సోఽధ్యక్షే తదుపగమాదిభ్యః ।
ప్రాణస్తేజసీతి తేజఃశబ్దస్య భూతవిశేషవచనత్వాద్విజ్ఞానాత్మని చాప్రసిద్ధేః ప్రాణస్య జీవాత్మన్యుపగమానుగమావస్థానశ్రుతీనాం చ తేజోద్ధారేణాప్యుపపత్తేః । తేజసి సమాపన్నవృత్తిః ఖలు ప్రాణః । తేజస్తు జీవాత్మని సమాపన్నవృత్తి । తద్ద్వారా జీవాత్మసమాపన్నవృత్తిః ప్రాణ ఇత్యుపపద్యతే । తస్మాత్తేజస్యేవ ప్రాణవృత్తిప్రవిలయ ఇతి ప్రాప్తేఽభిధీయతే స ప్రకృతః ప్రాణోఽధ్యక్షే విజ్ఞానాత్మన్యవతిష్ఠతే తత్తన్త్రవృత్తిర్భవతి । కుతః ఉపగమానుగమావస్థానేభ్యో హేతుభ్యః ।
తత్రోపగమశ్రుతిమాహ –
ఎవమేవేమమాత్మానమితి ।
అనుగమనశ్రుతిమాహ –
తముత్క్రామన్తమితి ।
అవస్థానశ్రుతిమాహ –
సవిజ్ఞానో భవతీతి చేతి ।
విజ్ఞాయతేఽనేనేతి విజ్ఞానం పఞ్చవృత్తిప్రాణసహిత ఇన్ద్రియగ్రామస్తేన సహావతిష్ఠత ఇతి సవిజ్ఞానః ।
చోదయతి –
నను ప్రాణస్తేజసీతి శ్రూయత ఇతి ।
అధికావాపోఽశబ్దార్థవ్యాఖ్యానమ్ ।
పరిహరతి –
నైష దోష ఇతి ।
యద్యపి ప్రాణస్తేజసీత్యతస్తేజసి ప్రాణవృత్తిలయః ప్రతీయతే, తథాపి సర్వశాఖాప్రత్యయత్వేన విద్యానాం శ్రుత్యన్తరాలోచనయా విజ్ఞానాత్మని లయోఽవగమ్యతే । న చ తేజసస్తత్రాపి లయ ఇతి సామ్ప్రతమ్ । తస్యానిలాకాశక్రమేణ పరమాత్మని తత్త్వలయావగమాత్ । తస్మాత్తేజోగ్రహణేనోపలక్ష్యతే తేజః సహచరితదేహబీజభూతపఞ్చభూతసూక్ష్మపరిచారాధ్యక్షో జీవాత్మా తస్మిన్ ప్రాణవృత్తిరప్యేతీతి ।
చోదయతి –
నను చేయం శ్రుతిరితి ।
తేజఃసహచరితాని భూతాన్యుపలక్ష్యన్తాం తేజఃశబ్దేనాధ్యక్షే తు కిమాయాతం తస్య తదసాహచర్యాదిత్యర్థః ।
పరిహరతి –
సోఽధ్యక్ష ఇత్యధ్యక్షస్యాపీతి ।
యదా హ్యయం ప్రాణోఽన్తరాలేఽధ్యక్షం ప్రాప్యాధ్యక్షసమ్పర్కవశాదేవ తేజఃప్రభృతీని భూతసూక్ష్మాణి ప్రాప్నోతి తదోపపద్యతే ప్రాణస్తేజసీతి ।
అత్రైవ దృష్టాన్తమాహ –
యోఽపి స్రుఘ్నాదితి ॥ ౪ ॥
భూతేషు తచ్ఛ్రుతేః ॥ ౫ ॥
సూత్రాన్తరమవతారయితుం పృచ్ఛతి –
కథం తేజఃసహచరితేష్వితి ।
నైకస్మిన్ దర్శయతో హి ।
అత్ర భాష్యకారోఽనుమానదర్శనమాహ –
కార్యస్య శరీరస్యేతి ।
స్థూలశరీరానురూపమనుమేయం సూక్ష్మమపి శరీరం పఞ్చాత్మకమిత్యర్థః ।
