బృహదారణ్యకోపనిషద్భాష్యమ్
ప్రథమోఽధ్యాయఃపఞ్చమం బ్రాహ్మణమ్
ఆనన్దగిరిటీకా (బృహదారణ్యక)
 
యత్సప్తాన్నాని మేధయా తపసాజనయత్పితేతి మేధయా హి తపసాజనయత్పితా । ఎకమస్య సాధారణమితీదమేవాస్య తత్సాధారణమన్నం యదిదమద్యతే । స య ఎతదుపాస్తే న స పాప్మనో వ్యావర్తతే మిశ్రం హ్యేతత్ । ద్వే దేవానభాజయదితి హుతం చ ప్రహుతం చ తస్మాద్దేవేభ్యో జుహ్వతి చ ప్ర చ జుహ్వత్యథో ఆహుర్దర్శపూర్ణమాసావితి తస్మాన్నేష్టియాజుకః స్యాత్ । పశుభ్య ఎకం ప్రాయచ్ఛదితి తత్పయః । పయో హ్యేవాగ్రే మనుష్యాశ్చ పశవశ్చోపజీవన్తి తస్మాత్కుమారం జాతం ఘృతం వై వాగ్రే ప్రతిలేహయన్తి స్తనం వానుధాపయన్త్యథ వత్సం జాతమాహురతృణాద ఇతి । తస్మిన్సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ నేతి పయసి హీదం సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ న । తద్యదిదమాహుః సంవత్సరం పయసా జుహ్వదప పునర్మృత్యుం జయతీతి న తథా విద్యాద్యదహరేవ జుహోతి తదహః పునర్మృత్యుమపజయత్యేవం విద్వాన్సర్వం హి దేవేభ్యోఽన్నాద్యం ప్రయచ్ఛతి । కస్మాత్తాని న క్షీయన్తేఽద్యమానాని సర్వదేతి పురుషో వా అక్షితిః స హీదమన్నం పునః పునర్జనయతే । యో వైతామక్షితిం వేదేతి పురుషో వా అక్షితిః స హీదమన్నం ధియా ధియా జనయతే కర్మభిర్యద్ధైతన్న కుర్యాత్క్షీయేత హ సోఽన్నమత్తి ప్రతీకేనేతి ముఖం ప్రతీకం ముఖేనేత్యేతత్ । స దేవానపిగచ్ఛతి స ఊర్జముపజీవతీతి ప్రశంసా ॥ ౨ ॥
గృహిణా వైశ్వదేవాఖ్యమన్నం యదహన్యహని నిరూప్యత ఇతి కేచిత్ । తన్న । సర్వభోక్తృసాధారణత్వం వైశ్వదేవాఖ్యస్యాన్నస్య న సర్వప్రాణభృద్భుజ్యమానాన్నవత్ప్రత్యక్షమ్ । నాపి యదిదమద్యత ఇతి తద్విషయం వచనమనుకూలమ్ । సర్వప్రాణభృద్భుజ్యమానాన్నాన్తఃపాతిత్వాచ్చ వైశ్వదేవాఖ్యస్య యుక్తం శ్వచాణ్డాలాద్యాద్యస్య అన్నస్య గ్రహణమ్ , వైశ్వదేవవ్యతిరేకేణాపి శ్వచాణ్డాలాద్యాద్యాన్నదర్శనాత్ , తత్ర యుక్తం యదిదమద్యత ఇతి వచనమ్ । యది హి తన్న గృహ్యేత సాధారణశబ్దేన పిత్రా అసృష్టత్వావినియుక్తత్వే తస్య ప్రసజ్యేయాతామ్ । ఇష్యతే హి తత్సృష్టత్వం తద్వినియుక్తత్వం చ సర్వస్యాన్నజాతస్య । న చ వైశ్వదేవాఖ్యం శాస్త్రోక్తం కర్మ కుర్వతః పాప్మనోఽవినివృత్తిర్యుక్తా । న చ తస్య ప్రతిషేధోఽస్తి । న చ మత్స్యబన్ధనాదికర్మవత్స్వభావజుగుప్సితమేతత్ , శిష్టనిర్వర్త్యత్వాత్ , అకరణే చ ప్రత్యవాయశ్రవణాత్ । ఇతరత్ర చ ప్రత్యవాయోపపత్తేః, ‘అహమన్నమన్నమదన్తమద్మి’ (తై. ఉ. ౩ । ౧౦ । ౬) ఇతి మన్త్రవర్ణాత్ ॥

ఎకమస్యేత్యాదిమన్త్రబ్రాహ్మణయోః స్వపక్షార్థముక్త్వా భర్తృప్రపఞ్చపక్షమాహ —

గృహిణేతి ।

యదన్నం గృహిణా ప్రత్యహమగ్నౌ వైశ్వదేవాఖ్యం నివర్త్యతే తత్సాధారణమితి భర్తృప్రపఞ్చైరుక్తమిత్యర్థః ।

సాధారణపదానుపపత్తేర్న యుక్తమిదం వ్యాఖ్యానమితి దూషయతి —

తన్నేతి ।

వైశ్వదేవస్య సాధారణత్వమప్రామాణికమిత్యుక్తమిదానీం తస్యాప్రత్యక్షత్వాదిదమా పరామర్శశ్చ న యుక్తిమానిత్యాహ —

నాపీతి ।

ఇతశ్చ సాధారణశబ్దేన సర్వప్రాణ్యన్నం గ్రాహ్యమిత్యాహ —

సర్వేతి ।

వైశ్వదేవగ్రహేఽపీతరగ్రహః స్యాదితి చేన్నేత్యాహ —

వైశ్వదేవేతి ।

యత్తు పరపక్షే యదిదమద్యత ఇతి వచో నానుకూలమితి తన్నాస్మత్పక్షేఽస్తీత్యాహ —

తత్రేతి ।

ప్రత్యక్షం సాధారణాన్నం సప్తమ్యర్థః ।

విపక్షే దోషమాహ —

యది హీతి ।

ప్రసంగస్యేష్టత్వం నిరాచష్టే —

ఇష్యతే హీతి ।

పరపక్షే వాక్యశేషవిరోధం దోషాన్తరమాహ —

న చేతి ।

శ్యేనాదితుల్యత్వం తస్య వ్యావర్తయతి —

న చ తస్యేతి ।

అనిషిద్ధస్యాపి తస్య స్వభావజుగుప్సితత్వాత్తదనుష్ఠానుయాయినః పాపానివృత్తిరిత్యాశఙ్క్యాఽఽహ —

న చేతి ।

‘అవశ్యం యాతి తిర్యక్త్వం జగ్ధ్వా చైవాహుతం హవిః ।’
ఇత్యకరణే వైశ్వదేవస్య ప్రత్యవాయశ్రవణాచ్చ తదనుష్ఠానుయినో న పాప్మలేశోఽస్తీత్యాహ —

అకరణే చేతి ।

సర్వసాధాణాన్నగ్రహే తు తత్పరస్య నిన్దావచనముపపద్యతే తేన తదేవ గ్రాహ్యమిత్యాహ —

ఇతరత్రేతి ।

తత్రైవ శ్రుత్యన్తరం సంవాదయతి —

అహమితి ।

అర్థిభ్యోఽవిభజ్యాన్నమదత్త్వా స్వయమేవ భుఞ్జానం నరమహమన్నమేవ భక్షయామి తమనర్థభాజం కరోమీత్యర్థః ।