపస్య ద్విప్రకారత్వాత్ సుషుప్తసిద్ధ్యర్థం విశేషణమ్ ।
సమస్త ఇతి ।
ఉపసహృతసర్వకరణ ఇత్యర్థః । విషయసంపర్కజనితకాలుష్యాభావాత్ సంప్రసన్నః సన్ స్వప్నం న విజానాతి తదా ఆసు రశ్మిపూర్ణాసు నాడీషు సృప్తః ప్రవిష్టో భవతీత్యర్థః ।
సుషుప్తముత్థాప్య తదాగమనావధిమజాతశత్రుర్గార్గ్యం ప్రతి పప్రచ్ఛ –
కుత ఎతదాగాదితి ।
ఎతదాగమనం కుత ఆగాత్ కృతవానిత్యర్థః ॥౭॥౮॥