దర్శయత ఇతి సూత్రావయవం వ్యాచష్టే –
దర్శయతశ్చైతమర్థమితి ।
ప్రశ్నప్రతివచనాభిప్రాయం ద్వివచనం శ్రుతిస్మృత్యభిప్రాయం వా । అణ్వ్యో మాత్రాః సూక్ష్మా దశార్ధానాం పఞ్చభూతానామితి ।
శ్రుత్యన్తరవిరోధం చోదయతి –
నను చోపసంహృతేషు వాగాదిష్వితి ।
కర్మాశ్రయతేతి ప్రతీయతే న భూతాశ్రయతేత్యర్థః ।
పరిహరతి –
అత్రోచ్యత ఇతి ।
గ్రహా ఇన్ద్రియాణి అతిగ్రహాస్తద్విషయాః । కర్మణాం ప్రయోజకత్వేనాశ్రయత్వం భూతానాం తూపాదానత్వేనేత్యవిరోధః ।
ప్రశంసాశబ్దోఽపి కర్మణాం ప్రయోజకతయా ప్రకృష్టమాశ్రయత్వం బ్రూతే సతి నికృష్ట ఆశ్రయాన్తరే తదుపపత్తేరిత్యాహ –
ప్రశంసాశబ్దాదపి తత్రేతి ॥ ౬ ॥
సోఽధ్యక్షే తదుపగమాదిభ్యః॥౪॥ మనః ప్రాణ ఇతి వాక్యం విచార్య తదనన్తరస్య ప్రాణస్తేజసీత్యస్య విచారాత్సంగతిః । తేజఃశబ్దస్య భూతవిశేషవచనత్వాదిత్యాదిహేతూనాం తస్మాత్తేజస్యేవ ప్రాణవృత్తిలయ ఇతి ప్రతిజ్ఞయా సంగతిః । ఉపగమనాదిశ్రుతీః స్వయమేవ వక్ష్యతి । తేజోద్వారేణేత్యేతదుపపాదయతి –
తేజసి సమాపన్నేతి ।
ప్రాణవృత్తిలయాత్ ప్రాణస్య జీవే వృత్తిలయ ఉపచర్యత ఇత్యర్థః ।
సమాపన్నేతి ।
ఆపత్తిర్లయః । యథా రాజానం యాత్రాయామ్ ఉద్యన్తం పరివారభూతాః ప్రాణినః సముపయన్తి, ఎవమాత్మానమన్తకాలే సర్వే ప్రాణా అభిసమాగచ్ఛన్తి । కోఽసావన్తకాలః? స ఉచ్యతే ।
యత్ర కాల ఎతద్భవతి, తదేవ దర్శ్యతే –
ఊర్ధ్వోచ్ఛ్వాసీతి ।
ఊర్ధ్వోచ్ఛ్వాసిత్వమిత్యుపగమనశ్రుతేరర్థః । సంముఖమాగమనముపగమనమ్ । ఆగమ్య చ గచ్ఛన్తం జీవమ్ అను పశ్చాద్గమనమనుగమనమ్ ।
ఇన్ద్రియగ్రామ ఇతి ।
ఆ ప్రాయణాదిత్యత్ర సవిజ్ఞానశబ్దః ప్రాప్తవ్యకర్మఫలప్రకాశనవచన ఇత్యుక్తమిహ తు తమపరిత్యజ్య తత్సహితేన్ద్రియసముదాయవచన ఇత్యుక్తమ్ ఇతి న విరోధః ।
కథం ప్రాణోఽధ్యక్ష ఇత్యధికావాపః క్రియత ఇతి భాష్యమ్ ? తదనుపపన్నమివ ? తేజఃశబ్దేన తేజోఽధ్యక్షజీవలక్షణాసంభవాదధికశబ్దప్రక్షేపాప్రాప్తేరత ఆహ –
అధికావాపోఽశబ్దార్థేతి ।
శ్రౌతోఽర్థో హి శబ్దే భాతి, అతోఽశ్రౌతార్థప్రక్షేపోఽధికావాప ఇత్యర్థః ।
లక్షణాస్వీకారే హేతుమాహ –
శ్రుత్యన్తరేతి ।
ప్రాణానాం జీవానుగమాదివిషయం వర్ణితమేవ శ్రుత్యన్తరమ్ ।
నను తస్య తేజోద్వారేణాన్యథాసిద్ధిరుక్తేతి, తత్రాహ –
న చ తేజసస్తత్రేతి ।
అనిలాకాశక్రమేణేతి ।
వ్యవధానాదేవ సాక్షత్తేజసః స్వరూపలయయోగాద్ న తద్ద్వారేణాత్మని ప్రలయ ఉపచరితుం శక్యో వ్యవధానాశ్రయణే చ ఘటాదావపి ప్రలయోపచారప్రసఙ్గ ఇత్యర్థః । వృత్తిలయస్తు న కుతశ్చిత్ప్రమాణాదాత్మన్యవగత ఇతి న తద్ద్వారాఽపి ప్రాణవృత్తిలయోపచార ఇతి ద్రష్టవ్యమ్ । తేజఃసహచరితశ్చాసౌ దేహబీజభూతశ్చ పఞ్చభూతసూక్ష్మరూపశ్చ పరివారశ్చ తస్యాధ్యక్షో జీవాత్మా తస్మిన్ప్రాణవృత్తిలయ ఇత్యర్థః॥౪॥ యద్యపి భాష్యే ప్రాణసంయుక్తోఽధ్యక్షస్తేజఃసహితేషు భూతసూక్ష్మేష్వవతిష్ఠత ఇత్యుక్తమ్; తథాపి తద్భూతసహితేఽధ్యక్షే ప్రాణస్తిష్ఠతీత్యేవంపరం వ్యాఖ్యేయమ్; సోఽధ్యక్ష ఇత్యుపక్రమాదితి భావః ।
చోద్యభాష్యేఽపి యద్యపి ప్రాణసహితస్యాధ్యక్షస్య భూతేష్వవస్థితిరాక్షిప్యత ఇతి ప్రతిభాతి; తథాపి భూతసహితాధ్యక్షే ప్రాణస్థితిరాక్షిప్యత ఇత్యేవంపరత్వేన యోజ్యమిత్యాహ –
తేజఃసహచరితానీతి ।
ప్రాణేనాధారత్వేన సంపృక్తస్యాధ్యక్షస్య భూతైర్మిలిత్వా స్థితిం శ్రుతిర్న దర్శయతీతి భాష్యయోజనా హి ఇయతా సూచితేతి ।
పరిహారభాష్యేఽప్యధ్యక్షం ప్రాప్య పూర్వవ్యాపారాన్తరాత్తేజ ఆదిభూతప్రాప్తిః ప్రాణస్య నాభిధీయతే, ఉపహితప్రాప్తేరుపాధిప్రాప్తినాన్తరీయకత్వాదిత్యభిప్రేత్యాహ –
అధ్యక్షసంపర్కవశాదితి ।
దృష్టాన్తేఽపి వ్యవధానేన ప్రాప్త్యంశో న వివక్షితోఽపి తు యథా స్రుఘ్నాన్నగరాద్గచ్ఛతో మథురాపాటలిపుత్రయోరుభయోః ప్రాప్యత్వేఽపి పాఠలిపుత్రం ప్రాప్యత్వేన నిర్దిశ్యతే, ఎవమిహాపి ప్రాణేన తేజసోఽధ్యక్షస్య చోభయోః ప్రాప్యత్వేఽపి తేజసీతి భూతమాత్రస్య ప్రాప్యత్వం నిర్దిశ్యత ఇత్యయమర్థో వివక్షిత ఇత్యాహ –
అత్రైవేతి॥౫॥
ప్రాణ ఎకస్మిన్నేవ తేజఃసూక్ష్మే నావతిష్ఠత ఇతి కార్యస్థానేకస్యానేకాత్మకత్వాదితి చ హేతుప్రతిజ్ఞయోర్వైయధికరణ్యమాశఙ్క్యాహ –
స్థూలశరీరానురూపమితి ।
కార్యానేకాత్మకత్వేనానుమితం కారణానేకత్వమేకత్ర ప్రాణస్థిత్యభావే హేతురిత్యర్థః॥౬॥